ఐస్‌ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీక్

Gas leak from ice factory - Sakshi

భయంతో పరుగులు తీసిన సిబ్బంది 

వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం 

రంగంలోకి ఓఎన్జీసీ రెస్క్యూ టీం.. తప్పిన ముప్పు

మలికిపురం: తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలోని వెంకటేశ్వర ఐస్‌ ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా గ్యాస్‌ భారీగా లీకయింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఓఎన్జీసీ రెస్క్యూ టీం సహకారంతో కొద్ది సేపట్లోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు ఫ్యాక్టరీ లోంచి గ్యాస్‌ లీక్‌ కాగానే ఫ్యాక్టరీలోని సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు.

ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్యాస్‌ కమ్ముకోవడంతో జనం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. విషయం తెలుసుకున్న అమలాపురం ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, తహసీల్దారు నరసింహరావు, ఎస్‌ఐ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను ఇళ్లకు దూరంగా పంపించారు. ఓఎన్జీసీ రెస్క్యూ టీం సహకారంతో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పెనుముప్పును నివారించారు. రాత్రి 9.30 గంటలకు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top