టీవీ చానల్ విలేకరి అరెస్ట్ | TV channel reporter arrested for blackmailing | Sakshi
Sakshi News home page

టీవీ చానల్ విలేకరి అరెస్ట్

Oct 11 2014 7:28 AM | Updated on Apr 4 2019 2:48 PM

ఇసుక వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో తహసిల్దార్ ఫిర్యాదు మేరకు ఓ టీవీ చానల్ విలేకరిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి చెప్పారు.

మొగల్తూరు : ఇసుక వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో తహసిల్దార్ ఫిర్యాదు మేరకు ఓ టీవీ చానల్ విలేకరిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై కె.సుధాకర్‌రెడ్డి చెప్పారు. నరసాపురం మండలం చినమామిడిపల్లి గ్రామానికి చెందిన కె.మురళీకృష్ణమనాయుడు అనే వ్యక్తి టీవీ చానల్ విలేకరినని చెప్పుకుంటూ ఇటీవల తూర్పుతాళ్లు గ్రామంలో ఇసుక వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేశాడు.

దీనిపై సంబంధిత వ్యాపారులు నరసాపురం తహసిల్దార్ దృష్టికి తీసుకురాగా, దీనిపై స్పందించిన తహసిల్దార్ ఎస్.హరినాథ్ మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌లో గత నెల 29న ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి అతని కోసం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం సీతారామపురం వంతెన వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement