నాగార్జున సాగర్ జలాల వాడుక విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ వివాదం మరింత ముదురుతోంది.
హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాల వాడుక విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ వివాదం మరింత ముదురుతోంది. సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు ఏపీ ఇరిగేషన్ అధికారులు వచ్చారు. కుడికాల్వకు 6 వేల క్యూసెక్కలు నీటిని విడుదల చేయడానికి ప్రయత్నించారు. అయితే నీటిని విడుదల చేయకుండా తెలంగాణ అధికారులు అడ్డుపడ్డారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికారులకు బందోబస్తుగా పోలీసులు భారీగా వచ్చారు.