ప్రకాశం జిల్లా కంభం మండలం నల్లకాలువలో ఓ అంగన్ వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు.
కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం నల్లకాలువలో అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తోన్న ఎలిజిబెత్ రాణి శుక్రవారం మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు.
విషయం తెలసుకున్న గ్రామస్తులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎలిజబెత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా, సూపర్‌వైజర్ జెన్నమ్మ వేధింపులకు తాళలేకే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.