అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలంలోని పూలకుంట గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్, ఆటో ఢీకొనడంతో ఇద్దరు మరణించారు.
గుమ్మగట్టు: అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలంలోని పూలకుంట గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్, ఆటో ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం నుంచి రంగసముద్రం గ్రామానికి వెళ్తున్న ఆటోలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో బొమ్మయ్య(55), తేజస్విని(2) అక్కడిక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన ఇద్దరూ రంగసముద్రం గ్రామానికి చెందినవారు.


