విజయనగరం క్రైం: పట్టణంలోని ఎఫ్.సి.ఐ గోదాం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి తీవ్రగాయలవ్వగా, మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి.
	విజయనగరం క్రైం: పట్టణంలోని ఎఫ్.సి.ఐ గోదాం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి  తీవ్రగాయలవ్వగా, మరో ముగ్గురికి స్వల్పగాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన వెంకటగౌరి, సుధాకర్ బెహరా, అరూప్  మండల్, సుఖాంత్ బిస్వాల్, ఈశ్వర్‌ప్రసాద్, పినిపి రామారావు, రేవళ్లరాజు, సన్యాసినాయుడులు బొండపల్లి మండలం గరుడబిల్లి రైల్వేలైన్‌లో లైన్ ట్రాక్  ప్రైవేటు కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రతిరోజు పనిచేస్తూ మధ్యాహ్నం సమయంలో భోజనానికి విజయనగరం వస్తుంటారు. అందులో భాగంగా గురువారం మధ్యాహ్నం భోజనానికి ఆటోలో వస్తున్నారు.
	 
	 ఎఫ్.సి.ఐ గోదాం వద్దకు వచ్చేసరికి రివర్స్‌గేర్‌లో వస్తున్న లారీ వీరి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో అరూప్‌మండల్, సుధాకర్ బెహరా, ఈశ్వర్‌ప్రసాద్, పినిపి రామారావులకు తీవ్రగాయలయ్యాయి. రేవళ్లరాజు, సన్యాసినాయుడు, వెంకట్‌గౌరిలకు స్వల్పగాయాలయ్యాయి. మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డాడు. క్షతగాత్రులను 108 వాహనంలో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన నలుగురు వ్యక్తులను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు.
	 
	 కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అరూప్ మండల్ మృతి చెందినట్టు ట్రాఫిక్ ఎస్సై ఎస్.అమ్మినాయుడు తెలిపారు. కేసు  నమోదు  చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
