సీఎంఏలో ఫస్ట్ ర్యాంకులు సూపర్‌విజ్‌వే | Superviz students get first rank in CMA | Sakshi
Sakshi News home page

సీఎంఏలో ఫస్ట్ ర్యాంకులు సూపర్‌విజ్‌వే

Aug 29 2013 4:21 AM | Updated on Sep 1 2017 10:12 PM

ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్ (సీఎంఏ) ఫైనల్, ఇంటర్ రెండింటిలోనూ సూపర్‌విజ్ విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారని ఆ సంస్థ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు తెలిపారు.

విజయవాడ, న్యూస్‌లైన్: ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంట్స్ (సీఎంఏ) ఫైనల్, ఇంటర్ రెండింటిలోనూ సూపర్‌విజ్ విద్యార్థులు ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించారని ఆ సంస్థ ప్రిన్సిపాల్ సబ్బినేని వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం విడుదల చేసిన సీఎంఏ ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు దగ్గుపాటి గురుప్రసాద్, ఫైనల్లో వెంకటమనోజ్‌లు ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు సాధించినట్లు వివరించారు. వారితోపాటు ఫైనల్‌లో తోట రజని 3వ ర్యాంకు, చుండూరు సుధీర్ 6, ఎస్వీఎన్‌ఎల్ సౌమ్య పెరూరి 13వ ర్యాంకు సాధించారు. 50 లోపు 13 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఇంటర్‌లో మద్ది రాజేష్ 2వ ర్యాంకు సాధించగా, చిట్లూరి లక్ష్మీ అనూష 8, ఆర్ శిల్ప 11వ ర్యాంకు సాధించడంతోపాటు, 50 లోపు 15 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement