breaking news
-
తిరుమల: రెచ్చిపోయిన దొంగలు.. టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ
సాక్షి, తిరుమల: తిరుమలలో టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు అదృశ్యమైంది. గుర్తు తెలియని దుండగులు ఏకంగా బస్సు దొంగతనానికి పాల్పడ్డారు. అయితే, లోకేషన్ ఆధారంగా ఎలక్ట్రిక్ బస్సు నాయుడుపేటలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో బస్సును స్వాధీనం చేసుకుని దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సు చోరీకి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు బస్సును దొంగతనం చేశారు. చోరీ చేసిన బస్సును తీసుకెళ్తుండగా లోకేషన్ ఆధారంగా నాయుడుపేట వద్ద బస్సు గుర్తించారు. దీంతో, బస్సును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, దుండగులు పారిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, వాహనాల మిస్సింగ్‌ను టీటీడీ.. అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఇది కూడా చదవండి: కదులుతున్న ‘స్కిల్’ డొంక.. లోకేష్ పీఏ అమెరికాకు జంప్! -
కదులుతున్న ‘స్కిల్’ డొంక.. లోకేష్ పీఏ అమెరికాకు జంప్!
సాక్షి, ఢిల్లీ: స్కిల్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక, చంద్రబాబు కేసులో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఐడీ విచారిస్తోంది. మరోవైపు.. ఈ కేసుతో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులు(పరోక్షంగా/ప్రత్యక్షంగా) దేశం దాటేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ బాబు పీఏ కిలారు రాజేష్ చౌదరి అమెరికాకు జంప్ అయినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో జైలుగా ఉండగా.. ఆయన కుమారుడు నారా లోకేష్ ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు. అయితే, ఢిల్లీ పెద్దలు లోకేష్‌ను పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక.. హస్తినలోనే మకాం పెట్టారు. ఇక, లోకేష్‌ను అరెస్ట్ చేస్తారనే ఎల్లో మీడియా వార్తల నేపథ్యంలో ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా, తాజాగా నారా లోకేష్ పీఏ కిలారు రాజేష్ చౌదరి దేశం నుంచి అమెరికాకు జంప్ అయినట్టు తెలుస్తోంది. కాగా, రాజేష్‌ను నారా లోకేషే అండర్ గ్రౌండ్లోకి పంపినట్టు పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. స్కిల్ స్కాంలో షెల్ కంపెనీల నిధులు లోకేష్‌కి రాజేషే మళ్లించారు. లోకేష్‌కు సంబంధించిన అన్ని ఆర్థికమైన వ్యవహారాలను రాజేష్ చూసుకుంటారు. ఇటీవల యువగళం యాత్రలోనూ రాజేష్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ ఈ వివరాలను పేర్కొంది. ఇక, ఐటీ నోటీసుల్లో కూడా రాజేష్ పేరు ఉండటం గమనార్హం. రాజేష్‌పై అమరావతి కాంట్రాక్ట్‌ల్లో బ్లాక్ మనీ తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఐటీ నోటీసుల్లో కూడా ఐటీ అధికారులు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక, చంద్రబాబు కస్టడీ విచారణలోనూ సీఐడీ ఇదే అంశంపై ఆయనను ప్రశ్నించింది. కాగా, రాజేష్ ఇన్ని రోజులు లోకేష్‌తో ఢిల్లీలో ఉండి సీఐడీ విచారణ ప్రారంభం కాగానే అమెరికాకు వెళ్లిపోయినట్టు సమాచారం. దీంతో, సీఐడీ.. రాజేష్ కోసం వెతుకుతోంది. పరార్... లోకేష్ PA కిలారు రాజేష్ చౌదరి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమెరికా కు జంప్ అట ఇంతకుముందుCIDనోటీస్ అందుకున్న బాబుPAపెండ్యాల శ్రీనివాస్ చౌదరి & అమరావతి కాంట్రాక్టర్,కాంట్రాక్టర్ ల ప్రతినిధి మనోజ్ USA,దుబాయ్ కు, రామోజీ కోడలు శైలజ కూడా USA కు జంప్ #KhaidiNo7691#CBNInJail pic.twitter.com/IZYbW9sxSv — YSRCP IT WING Official (@ysrcpitwingoff) September 24, 2023 ఇది కూడా చదవండి: ఈనాడు ఫోటోగ్రాఫర్పై బాలకృష్ణ చిందులు -
Sep 24, 2023 : చంద్రబాబు కేస్ అప్డేట్స్
Updates.. 09:30PM చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►చంద్రబాబు రిమాండ్‌పై సీఐడీ మెమోలో సంచలన విషయాలు ►శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారీలో ఉన్నారు ►వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. ►ఈ ఇద్దరూ షెల్ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చారు ►ఇంకా కేసు విచారణ చేయాల్సి ఉంది ►ఈ సమయంలో చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి ►విచారణ ప్రక్రియకు భంగం కలిగేలా.. ఇటీవల మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడారు ►పీవీ రమేష్ మాట్లాడిన విధానం చూస్తే బాబు, ఆయన అనుచరులు..సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది 08:09PM నాగబాబు ఎదుట జనసైనికుల నిరసన ►జనసేన నాయకుల సమావేశంలో నాగబాబు ఎదుట ఆ పార్టీ నేతలు నిరసన ►ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లి, తంబళ్ళ పల్లి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు,పుంగనూరు, కుప్పం జనసేన నాయకులతో సమావేశం ►టీడీపీతో పొత్తు ససేమీరా అంటూ నినాదాలు ►పవవ కల్యాణ్‌ను టీడీపీ సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని డిమాండ్ ►జనసేన పార్టీ ను వాడుకుని వదిలేస్తారు అంటూ ఆవేదన 06:30PM సీఐడీ కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ►చంద్రబాబు ని కోర్టులో ప్రవేశ పెట్టారు ►సీఐడీ కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ►జ్యుడీషియల్ కస్టడీ పొడిగించమని కోరాం ►చంద్రబాబు గతంలో సాక్ష్యులను ప్రభావితం చేసిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం ►ఇంకా పోలీస్ కస్టడీ పొడిగించమని కోరలేదు ►రేపు పీటీ వారెంట్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది ►సీఐడీ కస్టడీకి మళ్ళీ కోరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం :::వివేకానంద, సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 06:07PM చంద్రబాబు లాయర్లపై జడ్జి అసహనం ►సీఐడీ రిమాండ్ పొడిగింపు పిటిషన్‌పై ఆదేశాల సమయంలో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ జడ్జి అసహనం ►ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా? ►ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుంది ►విచారణలో ఏం గుర్తించారనేది బయటపెట్టాలని జడ్జిని కోరిన చంద్రబాబు ►విచారణ సమయంలో విషయాలను బయటపెట్టడం సరికాదన్న జడ్జి. ►ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ సబ్మిట్ చేసింది ►ఆ పత్రాలను మీ లాయర్ల దగ్గరి నుంచి అడిగి తీసుకోండి అని చంద్రబాబు, న్యాయమూర్తి సూచన 06:00PM మరో 11 రోజులు జైలులోనే చంద్రబాబు ►చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు ►ఏసీబీ జడ్జి: కస్టడీలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? ►చంద్రబాబు: ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు ►ఏసీబీ జడ్జి: వైద్య పరీక్షలు నిర్వహించారా ►చంద్రబాబు: నిర్వహించారు ►ఏసీబీ జడ్జి:మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది ►ఏసీబీ జడ్జి:ఇప్పుడే అంతా అయిపోయిందని మీరు అనుకోవద్దు ►ఏసీబీ జడ్జి: మీ బెయిల్ పిటిషన్‌పై రేపు(సోమవారం) వాదనలు వింటాం 05:52PM చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ►స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలిచ్చింది ►అక్టోబర్ 5 దాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు ప్రకటించిన న్యాయమూర్తి 05:20PM సీఐడీ కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్ ►చంద్రబాబు నాయుడి రిమాండ్, అలాగే కస్టడీ పొడిగించాలని సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది ► ఈ పిటిషన్లపై చంద్రబాబు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ►కాసేపట్లో పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ► రిమాండ్ పొడిగింపు పిటిషన్‌పైనా విచారణ చేపట్టనున్న ఏసీబీ కోర్టు 05:14PM చంద్రబాబు రిమాండ్, కస్టడీ పొడిగించండి: సీఐడీ ►చంద్రబాబును వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన సీఐడీ ►రిమాండ్, కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేసిన ఏసీబీ అధికారులు ►కస్టడీ ముగిసినందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులను ఆదేశించిన న్యాయమూర్తి ►కాసేపట్లో చంద్రబాబుతో వర్చువల్ మాట్లాడనున్న జడ్జి 05:00PM ముగిసిన కస్టడీ.. ఇంటరాగేషన్‌లో సహకరించని చంద్రబాబు ►ముగిసిన చంద్రబాబు రెండు రోజుల పోలీస్ కస్టడీ ►రెండు రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబుని విచారించిన సీఐడీ అధికారుల బృందం ►రెండవ రోజు దాదాపు 6 గంటలకి పైగా చంద్రబాబుని విచారించిన సీఐడీ బృందం ►రెండు రోజుల పోలీస్ కస్టడీలో విచారణకు సహకరించని చంద్రబాబు ►రెండు రోజుల పాటు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన విచారణ ►రెండు రోజులలో దాదాపు 12 గంటలపాటు చంద్రబాబుని విచారించిన సీఐడీ బృందం ►విచారణ అనంతరం చంద్రబాబుకి వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ►ప్రతీ గంటకి అయిదు నిమిషాల బ్రేక్ ►చంద్రబాబు విచారణని వీడియో తీయించిన సీఐడీ అధికారులు ►కేసు ఇన్వెస్టిగేషన్ అధికారి డీఎస్పీ ధనుంజయుడి ఆధ్వర్యంలో రెండు బృందాలగా విడిపోయి విచారణ ►ఒక్కో బృందంలో ఒక డిఎస్పీ, ఇద్దరు సిఐలు ►రెండు రోజుల విచారణలో దాదాపు వందకి ప్రశ్నలు ►షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై ప్రధానంగా విచారణ ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ కి హవాలా రూపంలో 118 కోట్ల అందిన వైనంపైనా ప్రశ్నలు ►13 చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలపైనా ప్రశ్నలు ►అర్ధిక శాఖ అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకోకుండా 371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నలు ►ఐఎఎస్ అధికారుల వాంగ్మాలాలని డాక్యుమెంట్లని ముందుపెట్టి చంద్రబాబుని ప్రశ్నించిన అధికారులు ►చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి, సుమన్ బోస్ కి మధ్య సంబంధాలపైనా విచారణ ►కిలారు రాజేష్‌కి నారా లోకేష్‌కి మధ్య ఆర్ధికసంబందాలపైనా ప్రశ్నలు ►కీలక ప్రశ్నలకి సమాధానాలు చెప్పకుండా దాటవేత ►డాక్యుమెంట్ల పేరుతో కాలయాపన చేయడానికి దాటవేతకు చంద్రబాబు ప్రయత్నాలు ►కస్టడీ ముగియడంతో వైద్య పరీక్షల అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో చంద్రబాబుని హాజరుపర్చనున్న సీఐడీ 04.40PM చంద్రబాబు రిమాండ్‌పై టీడీపీలో ఉత్కంఠ ►స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ నేటితో ముగియనుంది ►మరోవైపు.. ఇంకాసేపట్లో సీఐడీ కస్టడీ కూడా ముగుస్తుంది.! ► వర్చువల్‌గా బాబును కోర్టులో హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ►ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టుకు న్యాయమూర్తి చేరుకున్నారు ► ఏసీబీ న్యాయమూర్తి ఎలాంటి ఆదేశాలు ఇస్తారనే దానిపై టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది 04.05PM కాసేపట్లో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ ►5 రోజుల కస్టడీ అడిగితే 2 రోజులు ఇచ్చిన కోర్టు ►కస్టడీ మరికొన్ని రోజులు కావాలని కోరనున్న సీఐడీ ►నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్ ►సీఐడీ కస్టడీ తర్వాత వర్చువల్ విధానంలో బాబుని జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న అధికారులు ►రిమాండ్ పొడిగింపు పై సాయంత్రం ఆదేశాలు ఇవ్వనున్న ఏసీబీ కోర్టు ►రిమాండ్, కస్టడీ .. ఈ రెండు అంశాలపై ఈ సాయంత్రం క్లారిటీ 04:00PM టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం ►రాజకీయ కార్యక్రమాల పర్యవేక్షణకు టీడీపీ కమిటీ ►14 మందితో కమిటీ ఏర్పాటు చేసిన అచ్చెన్నాయుడు ►ఇంటింటికీ వెళ్లి బాబు తప్పు చేయలేదని చెప్పాలని ఆదేశం 3.45PM క్వాష్ పిటిషన్ల దారి పట్టిన తెలుగుదేశం ► ఏపీ హైకోర్టులో కొల్లురవీంద్ర , బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లు ► గన్నవరం సభలో వ్యాఖ్యలపై పేర్ని నాని ఫిర్యాదు పై ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలన్న బుద్ధా వెంకన్న ► గన్నవరంలో వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కొల్లురవీంద్ర పిటిషన్ ► ఇప్పటికే స్కిల్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ వేసి భంగపాటుకు గురైన టీడీపీ అధినేత చంద్రబాబు ► సీఐడీ కస్టడీని సవాల్ చేస్తూ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన వైనం 03:20PM టీడీపీపై నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు ►తిరుపతిలో జనసేన కార్యకర్తలతో నాగబాబు భేటీ ►టీడీపీ నేతలు గతంలో టార్చర్ పెట్టారని ఆవేదన వెళ్లగక్కిన జనసేన కార్యకర్తలు ►గతం మర్చిపోయి ముందుకెళ్లాలని కార్యకర్తలకు నాగబాబు హితవు ►టీడీపీ నాయకులు మన కిందనే పనిచేయాలి. ►టీడీపీతో కలిసి పనిచేసినా జనసేన అజెండానే తీసుకెళ్లాలి ►అధికారంలోకి వస్తే పవనే సీఎం అంటూ నాగబాబు వ్యాఖ్య 03:06PM చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తారా? ►స్కిల్ స్కామ్ కేసులో నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్ ►కొనసాగుతున్న సీఐడీ ఇంటరాగేషన్.. సాయంత్రం ముగియనున్న సీఐడీ కస్టడీ ►వర్చువల్‌గా చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ముందుకు సీఐడీ హాజరుపరిచే ఛాన్స్ ►సీఐడీ సైతం మరో మూడు రోజులు కస్టడీ కోరే అవకాశం ►ఐదురోజులు అడిగితే 2 రోజులే ఇచ్చిన సీఐడీ కోర్టు ►విచారణలో సీఐడీ అధికారులకు పూర్తి స్థాయిలో సహకరించని చంద్రబాబు? ► రిమాండ్, కస్టడీ.. ఈ రెండింటిపై సాయంత్రమే రానున్న క్లారిటీ 2:36PM ఇంటరాగేషన్ వేళ.. చంద్రబాబు క్వాష్ పిటిషన్! ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు కస్టడీపై క్వాష్ పిటిషన్ దాఖలైంది ►ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు క్వాష్ చేయాలని పిటిషన్ వేసిన చంద్రబాబు లాయర్లు ►రెండురోజుల కస్టడీలో భాగంగా నిన్నటి నుంచి జైల్లోనే విచారిస్తున్న సీఐడీ అధికారులు ►ఇవాళ సాయంత్రం ఐదు గంటల దాకా కొనసాగనున్న విచారణ 2:15PM కాలయాపనకు చంద్రబాబు యత్నం? ►రాజమండ్రి జైల్లో రెండో రోజు చంద్రబాబు విచారణ కొనసాగుతోంది ►సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు ముక్తసరిగా సమాధానాలు! ►నిన్నటి విచారణలో కాలయాపనకు చేసేందుకు చంద్రబాబు యత్నం ►ఇవాళ్లి విచారణలో.. సూటిగా ప్రశ్నలపైనా సమాధానం ఇవ్వాలని కోరుతున్న అధికారులు ►సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనున్న కస్టడీ విచారణ 1:45 PM మరో వారం ఢిల్లీలోనే లోకేష్ ►మరో వారం రోజుల పాటు లోకేష్ ఢిల్లీలోనే మకాం. ►అరెస్ట్ భయంతో ఢిల్లీలో దాక్కున్న లోకేష్ బాబు. ►స్కిల్ స్కాం కేసులో లోకేష్ అవినీతిపైన సీఐడీ వద్ద ఆధారాలు. ►నేను ఢిల్లీలో ఉంటా.. పార్టీ నేతలు అరెస్ట్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలన్న లోకేష్. ►ఢిల్లీలో న్యాయ నిపుణులతో సంప్రదింపులంటూ లోకేష్ లీకులు. ►ఇప్పటికే పరారీలో లోకేష్ స్నేహితుడు కిలారి రాజేష్ 1:00 PM లంచ్ విరామం @ 1PM .. ►సీఐడీ విచారణలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్. ►మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కానున్న సీఐడీ విచారణ. ►ప్రతీ గంటకు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చిన అధికారులు 12:45 PM నేటితో ముగియనున్న చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ►స్కిల్ కేసులో మరో పిటిషన్ దాఖలు చేయనున్న సీఐడీ. ►చంద్రబాబు కస్టడీని రెండు రోజులు పొడిగించాలని కోరనున్న సీఐడీ. ►సాయంత్రం 5 గంటలతో ముగియనున్న చంద్రబాబు సీఐడీ కస్టడీ. ►చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించే క్రమంలో మరో పిటిషన్ దాఖలుకు సీఐడీ రంగం సిద్ధం. ►మధ్యాహ్నం 3 గంటలకు కోర్టుకు హాజరుకానున్న న్యాయమూర్తి. ►వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడనున్న జడ్జి. 12:30 PM నారా బ్రహ్మణితో జనసేన నేతల సమావేశం ►జనసేన నేతలతో నారా బ్రహ్మణి సమావేశమయ్యారు. ►పవన్ కళ్యాణ్ ఎక్కడ అని అడిగిన బ్రహ్మణి. ►బిజీగా ఉన్నారని చెప్పిన కందుల దుర్గేష్, బాలకృష్ణ, శశిధర్, చంద్రశేఖర్. ►ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న బ్రహ్మణి ►ఉమ్మడి కార్యాచరణ నిధుల గురించి అడిగిన జనసేన నేతలు ►మాకు మద్ధతు ఇస్తే చేస్తామన్న జనసేన నేతలు 12:15 PM చంద్రబాబును ప్రశ్నిస్తున్న సీఐడీ బృందం ►సీఐడీ డీఎస్సీ ధనుంజయుడు నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ. ►చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో విచారణ. ►మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు భోజన విరామ సమయం. 12:00 PM ముఖ్య నేతలతో లోకేష్ సమీక్ష ►చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాలపై ముఖ్యనేతలతో లోకేష్ సమీక్ష ►చంద్రబాబుకు మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపిన నారా లోకేష్. ►ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబుకు ఏమీ కాదన్న లోకేష్. ►ఎంత ఖర్చు అయినా నిరసన కార్యక్రమాలను చేయాలని పార్టీ నేతలకు సూచనలు. ►నారా లోకేష్ యువగళం పాదయాత్ర సంగతి ఏంటని అడిగిన నేతలు. ►యువగళం సంగతి తర్వాత చూద్దామన్న లోకేష్. ►నా తరపున మీరే ఇంటింటికీ వెళ్లి రాజకీయ కక్ష చేస్తున్నారని ప్రచారం చేయాలన్న లోకేష్. ►చంద్రబాబుపై కేసు విషయంలో ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులతో బిజీగా ఉన్నానన్న లోకేష్ 11:45 AM విజయసాయిరెడ్డి సెటైర్లు.. ►చంద్రబాబుకు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?? ►40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్న చంద్రబాబు. ►ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో? ►2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.371 కోట్ల స్కిల్ స్కాం ►తవ్వేకొద్దీ బయటికొచ్చే ‘ఆస్తి’కలెన్నో! లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? 40 ఏళ్లుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తూనే ఉన్నాడు. ఢిల్లీ వెళ్లి ఆర్తనాదాలు చేస్తున్న వారికి, కొవ్వొత్తుల ప్రదర్శకులకు తెలియదా ఆయన సంపాదన రహస్యం ఏమిటో? 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే 371 కోట్ల స్కిల్ స్కాంకు పాల్పడ్డాడు. తవ్వేకొద్దీ బయటికొచ్చే… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 24, 2023 10:04AM సీఐడీ విచారణ ప్రారంభం @2డే ►రెండో రోజు చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ బృందం ►బాబుకు వైద్య పరీక్షల తర్వాత విచారణ ప్రారంభించిన సీఐడీ బృందం ►రెండు బృందాలుగా విడిపోయి విచారణ ►సాయంత్రం 5గంటల వరకూ కొనసాగనున్న విచారణ 9:25 AM లోకేష్ పీఏ అమెరికా జంప్.. ►నారా లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ►లోకేష్ పీఏ కిలారు రాజేష్ చౌదరి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమెరికాకు జంప్. ►అంతకుముందు సీఐడీ నోటీసులు అందుకున్న బాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ యూఎస్‌కు జంప్ ►అమరావతి కాంట్రాక్టర్,కాంట్రాక్టర్ ల ప్రతినిధి మనోజ్ USA, దుబాయ్ కు, రామోజీ కోడలు శైలజ కూడా USAకు జంప్. పరార్... లోకేష్ PA కిలారు రాజేష్ చౌదరి నిన్న రాత్రి ఢిల్లీ నుంచి అమెరికా కు జంప్ అట ఇంతకుముందుCIDనోటీస్ అందుకున్న బాబుPAపెండ్యాల శ్రీనివాస్ చౌదరి & అమరావతి కాంట్రాక్టర్,కాంట్రాక్టర్ ల ప్రతినిధి మనోజ్ USA,దుబాయ్ కు, రామోజీ కోడలు శైలజ కూడా USA కు జంప్ #KhaidiNo7691#CBNInJail pic.twitter.com/IZYbW9sxSv — YSRCP IT WING Official (@ysrcpitwingoff) September 24, 2023 9:15 AM స్కాంకు ఆది, అంతం చంద్రబాబే: విజయసాయిరెడ్డి ►స్కిల్ స్కాంపై ఢిల్లీలో లోకేష్ తప్పుడు ప్రచారం. ►రూ.371 కోట్ల కుంభకోణానికి ఆది, అంతం చంద్రబాబే. ►ఫైళ్లపై 13 చోట్ల చంద్రబాబు, 2 చోట్ల అచ్చెన్న సంతకాలు. స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిన చంద్రబాబు గారు ఏ తప్పూ చేయకుండానే జైలు పాలయ్యారని లోకేశ్ ఢిల్లీ వెళ్లి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. 371 కోట్ల ఈ కుంభకోణానికి ఆది, అంతం చంద్రబాబే. ఫైళ్లపై 13 చోట్ల ఆయన, 2 చోట్ల అచ్చెన్న సంతకాలు చేసి నిధుల విడుదలకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఈ… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 24, 2023 9:02 AM మాట మార్చిన మోత్కుపల్లి.. ►చంద్రబాబుపై మోత్కుపల్లి మార్చారు ►నాడు చంద్రబాబును రాజకీయంగా అంతం చేయమని దేవున్ని కోరిన మోత్కుపల్లి. ►నేడు, చంద్రబాబు పెద్ద మనిషి అంటూ కలరింగ్. ►బాబు ఎలా అరెస్ట్ చేస్తారంటూ మోత్కుపల్లి భజన. ►నాడు బాబును ప్రజాద్రోహి, దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు అంటూ కామెంట్స్ ►నాడు చంద్రబాబు ఓటమిని కోరుకున్న మోత్కుపల్లి. ►ముఖ్యమంత్రి జగన్.. సీఎం కావాలని కోరుకున్న మోత్కుపల్లి. “బాబు పై మాట మార్చిన మొత్కుపల్లి” నాడు, చంద్రబాబు ని రాజకీయంగా అంతం చేయమని దేవుడిని కోరిన మొత్కుపల్లి. నేడు, చంద్రబాబు పెద్ద మనిషి అలా ఏలా అరెస్ట్ చేస్తారంటూ బాబు భజన మొదలుపెట్టిన మొత్కుపల్లి.#CorruptBabuNaidu pic.twitter.com/Xa4vN3LMHc — YSR Congress Party (@YSRCParty) September 23, 2023 కమల హాసన్, కోటం హాసన్ లా... కోతి హాసన్ ఆర్టిస్ట్ వచ్చేశాడు రోయ్... చెప్పు... చెప్పు తెగుద్దీ... (బ్రహ్మనందం వెర్షన్) ప్రతోడు ANR,NTR లా నటిస్తున్నారని అనుకుంటే ఎలారా..? పొగడటం,, తిట్టడం.. అంతా మీ నటనలే అయితే ప్రజలు ఏది నమ్మాలిరా... హవలాగా?#KhaidiNo7691#CBNArrested pic.twitter.com/yYmHFeYGf7 — YSRCP IT WING Official (@ysrcpitwingoff) September 24, 2023 9:00 AM మళ్లీ ఎన్టీఆర్‌ను నమ్ముకున్న టీడీపీ ►టీడీపీ మళ్లీ ఎన్టీఆర్‌ను నమ్ముకుంది. ►ఎన్టీఆర్ కామెంట్స్‌ను టీడీపీ ట్విట్టర్లో షేర్ చేసింది. "నా దగ్గర వేయి ప్రణాళికలు లేవు. ఉన్నదొకటే ప్రణాళిక. నేను, నా పార్టీ తెలుగువారి సేవలో తరించాలి. తెలుగునేలకు ఖండాంతర ఖ్యాతి తేవాలి " అన్న ఎన్టీఆర్, వేయి మాటలు మాట్లాడకుండా తాను చేయదలచుకున్న సేవ చేసుకుపోయారు. ఆ నిజాయితీనే ఎన్టీఆర్ కు పేదల గుండెల్లో స్థానమిచ్చింది శకపురుషుడు… pic.twitter.com/BnUqDQJcXq — Telugu Desam Party (@JaiTDP) September 24, 2023 8:10 AM కీలక విషయాలపై సిట్ ఫోకస్ ►నేడు డొల్ల కంపెనీల ద్వారా నిధుల మల్లింపుపై ప్రధానంగా విచారించే అవకాశం ►చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్ హవాలా రూపంలో 118 కోట్ల అందిన వైనంపై ప్రశ్నించే అవకాశం ►రూ.13చోట్ల చంద్రబాబు చేసిన సంతకాలపై ప్రశ్నలు ఉండే అవకాశం. ►ఆర్ధిక శాఖ అభ్యంతరాలని పరిగణనలోకి తీసుకోకుండా రూ.371 కోట్లు నిధులు ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించే అవకాశం ►చంద్రబాబుకి, గంటా సుబ్బారావుకి, సుమన్ బోస్కి మధ్య సంబంధాలపై విచారణ ►చంద్రబాబు నుంచి పలు కీలక విషయాలని రాబట్టేందుకు సిట్ ప్రయత్నాలు ►నేటి సాయంత్రం 5 గంటలతో ముగియనున్న చంద్రబాబు రెండు రోజుల కస్టడీ. 7:10 AM రెండో రోజు విచారించనున్న సీఐడీ ►స్కిల్ స్కాం కేసులో రెండో రోజు విచారించనున్న సీఐడీ అధికారులు ►ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ ►కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీఐడీ విచారణ. ►విచారణలో ప్రతీ గంటకు 5 నిమిషాల పాటు బ్రేక్. కేసులో 30 శాతం ప్రశ్నలు పూర్తి.. ►మొదటిరోజు విచారణకు సరిగా సహకరించని చంద్రబాబు ►టైమ్ పాస్ చేయడానికే బాబు ప్రాధాన్యం ►కోర్టు కస్టడీకి ఇచ్చిన ఉత్తర్వుల 20 పేజీలు డాక్యుమెంట్స్ పరిశీలించేందుకు అధిక సమయం వెచ్చించిన చంద్రబాబు. ►సీఐడీ ప్రశ్నలకు తెలీదు.. గుర్తు లేదనే సమాధానాలతో దాటవేత ►తొలిరోజు నాలుగు దశల్లో విచారణ పూర్తి. ►సంయమనం కోల్పోకుండా విచారణ జరిపిన అధికారులు. ►కోర్టు మార్గదర్శకాల మేరకు కొనసాగిన విచారణ. మొదటి రోజు ఇలా.. ► చంద్రబాబును ప్రశ్నించిన CID బృందం ► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ► చంద్రబాబు స్టేట్మెంట్ను రికార్డు చేసిన అధికారులు ► విచారణను వీడియో రికార్డింగ్ చేసిన అధికారులు ► న్యాయవాదుల సమక్షంలోనే జరిగిన విచారణ ► బాబు తరపు లాయర్లు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావు ► భోజనంతో పాటు మొత్తం 4 సార్లు బ్రేక్ ఇచ్చిన అధికారులు ► బాబు ఆరోగ్యం దృష్ట్యా జైలు ఆవరణలోనే వైద్య బృందం. కస్టడీ విచారణలో ప్రశ్నల పరంపర ► కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు సాక్ష్యాధారాల మాయంపై ప్రశ్నలు ► సుమన్ బోస్‌తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా? ► డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు? ► సుబ్బారావుకు 4 పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి? ► నిధుల విడుదల చేసే ముందు ప్రొసీర్స్ ఎందుకు ఫాలో కాలేదు? ► ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా నిధులు ఎందుకు విడుదల చేశారు? ► యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు? ► 3వేల కోట్ల గురించి అడగొద్దని అధికారులను ఎందుకు దబాయించారు? ► ఈ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పాత్ర ఏంటి? ► 3వేల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ డిస్కౌంట్‌గా ఎందుకు మారింది? ► 330 కోట్ల డబ్బులు దోచుకునేందుకే 3,356 కోట్లకు ప్రాజెక్టు అంచనాలు పెంచారా? ► సుమన్ బోస్‌తో సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి.? -
‘స్కిల్’ స్కామ్ మీ బాబు నిర్వాకమే
సాక్షి, అమరావతి: ఈనాడు రామోజీరావు ఎన్ని కట్టు కథలు చెబుతున్నా ‘స్కిల్’ కుంభకోణంలో చంద్రబాబు అవినీతి బండారాన్ని మాత్రం దాచలేకపోతున్నారు. అయ్యో.. అయ్యో మా చంద్రబాబు ఎలాంటి అవినీతి చేయలేదు.. అదిగో జీవో.. ఇదిగో సీమెన్స్ ఒప్పందం.. అంటూ రామోజీ రోజూ పేజీలకు పేజీలు అభూతకల్పనలు ప్రచురిస్తున్నా ఈ కుంభకోణంలో అవినీతి దాగడం లేదు. సీఐడీనే కాదు.. కేంద్ర ప్రభుత్వ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జీఎస్టీ విభాగాలు కూడా టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ)లో అవినీతి బాగోతాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేశాయి. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా చంద్రబాబు, ఆయన ముఠా ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ పేరిట నిధులు కొల్లగొట్టారని ఆధారాలతోసహా వెలికి తీశాయి. మరోవైపు అసలు ఈ ప్రాజెక్ట్ గురించే తమకు తెలియదని సీమెన్స్ కంపెనీ పదే పదే స్పష్టం చేస్తున్నా, ఏకంగా న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చినా.. రామోజీరావు మాత్రం ససేమిరా అంటున్నారు. అదేమీ కుదరదు.. ‘మా ఈనాడే న్యాయస్థానం.. నేనే న్యాయమూర్తి’ అన్నట్లు తిమ్మిని బమ్మిని చేయాలని యత్నిస్తుండటం దిగజారుడు పాత్రికేయానికి నిదర్శనం. చంద్రబాబు కోసం జారేందుకు ఇక మేట్లే లేవు.. వదిలేసేందుకు ప్రమాణాలే లేవన్నట్టుగా ఈనాడు మరోసారి అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని మోసగించేందుకు యత్నించింది. అందుకే అసలు వాస్తవాలు మరోసారి.. ఒప్పందం గురించి మాకు తెలీదు: సీమెన్స్ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ గురించి అసలు తమకు తెలియదని జర్మనీలోని సీమెన్స్ ప్రధాన కార్యాలయం విస్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు ఏపీఎస్ఎస్డీసీకి ఈ మెయిల్ ద్వారా తెలియజేయడంతోపాటు న్యాయస్థానంలో సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. న్యాయస్థానంలో వాంగ్మూలం ఇవ్వడం కంటే స్పష్టమైన, సాధికారికమైన సాక్ష్యం మరొకటి ఉండదు. అయినా సరే చంద్రబాబు కుదుర్చుకున్న నకిలీ ప్రాజెక్ట్ సరైందేనని నమ్మించేందుకు ఈనాడు పత్రిక పడరాని పాట్లు పడుతోంది. ఏపీ సీఐడీతోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా స్కిల్ స్కామ్‌పై విచారణ చేస్తోంది. షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని నిర్ధారించి, ఈ కుంభకోణంలో చంద్రబాబు ముఠా సభ్యులైన సీమెన్స్ ఇండియా ఎండీగా వ్యవహరించిన సుమన్ బోస్ (ఆయన అవినీతి వ్యవహారంపై విచారించి సీమెన్స్ కంపెనీ ఆయన్ను తొలగించింది), డిజైన్‌టెక్ కంపెనీ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్లతోపాటు నలుగురిని అరెస్ట్ చేసింది. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీమెన్స్ ఇండియా కంపెనీ ప్రస్తుత ఎండీ మాథ్యూ థామస్ ఈడీకి వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలం ఆధారంగానే డిజైన్‌టెక్ కంపెనీకి చెందిన రూ.32.31 కోట్ల బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్ చేసింది. అందుకోసం జారీ చేసిన ‘ప్రొవిజనల్ ఆర్డర్ ఆఫ్ అటాచ్మెంట్’లో మాథ్యూ థామస్ వాంగ్మూలాన్ని ఈడీ సవివరంగా పేర్కొంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని.. అప్పటి సీమెన్స్ ఇండియా ఎండీగా ఉన్న సుమన్ బోస్ కుమ్మక్కు అయ్యారని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయన చెప్పిన విషయాలను వెల్లడించకుండా.. చంద్రబాబుకు అనుకూలంగా వక్రీకరిస్తూ ఈనాడు ప్రజలను మోసగించేందుకు యత్నించింది. ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ అంతా సవ్యంగానే సాగిందని అవాస్తవాన్ని ప్రచురించింది. టీడీపీ ప్రభుత్వం తమ కంపెనీ పేరిట కుదర్చుకున్న ఒప్పందం నకిలీదని, తమకు అసలు ఆ ఒప్పందం గురించి తెలియదని మాథ్యూ థామస్ స్పష్టం చేశారు. కాదు.. కాదు.. అది అసలైన ఒప్పందమే అని నమ్మించేందుకు ఈనాడు తనకు అలవాటైన రీతిలో దిగజారుడు పాత్రికేయాన్ని మరోసారి ప్రదర్శించింది. అది నకిలీ ఒప్పందం ఓ హోల్‌సేలర్‌కు, డిస్ట్రిబ్యూటర్‌కు ఉన్న వ్యాపార లావాదేవీని ఏకంగా ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ ఒప్పందంగా భ్రమింపజేసేందుకు ఈనాడు పడరాని పాట్లు పడింది. ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ఈ కుంభకోణం సూత్రధారి చంద్రబాబు పన్నిన పన్నాగంలో పాత్రధారైన సుమన్ బోస్ అందుకోసం తీసుకువచ్చిన డిస్ట్రిబ్యూటరే డిజైన్‌టెక్ కంపెనీ. అందుకే ఈ కేసులో సుమన్బోస్తోపాటు డిజైన్‌టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్‌ను సీఐడీతోపాటు ఈడీ కూడా అరెస్ట్ చేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేశారన్న వాస్తవాన్ని ఈనాడు తన వార్తా కథనంలో ఎక్కడా ప్రస్తావించ లేదు. అటువంటి సుమన్‌బోస్, వికాస్ కన్వేల్కర్ సృష్టించిన నకిలీ ఒప్పందాన్ని అసలైన ఒప్పందంగా నమ్మించేందుకు ఈనాడు కుయుక్తి పన్నడం విస్మయ పరుస్తోంది. ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’ విధానమే లేదు అసలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ (ఆర్థిక సహాయం) అన్న విధానమే సీమెన్స్ కంపెనీ ఏనాడూ అనుసరించలేదని కూడా మాథ్యూ థామస్ స్పష్టం చేశారు. ఐఐటీ, ఎన్ఐటీ వంటి సంస్థలకు కూడా గ్రాంట్ ఇన్ఎయిడ్ ఏనాడూ ఇవ్వలేదన్నారు. కానీ తమ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో కుమ్మక్కై గ్రాంట్ ఇన్ ఎయిడ్ వస్తుందని నకిలీ ఒప్పందం సృష్టించారని చెప్పారు. అంటే టెండర్ల ప్రక్రియ లేకుండా ఏకపక్షంగా నిధులు కొల్లగొట్టేందుకే చంద్రబాబు ముఠా ఈ కుతంత్రానికి పాల్పడింది. ఇక ఈ ప్రాజెక్ట్ కింద బిల్లుల చెల్లింపునకు సమర్పించిన ఇన్వాయిస్లు కూడా తమ కంపెనీవి కావని, అవి నకిలీవని మాథ్యూ థామస్ స్పష్టం చేశారు. సీమెన్స్ కంపెనీ సహజంగా అనురించే పద్ధతుల్లో ఇన్వాయిస్లు లేవని, సాఫ్ట్వేర్ వారీగా, హార్డ్‌వేర్ వారీగా రేటు ఎంత.. ఎంత డిస్కౌంట్ ఇచ్చారు.. అనే విషయాలే లేవన్నారు. అంటే సీమెన్స్ కంపెనీ పేరిట సృష్టించినవి నకిలీ ఇన్వాయిస్లేనన్నది స్పష్టమైందన్నారు. ఆయన చెప్పిన అంశాలను ఈనాడు ప్రచురించకుండా చంద్రబాబు అవినీతికి ముసుగు వేసేలా వక్రీకరించి తన క్షుద్ర పాత్రికేయాన్ని ప్రదర్శించింది. ఆ షెల్ కంపెనీలతో సీమెన్స్‌కు సంబంధం లేదు నిధులు కొల్లగొట్టేందుకు ‘నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను కూడా సుమన్ బోస్ తెరపైకి తెచ్చారని మాథ్యూ థామస్ చెప్పారు. సీమెన్స్ కంపెనీ ఏనాడు ఆ కంపెనీతో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించలేదని తెలిపారు. కానీ ఆ కంపెనీని వెండార్‌గా చూపించారని.. ఆ కంపెనీ ద్వారా పరికరాలు సరఫరా చేసినట్టు రికార్డుల్లో నమోదు చేసి, సుమన్ బోస్ అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. ఆ విషయం సీమెన్స్ కంపెనీ అంతర్గత విచారణలో కూడా వెల్లడైందన్నారు. నాలెడ్జ్ పోడియం సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతోపాటు టాలెంట్ ఎడ్జ్, అలైడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ ఏసియా లిమిటెడ్, స్కిలర్ ఎంటర్ ప్రైజస్, డిజైన్ టెక్ కంపెనీలకు చెందిన యాజమానులతో సుమన్‌బోస్ కుమ్మక్కయ్యారని తమ విచారణలో నిగ్గు తేలిందని మాథ్యూ థామస్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సుమన్‌బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్, ముకుల్ చంద్ర అగర్వాల్ ఒక వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారని తాము గుర్తించామన్నారు. నిధులు అక్రమంగా మళ్లింపులో సాధనంగా వ్యవహరించిన ఫిష్ హాస్పిటాలిటీ, యాక్సన్ స్మార్ట్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యాక్స్ స్మార్ట్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, గోఫార్ అడ్వైర్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్, అప్టస్ హెల్త్‌కేర్ లిమిటెడ్, బెన్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో సీమెన్స్ కంపెనీ ఏనాడూ ఎలాంటి లావాదేవీలను నిర్వహించలేదని మాథ్యూ థామస్ స్పష్టం చేశారు. సుమన్ బోస్ తన స్వార్థం కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని విచారణలో ఆధారాలతో సహా నిర్ధారణ అయ్యిందన్నారు. కానీ ఈనాడు పత్రిక ఆ విషయాలను ఎక్కడా ప్రచురించకపోవడం రామోజీరావు కుట్రపూరిత వైఖరికి నిదర్శనం. సీఐటీడీ మదింపే లేదు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో తమ అధినేత చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి రిమాండ్ ఖైదీగా ఉండటంతో టీడీపీకి దిక్కుతోచడం లేదు. అందుకే కుంభకోణాన్ని కప్పిపుచ్చేందుకు ఆ పార్టీ నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. సీఐటీడీ మదింపు నివేదిక ఇచ్చిందంటూ అవాస్తవాలు ప్రచారంలోకి తెస్తున్నారు. టీడీపీ నేతలు, పచ్చ మీడియా లేవనెత్తిన రెండు ప్రశ్నలకు ప్రభుత్వం దీటుగా సమాధానం ఇచ్చింది. ప్రశ్న 1: ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ సీఐడీటీ కన్నా, ప్రైవేట్ సంస్థే ముద్దా.. సీఐడీటీ నివేదికను పరిగణనలోకి తీసుకోరా.. ఒక్కో క్లస్టర్‌కు రూ.559 కోట్లుగా సీఐటీడీ ఇచ్చిన నివేదికను ఎందుకు పట్టించుకోలేదు? వాస్తవం : స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కుంభకోణం కోసం చంద్రబాబు, ఆయన ముఠా సీఐటీడీ సంస్థను వాడుకున్నారు. వాస్తవంగా ఆ ప్రాజెక్ట్‌పై సీఐడీటీ ఎలాంటి మదింపు నివేదిక ఇవ్వనే లేదు. ఆ ప్రాజెక్ట్‌ను కనీసం పరిశీలించనూ లేదు. ఆ ప్రాజెక్ట్ పేరిట నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు మంజూరు చేసిన తర్వాత ఆ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగంతో సీఐడీటీ పేరిట మదింపు నివేదికను తెరపైకి తెచ్చారు. ఈ అంశంలో అసలు వాస్తవాలను సీఐటీడీ సంస్థే వెల్లడించింది. ‘టీడీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఎస్డీసీ అధికారులు, డిజైన్ టెక్ ప్రతినిధులు 2015 డిసెంబర్ 18న ఓ ప్రాజెక్ట్ నివేదిక కాపీని తీసుకువచ్చి సీఐటీడీ సంస్థను పరిశీలించమని కోరారు. ఆ కాగితాలను చూసి తాము అంచనా నివేదిక ఇచ్చాం. తాము ఇచ్చింది మదింపు నివేదిక కాదు.. కేవలం పరిశీలన పత్రమే. అంతేగానీ అసలు ఆ ప్రాజెక్ట్ వాస్తవంగా ఉందా లేదా అన్నది మేము క్షేత్ర స్థాయిలో పరిశీలించలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి సాఫ్ట్వేర్, పరికరాలు, మౌలిక వసతుల విలువను అంచనా వేసి నివేదిక ఇస్తే అది మదింపు నివేదిక అవుతుంది. కానీ మేము ఇటువంటి మదింపు నివేదిక ఇవ్వలేదు. మా పేరుతో ప్రచారంలో ఉన్న మదింపు నివేదికతో మాకు సంబంధం లేదు’ అని తేల్చి చెప్పింది. కేవలం ప్రతిపాదనలు చూసి నివేదిక ఇవ్వడం అంటే ‘డీపీఆర్’ ఇవ్వడం లాంటిదే. ఇక వారి వద్దకు పత్రాలు తీసుకువచ్చే నాటికే అంటే 2015 డిసెంబర్ 18కే ఆ ప్రాజెక్ట్ వ్యయంలో ప్రభుత్వ వాటా 10 శాతం అంటే రూ.337 కోట్లను డిజైన్‌టెక్ కంపెనీకి ప్రభుత్వం చెల్లించేసిందని కూడా సీఐడీటీ తెలిపింది. కాబట్టి తమ నివేదిక ఆధారంగానే నిధులు చెల్లించారన్నది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. మరి అది నిబంధనలకు విరుద్ధమే కదా రామోజీ? ప్రశ్న 2: 2.13 లక్షల మంది సీమెన్స్ ప్రాజెక్టు ద్వారా శిక్షణ పొందారు.. 80 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి.. వాస్తవం : అసలు సీమెన్స్ కంపెని తమకు ఆ ఒప్పందమే తెలియదు.. ఆ ప్రాజెక్ట్ గురించే తెలీదు అని స్పష్టం చేసింది. ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతం నిధులను సమకూర్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే విధానమే తమ వద్ద లేదని కూడా కుండబద్దలు కొట్టింది. తమ అంతర్గత విచారణలో కూడా ఆ అంశం నిర్ధారణ అయ్యిందని చెప్పింది. ఈ మేరకు న్యాయస్థానంలో సీఆర్పీసీ సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చింది. ఇలాంటి సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూర్చేందుకు ఒప్పదం చేసుకున్నామని టీడీపీ చెబుతుండటం పూర్తిగా అవాస్తవం. ఆ ప్రాజెక్ట్ అన్నదే లేనప్పుడు.. 2 లక్షల మందికి ఎలా శిక్షణ ఇస్తారు? ఇలా చెప్పడం ప్రజలను మోసగించడమే. ఆ ప్రాజెక్ట్ కింద శిక్షణ పొందని విద్యార్థులను శిక్షణ పొందినట్టుగా.. బీటెక్ అర్హతతో విద్యార్థులు తాము చదువుకున్న ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ కింద ఉద్యోగాలు పొందిన వారిని ఈ ప్రాజెక్ట్ కింద ఉద్యోగాలు వచ్చినట్టుగా నమ్మించేందుకు టీడీపీ కుట్ర పన్నుతోంది. -
కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మృతి
జి.కొండూరు(మైలవరం): కొలంబియాలో స్నేహితురాలి జన్మదిన వేడుకలకు హాజరైన తెలుగు విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన బేతపూడి సుదీర్‌కుమార్ అలియాస్ జోషి (34) టెలీ కమ్యూనికేషన్లో ఎంఎస్ చేసేందుకు 2018లో స్పెయిన్ వెళ్లాడు. అక్కడ యూనివర్సిటీ ఆఫ్ లే డే జైన్‌లో ఎంఎస్‌లో చేరాడు. కరోనా కారణంగా చదువు పూర్తి కాకపోవడం, సబ్జెక్ట్‌లు మిగిలిపోవడంతో అక్కడే ఉండి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసుకుంటూ ఎంఎస్ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. తనతోపాటు అదే యూనివర్సిటీలో చదువుతున్న కొలంబియాకు చెందిన యువతి జెస్సికాతో సుదీర్‌కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీన తన స్నేహితురాలి జన్మదిన వేడుకల నిమిత్తం సుదీర్‌కుమార్ స్పెయిన్ నుంచి కొలంబియా రాజధాని బోగోటో వెళ్లాడు. అక్కడి నుంచి రియో బ్లాంకోలోని స్నేహితురాలి నివాసానికి చేరుకున్నాడు. అక్కడ జన్మదిన వేడుకల అనంతరం ఏం జరిగిందో ఏమో కానీ ఈ నెల 19వ తేదీన మంగళవారం తెల్లవారుజామున కొలంబియాలోని జెస్సీకా నుంచి జి.కొండూరులోని సుదీర్‌కుమార్ తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసుకు సుదీర్‌కుమార్ మరణ వార్త అందింది. తన ఇంట్లోనే సుదీర్‌కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని జెస్సీకా తెలిపినట్లు కేథరీన్, దేవదాసు చెబుతున్నారు. స్నేహితురాలి జన్మదిన వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను సైతం తమతో వాట్సాప్‌లో పంచుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. జన్మదిన వేడుకలలో భాగంగా తాగిన డ్రింక్ వల్ల మత్తుగా ఉందని, తర్వాత మాట్లాడతానని తమతో చివరిగా ఫోన్లో మాట్లాడినట్లు చెబుతున్నారు. తమ కుమారుడిని జన్మదిన వేడుకల పేరుతో రప్పించి కావాలని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని తమ కుమారుడి భౌతికకాయం తమకు అప్పగించేలా చూడాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
తెలీదు.. గుర్తులేదు అంటూ సీఐడీకి సహకరించని చంద్రబాబు
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం: టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబును సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తొలిరోజు శనివారం విచారించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ని రెండ్రోజుల సీఐడీ కస్టడీ విచారణకు న్యాయస్థానం అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు అధికారి ధనుంజయ నేతృత్వంలో సిట్ బృందం చంద్రబాబును సెంట్రల్ జైలులోనే కస్టడీలోకి తీసుకుని విచారించింది. న్యాయస్థానం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ ఆయన్ను విచారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గతంలో సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్లుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించినట్లు తెలిసింది. పక్కా పన్నాగంతో తొలిరోజు విచారణలో ఆయన దాదాపు సగం సమయం వృథా అయ్యేటట్లు చేయగలిగారు. దాంతోపాటు సిట్ అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకే ఆయన ప్రాధాన్యమిచ్చారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నదే చంద్రబాబు ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ సిట్ అధికారులు పూర్తి సంయమనం, ఓపికతో వ్యవహరించి తొలిరోజు విచారణ ప్రక్రియను పూర్తిచేశారు. సమీపం నుంచి పరిశీలించేందుకు చంద్రబాబు న్యాయవాదులను అనుమతించారు. విచారణ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు కాలహరణం.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోని స్నేహ బ్లాక్‌కు సమీపంలోని కాన్ఫరెన్స్ హాలులో సిట్ అధికారులు చంద్రబాబును విచారించారు. అందుకోసం ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలతోపాటు మొత్తం 12 మందితో కూడిన సిట్ బృందం శనివారం ఉ.9.30 గంటలకు సెంట్రల్ జైలుకు చేరుకుంది. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నిర్ణీత షెడ్యూల్ ప్రకారం విచారణ ప్రక్రియను ప్రారంభించారు. అంతకుముందు.. తనను కస్టడీకి అనుమతిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల కాపీ కావాలని చంద్రబాబు అడిగారు. 20 పేజీల ఆ కాపీని అధికారులు ఆయనకిచ్చారు. దానిని చదివే నెపంతో చంద్రబాబు చాలాసేపు కాలహరణం చేశారు. అయినప్పటికీ సిట్ అధికారులు ఓపిగ్గా వేచి చూసి ఆయన సరే అన్నాకే విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ప్రశ్నావళిలో 30 శాతమే తొలిరోజు.. ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తులో వెల్లడైన కీలక ఆధారాల ప్రాతిపదికగా రూపొందించిన ప్రశ్నావళిని అనుసరించి సీఐడీ అధికారులు చంద్రబాబును ప్రశ్నించినట్లు సమాచారం. గతంలో సిట్ కార్యాలయంలో జరిగిన విచారణలో చెప్పినట్టుగానే ‘నాకు తెలీదు.. గుర్తులేదు’.. అంటూ సమాధానాలు దాటవేసేందుకే చంద్రబాబు ప్రయత్నించారు. కొన్ని ప్రశ్నలకు అవి సంబంధిత అధికారులను అడగాలిగానీ తనను కాదని వ్యాఖ్యానించారని సమాచారం. కీలక పత్రాలను ఆయన ముందుంచి మరీ వాటిపై ప్రశ్నించినా సరే ఆయన సూటిగా సమాధానం చెప్పలేదని తెలిసింది. విచారణకు చంద్రబాబు ఏమాత్రం సహకరించకపోవడంతో ప్రశ్నావళిలోని 30 శాతం ప్రశ్నలను కూడా సీఐడీ అధికారులు అడగలేకపోయారు. రెండ్రోజుల కస్టడీ సమయాన్ని వీలైనంత వరకు వృథా చేయాలన్నది చంద్రబాబు ఉద్దేశమన్నది స్పష్టమైంది. అయినప్పటికీ అధికారులు పూర్తి సహనంతో వ్యవహరించి తమ ప్రశ్నలను కొనసాగించారు. ప్రతి గంటకూ ఐదు నిముషాల పాటు విరామం ఇవ్వడంతోపాటు చంద్రబాబు కోరిన అదనపు సమయాల్లోనూ విచారణ ప్రక్రియను నిలుపుదల చేశారు. గంటసేపు మధ్యాహ్న భోజన విరామం ఇచ్చారు. అలా తొలిరోజు నాలుగు దశల్లో విచారించారు. అనంతరం.. చంద్రబాబు న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అనంతరం చంద్రబాబుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని స్నేహబ్లాక్‌కు తరలించారు. కట్టుదిట్టమైన భద్రత.. చంద్రబాబు కస్టడీ విచారణ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశారు. జైలు లోపల, బయట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది ఆక్టోపస్, సివిల్ పోలీసు బృందాలను మొహరించారు. తొలిరోజు విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందం ఫైళ్లు, వీడియో రికార్డింగ్ సామగ్రి మొత్తం తీసుకుని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంది. మీడియాపై బాలకృష్ణ చిందులు.. మరోవైపు.. నందమూరి బాలకృష్ణ తన నైజాన్ని ప్రదర్శించారు. మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లపై చిందులు తొక్కారు. రాజమహేంద్రవరం విద్యానగర్‌లోని లోకేశ్ క్యాంప్ ఆఫీసు వద్ద శనివారం పార్టీ నేతలతో మంతనాలు సాగించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న విలేకరులు, ఫొటోగ్రాఫర్లపై ఆయన మండిపడ్డారు. క్యాంప్ వద్ద ఉన్న ఈనాడు ఫొటోగ్రాఫర్‌పై ఆయన తీవ్రస్థాయిలో చిందులు తొక్కారు. తాను ఈనాడు ఫొటోగ్రాఫర్‌నని ఆయన చెబితే.. ‘అయితే ఏంటి బొక్కా..’ అంటూ బాలకృష్ణ అసభ్యకరంగా మాట్లాడటం అందరినీ విస్మయపరిచింది. -
స్కిల్ స్కాం: అంతా చంద్రబాబు కనికట్టు
సాక్షి, అమరావతి: నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ పేరుతో డబ్బులు కొట్టేయడానికి టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. స్కిల్ సెంటర్స్ పేరుతో డొల్ల కంపెనీల ద్వారా డబ్బు ఎలా తరలించాలో ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న తర్వాతే ఏపీఎస్ఎస్డీసీని తెరపైకి తెచ్చి.. సీమెన్స్ ముసుగులో ఒప్పందం చేసుకున్నారు. ఎటువంటి పరికరాలు సరఫరా చేయకుండానే చేసినట్లు దొంగ ఇన్వాయిస్లను సృష్టించి రూ.241 కోట్లు కాజేశారు. ఈ బాగోతమంతా ఎన్ఫోర్స్మెంట్, జీఎస్టీ ఇంటిలిజెన్స్, సెబీ, ఫోరెన్సిక్ ఆడిట్స్‌లో పక్కా ఆధారాలతో బయటపడింది. ఇందుకోసం అప్పటికప్పుడు కొన్ని షెల్ కంపెనీలను పుట్టించగా, హవాలా మార్గంలో నగదును సరఫరా చేసే కొన్ని షెల్ కంపెనీలను ఎంచుకున్నారు. మొత్తం ఈ కుంభకోణంలో సీమెన్స్ ముసుగులో డిజైన్‌టెక్ కీలకంగా వ్యవహరించింది. డిజైన్ టెక్ నుంచి రెండు షెల్ కంపెనీలకు మొత్తం నగదును పంపించి, అక్కడ నుంచి అనేక షెల్ కంపెనీల ద్వారా తిరిగి ఆ నగదు చంద్రబాబు సూచించిన వ్యక్తులకు చేరినట్లు దర్యాప్తులో షెల్ కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. రూ.లక్షతో రూ.241 కోట్లు నగదును తరలించడం కోసం స్కిలర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో పీవీఎస్పీ ఐటీ స్కిల్స్ ప్రాజెక్ట్‌గా పిలిచేవారు) పేరుతో ఒక డొల్ల కంపెనీని అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు. ఏపీఎస్ఎస్డీసీతో ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే 2015 మార్చి30న స్కిలర్ కంపెనీని ఏర్పాటు చేసినట్లు రిజాస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) డేటా స్పష్టం చేస్తోంది. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రతిక్ రమన్భాయ్ పటేల్, అబ్దుల్ రఫుల్ హాయ్ కేవలం లక్ష రూపాయల మూల ధనంతో స్కిలర్ ఎంటర్‌ప్రైజెస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు ఎటువంటి అనుభవం లేని ఈ కంపెనీకి ఏకంగా రూ.241.49 కోట్ల విలువైన హార్డ్‌వేర్ పరికరాలను సరఫరా చేసే కాంట్రాక్టును అప్పగించారు. 717 దొంగ ఇన్వాయిస్లను సృష్టించి వాటి ద్వారా డబ్బులు కొట్టేశారు. స్కిలర్ కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈ స్కిల్ ల్యాబ్స్‌కు రూ.241.49 కోట్ల విలువైన హార్డ్‌వేర్ పరికరాలను సరఫరా చేసి డబ్బులు తీసుకున్నట్లు దొంగ రికార్డులు సృష్టించారు. కానీ ఆ వివరాలను ఎక్కడా ఆ కంపెనీ అకౌంట్స్‌లో చూపించలేదు. 2016–17 సంవత్సరానికి స్కిలర్ కంపెనీ ఆర్వోసీకి సమర్పించిన ఆర్థిక స్టేట్మెంట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఆ సంవత్సరంలో కేవలం రూ.99.03 కోట్ల విలువైన పరికరాలు మాత్రమే సరఫరా చేసినట్లు దొంగ లెక్కలు చూపించారు. వాస్తవానికి ఒక్క రూపాయి విలువైన పరికరాలు కూడా సరఫరా చేయలేదు. స్కిల్ కుంభకోణంపై సీఐడీ విచారణ ప్రారంభించిన తర్వాత స్కిలర్ తన దుకాణం మూసేసినట్లు ఆర్వోసీ రికార్డులు సూచిస్తున్నాయి. 2021లో చివరిసారిగా బ్యాలెన్స్ షీట్లు సమర్పించిన స్కిలర్ గత రెండేళ్ల నుంచి ఎటువంటి సమాచారాన్ని ఆర్వోసీకి ఇవ్వడం లేదు. డబ్బులు వచ్చాక దుకాణం బంద్ స్కిలర్ చేతికి వచ్చిన రూ.241.49 కోట్లను పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్, ఐటీ స్మిత్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక డొల్ల కంపెనీల ద్వారా చంద్రబాబు గూటికి తరలించేశారు. ఈ కంపెనీలు కేవలం స్కిల్ కుంభకోణం సమయంలో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించాయని, ఆ తర్వాత పని చేయలేదని రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రూ.లక్ష మూలధనంతో 2012లో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఇన్‌వెబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డొల్ల కంపెనీని 2016లో నగదు తరలించిన తర్వాత మూసేశారు. 2016లో చివరిసారిగా బ్యాలెన్స్ షీట్ సమర్పించిన ఈ కంపెనీ ఆ తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని, ప్రస్తుతం ఇది మూతపడిన కంపెనీగా ఆర్వోసీ రికార్డుల్లో పేర్కొన్నారు. మరో డొల్ల కంపెనీ పాట్రిక్ ఇన్ఫో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా న్యూఢిల్లీ కేంద్రంగా రూ.లక్షతో మొదలైంది. స్కిల్ కుంభకోణం నిధుల తరలింపు పూర్తయిన తర్వాత 2018లో ఈ కంపెనీ మూతపడింది. 2018 తర్వాత ఈ కంపెనీ ఎటువంటి బ్యాలెన్స్ షీట్లను సమర్పించలేదని, ప్రస్తుతం ఈ కంపెనీ మూసివేసిన కంపెనీగా ఆర్వోసీ రికార్డుల్లో చూపిస్తోంది. రూ.లక్షతో న్యూఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైన భారతీయ గ్లోబల్ ఇన్ఫో మీడియా లిమిటెడ్ 2018 డిసెంబర్ 10 తర్వాత నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదని ఆర్వోసీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే ఈ డొల్ల కంపెనీలన్నీ నగదు తరలించాక కనుమరుగయ్యాయని స్పష్టమవుతోంది. ఇలా దొంగ ఇన్వాయిస్లతో నగదును తరలించడమే కాకుండా, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను కోరుతూ దరఖాస్తు చేయడంతో పూణేలోని జీఎస్టీ ఇంటిలిజెన్స్ రంగంలోకి దిగి తీగ లాగితే మొత్తం డొంకంతా బయట పడింది. హవాలా నగదు తరలింపులో ఏసీఐ దిట్ట అల్లైయిడ్ కంప్యూటర్స్ ఇంటర్నేషనల్ (ఆసియా) లిమిటెడ్ (ఏసీఐ) నకిలీ ఇన్వాయిస్లతో నగదును తరలించడంలో దిట్ట. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన ఈ కంపెనీకి ఈ విషయంలో పెద్ద రికార్డే ఉంది. 2013–14 నుంచి 2019–20 వరకు ఈ కంపెనీ బ్యాలెన్స్‌షీట్‌ను పరిశీలిస్తే స్కిల్ కుభంకోణం సమయంలో ఏసీఐ ద్వారా ఎంత నగదు తరలించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కుంభకోణం ముందు, తర్వాత ఏడాదికి రూ.లక్షల్లో మాత్రమే ఆదాయాన్ని చూపిన ఈ కంపెనీ.. కుంభకోణం సమయంలో రూ. కోట్లల్లో ఆదాయం చూపించడం గమనార్హం. ఒప్పందం కుదిరిన మొదటి సంవత్సరం అంటే 2015–16లో రూ.30.52 కోట్లు, 2016–17లో రూ.35.77 కోట్లు, 2018–19లో రూ.9.77 కోట్లు ఆదాయాన్ని చూపించిన ఈ కంపెనీ 2019–20కి వచ్చే సరికి కేవలం రూ.2 లక్షల ఆదాయాన్ని మాత్రమే చూపించింది. ఈ కంపెనీ లావాదేవీలపై అనుమానం వచ్చిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 2017లో రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. ఈ విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా సెబీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ వారికి సమాచారమిస్తే వారు ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ సందర్భంగా కంపెనీకి, కంపెనీ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేయగా, వారు నిజాలను ఒప్పేసుకున్నారు. ఎటువంటి వస్తువులు సరఫరా చేయకుండానే చేసినట్లు ఇన్వాయిస్లు సృష్టించి డిజైన్ టెక్ నుంచి నగదును తీసుకొని వాటిని వివిధ రూపాల్లో తిరిగి వారికే ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. ఈ మేరకు ఏసీఐ ఎండీ స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు పేరుతో రూ.241 కోట్లు డొల్ల కంపెనీల ద్వారా కొట్టేస్తూ సాక్ష్యాలతో బటయపడినా టీడీపీ మీడియా మా బాబు నిప్పు అంటూ అడ్డుగోలుగా వాదనలు చేయడం వారికే చెల్లింది. -
ఇంటరాగేషన్‌లో ముద్దాయికి 50 ప్రశ్నలు!
సాక్షి, తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ప్రథమ ముద్దాయి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడి తొలిరోజు సీఐడీ కస్టడీ విచారణ Interrogation ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాబును.. శనివారం మొత్తంగా ఏడు గంటలపాటు ప్రశ్నించింది సీఐడీ డీఎస్పీ ధనుంజయుడి నేతృత్వంలోని బృందం. అలాగే.. కోర్టు ఆదేశాల ప్రకారం నిర్ణీత సమయంలోనే విచారణ ముగించిన సీఐడీ.. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబు విచారణ కొనసాగింది. శనివారం ఉదయం, మధ్యాహ్నాం రెండు దఫాలుగా ప్రశ్నించారు అధికారులు. ఫస్ట్ హాఫ్‌లో దాదాపు గంటన్నరపాటు చంద్రబాబును ప్రశ్నించారు అధికారులు. భోజన విరామంతో పాటు విచారణలో మొత్తం నాలుగుసార్లు బ్రేకులు ఇచ్చారు. బాబు వయసు రీత్యా ఒక వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. మొత్తం 120 ప్రశ్నలతో విచారణకు వెళ్లిన సీఐడీ.. యాభై ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. సీమెన్స్ ఒప్పందం, లావాదేవీలపైనే ప్రధానంగా చంద్రబాబును ప్రశ్నించింది సీఐడీ. స్కిల్ స్కాంలో కుట్ర కోణం, నిధుల విడుదల, షెల్ కంపెనీలు.. సాక్ష్యాధారాల మాయంపైనా సీఐడీ ప్రశ్నల వర్షం గుప్పించినట్లు తెలుస్తోంది. డీపీఆర్ లేకుండా ఎందుకు ప్రాజెక్టు ఓకే చేయించారు?. ఫైనాన్స్ సెక్రటరీ వద్దన్నా.. నిధులు ఎందుకు విడుదల చేశారు?. యూపీ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్‌ను డిప్యూటీ సీఈవోగా ఎందుకు చేశారు?.. లాంటి ప్రశ్నలు గుప్పించినట్లు సమాచారం. సుమన్ బోస్‌తో చంద్రబాబు రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారా?. ఆయనతో గంటా సుబ్బారావుకు జరిగిన ఈమెయిల్స్ వివరాలేంటి?. సుబ్బారావుకు నాలుగు పదవులు కట్టబెట్టడం వెనుక మతలబేంటి?. ఈ స్కామ్‌లో బాబుతో పాటు అచ్చెన్నాయుడి పాత్ర ఏంటి?. మూడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్.. డిస్కౌంట్‌గా ఎందుకు మారింది?. రూ. 3 వేల కోట్ల గురించి అడగొద్దని అధికారుల్ని ఎందుకు దబాయించారు? లాంటి ప్రశ్నలూ సంధించినట్లు సమాచారం. అయితే వాటిని ఆయన ఎలాంటి ప్రశ్నలు సంధించారనేది సీఐడీ కోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాతే తెలిసేది. బాబు తరపు లాయర్లు దమ్మలపాటి శ్రీనివాస్, సుబ్బారావుల సమక్షంలో.. చంద్రబాబు స్టేట్మెంట్ను పకడ్బందీగా రికార్డ్ చేశారు సీఐడీ అధికారులు. మరోవైపు విచారణ నేపథ్యంలో సెంట్రల్ జైలు దగ్గర పోలీసుల అలర్ట్ అయ్యారు. విచారణ జరిగాక.. స్థానిక గెస్ట్‌హౌజ్‌కి వెళ్లింది సీఐడీ అధికారుల బృందం. రేపు(సెప్టెంబర్ 24, ఆదివారం) కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో చంద్రబాబును విచారించనుంది సీఐడీ. ఇదీ చదవండి: ఫస్ట్ టైం.. ‘బ్లూజీన్’తో కోర్టులో హాజరైన చంద్రబాబు -
జడ్జిపై టీడీపీ నేతల పోస్టులు.. రాష్ట్రపతి భవన్ నుంచి సీరియస్ లేఖ
సాక్షి, ఢిల్లీ: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు విచారిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా.. జవహర్ రెడ్డికి లేఖ రాశారు. అయితే, చంద్రబాబు కేసులో భాగంగా అడిషనల్ సెషన్స్ జడ్జి హిమబిందుపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు వెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును రిమాండ్‌కు పంపించిన తర్వాత హిమబిందు వ్యక్తిగత జీవితంపై టీడీపీ నేతలు వివాదస్పదంగా వ్యవహరించారు. హిమబిందు వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా టీడీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని రామానుజరావు తన ఫిర్యాదు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రామానుజరావు ఫిర్యాదు రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ రాసింది. జడ్జి హిమబిందుకు సంబంధించిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని జవహర్‌రెడ్డికి పీసీ మీనా లేఖ రాశారు. ఇది కూడా చదవండి: ‘బ్లూజీన్’ ద్వారా కోర్టులో చంద్రబాబు హాజరు -
వ్యూహాత్మకంగా చంద్రబాబు విచారణకు సీఐడీ
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడిని విచారించేందుకు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. దీంతో.. చంద్రబాబు నాయుడికి ఎలాంటి ప్రశ్నలు సంధించాలి? ఎలా విచారించాలి? అనేదానిపై సీఐడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. స్కామ్‌లో చంద్రబాబే ప్రధాన నిందితుడు.. అంతిమ లబ్ధిదారుడు కావడంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి కస్టడీ నుంచి వీలైనంత కీలక సమాచారం రాబట్టాలని భావిస్తోంది ఏపీ సీఐడీ. చంద్రబాబు కస్టడీ నేపథ్యంలో ఏం జరగబోతోంది?.. ఏ విధంగా సీఐడీ విచారణ చేయనుంది? అనే విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టు పర్మిషన్ లభించిన నేపథ్యంలో సీఐడీ ఏర్పాట్లు చేసుకుంటోంది. రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలుకు సీఐడీ అధికారుల బృందం వెళ్లనుంది. మెరికల్లాంటి అధికారుల్ని ఇప్పటికే ఏపీ సీఐడీ కస్టడీ విచారణ కోసం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కస్టడీలో చంద్రబాబును ప్రశ్నించే అధికారుల జాబితాను ఇప్పటికే సీఐడీ కోర్టుకు సమర్పించింది కూడా. శనివారం ఉదయం నుంచే ఆధికారులు విచారణ చేపట్టే విధంగా సిద్ధం అవుతున్నారు. కోర్టు నిర్దేశించిన టైం ప్రకారం ఉదయం 9.30గం. నుంచి సాయత్రం 5గంటల దాకా.. తిరిగి ఆదివారం సైతం ఇదే సమయంలోనే విచారణ చేపట్టనుంది. లంచ్, టీ బ్రేక్‌లకు మినహా మిగిలిన సమయం అంతా విచారణకే కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది. కోరింది ఐదురోజులు అయినప్పటికీ.. రెండే రోజులు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. కాబట్టి.. తక్కువ సమయం ఉండటం వల్ల వీలైనంత ఎక్కువ సమయం విచారణకు వాడుకోవాలనేది సీఐడీ వ్యూహంగా కనిపిస్తోంది. రాబట్టాల్సిన సమాధానాలు బోలెడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు నుంచి వీలైనంత ఎక్కువగా సమాచారం రాబట్టాలి.. ఇది ఇప్పుడు సీఐడీ ముందున్న టాస్క్. ఈ మేరకు ప్రశ్నావళిని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు ఏ విధంగా ముడుపులు చేరాయో తేల్చే పనిలో సీఐడీ అధికారులు నిమగ్నమయ్యారు. చంద్రబాబు బ్యాంకు ఖాతాల గురించి ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏ విధంగా షెల్ కంపెనీల డబ్బు చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ వరకు వచ్చిందో తేల్చడమే కస్టడీలో కీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పారిపోవడంలో చంద్రబాబు పాత్రపైన సీఐడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు సీమెన్స్ మాజీ ఎండి సుమన్ బోస్, డిజైన్‌టెక్ కంపెనీ అధిపతి ఖన్వేల్కర్‌తో చంద్రబాబు మీటింగ్‌లపైనా ప్రశ్నలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వద్దన్నా.. ఎందుకు అలా చేశారు? కేవలం షెల్ కంపెనీలు ముడుపుల వ్యవహారం మాత్రమే కాకుండా… కేసులో ఏవిధంగా అధికారులపై చంద్రబాబు ఒత్తిడి చేశారనే విషయంపైనా సీఐడీ దృష్టి సారించింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటులో క్యాబినెట్ అప్రూవల్ లేకపోడం నుంచి మొదలు ఏవిధంగా అధికార దుర్వినియోగం జరిగిందనే విషయంపై సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. నిధుల విడుదలపై ఫైనాన్స్ శాఖ అధికారులు వద్దన్నా చంద్రబాబు ఎందుకు బలవంతపెట్టి వందల కోట్లు విడుదల చేయించారనే విషయంపై సీఐడీ ప్రశ్నలు సిద్ధం చేశారనే వార్తలు వస్తున్నాయి. దాదాపు 100కు పైగా ప్రశ్నలతో సీఐడీ విచారణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో కలిపి విచారించేందుకు ఈ కేసులో ఉన్న నిందితులను పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్లాన్‌బీ కూడానా? కస్టడీలో చంద్రబాబు విచారణకు సహకరించపోతే ఏం చేయాలి?.. ఈ విషయంపైనా సీఐడీ అధికారులు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ఈ మేరకు ప్లాన్ బీ కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు విచారణకు సహకరించకపోతే.. కస్టడీ పిటిషన్ పొడిగించాలనే విజ్ఞప్తితో పాటు విచారణ సందర్భంగా ఎదురైన ఇబ్బందుల్ని కోర్టుకు తెలపాలని సీఐడీ అధికారులు భావిస్తున్నారు. సీఐడీ విచారణలో చంద్రబాబును షాక్ గురిచేసే కొన్ని ఆధారాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పక్కా ఆధారాలతో ఈ స్కామ్‌లో దొరికిన చంద్రబాబును కస్టడీకి తీసుకోవడం ద్వారా కీలకమైన విషయాలనే సీఐడీ బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఇంత జరిగాక దర్యాప్తు ఆపమని చెప్పలేం: ఏపీ హైకోర్టు
సాక్షి, కృష్ణా: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. క్వాష్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ‘పిటిషన్ డిస్మిస్డ్’ అంటూ ఏకవాక్యంతో తీర్పు ఇచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. ఇక 68 పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్ ఆర్డర్ కాపీలో ఏపీ హైకోర్టుల కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపడం సరికాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్‌ను క్వాష్ చేయలేం.అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి. ఎఫ్ఐఆర్లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదు. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలి. విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్ఐఆర్లో నమోదు చేయొచ్చు. విచారణలో ఎఫ్ఐఆర్ మెరిట్స్ మీద కేసును అడ్డుకోకూడదు. సీఆర్పీసీ 482 కింద దాఖలైన పిటిషన్‌పై మినీ ట్రయల్ నిర్వహించలేం. 2021 నుంచి 140 మందిని సీఐడీ విచారించింది. నాలుగు వేల దాకా డాక్యుమెంట్లు సేకరించింది. ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేం. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందు వల్ల మేం జోక్యం చేసుకోలేం’’ అని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ రెండేళ్ల దర్యాప్తు తదనంతరం.. తనపై నమోదు అయిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లుథ్రా వాదనలు వినిపించారు. మరోవైపు సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు రిమాండ్‌ను అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం(ఏసీబీ కోర్టు) రెండ్రోజులు పొడిగించిన సంగతి తెలిసిందే హైకోర్టు ఆర్డర్ పూర్తి కాపీ కోసం క్లిక్ చేయండి -
Sep 22nd : చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 8:46 PM, సెప్టెంబర్ 22, 2023 కోర్టు ఆదేశాల ప్రకారమే బాబు విచారణ ►చంద్రబాబును విచారించేందుకు సిద్ధమవుతున్న సీఐడీ. ►రేపు, ఎల్లుండి రాజమండ్రి సెంట్రల్ జైలులోనే కాన్ఫరెన్స్ హాల్లో విచారించనున్న సీఐడీ ►కేసు విచారణాధికారి CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ ►విచారణలో పాల్గొననున్న తొమ్మిది మంది సీఐడీ అధికారులు ► ఏసీబీ కోర్టు ఆదేశాల ప్రకారమే చంద్రబాబు విచారణ చేపడతామన్న సీఐడీ ►ఉదయం 9.30 నుంచి సాయంత్ర ఐదు గంటల వరకు సీఐడీ విచారణ ►చంద్రబాబు తరపున ఒక లాయర్‌కు అనుమతి ►విచారణ సమయంలో ఉండకూడదని బాబు లాయర్‌కు కోర్టు ఆదేశం 7:45 PM, సెప్టెంబర్ 22, 2023 సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాల్లో విచారణ ► చంద్రబాబు సీఐడీ విచారణకు సెంట్రల్ జైలులో కాన్ఫరెన్స్ హాల్ సిద్ధం ► దాదాపు పాతిక మంది కూర్చునే హాల్ రెడీ ► కోర్టు నుంచి సూపరిండెంట్ కార్యాలయానికి అందిన సమాచారం ► డిప్యూటీ సూపరిండెంట్‌కు పర్యవేక్షణ బాధ్యతలు ► సీఐడీ సమాచారం మేరకు.. ఎస్పీ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ 6:30 PM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు తీర్పు తర్వాత సిద్ధార్థ్ లూథ్రా ట్వీట్ ► మరోసారి తన నిర్వేదాన్ని బయటపెట్టుకున్న లూథ్రా ► ట్వీట్లో ఆశావాదం ప్రదర్శించేందుకు లూథ్రా ఆరాటం Har raat ki subah Aati hai Naya din Ujala laata hai - there is dawn after night and each morning brings light into our lives — Sidharth Luthra (@Luthra_Sidharth) September 22, 2023 6:00 PM, సెప్టెంబర్ 22, 2023 బాబును ప్రశ్నించేందుకు టీం రెడీ ► కాసేపట్లో రాజమండ్రికి బయల్దేరనున్న సీఐడీ ► మరో 15 గంటల్లో సీఐడీ కస్టడీలోకి చంద్రబాబు ► CID DSP ధనుంజయుడు నేతృత్వంలో విచారణ బృందం ► ఒక CI, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్లు, ఇద్దరు టైపిస్ట్‌లు, ఒక వీడియోగ్రాఫర్ సహా 12 మందికి అనుమతి ► అధికారుల జాబితాను ఏసీబీ కోర్టుకు సమర్పించిన సీఐడీ ► కస్టడీ విచారణకు చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లకు అనుమతి 6:30 PM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ స్కాంను బయటపెట్టింది GST ► స్కిల్ స్కాంను బయటపెట్టింది కేంద్ర సంస్థ ► రాష్ట్ర దర్యాప్తు సంస్థకు కావాల్సిన సమాచారం ఇచ్చారు ► అసెంబ్లీలో ప్రకటించిన అధికార పక్షం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ని ఫస్ట్ బయటపెట్టింది జీఎస్టీ అధికారులు. అప్పట్లో నిధులు మళ్లింపు జరిగిందని టీడీపీ ప్రభుత్వాన్ని ఒక విజిల్ బ్లోయర్‌గా జీఎస్టీ, ఈడీ హెచ్చరించాయి. కానీ.. ఆరోజు @JaiTDP ప్రభుత్వానికి జీఎస్టీ విజిల్ వినిపించలేదు. ఈరోజు అసెంబ్లీకి వచ్చి టీడీపీ… pic.twitter.com/fEc3ShhCoF — YSR Congress Party (@YSRCParty) September 22, 2023 5:30 PM, సెప్టెంబర్ 22, 2023 మన పిటిషన్ కొట్టుడుపోయింది, ఏటి సేద్దాం.? ► రాజమండ్రి జైలులో చంద్రబాబుతో లాయర్ లక్ష్మీనారాయణ ములాఖత్ ► క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిన విషయాన్ని బాబుకు వివరించిన లాయర్ ► టిడిపి లీగల్ టీంపై చంద్రబాబు ఆగ్రహం ► మరింత మంది సుప్రీంకోర్టు సీనియర్లతో మాట్లాడాలని సూచించిన చంద్రబాబు ► ఎంత ఖర్చయినా సరే.. టాప్ లాయర్లంతా మనదగ్గరే ఉండాలన్న చంద్రబాబు ► కొత్తగా మరిన్ని పిటిషన్లు వేస్తామని చంద్రబాబుకు వివరించిన లాయర్ లక్ష్మీనారాయణ ► ఆధారాల జోలికి వెళ్లకుండా సాంకేతిక దారులేమున్నాయని అడిగిన బాబు ► తదనంతర కార్యాచరణపై లాయర్ లక్ష్మీనారాయణతో మాట్లాడిన చంద్రబాబు 5:20 PM, సెప్టెంబర్ 22, 2023 జాతీయఅధ్యక్షుడు జైల్లో, జాతీయ కార్యదర్శి ఢిల్లీలో, ఇక్కడ మనమేం చేద్దాం.? ► టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలతో అచ్చెన్నాయుడు సమావేశం ► చంద్రబాబు జైల్లో ఉన్నాడు, క్వాష్ పిటిషన్ కొట్టేశారు, కస్టడీకి ఇచ్చేశారు ► ఇప్పటి పరిస్థితుల్లో బెయిల్ డౌట్, జైల్లో మరింత కాలం బాబు ఉండే అవకాశం ► పార్టీని ఎవరు నడిపించాలి? అసలేం చేయాలి? ► ప్రజలకు ఏమని చెప్పుకోవాలి? ఏం చెబితే వారు నమ్ముతారు? ► ఆధారాలపై ఇంత స్పష్టత వచ్చాక.. మనం చెప్పే మాటలు నమ్ముతారా? ► అవినీతిపై ఇంత పక్కాగా ఆధారాలుంటే ఏమని సర్దిచెప్పుకుందాం ► రేపు లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి అన్ని ఆధారాలున్నాయి ► లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఏం చేద్దామని అడిగిన అచ్చెన్న 5:15 PM, సెప్టెంబర్ 22, 2023 సోమవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ రద్దుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న టీడీపీ ► సుప్రీంకోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై లాయర్లతో చర్చిస్తున్న లోకేష్ ► హైకోర్టు తీర్పు కాపీలోని అంశాలపై లాయర్ల అధ్యయనం ► సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తే కిం కర్తవ్యం.? ► తమకు వ్యతిరేకంగా ఏ ఏ ఆధారాలున్నాయి? ► ఏం వాదన చెబితే న్యాయస్థానంలో సాంకేతికంగా బయటపడవచ్చు.? ► శోధనలు, పరిశోధనలతో కుస్తీ పడుతోన్న టిడిపి లీగల్ సెల్ 5:10 PM, సెప్టెంబర్ 22, 2023 ఇప్పట్లో లోకేష్ ఢిల్లీని వదిలేది లేదు ► మరికొన్ని రోజులు ఢిల్లీలోనే నారా లోకేష్ : ఎల్లో మీడియా ► హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మారిన పరిణామాలు ► లోకేష్‌ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమయిందంటూ ఎల్లో మీడియా వార్తలు ► ఇప్పటికే అరెస్ట్ భయంతో వణికిపోతోన్న లోకేష్ ► తాజాగా చంద్రబాబు క్వాష్ కూడా తిరస్కరణకు గురవడంతో లోకేష్‌లో పెరిగిన భయం ► మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండాలని లోకేష్ నిర్ణయించినట్టు ఎల్లోమీడియా వార్తలు ► సుప్రీంకోర్టులో లోకేష్ న్యాయపోరాటం చేస్తారంటున్న ఎల్లోమీడియా ► ఎప్పటికప్పుడు న్యాయవాదులతో లోకేష్ సంప్రదింపులు ► అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బస చేసిన సెవెన్ స్టార్ లగ్జరీ హోటల్ ITC మౌర్యలో బస ► ITC మౌర్యలో రోజుకి సూట్ అద్దె లక్ష రూపాయల పైనే ► ITC మౌర్య హోటల్ మరిన్ని రోజులు ఉండనున్న లోకేష్ 5:00 PM, సెప్టెంబర్ 22, 2023 TDP క్యాంపు ఖాళీ ► రాజమండ్రి : హైకోర్టు ఆదేశాల తర్వాత టిడిపి నిరసన క్యాంపు ఖాళీ ► క్వాష్ పిటిషన్ డిస్మిస్ వెనక పూర్తి కారణాలు వెల్లడించిన హైకోర్టు ► తప్పు జరిగిందని స్పష్టంగా బయటికొచ్చిన ఆధారాలు, డాక్యుమెంట్లు ► నిన్నటి వరకు అక్రమ అరెస్ట్ అన్న టిడిపి నేతలు ► పచ్చ మీడియా వార్తలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం ► మొత్తం కుంభకోణాన్ని స్పష్టంగా బయటపెట్టిన హైకోర్టు ఉత్తర్వులు ► పైగా ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని చెప్పడంతో పూర్తి అవగాహన ► తీర్పు తర్వాత టిడిపి క్యాంప్ నుంచి వెళ్లిపోయిన కార్యకర్తలు ► నాయకులు, నేతలు లేక బోసిపోయిన టిడిపి క్యాంప్ 4:10 PM, సెప్టెంబర్ 22, 2023 రేపు, ఎల్లుండి చంద్రబాబు కస్టడీ ► రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే కస్టడీకి తీసుకోనున్న సీఐడీ ► రెండు రోజుల కస్టడీలో ప్రశ్నించే అంశాలపై సీఐడీ కసరత్తు ► పలు కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రిపరేషన్ ► మీడియాకు విచారణకు సంబంధించిన వివరాలు వెల్లడించకూడదన్న ఏసీబీ కోర్టు ► చంద్రబాబు ఆరోగ్య రీత్యా, వయసు రీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ► కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలి ► చంద్రబాబు కస్టడీ విచారణ అంశాలను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామన్న కోర్టు 3:10 PM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ ఎప్పుడు? ఎలా? ► కస్టడీ ఎప్పుడు? : సెప్టెంబర్ 23 & సెప్టెంబర్ 24 ► కస్టడీ ఎక్కడ ? : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ► కస్టడీ సమయం ? : ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ► కస్టడీలో ఎవరు ప్రశ్నిస్తారు ? : CID అధికారులు ► కస్టడీ ఎవరి సమక్షంలో ? : చంద్రబాబు లాయర్ల సమక్షంలో ► ఎవరు సమాధానం చెప్పాలి ? : లాయర్లు ఉంటారు కానీ.. ప్రతీ సమాధానం చంద్రబాబే చెప్పాలి ► కస్టడీ ఉద్దేశ్యమేంటీ ? : కుట్రకోణంలో పూర్తి భాగం తెలుసుకునేందుకు.. ► కస్టడీలో ఏ విధంగా జవాబులను రాబడుతారు ? : తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను ముందు పెట్టి చంద్రబాబును ప్రశ్నలు అడుగుతారు. దాని వల్ల నిందితుడు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. అడిగే ప్రతి ప్రశ్నకు సంబంధించిన పూర్తి ఆధారాలు CID వద్ద ఉంటాయి కాబట్టి మాట మార్చేందుకు, కొత్త కథ చెప్పేందుకు ఛాన్స్ ఉండదు. ► కస్టడీ గడువు పెంచుకునే అధికారముందా ? : కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని CID భావిస్తే.. కోర్టు అనుమతితో మరోసారి గడువు పొడిగించుకోవచ్చు 3:04 PM, సెప్టెంబర్ 22, 2023 సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? : టిడిపి మల్లగుల్లాలు ► సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అన్నదానిపై తెలుగుదేశం నేతల మంతనాలు ► ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లాలంటున్న టీడీపీలో కొందరు నేతలు ► ఇన్ని ఆధారాలుంటే సుప్రీంకోర్టులోనూ కేసు కొట్టేస్తారు : టిడిపిలో మరికొందరు ► సీనియర్ లాయర్లతో తెలుగుదేశం ముఖ్యనేతల సమావేశం ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై ముందునుంచీ నమ్మకంగా లేని లోకేష్ ► క్వాష్ పిటిషన్ వేసే సమయానికి ఢిల్లీకి వెళ్లిపోయిన లోకేష్ ► సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో లోకేష్ మంతనాలు ► క్వాష్ పిటిషన్ డిస్మిస్ కోరితే తమకు రిలీఫ్ ఉంటుందా అని సమాలోచనలు 2:44 PM, సెప్టెంబర్ 22, 2023 సీఐడీ కస్టడీకి చంద్రబాబు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో.. చంద్రబాబు సీఐడీ కస్టడీకి అనుమతి ► రెండు రోజుల కస్టడీకి ఇచ్చిన ఏసీబీ కోర్టు ► విచారణ ఎక్కడ చేస్తారు?.. జైల్లోనా? తటస్థ ప్రదేశంలోనా? అని సీఐడీకి జడ్జి ప్రశ్న ► జైల్లోనే విచారిస్తామని కోర్టుకు తెలిపిన సీఐడీ ► జైల్లోనే విచారించేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చిన ఏసీబీ కోర్టు ► చంద్రబాబును విచారిస్తే.. స్కిల్ స్కాంలో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే ఛాన్స్ 2:39 PM, సెప్టెంబర్ 22, 2023 మరికాసేపట్లో చంద్రబాబు కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పు ►స్కిల్ స్కాంలో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరిన సీఐడీ ►చంద్రబాబు నోరు విప్పితేనే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయంటున్న సీఐడీ ► చంద్రబాబు రిమాండ్‌ను మరో రెండ్రోజులు పొడిగించిన ఏసీబీ కోర్టు ►హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత తీర్పు నేపథ్యంలో.. ఉత్కంఠ 2:15 PM, సెప్టెంబర్ 22, 2023 ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది? ► కేసు నమోదు అయింది : CID పోలీస్ స్టేషన్, మంగళగిరి ► కేసు నమోదు ఎప్పుడు : డిసెంబర్ 9, 2021 ► కుంభకోణం జరిగింది : 2014-15 నుంచి 2018 మధ్య కాలంలో ► ఫిర్యాదు దారు : ఛైర్మన్, APSSDC (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్) ► ప్రభుత్వ ఖజనా నుంచి విడుదలైన నిధులు : రూ.371 కోట్లు ► డొల్ల కంపెనీలు, ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా పక్కదారి పట్టిన మొత్తం : రూ.279 కోట్లు ► నిధులు వేగంగా విడుదల కావాలంటూ ఆదేశాలిస్తూ చంద్రబాబు పెట్టిన సంతకాలు : 13 ► చంద్రబాబు అరెస్ట్ : సెప్టెంబర్ 9, 2023 ► నమోదయిన సెక్షన్లు : 166, 167, 418, 420, 465, 468, 471, 477A, 409, 201, 109 read with 120B read with 34 of the Indian Penal Code, 1860 (for short, ‘IPC’) and 12, 13 (2) read with 13 (1) (c) & (d) of the Prevention of Corruption Act, 1988 (for short, ‘the PC Act’) ► కోర్టులో క్రైం రిజిస్ట్రేషన్ : Crl.M.P.No.1096 of 2023 ► జ్యుడిషియల్ కస్టడీ : సెప్టెంబర్ 10, 2023 ► కస్టడీ పరిధి : ACB కోర్టు కమ్ జిల్లా మూడో అడిషనల్ జడ్జి, విజయవాడ ► క్వాష్ పిటిషన్ : సెప్టెంబర్ 10, 2023 ► క్వాష్ పిటిషన్ కొట్టివేత : సెప్టెంబర్ 22, 2023 2:10 PM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు తీర్పులో న్యాయమూర్తి ఏం చెప్పారంటే.. ► సెక్షన్ 482 Cr.P.Cకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది ► నిహారిక ఇన్ఫ్రా vs మహారాష్ట్ర ప్రభుత్వం కేసును దీనికి సరైన ఉదాహరణ ► ఇన్ని ఆధారాలున్న ఈ కేసులో క్వాష్ పేరిట ఇప్పుడు మినీ ట్రయల్ నిర్వహించలేం ► 2021నుంచి ఇప్పటివరకు 140 మంది సాక్షులను CID విచారించింది ► దాదాపు 4వేల డాక్యుమెంట్లను తన వాదనకు ఆధారంగా చూపించింది ► ఈ కేసుకు అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిన అర్హత ఉంది ► ఈ కేసును క్వాష్ పేరిట నిలిపివేయలేం, దర్యాప్తును నిలువరించలేం ► ఈ పరిస్థితుల్లో నిందితులకు ఎలాంటి ఊరట కలిగించలేం ► దీనికి సంబంధించిన అన్ని పిటిషన్లు (ఏవైనా ఉంటే..) వాటన్నింటిని రద్దు చేస్తున్నాం 2:02 PM, సెప్టెంబర్ 22, 2023 ACB కోర్టును హైకోర్టు సమర్థించింది : హైకోర్టు లాయర్లు ► CID పరిశోధించిన అంశాలతో లోయర్ కోర్టు ఏకీభవించింది ► కొన్ని సాంకేతిక కారణాలతో కేసు కొట్టేయమంటే హైకోర్టు ఎందుకు ఒప్పుకుంటుంది ► ACB కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు పూర్తి స్థాయిలో సమర్థించింది ► సెక్షన్లన్ని చెల్లవన్న చంద్రబాబు లాయర్ల వాదన చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది ► కేసు కొట్టేస్తారన్న చంద్రబాబు, తెలుగుదేశం మాటలు కొందరు నమ్మారేమో కానీ.. కోర్టు ముందు ఆధారాలు లేకుండా చేసే వాదనలను హైకోర్టు నమ్మలేదు ► రాజకీయ కక్షతోనే కేసు పెట్టారన్న వాదనలో పస లేదని న్యాయస్థానం నమ్మింది ► చేసిన కుంభకోణాన్ని కవర్ చేసుకునేందుకు రాజకీయ కక్షను తెరపైకి తెచ్చారని వెల్లడవుతోంది ► తప్పు జరగలేదు, తప్పు చేయలేదు అని బాబు లాయర్లు చెప్పలేకపోయారు ► పైగా అరెస్టయిన సౌమిత్రా బోసుతో ప్రెస్ మీట్ పెట్టి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు ► ఎల్లో మీడియాలో వచ్చే వార్తలు వాళ్లు చదువుకోడానికే తప్ప.. కోర్టుల ముందు నిలబడవు 1:55 PM, సెప్టెంబర్ 22, 2023 CID వాదనే నెగ్గింది: హైకోర్టు లాయర్లు ► కేసులో చాలా లోతు ఉంది, పరిశోధనతో నిజాలు నిగ్గు తేలుతాయి ► 17A అన్న ఒక్క పాయింట్‌తో కేసు ఎలా గెలుస్తారు? ► ఇంత పెద్ద కుంభకోణంలో అరెస్ట్ చేసిన విధానాన్ని ఎలా ప్రశ్నిస్తారు? ► 2018 కంటే ముందే కుంభకోణం జరిగినట్టు డాక్యుమెంటరీ ఆధారాలున్నాయి ► ఆరోపణలు మాత్రమే ఉన్నాయన్న బాబు లాయర్ల వాదనను ఖండిస్తూ ఆధారాలు చూపించిన CID ► FIRలో పేరు లేదన్న కారణంతో కేసు నుంచి తప్పించుకోలేరు ► చట్టం ముందు అందరూ సమానమే 1:50 PM, సెప్టెంబర్ 22, 2023 క్వాష్ పేరుతో తొందరపడ్డారు : హైకోర్టు లాయర్లు ► చంద్రబాబు క్వాష్ పేరుతో తప్పుడు ప్రయత్నం చేశారు ► ఇన్ని డాక్యుమెంటరీ ఆధారాలుండగా క్వాష్ కోసం ఏ అడ్వొకేట్ ప్రయత్నించరు ► సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సాధారణంగా ఇలాంటి కేసును ఒప్పుకోరు ► ఎంత పెద్ద లాయర్లు వాదించినా.. కేసు వీక్‌గా ఉంటే గెలవలేరు ► దర్యాప్తు సంస్థ CID ఈ కేసులో చాలా పక్కాగా ఆధారాలు సేకరించారు ► నిధులు పక్కదారి పట్టినట్టు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ (సబ్‌స్టాన్షియల్)గా ఉన్నాయి ► క్వాష్ వేసి బయటపడవచ్చని చంద్రబాబు ఎందుకు నమ్మారో తెలియదు ► కేసు ఇంత పక్కాగా ఉంటే ప్రాథమిక స్థాయిలో ఎందుకు కొట్టేస్తారు? 1:45 PM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు పక్కాగా ఎక్కడ ఇరుక్కున్నారంటే : హైకోర్టు లాయర్లు ► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే కేసును దర్యాప్తు చేస్తున్నాయి ► Co-accused - సహ నిందితులందరూ చంద్రబాబు పేరు చెప్పారు ► నోట్ ఫైల్స్‌తో పాటు చంద్రబాబు ఎక్కడెక్కడ సంతకాలు పెట్టారో ఆధారాలున్నాయి ► నిధులు ఏ రకంగా రూట్ అయ్యాయో పక్కగా తేలింది ► చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇప్పటికే పరారీలో ఉన్నారు ► సీమెన్స్ కంపెనీ తమకు ఇందులో సంబంధం లేదని లిఖితపూర్వకంగా ఇచ్చింది ► సీమెన్స్ కంపెనీ పేరు చెప్పి కుంభకోణం జరిపారు ► ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్టు న్యాయస్థానం గుర్తించింది ► 120బి, 420, 468, 471, PC 13, 31, 32 ఇన్ని సెక్షన్లు ఉన్నాయి ► ఇంతటి ప్రభావం ఉన్న కేసులో ప్రాథమిక దశలో హైకోర్టు జోక్యం చేసుకోలేదు 1:35 PM, సెప్టెంబర్ 22, 2023 క్వాష్ పిటిషన్ డిస్మిస్ ఎందుకు చేసిందంటే.. : హైకోర్టు లాయర్లు ► క్రిమినల్ కేసులో విచారణ ముఖ్యం, దర్యాప్తు తర్వాతే క్వాష్‌కు అవకాశం ► ఈ కేసులో దర్యాప్తులో నిజనిజాలు తేలుతాయి : లాయర్లు ► ఇప్పుడున్న పరిస్థితి ప్రీ మెచ్యూర్ మాత్రమే : లాయర్లు ► ఈ కేసులో CID దర్యాప్తు పక్కాగా ఉంది : లాయర్లు ► ఈ కుంభకోణంలో అయిదు లేయర్లను CID గుర్తించింది ► నిధులు పక్కాగా ఎటు మళ్లాయో CID పక్కాగా ఆధారాలు సేకరించింది ► GSTలో రూ.41 కోట్లు ఎలా ఎగ్గొట్టారో పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది ► పక్కాగా కేసు కట్టడంతో దీంట్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు సమ్మతి చూపలేదు ► ఈ కేసులో తీగ లాగిన కొద్దీ మరెన్నో కోణాలు బయటపడే అవకాశముంది ► ఇక్కడ ఉన్న వారితో పాటు జర్మనీలో ఉన్న సీమెన్స్ కంపెనీ వాళ్లను కూడా సంప్రదించాలి ► ప్రభుత్వ ధనం ఎక్కడికెళ్లిందన్నది తేల్చాల్సిందే, ఖజానాకు కట్టాల్సిందే ► ఆధారాలు ఉండడంతో హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించింది : లాయర్లు 1:30 PM, సెప్టెంబర్ 22, 2023 Big Breaking : చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్టు ప్రకటించిన హైకోర్టు న్యాయమూర్తి ► పూర్తి జడ్జిమెంట్ త్వరలో బయటకు వచ్చే అవకాశం ► హైకోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► అసలు కేసే చెల్లదన్న చంద్రబాబు లాయర్ల వాదనను తిరస్కరించిన హైకోర్టు ► 17A సెక్షన్ కింద అరెస్ట్ చెల్లదన్న వాదనను అంగీకరించని హైకోర్టు ► CID వాదనలతో ఏకీభవించిన ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం ► అరెస్ట్ సక్రమమే, రిమాండ్ సక్రమమే, కేసు దర్యాప్తు జరగాల్సిందే 12:30 PM, సెప్టెంబర్ 22, 2023 చేసిన పాపాలకు ఆత్మ పరిశీలన చేసుకోవాలి : పేర్ని నాని ► స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఏపీ అసెంబ్లీలో చర్చ ► ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ బాబు ► "వాట్ ఐ యామ్ సేయింగ్, మన వాళ్లు బ్రీఫ్డ్ మీ" అన్నది బాబే కదా.! ► ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అక్కర్లేదని స్వీట్లు పంచుకున్న చరిత్ర బాబుది, టిడిపిది ► చేసిన పాపాలకు చంద్ర బాబు జైల్లో ఆత్మపరిశీలన చేసుకోవాలి ► స్కిల్ స్కాం పక్కాప్లాన్ ప్రకారం జరిగింది, సూత్రధారి, కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ చంద్రబాబే ► డొల్ల కంపెనీలు సృష్టించి నిధులు దారి మళ్లించారు ► ఎంవోయూ..జీవోకు సంబంధమే లేదు ► రూ. 371 కోట్ల రూపాయలు డొల్ల కంపెనీలకు ఎలా వెళ్లాయి? 12:20 PM, సెప్టెంబర్ 22, 2023 సెప్టెంబర్ 27న ఉండవల్లి పిటిషన్.? ► ఉండవల్లి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు ► రిట్ నెంబర్ 38371/2023 గా నమోదు చేసిన రిజిస్ట్రార్ ► బుధవారం విచారణకు వచ్చే అవకాశం ► హైకోర్టు ఇరుపక్షాలు వాదనలు వినే అవకాశం 12:00 PM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై టిడిపి ప్రజంటేషన్ ► స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వాస్తవాలపై పయ్యావుల కేశవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ► ఎంప్లాయిమెంట్ కోసమే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ► సీమెన్స్ ప్రతినిధులు చంద్రబాబు వెనకాలపడ్డారు ► సీమెన్స్ రిపోర్ట్ తర్వాత సుదీర్ఘ సమావేశం తర్వాత చంద్రబాబు ఓకే చేశారు ► ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన పిల్లల్ని తయారు చేయాలని చంద్రబాబు చెప్పారు ► భవిష్యత్‌ను ఆలోచించిన మేధావి మా నాయకుడు బాబు 11:45 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు రిమాండ్‌పై అసెంబ్లీలో కన్నబాబు ప్రకటన ► చంద్రబాబు విజనరీ కాదు, ప్రిజనరీ ► ఇప్పటి వరకు ఈ కేసులో పదిమందిని అరెస్ట్ చేశారు ► ఏడుగురు నిందితులు బెయిల్‌పై బయటకు వచ్చారు ► బెయిల్ మీద వచ్చిన సుమన్ బోస్ బాబుకు మద్దతు పలకడం విడ్డూరం ► 17 మంది వాంగ్మూలాలను మెజిస్ట్రేట్ ముందు రికార్ట్ చేశారు ► గొప్ప నాయకుడిలా చంద్రబాబు ఫోజులిస్తున్నారు ► చంద్రబాబు అవినీతిని ఆదాయంపన్ను శాఖ బట్టబయలు చేసింది ► బోగస్ ఇన్వాయిస్లు సృష్టించడంలో యోగేష్ గుప్తా దిట్ట ► టన్నుల పేరుతో కోడ్ లాంగ్వేజ్ లో అవినీతికి పాల్పడ్డారు ► టన్నులు అంటే బరువు కాదు... కోట్లు అనే అర్ధం వచ్చేలా కోడ్ లాంగ్వేజ్ ► చంద్రబాబు 13 చోట్ల సంతకాలు పెట్టారు ► చంద్రబాబు ఆదేశాల మేరకే డబ్బును రిలీజ్ చేశారు ► డబ్బులు నేరుగా తన అకౌంట్ లోకి చేరుతాయి కాబట్టే స్కిల్ స్కీమ్ పై చంద్రబాబుకు అంత ప్రేమ ► ఒకేరోజు ఒకే విడతగా రూ.371 కోట్లు రిలీజ్ చేశారు ► అరెస్ట్ రోజున హెలికాఫ్టర్‌ను చంద్రబాబు కావాలనే తిరస్కరించారు ► రోడ్డు మార్గంలో వెళితే సానుభూతి వస్తుందనేది బాబు ప్లాన్ ► రిమాండ్ విధించిన జడ్జినే టీడీపీ బ్యాచ్ ట్రోల్ చేశారు 11:30 AM, సెప్టెంబర్ 22, 2023 సానుభూతి కోసం ఇంత విష ప్రచారమా? : YSRCP ► చంద్రబాబు జైల్లో ఉంటే సానుభూతి కోసం ఎల్లో మీడియా విచిత్ర వేషాలు ► దోమలు, ఏసీ, వేడి నీళ్లంటూ అర్థం పర్థం లేని ఆరోపణలు ► దింపుడు కళ్లెం ఆశలు సరికాదన్న విజయసాయిరెడ్డి అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకెళ్లిన బాబుపై సానుభూతి కోసం ప్రయత్నిస్తోంది పచ్చకుల మీడియా. నక్సల్స్ క్లెమోర్ మైన్ పేలిస్తేనేరాని సానుభూతి తప్పుచేసి జైలుకెళ్తే వస్తుందా? 2024 కోసం ఎదో దింపుడు కల్లెం ఆశ. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 22, 2023 11:22 AM, సెప్టెంబర్ 22, 2023 ఈ మధ్యాహ్నమే క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు.? ► మధ్యాహ్నం 1.30 గంటలకు హైకోర్టు ముందుకు క్వాష్ పిటిషన్ ► క్వాష్ పిటిషన్‌పై ఇప్పటికే పూర్తయిన ఇరుపక్షాల వాదనలు ► క్వాష్ పిటిషన్‌పై తీర్పును ఈ నెల 19న రిజర్వ్‌లో పెట్టిన హైకోర్టు ► మధ్యాహ్నం క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం 11:15 AM, సెప్టెంబర్ 22, 2023 హైకోర్టు క్వాష్ పిటిషన్ దృష్ట్యా కస్టడీ తీర్పు రిజర్వ్ ► విజయవాడ : కస్టడీ పిటిషన్‌పై ACB కోర్టు సమాలోచనలు ► ఏసీబీ కోర్టుకు వచ్చిన ఇరుపక్షాల లాయర్లు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా.. కస్టడీ పిటిషన్‌పై సమాలోచనలు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు ఆగుతారా? ► మధ్యాహ్నం తర్వాత తమ నిర్ణయం ప్రకటించనున్న ACB కోర్టు 11:00 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబుపై ప్రజాప్రయోజన వ్యాజ్యానికి లిస్టింగ్ ► చంద్రబాబుపై రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిల్ ► రిట్ నెంబర్ 38371/2023 గా నమోదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్ ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి ► 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటిషన్ ► కేంద్ర ప్రభుత్వం, CBI, EDలను ప్రతివాదులుగా పేర్కొంటూ పిటిషన్ ► త్వరలోనే విచారణ జరపనున్న హైకోర్టు 10:30 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు రిమాండ్ సెప్టెంబర్ 24వరకు వరకు పొడిగింపు ► ACB కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయిన చంద్రబాబు ► రిమాండ్ ముగియడంతో ACB కోర్టు న్యాయమూర్తి ముందుకు చంద్రబాబు ► రాజమండ్రి జైలులో చంద్రబాబు, విజయవాడ ACB కోర్టులో న్యాయమూర్తి ► చంద్రబాబుతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన న్యాయమూర్తి ► CID కస్టడీ అడుగుతోంది, మీ అభిప్రాయమేంటీ? : జడ్జి ► నాది 45 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ : చంద్రబాబు ► నా గురించి దేశంలో అందరికీ తెలుసు : చంద్రబాబు ► మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారు : జడ్జి ► అక్రమంగా అరెస్ట్ చేశారన్నది నా ఆవేదన: బాబు ► చట్టం ముందు అందరూ సమానమే, నా హక్కులు రక్షించాలి : చంద్రబాబు ► మీకు జైల్లో ఏమైనా ఇబ్బందులున్నాయా? : జడ్జి ► రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిందే నేను : చంద్రబాబు ► నాపై ఉన్నవి ఆరోపణలే, నన్ను విచారణ చేసిన తర్వాత జైలుకు పంపాల్సింది : బాబు ► మీరు పోలీస్ కస్టడీలో లేరు, జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్నారు : జడ్జి ► ఎల్లుండి వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు ► జైల్లో చంద్రబాబుకు ఏ ఏ సౌకర్యాలు కల్పిస్తున్నారు : జడ్జి ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు సౌకర్యాలు : అధికారులు రిమాండ్ సమయం ముగియడంతో చంద్రబాబుగారిని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. విచారణలో మాట్లాడుతూ... తనని అన్యాయంగా అరెస్టు చేసారని... తన హక్కులను రక్షించాలని, న్యాయాన్ని కాపాడాలని చంద్రబాబుగారు జడ్జిని కోరారు #CBNLifeUnderThreat… pic.twitter.com/SQHNUgDdIx — Telugu Desam Party (@JaiTDP) September 22, 2023 10:20 AM, సెప్టెంబర్ 22, 2023 ఆర్థిక నేరాల్లో అందరికంటే పెద్ద చంద్రబాబే ► చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారు : YSRCP ► ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక నేరస్థుడు చంద్రబాబు : YSRCP ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక గజదొంగ చంద్రబాబు.#CorruptBabuNaidu#SkillDevelopmentScam#KhaidiNo7691#SkilledCriminalCBNInJail pic.twitter.com/luz0vx1z1N — YSR Congress Party (@YSRCParty) September 22, 2023 10:10 AM, సెప్టెంబర్ 22, 2023 PT వారంట్లపై నేడు విచారణ ► CID పీటీ వారెంట్లపై నేడు ACB కోర్టులో విచారణ ► PT వారంట్ అంటే ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ (రిమాండ్‌లో ఉన్న ఖైదీ) ► అమరావతి రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో పీటీ వారెంట్లు వేసిన CID 10:00 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబుపై కేసులు ఎత్తేయాలని టిడిపి ధర్నా ► చంద్రబాబు కేసులను ప్రస్తావిస్తూ ఎమ్మెల్యేల నిరసన చంద్రబాబు గారి పై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. శాసనసభకు పాదయాత్రగా వెళ్లి, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేస్తూ అసెంబ్లీ లోపలికి వెళ్లారు.#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu… pic.twitter.com/QqLRIo3QFe — Telugu Desam Party (@JaiTDP) September 22, 2023 10:00 AM, సెప్టెంబర్ 22, 2023 నేడు కోర్టు ముందుకు చంద్రబాబు ► ఇవ్వాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు చంద్రబాబు ► రాజమండ్రి సెంట్రల్ జైలులో లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ► బాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు నేటికి వాయిదా ► హైకోర్టులో నేడు లిస్ట్ కాని క్వాష్ పిటిషన్ 7:20 AM, సెప్టెంబర్ 22, 2023 అసెంబ్లీలో స్కిల్ స్కాంపై చర్చ ►నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ►అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై స్వల్పకాలిక చర్చ. 7:10 AM, సెప్టెంబర్ 22, 2023 చంద్రబాబు పిటిషన్లపై నేడు వాదనలు ►చంద్రబాబు పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో వాదనలు ►హైకోర్టు తీర్పును బట్టి ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించే అవకాశం 6:30 AM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం వాయిదా ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌లో ఉందని చెప్పిన లాయర్లు ► హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు ► కస్టడీ పిటిషన్‌పై ఈరోజు వరకు వేచి చూద్దామని చెప్పిన న్యాయమూర్తి ► నేటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 6:25 AM, సెప్టెంబర్ 22, 2023 కస్టడీ పిటిషన్‌పై ఇదీ క్లారిటీ.! ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌కు కస్టడీ పిటిషన్‌కు సంబంధం ఉంది ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి ► ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా ► ఈరోజు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తానన్న న్యాయమూర్తి 6:20 AM, సెప్టెంబర్ 22, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో కస్టడీకి ఇవ్వండి ► విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CID ► ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరిన CID ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 స్కిల్ స్కాంపై ఉండవల్లి పిటిషన్ ►స్కిల్ స్కాంపై ఏపీ హైకోర్టులో ఉండవల్లి అరుణ్‌కుమార్ పిల్ దాఖలు. ►స్కిల్ స్కాం కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్. ►స్కిల్ కుంభకోణంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని అభ్యర్థన. ►ఈ కేసులో ఇంకా చాలా విషయాలు తెలియాల్సి ఉందన్న ఉండవల్లి. చదవండి: ‘స్కిల్’ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: హైకోర్టులో ఉండవల్లి పిటిషన్ 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే.. ►అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. ►లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రోకోలో భాగంగానే చంద్రబాబుకు కరకట్ట నివాసం. ►ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు. ►అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. ►అమరావతిని రాజధానిగా సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబు. ►అమరావతి మాస్టర్‌ప్లాన్ గురించి చంద్రబాబుకు మొత్తం ముందే తెలుసు. ►మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే. ►రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో చంద్రబాబుకు పూర్తి భాగస్వామ్యం. చదవండి: బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్మెంట్ స్కాం ఏంటీ? 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ►ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డ లింగమనేని, చంద్రబాబు, నారాయణ. ►టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్పు. ►2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 ఇన్నర్‌రింగ్‌రోడ్డును ఆనుకుని లింగమనేనికి ఆస్తులు ►ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి లబ్ది. ►కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ►లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్మెంట్ ఖరారు. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే ►చంద్రబాబు కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మాణం. ►ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివాసం. ►సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు. ►ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. ►ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. ►కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ►ఆ నివాసాన్ని చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చిన లింగమనేని రమేశ్. 6:00 AM, సెప్టెంబర్ 22, 2023 లోకేశ్‌దీ కీలక పాత్రే... ►క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర. ►లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం. ►హెరిటేజ్ డైరెక్టర్‌గా సమావేశంలో పాల్గొన్న లోకేశ్. ►అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసం. ►క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర. -
దంపతులను బలి తీసుకున్న పాతకక్షలు
అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జంట హత్యలు కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలు భార్య భర్తలను బలితీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకేశ్, భువనేశ్ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్ చేయగా లింక్ డాక్యుమెంట్స్ లేవంటూ వీఆర్వో, ఆర్ఐలు రిజక్ట్ చేశారు. దీనిపై వివరణ కోరేందుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు్గరితో కలిసి గురువారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్వో కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా పాస్‌పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకటనారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్‌తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడుకులే హత్యలకు కారణమని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
గణేష్ మండపం వద్ద డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు
గుండెపోటు.. ఈ మాట వింటేనే గుండె ఆగినంత పని అవుతుంది. అంతకంతకు పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరి ప్రాణాలు ఎప్పుడు ఎలా పోతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండే యువకులు సైతం సడెన్ హార్ట్ఎటాక్తో కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్నారు. రదాగా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా గడిపిన వారు అప్పటికప్పుడే ప్రాణాలు విడిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా అనంతపురం జిల్లా ధర్మవరంలో విషాదం చోటుచేసుకుంది.. పట్టణంలోని మారుతి నగర్లో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవరాత్రుల్లో భాగంగా బుధవారం రాత్రి వినాయకుని మండపం ముందు డాన్స్ చేస్తూ ప్రసాద్ (26) అనే యువకుడు మృతి చెందాడు. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ప్రసాద్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. -
టీడీపీ నేత కీచక పర్వం.. విద్యార్ధినికి వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం మండలం గొట్లూరులో టీడీపీ నేత భాస్కర్ కీచక పర్వానికి తెగబడ్డాడు. ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆటోలో నుంచి బయటకు లాక్కెళ్లి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలికకు గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి తల్లిదండ్రులు పోలసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్ -
Sep 21st : చంద్రబాబు కేసు అప్డేట్స్
Live Updates.. 7:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇమేజ్ బిల్డప్ కోసం అఖిలప్రియ అష్టకష్టాలు ► నంద్యాలలో దీక్ష పేరుతో మీడియాను ఆకర్షించేందుకు అఖిలప్రియ కష్టాలు ► ఇప్పటికే అఖిలప్రియపై బోలెడు కేసులు ► నడి రోడ్డుపై దౌర్జన్యం, పలువురిపై దాడి కేసుల్లో ఉన్న అఖిలప్రియ ► సుబ్బారెడ్డి కుటుంబంతో పలు వివాదాలు ► వేర్వేరు కేసుల్లో పలుమార్లు అరెస్టయిన అఖిలప్రియ ► ఇప్పుడు ఇమేజ్ బిల్డప్ కోసం నిరాహార దీక్ష ► చంద్రబాబును అరెస్ట్ అయిన RK ఫంక్షన్ హాల్ ఎదుటే అఖిలప్రియ దీక్ష ► నంద్యాల, ఆళ్లగడ్డల నుంచి జనాల్ని తరలించేందుకు ప్రయత్నాలు 7:00 PM, సెప్టెంబర్ 21, 2023 విజయవాడలో తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశం ► చంద్రబాబు అరెస్ట్‌పై రేపటి సభలోనూ పట్టుపట్టాలని టీడీఎల్పీ నిర్ణయం ► స్పీకర్ తమ్మినేనిని లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయం ► రేపు సభలో తగ్గేదే లేదన్న బాలకృష్ణ ► స్కిల్ అంశం పై పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు సిద్దం కావాలని నిర్ణయం ► ఎల్లో మీడియాలోనూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పేరిట తమ వర్షన్ చెప్పుకోవాలని ఎమ్మెల్యేల నిర్ణయం 6:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో కస్టడీకి ఇవ్వండి ► విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని పిటిషన్ ► ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన CID ► ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరిన CID ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A1 ముద్దాయిగా చంద్రబాబు 5:50 PM, సెప్టెంబర్ 21, 2023 దోమల ప్రచారం వెనక అసలు వాస్తవాలు ఇవి ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో దోమల వ్యవహారంపై స్పష్టత ఇచ్చిన అధికారులు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీ డెంగ్యూతో మృతి చెందడాని టిడిపి చేస్తోన్న ప్రచారం తప్పు ► రిమాండ్ ఖైదీ సత్యనారాయణ ఈ నెల ఆరో తేదీన జైలుకు వచ్చారు ► వచ్చిన రోజే జరిగిన స్క్రీనింగ్ టెస్టులో ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది ► వెంటనే రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి నిందితుడిని తరలించాము ► ఈ నెల 19న కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ► ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు ► జైల్లో కుట్టిన దోమల వల్ల సత్యనారాయణకు డెంగ్యూ వచ్చి చనిపోయాడన్న వాదన సరికాదు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఇప్పటికి ఫాగింగ్ పూర్తి, ప్రతీ రోజూ కొనసాగింపు ► చంద్రబాబు ఒక్కరే కాదు, జైల్లో ఉన్న ఖైదీల అందరి ఆరోగ్య భద్రత చూడడమే తమ లక్ష్యం అంటున్న జైలు అధికారులు 5:25 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీ పిటిషన్‌పై ఇదీ క్లారిటీ.! ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌కు కస్టడీ పిటిషన్‌కు సంబంధం ఉంది ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటానని చెప్పిన న్యాయమూర్తి ► రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా ► రేపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే కస్టడీ పిటిషన్‌పై తీర్పు వెల్లడిస్తానన్న న్యాయమూర్తి 5:05 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా ► హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ గురించి అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టు తీర్పు ఎప్పుడు రావొచ్చని చంద్రబాబు లాయర్లను అడిగిన ACB కోర్టు న్యాయమూర్తి ► హైకోర్టులో వాదనలు ముగిసాయి, తీర్పు రిజర్వ్‌లో ఉందని చెప్పిన లాయర్లు ► హైకోర్టు తీర్పు వచ్చేవరకు ACB కోర్టు వేచిచూడాలా లేదా అన్నదానిపై సమాలోచనలు ► కస్టడీ పిటిషన్‌పై రేపటి వరకు వేచి చూద్దామని చెప్పిన న్యాయమూర్తి ► రేపటి హైకోర్టు తీర్పును బట్టి ACB కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం 5:00 PM, సెప్టెంబర్ 21, 2023 అందరి చూపు ACB కోర్టు నిర్ణయంపై ► విజయవాడ : ACB కోర్టు వెలువరించబోయే కస్టడీ నిర్ణయంపై ఉత్కంఠ ► బెంచ్ మీదకు వచ్చిన జడ్జి ► కాసేపట్లో చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు వెల్లడించే అవకాశం 4:45 PM, సెప్టెంబర్ 21, 2023 పక్కా ఆధారాలతోనే బాబు అరెస్ట్ : CID చీఫ్ ► స్కిల్ స్కాంలో పక్కా ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ ► ప్రతి పేపర్ పై చంద్రబాబు సంతకం ఉంది ► షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారు ► చంద్రబాబుకు పీఏగా పని చేసిన శ్రీనివాస్ ద్వారా డబ్బులు మళ్లించారు ► స్కిల్ స్కాంలో చంద్రబాబుకు పాత్ర ఉందని ఆధారాలు చెబుతున్నాయి ► పీఏ శ్రీనివాస్‌ను విచారిస్తే కీలక విషయాలు బయటకు వస్తాయి ► శ్రీనివాస్‌కు నోటీసులు ఇవ్వగానే అమెరికాకు పారిపోయాడు ► అప్పుడు సీఎంగా ఉన్నారు కనుకే ఐపీసీ 409 చంద్రబాబుకు వర్తిస్తుంది ► స్కిల్ స్కాంలో ఆధారాలు దొరికితే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం ► సీమెన్స్ సంస్థలో గతంలో పని చేసిన వాళ్ల పాత్ర కూడా ఉంది ► సీమెన్స్ లో ఇప్పుడున్న వాళ్లు స్కాంతో తమకు సంబంధం లేదంటున్నారు ► చంద్రబాబు నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంది 4:30 PM, సెప్టెంబర్ 21, 2023 CID లాయర్లు ఏం వాదించారు? ► కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుంది : CID ► చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ► ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం ► చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ► చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉంది ► కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు, నిజం బయటకు వస్తుంది ► 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదు ► స్కిల్ స్కాంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ► కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు 4:30 PM, సెప్టెంబర్ 21, 2023 బాబు లాయర్లు ఏం వాదించారు? ► FIRలో పేరు లేదు, కస్టడీ వద్దు ► చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు ► FIRలో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారు ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు ► అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు ► ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు ► ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు ► విచారణలో కొత్త కోణం ACB కోర్టు ముందు ఉంచలేక పోయారు 4:00 PM, సెప్టెంబర్ 21, 2023 ACB కోర్టుకు ఇరుపక్షాల లాయర్లు ► విజయవాడ : ACB కోర్టుకు చేరుకున్న లాయర్లు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో తీర్పు ► కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు, చంద్రబాబు లాయర్లు 4:00 PM, సెప్టెంబర్ 21, 2023 ACB కోర్టు ఉత్తర్వులపై అందరి దృష్టి ► విజయవాడ : ACB కోర్టులో కస్టడీ పిటిషన్‌పై నిన్ననే పూర్తయిన వాదనలు ► ఇవ్వాళ మరోసారి బెంచ్ ముందుకు రానున్న కస్టడీ పిటిషన్ ► ఇవ్వాళ కస్టడీ ఇస్తారా? ఇస్తే ఎన్ని రోజులు అన్న విషయం న్యాయమూర్తి ప్రకటించే అవకాశం ► మరికొద్దిసేపట్లో ఏసీబీ కోర్టు బెంచ్ ముందుకు కస్టడీ పిటిషన్ అంశం వచ్చే అవకాశం 3:20 PM, సెప్టెంబర్ 21, 2023 ఎర్రన్నాయుడు కూతురు ఎందుకు కనిపించడం లేదు? ► రాజమండ్రిలో 11 రోజులుగా జైల్లో ఉన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ► పార్టీలో ఉన్న లీడర్లంతా ఇప్పటివరకు రాజమండ్రిలో హాజరు వేసుకున్నవాళ్లే ► రాజమండ్రిలో ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవాని మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.! ► పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడి అన్న కూతురు, లోకల్ ఎమ్మెల్యే ఎందుకు కనిపించడం లేదు? ► ఆదిరెడ్డి కుటుంబం దగ్గరుండి భవానిని దూరం పెట్టిందా? ► లేక చంద్రబాబు అసలు రంగు తెలిసి భవాని దూరంగా ఉంటోందా? ► చంద్రబాబు అరెస్టు నిరసిస్తూ భువనేశ్వరి, బ్రాహ్మణి నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కూడా పాల్గొనే అవకాశం లేదా? 3:20 PM, సెప్టెంబర్ 21, 2023 భద్రతపై తప్పుడు ఆరోపణలు సరికాదు : విజయసాయిరెడ్డి ► చంద్రబాబు భద్రతపై తెలుగుదేశం నేతల ఆరోపణలు సరికాదు ► లోకేష్, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు ► దోమలతో స్లో పాయిజన్ అంటూ ఎల్లో మీడియా చేస్తోంది విషప్రచారం ► అసలు తెలుగుదేశం నేతలే ఏదో చేస్తారా అన్న అనుమానాలున్నాయి మీ వ్యవహారం చూస్తుంటే మీరు, మీ పార్టీ వారే... జైల్లో చంద్రబాబు గారికి హాని తలపెడతారన్న అనుమానం కలుగుతోంది. బాబుకు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని కొట్టెయ్యాలన్న కసి కొందరు టీడీపీ నాయకుల్లో కనిపిస్తోంది. టీడీపీ వారితో జైలు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023 3:00 PM, సెప్టెంబర్ 21, 2023 ఇదేం పార్టీ? ఇదేం ప్రవర్తన? టిడిపి నేతల తీరుపై YSRCP మండిపాటు ► చంద్రబాబు అరెస్ట్ విషయంలో టిడిపి నేతలు ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు ► అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ తీరు ఏ మాత్రం సరికాదు ► యువగళం పాదయాత్రలో లోకేష్ సాంతం బూతులు మాట్లాడారు ► ప్రజలను రెచ్చగొట్టడమే మామా అల్లుళ్ల పనా? నాయకుడు అనేవాడు.. అందరికీ ఆదర్శంగా ఉండాలి. కానీ.. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌కి ఆ లక్షణాలు మచ్చుకకి కూడా లేవు. ఒకరేమో అసెంబ్లీ వేదికగా, మరొకరేమో బహిరంగ వేదికపై అసభ్యంగా సైగలు చేస్తారు. కనీసం మహిళలు ఉన్నారనే ఇంగితం కూడా ఇద్దరికీ లేకపోయింది. #TDPGoonsInAssembly#APAssembly… pic.twitter.com/zBtLktpM7S — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 2:30 PM, సెప్టెంబర్ 21, 2023 దోమల పేరు చెప్పి భయపెడతారా? ► చంద్రబాబుపై సానుభూతి కోసం దోమల పేరు చెప్పడం సరికాదు : బాపట్ల ఎంపీ సురేష్ ► ఎవరికి భయపడనని చెప్పే చంద్రబాబు, దోమలకు భయపడతారా ? ► చంద్రబాబు ప్రాణాలకు ప్రమాదం లోకేష్ , టిడిపి నేతల నుంచే ఉంది ► చంద్రబాబు లాగే వెన్నుపోటు విద్య లోకేష్‌కు అబ్బినట్టుంది ► చంద్రబాబు పదవి కోసం లోకేష్ ఇలా వ్యవహరించే అవకాశం ఉంది ► చంద్రబాబు పై ఇలాంటి ప్రకటనలు చేస్తున్న వారి ఫోన్లను కోర్టు తనిఖీ చేయాలి ► వారం రోజుల నుంచి ఢిల్లీలో ఉన్న లోకేష్ ఏపీకి ఎందుకు పోవడం లేదు? ► దోమల పేరుతో ఎలాంటి సానుభూతి రాదు, నవ్వులపాలవుతారు 1:30 PM, సెప్టెంబర్ 21, 2023 బాబు భద్రతపై ఆందోళన అవసరం లేదు: జైళ్ల శాఖ ► రాజమండ్రి : చంద్రబాబు భద్రత గురించి టిడిపి అభ్యంతరాలను ఖండించిన జైళ్ల శాఖ డీఐజీ ► సెంట్రల్ జైలులో 2,063 మంది ఖైదీలు ఉన్నారు ► జైలు లోపల జాగ్రత్తలు తీసుకుంటున్నాం ► కోర్టు సూచించిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం ► ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 1:00 PM, సెప్టెంబర్ 21, 2023 భారతీయుల నిరసనతో హోరెత్తుతోన్న కెనడా ► కెనడాలో గత కొద్ది రోజులుగా సిక్కుల నిరసనలు ► సిక్కుల నిరసనకు తోడుగా తెలుగుదేశం నిరసనలు ► ఇప్పటికే వరుస నిరసనలపై కెనడా ప్రభుత్వం సీరియస్ ► టోరంటోలో తెలుగుదేశం నిర్వహించిన ఆందోళనలపై సీరియస్ ► భారత్‌కు సంబంధించిన అంశాలను సున్నితంగా చూస్తోన్న కెనడా ► ఇప్పటికే రెండు దేశాల మధ్య దెబ్బ తిన్న సంబంధాలు ► ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పేరు చెప్పి కెనడాలో ఆందోళనలు చేయడం సరికాదంటున్న అక్కడి అధికారులు ► కెనడాలో సిక్కులకు పోటీగా టిడిపి నాయకులు చేస్తోన్న ఆందోళనలపై భారత ప్రభుత్వం సీరియస్ ► మన దేశానికి సంబంధించిన అంతర్గత అంశం, అది కూడా అవినీతి కేసుకు సంబంధించి అంతర్జాతీయంగా ఆందోళనలు చేపట్టడం సరికాదంటున్న కేంద్రం ► తెలుగు రాని విదేశీయులను ఆందోళనల్లో భాగస్వామ్యం చేస్తోన్న టిడిపి ► అనుమతి లేకుండా ఆందోళనలకు దిగే వారి వివరాలు సేకరిస్తోన్న భారత ప్రభుత్వం, కెనడా ప్రభుత్వం That’s Toronto canada 🇨🇦 for Babu garu #IAmWithBabu #IAmWithCBN 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 pic.twitter.com/LHJ3KkCHKt — Bring it On🔥TDP Voice - Siva (@TDPVoice2024) September 18, 2023 12:40 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబుకు జైల్లో అన్ని సౌకర్యాలున్నాయి : వైఎస్సార్సిపి ► జైల్లో చంద్రబాబుకు నిర్దేశిత నిబంధనల మేరకు అన్ని సౌకర్యాలున్నాయి ► ఇంటి భోజనంకు అనుమతిస్తున్నారు, వేడి నీళ్లు కూడా ఇస్తున్నారు ► కోర్టు కల్పించిన అన్ని సౌకర్యాలు ఉన్నా.. టిడిపి బురద జల్లుతోంది ► భద్రత లేదంటూ లోకేష్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు వైఎస్సార్సీపీ గుర్తు ఫ్యాన్ అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడరాదన్న నియమం ఏమీలేదు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఫ్యాన్ తీసేసి నాకు ఏసీ కావాలని పట్టుబట్టినా జైలు నిబంధనలు అందుకు అనుమతించవు. స్విచ్ వేయకుండా ఫ్యాన్ తిరగడం లేదంటే ఎలా? — Vijayasai Reddy V (@VSReddy_MP) September 21, 2023 12:35 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు అరెస్ట్‌పై అసెంబ్లీలో రాద్ధాంతమా? : వైఎస్సార్సిపి ► జైల్లో చంద్రబాబు ఉంటే.. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు అల్లరి చేస్తున్నారు ► సభలో స్పీకర్ పోడియం చుట్టు ముట్టి సమావేశాలు అడ్డుకున్నారు ► మీసాలు తిప్పుతూ బాలకృష్ణ రెచ్చగొట్టేలా ప్రవర్తించారు .@ncbn అరెస్టుకు నిరసనగా అసెంబ్లీలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన @JaiTDP ఎమ్మెల్యేలు. మీసాలు తిప్పుతూ రెచ్చగొట్టేలా ప్రవర్తించిన బాలకృష్ణ. వీరి నాయకుడు అవినీతి చేసి అరెస్టు అయితే దానిపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీలో నిరసన తెలుపుతూ విలువైన అసెంబ్లీ… pic.twitter.com/lQuzKDG4BV — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 12:30 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబుకు జైల్లో ఏసీ లేక ఇబ్బందులు వస్తున్నాయి : అచ్చెన్నాయుడు ► జైల్లో చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు లేవు ► ఏసీ లేకపోవడం వల్ల చంద్రబాబుకు ఇబ్బంది అవుతోంది ► దోమలు కూడా కుడుతున్నాయని చంద్రబాబు చెప్పారు ► ఇటీవలే డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయని వార్తలు వచ్చాయి ► చంద్రబాబు చన్నీళ్లతో స్నానం చేస్తున్నారని చెబుతున్నారు ► చంద్రబాబుకు వేడి నీళ్లు స్నానానికి ఇవ్వాలని కోరుతున్నాం ► కోర్టులు ఇచ్చిన ఆదేశాలను పాటించాలి 12:25 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు రిమాండ్‌పై చర్చించడానికి రెడీ ► చంద్రబాబు రిమాండ్‌పై చర్చించాలని టిడిపి పట్టు ► Yes, చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేసిన ప్రభుత్వం ► ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ► తెలుగుదేశం పార్టీని సూటిగా ప్రశ్నించిన మంత్రి బుగ్గన చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ.. చట్టపరంగా ప్రస్తుతం న్యాయస్థానంలో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. అయినప్పటికీ అసెంబ్లీలో చర్చకి డిమాండ్ చేస్తున్నారు. కానీ.. ప్రభుత్వం నుంచి అడిగే ప్రశ్నలకి టీడీపీ ఎమ్మెల్యేల వద్ద సమాధానం ఉందా? - మంత్రి బుగ్గన… pic.twitter.com/5qpL4L1Nmq — YSR Congress Party (@YSRCParty) September 21, 2023 12:20 PM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు రిమాండ్‌పై అసెంబ్లీలో బాలకృష్ణ ప్రెస్ మీట్ ► లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ కావడం వల్లే చంద్రబాబును అరెస్ట్ చేశారు ► ఈ కేసులో ఏమీ తేలదు, ఇలాంటి కేసులు చాలా చూశాను ► చంద్రబాబు జైల్లో చాలా ధైర్యంగా ఉన్నారు ► తననెవరు ఏమి చేయలేరని నాకు చెప్పారు ► అమరావతి ఉద్యమంలో అంతా జూనియర్ అర్టిస్టులను విమర్శిస్తున్నారు 12:15 PM, సెప్టెంబర్ 21, 2023 బెయిల్ కోసం తెలుగుదేశం యాగం ► చంద్రబాబుకు బెయిల్ రావాలంటూ విజయవాడలో యాగం ► టిడిపి నేత కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ► చంద్రబాబు క్షేమంగా ఉండాలంటూ రుద్ర మహా మృత్యుంజయ యాగం ► రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల ఏర్పాటు 12:10 PM, సెప్టెంబర్ 21, 2023 కస్టడీపై ఈ సాయంత్రం నిర్ణయం ► చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీ అడిగిన CID ► కస్టడీ వద్దంటూ నిన్న బాబు లాయర్ల వాదన ► ఒక్క రోజు కస్టడీ ఇస్తే సరిపోతుందంటూ కొన్ని కేసుల ఉదాహరణ ► ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వాలన్నదానిపై నేడు కోర్టు నిర్ణయం ప్రకటించే అవకాశం ► మరోవైపు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 26కు వాయిదా 12:00 PM, సెప్టెంబర్ 21, 2023 లోకేష్ కొత్త రాగం, చంద్రబాబుకు మరింత భద్రత కావాలని డిమాండ్ ► చంద్రబాబుకు జైల్లో దోమలు కుడుతున్నాయి ► చంద్రబాబు జైల్లో ప్రాణ భయం ఉంది ► చంద్రబాబుకు మరింత భద్రత కల్పించాలి ► పూర్తి భద్రత ఉందని జైలు అధికారులు చెప్పినా బురద వేసే ప్రయత్నం ► దోమల పేరు చెప్పి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్న వైఎస్సార్సిపి సైకో జగన్ @ncbn గారిని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు… pic.twitter.com/20a8Hq0Dl9 — Lokesh Nara (@naralokesh) September 21, 2023 11:45 AM, సెప్టెంబర్ 21, 2023 అసెంబ్లీలో చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ సభ్యుల ఓవరాక్షన్ ► శాసనసభ, మండలిలో టీడీపీ సభ్యుల రౌడీయిజం. ► స్పీకర్ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు. ► పోడియం వద్ద మీసం మెలేయడంపై బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్. ► ఒక్కరోజు సభ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ ► సమావేశాల నుంచి పూర్తిగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్ సస్పెండ్. 11:40 AM, సెప్టెంబర్ 21, 2023 ► రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బాబు పిటిషన్‌పై విచారణ 26కు వాయిదా. ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్డు సాయంత్రం 4 గంటలకు తీర్పు ఇచ్చే అవకాశం 11:20AM, సెప్టెంబర్ 21, 2023 ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈనెల 26కు వాయిదా 11:00AM, సెప్టెంబర్ 21, 2023 ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ ►ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ►కాసేపట్లో తీర్పు వెలువరించే అవకాశం ►సీఐడీ తరుఫున వాదనలు వినిపించిన పొన్నవోలు ►చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన లూద్రా, సిద్ధార్థ్ అగర్వాల్ 8:40AM, సెప్టెంబర్ 21, 2023 ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న :3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు లో మీరు 90 శాతం పెట్టుబడితో 10 శాతం ప్రభుత్వం పెట్టుబడితో స్కిల్ సెంటర్స్ పెట్టడానికి డిజైన్ టెక్ తో కలిసి ఒప్పందం చేసుకున్నారా..? ►సీమెన్స్ సమాధానం: అలాంటి ఒప్పందం మేము చేసుకోలేదు, 90 శాతం పెట్టుబడి పెట్టి ప్రాజెక్ట్ చేసే పద్దతి మా దగ్గరలేదు.. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : 3300 కోట్ల ఈ ప్రాజెక్టులో భాగంగా మీకు డిజైన్ టెక్ నుండి గాని స్కిల్ కార్పొరేషన్ నుండి గానీ ఏమైనా పర్చేజ్ ఆర్డర్ వచ్చిందా..? ►సీమెన్స్ సమాధానం : ఈ ప్రాజెక్టు లో భాగంగా మాకు ఎటువంటి పర్చేజ్ ఆర్డర్ రాలేదు..2015 లో డిజైన్ టెక్ నుండి 3 సార్లు మొత్తంగా 58 కోట్ల రూపాయలకు మాకు ఆర్డర్ వచ్చింది,మేము సప్ప్లై చేశాం.. ►సీమెన్స్‌కి సీఐడీ ప్రశ్న : ప్రస్తుతం సుమన్ బోస్ ఎక్కడున్నారు?? వారు అసలు ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్ట్ ని ఒప్పందం చేసుకునే అర్హత ఉందా..? ►సీమెన్స్ సమాధానం : సుమన్ బోస్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, 2018 లో వారు మా కంపెనీలో లేరు,ఇక ఇలాంటి 90 శాతం పెట్టుబడి పెట్టె ప్రాజెక్టులను మేము చేయం,ఇలాంటి ఒప్పందం చేసుకోవదానికి సుమన్ బోస్ కి ఆ అర్హత లేదు,ఇక ఇలాంటి ఒప్పందం చేసుకున్నట్లు మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇలాంటి ఒప్పందం కూడా లేదు 8:00 AM, సెప్టెంబర్ 21, 2023 రాజమండ్రి సెంట్రల్లో జైలులో 11వ రోజు చంద్రబాబు.. ►యథావిధిగా చంద్రబాబు రోజు వారి కార్యక్రమాలు ►ఇంటి నుంచే వచ్చిన ఆహారం, మందులు. ►పటిష్టమైన భద్రత మధ్య స్నేహ బ్లాక్‌లో చంద్రబాబు ►రాజమండ్రి రూరల్ కాతేరులో కొనసాగుతున్న టీడీపీ క్యాంపు ►రాజమండ్రిలోనే ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణి ►రాజమండ్రి వస్తే లొకేష్‌ను అరెస్ట్ చేస్తారంటూ రచ్చ చేస్తున్న ఎల్లో మీడియా. ►ఇవాళ జరగనున్న అసెంబ్లీ సెషన్స్ కు హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు. 7:50 AM, సెప్టెంబర్ 21, 2023 ఎల్లో బ్యాచ్ కొత్త నాటకం. ►అసెంబ్లీకి హాజరుకానున్న టీడీపీ ఎమ్మెల్యేలు ►సభకే రాని బాబు కోసం ఎల్లో బ్యాచ్ కొత్త ప్లాన్ ►అసెంబ్లీ వాయిదా వేయాలని మరో నాటకం. 7:00 AM, సెప్టెంబర్ 21, 2023 చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు వాదనలు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు ► కస్టడీ పిటిషన్‌పై నేడు తీర్పు ఇచ్చే అవకాశం 6:00 AM, సెప్టెంబర్ 21, 2023 అంగళ్లు కేసుపై నేడు హైకోర్టులో విచారణ ► అంగళ్లు విధ్వంసం కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► నేడు విచారణ చేపట్టనున్న హైకోర్టు ► అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలు ► టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు -
గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్
నెల్లూరు: గూడూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లో తాను సదరన్ రైల్వేలో డీఎస్పీ అంటూ కొద్దిరోజులుగా హల్చల్ చేస్తున్న వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. గూడూరు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి నిందితుడి వివరాలను వెల్లడించారు. వివరాలు..ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామానికి చెందిన మందా నాగరాజు ఆరు నెలలుగా గూడూరు ప్రాంతంలో నివాసం ఉంటూ తాను సదరన్ రైల్వేలో డీఎస్పీ అని నమ్మబలికాడు. ఈ క్రమంలోనే ఓ సెటిల్మెంట్కు సంబంధించి కొండంరెడ్డి రమేష్‌రెడ్డి అలియాస్ రాజారెడ్డిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి బాండ్ పేపర్‌పై బలవంతంగా సంతకాలు పెట్టించాడు. పది రోజుల్లో రూ.10 లక్షలు ఇవ్వకపోతే ఎన్కౌంటర్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు ఒకటో పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి నాగరాజును విచారించగా నకిలీ డీఎస్పీ అని తేలింది. ఈ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో గూడూరు సొసైటీ ప్రాంతానికి చెందిన రమేష్ అనే వ్యక్తికి రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.5 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. నిందితుడు నాగరాజు రైల్వేలో లోకోపైలట్, ఆర్పీఎఫ్ డీఎస్పీ అని చెప్పుకుంటూ గూడూరు పట్టణ, పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు వలవేశాడు. రైల్వే డిపార్ట్మెంట్లో టీసీ, క్లర్క్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెట్టి వారి నుంచి సుమారు రూ.30 లక్షల వరకు వసూలు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అతనిపై ఒంగోలు –1 టౌన్లో 2021లో చీటింగ్ కేసు నమోదై ఉందని చెప్పారు. నకిలీ రైల్వే డీఎస్పీ నుంచి నకిలీ యూనిఫామ్, ఐడీ కార్డులు, రైల్వే మెడికల్ ఫిట్నెస్, ఆర్ఆర్బీ సెలెక్షన్ సర్టిఫికెట్లు, రైల్వే పోలీసు క్యాప్‌తో పాటు వైర్‌సెల్ సెట్, ఫైబర్ లాఠీ, ఐదు సెల్ఫోన్లు, పల్సర్ బైక్, ల్యాప్‌టాప్, రూ.1.9లక్షల నగదుతో పాటు రూ.7 లక్షల విలువ చేసే రెండు ఖాళీ స్థలం డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ హజరత్‌బాబు, ఆర్పీఫ్ సీఐ లక్ష్మణరావు, ఏఎస్ఐ సీకేఎన్ రావు, ఒకటో పట్టణ ఎస్సై పవన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Updates.. 06:00 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై CID లాయర్, స్పెషల్ జీపీ వివేకానంద ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ముగిసాయి, ఇవ్వాలని మేం కోరాం. ► చంద్రబాబు కస్టడీలో అన్ని విషయాలు బయటికి వస్తాయి ► 24 గంటల్లో విచారణ పూర్తి చేయడం సాధ్యం కాదు ► స్కిల్ స్కాంలో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ► కొందరు కేసును తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు 05:27 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తి ► చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు రేపటికి వాయిదా 05:00 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్‌పై ఇంకా కొనసాగుతున్న వాదనలు ► చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన సిద్ధార్థ్ అగర్వాల్, సిద్ధార్థ్ లూథ్రా ► చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడే CID ఆఫీసులో విచారించారు ► చంద్రబాబు నుంచి అన్ని వివరాలు రాబట్టామని CID చెప్పింది ► ఇప్పుడు మళ్లీ కస్టడీ అడగడం సరికాదు 04:10 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీపై తిరకాసు : బాబు లాయర్ ► ACB కోర్టులో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా వాదనలు ► అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన రోజే కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదు ► 2021 లోనే స్కాం జరిగినపుడు అప్పటి నుండి ఏం చేస్తున్నారు ► ఇతర రాష్ట్రాల్లో జరిగిన వివిధ కుంభకోణాల కేసులను ఉదాహరణగా చూపిస్తున్న లూద్రా ► 5 రోజుల కస్టడీ అడిగినపుడు న్యాయమూర్తి ఒక్కరోజే కస్టడీ కి ఇచ్చిన కేసులను రిఫరెన్స్ గా చూపించిన లూద్రా 03:40 PM, సెప్టెంబర్ 20, 2023 FIRలో పేరు లేదు, కస్టడీ వద్దు : బాబు లాయర్ ► చంద్రబాబు కస్టడీ వద్దంటూ సిద్దార్ద లూద్రా వాదనలు ► చంద్రబాబుకి ఈ కేసుతో ఎక్కడా సంబంధం లేదు ► చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా ఆధారాలు లేవు ► FIRలో చంద్రబాబు పేరు లేకుండానే అరెస్ట్ చేశారు ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని జైల్లో పెట్టారు ► అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగింది ► NSG సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు ► ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు ► ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు ► విచారణలో కొత్త కోణం ACB కోర్టు ముందు ఉంచలేక పోయారు ► ఆధారాలు లేకుండా కస్టడీ ఎలా అడుగుతారు? ► చంద్రబాబు కస్టడీ పిటీషన్ తిరస్కరించాలి ► చంద్రబాబుని అరెస్ట్ చేసిన తర్వాత సిట్ కార్యాలయంలో విచారించారు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు 03:30 PM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీతో అసలు కుట్ర కోణం వెల్లడవుతుంది : CID ► చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏఏజీ పోన్నవోలు వాదనలు ► ఈ కేసులో న్యాయం అనేది జరిగి తీరాలి ► చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు ► కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ► ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత విచారించాలి ► ఈ కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికి తీయడం ముఖ్యం ► చంద్రబాబును పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి ► చంద్రబాబు స్వార్థ పూరిత వ్యవహారాలు మరిన్ని బయటకు రాకుండా అడుగడుగునా విచారణను అడ్డుకుంటున్నారు ► స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో దుర్వినియోగం అయిన నిధులు ఎక్కడెక్కడికి వెళ్ళాయో సమాచారం ఉంది ► కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది ► కస్టడికి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు, నిజం బయటకు వస్తుంది 03:25 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబుకు పవన్ మద్ధతివ్వడం అభ్యంతరకరం : కాపు నాయకులు ► జైల్లో ఉన్న చంద్రబాబుకు పవన్ మద్ధతివ్వడం ఏమాత్రం బాగోలేదు ► జైలు ఎదుట నిలబడి పొత్తు ప్రకటన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ► కాకినాడలో కాపు చర్చ గోష్టిలో పాల్గోన్న కాపు నేతలు, న్యాయవాదులు, అభిమానులు ► జనసేన ఒంటరిగా పోటి చేయాలి ► పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఎదగాలనుకున్నాం ► టిడిపితో పొత్తు పెట్టుకుని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి కాపులు ఎందుకు పని చేయాలి? ► టిడిపితో పవన్‌కు పొత్తు ఉంటే.. అసలు పవన్ కళ్యాణ్‌కే మద్దతు ఇవ్వము ► చంద్రబాబు ఏ మాత్రం విశ్వసనీయత లేని వ్యక్తి, అతని మాటల్ని నమ్మలేము ► ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ కళ్లు తెరవాలి, పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేయాలి ► అలా పోటీ చేస్తేనే కాపుల మద్దతు పవన్ కు ఉంటుంది 02:58 PM, సెప్టెంబర్ 20, 2023 భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారు: ఏఏజీ సుధాకర్‌రెడ్డి ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి. ►చంద్రబాబును విచారించేందుకు సమయం సరిపోలేదు. ►రూ.371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలున్నాయ్. ►సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్న.. భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారు. 02:33 PM, సెప్టెంబర్ 20, 2023 అంగళ్లు కేసులో విచారణ రేపటికి వాయిదా ► అంగళ్లు విధ్వంసం కేసులో.. ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన చంద్రబాబు ► విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు ► అంగళ్లు కేసులో ఏ1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టీడీపీ కార్యకర్తలు ►టీడీపీ కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలు 02:29 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ ప్రారంభం ► చంద్రబాబును కస్టడీ కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ ► ఐదు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ వేసిన సీఐడీ ► స్కిల్ స్కాంలో ఏ1గా చంద్రబాబు నాయుడు ► ప్రధాన నిందితుడైన చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయంటున్న సీఐడీ 02:05 PM, సెప్టెంబర్ 20, 2023 మరికాసేపట్లో సీఐడీ కోర్టులో వాదనలు ► విజయవాడ ఏసీబీ కోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ► స్కిల్ స్కాంలో సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ 01:45 PM, సెప్టెంబర్ 20, 2023 ►మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో విచారణ ►లంచ్ అనంతరం ఇరువైపులా వాదనలు వింటానన్న ఏసీబీ కోర్టు ►సీఐడీ తరపున వాదనలు వినిపించనున్న ఏఏజీ పొన్నవోలు ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబును విచారించాల్సి ఉంటుందంటున్న సీఐడీ ►చంద్రబాబుని కస్టడీకి ఇస్తేనే అసలు నిజాలు బయటపడతాయని వాదించే అవకాశం 12:55 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు ఒక్కడే జైలుకు వెళ్లలేదు ► విశాఖ: చంద్ర బాబు నాయుడు అరెస్ట్ పై మేధావుల అభిప్రాయం ► లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రెసిడెంట్ సుబ్బారావు ► ఈ దేశంలో మాజీ ముఖ్యమంత్రి నీ అరెస్ట్ చెయ్యడం కొత్త కాదు ► బీహార్‌లో పశుదాణా స్కాం అందరికీ తెలిసిందే, లాలూ అరెస్టయ్యారు ► తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జయలలిత జైలుకెళ్లారు ► ఉత్తరప్రదేశ్‌లో మాయావతిపై కేసు పెట్టారు ► న్యాయ స్థానం ముందు అందరూ సమానం ► రుల్ ఆఫ్ లా ఇన్ ఇండియాకు ఎవరు కూడా అతీతులు కాదు ► కోర్టు విచారణ ఎప్పుడు కూడా ఆధారాల మీద ఉంటుంది ► చంద్రబాబు నాయుడు ఏ తప్పు చెయ్యలేదని ఆధారాలు లేకపోతే కోర్టు ఆయనని జైలుకు పంపదు.! 12:45 PM, సెప్టెంబర్ 20, 2023 అసెంబ్లీకి వెళ్లాలని టిడిపి నిర్ణయం ► అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని టిడిపి ఎమ్మెల్యేల నిర్ణయం ► చంద్రబాబు అరెస్టును ప్రస్తావించాలని నిర్ణయం ► చంద్రబాబు అరెస్టు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని లోకేష్ సూచన ► ప్రజల్లోకి పార్టీ వాదనను బలంగా తీసుకెళ్లాలన్న నారా లోకేష్ 12:42 PM, సెప్టెంబర్ 20, 2023 టీవీ డిబేట్లలో ఇష్టానుసార వ్యాఖ్యలా? ► విజయవాడ కోర్టు ప్రాంగణంలో వైసిపి లీగల్ సెల్ నిరసన ► ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై ఓ టీవీ ఛానల్ డిబేట్ కొలికపూడి శ్రీనివాస్ వ్యాఖ్యలు ► ఇష్టానుసారంగా మాట్లాడిన టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి ► కొలికపూడి, అనం అనుచిత వ్యాఖ్యలపై లాయర్ల నిరసన ► నిరసనలో బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు, లీగల్ సెల్ న్యాయవాదులు ► రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న పోన్నవోలుపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు ► కొలికపూడిపై సుమోటోగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ►కొలికపూడికి రిమాండ్ విధించాలి ►న్యాయ వ్యవస్థపై నోరు జారినవారిపై డిఫమేషన్ కేసు వేస్తామన్న లాయర్లు 12:05 PM, సెప్టెంబర్ 20, 2023 చంద్రబాబు అరెస్ట్‌పై టిడిపి ఎమ్మెల్యేల భేటీ ► బాబు అరెస్ట్‌పై తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో చర్చ ► అచ్చెం నాయుడు అధ్యక్షతన సమావేశం, జూమ్ ద్వారా లోకేష్ జాయిన్ ► అసెంబ్లీకి హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై మల్లగుల్లాలు ► అసెంబ్లీలో ప్రస్తావిస్తే మంచిదంటున్న కొందరు నేతలు ► అసెంబ్లీకి వెళ్లకుండా నిరసన తెలపాలంటున్న మరికొందరు ► ఢిల్లీ నుంచి లోకేష్ ఎప్పుడొస్తారని అడిగిన ఎమ్మెల్యేలు 12:01 PM, సెప్టెంబర్ 20, 2023 హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు అయ్యన్న ► కృష్ణాజిల్లా : హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు వచ్చిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ► లోకేష్ యువగళం బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అయ్యన్నపై అభియోగాలు ► ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న అయ్యన్నపాత్రుడు ► అయ్యన్నపాత్రుడి పై ఉంగుటూరు మండలం ఆత్కూరు పోలీస్ స్టేషన్లో YSRCP ఫిర్యాదు ► అయ్యన్నపాత్రుడికి ఇప్పటికే 41 నోటీసులిచ్చిన పోలీసులు ► పోలీసులకు వివరణ ఇచ్చేందుకు హనుమాన్ జంక్షన్ స్టేషన్‌కు వచ్చిన అయ్యన్నపాత్రుడు 12:00 PM, సెప్టెంబర్ 20, 2023 CID తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ► కస్టడీ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు సమయం కోరిన సీఐడీ ► ఏఏజీ పొన్నవోలును ఒంటి గంటకు హాజరు కావాలని సూచించిన కోర్టు ► 2.15 నిమిషాల వరకూ సమయం అడిగిన సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద ► పొన్నవోలు రాలేని పక్షంలో తానే వాదనలు వినిపిస్తానని తెలిపిన వివేకానంద 11:50 AM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్ కోసం కసరత్తులు ► ACB కోర్టుకు చేరుకున్న బాబు లాయర్ల బృందం ► సిద్ధార్థ్ అగర్వాల్ నేతృత్వంలో టిడిపి లాయర్లు ► ముందుగా ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ విచారణ ► ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ ► పీటీ వారెంట్ల విచారణ ఇప్పుడు ముఖ్యం కాదన్న ఏసీబీ 11:35 AM, సెప్టెంబర్ 20, 2023 కస్టడీ పిటిషన్ @ 1pm ► ACB కోర్టు ముందుకు చంద్రబాబు కస్టడీ పిటిషన్ ► చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన CID ► ఇవ్వాళ మధ్యాహ్నం ఒంటిగంటకు వాదనలు వింటామన్న ACB కోర్టు ► ముందు కస్టడీ పిటిషన్, ఆ తర్వాత బెయిల్ పిటిషన్‌పై వాదనలు ► ఇప్పటివరకు క్వాష్ పిటిషన్‌పై ఆశలు పెట్టుకున్న టిడిపి లీగల్ సెల్ ► క్వాష్ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో ముగిసిన వాదనలు ► క్వాష్ పిటిషన్ తీర్పు వరకు ఆగేకంటే బెయిల్ కోసం మరో ప్రయత్నం ► స్కిల్ కేసు బెయిల్ ఉండగానే, మరో కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ 11:15 AM, సెప్టెంబర్ 20, 2023 తారాస్థాయికి చేరిన ఎల్లోమీడియా విషప్రచారం ► చంద్రబాబు జైలులో ఉండడంతో విషాన్ని చిమ్ముతున్న పచ్చమీడియా ► చంద్రబాబుకు దోమలతో స్లో పాయిజన్ ఇచ్చే ప్రమాదముందని స్పెషల్ డ్రైవ్‌లు ► నవ్విపోదురు గాక.. నాకేంటీ అన్న చందాన బాధ్యతారహిత వార్తలు ► మొదట సానుభూతి కోసం ప్రయత్నం, ఆ తర్వాత కుట్ర అంటూ గగ్గోలు ► చంద్రబాబుకు మార్నింగ్‌వాక్‌లో చప్పట్లతో స్వాగతం పలుకుతున్నారన్న ఎల్లో మీడియా ► వేడి నీళ్లు, దోమలు, ఏసీ, టీవీ ఛానళ్లు.. ఇష్టానుసారంగా సాగుతున్న దుష్ప్రచారం 11:00 AM, సెప్టెంబర్ 20, 2023 ఆలూ లేదు చూలు లేదు.. అల్లుడి పేరు..! ► పుకార్లను జనంలో నింపేందుకు ఎల్లో మీడియా టాప్ స్టోరీలు ► లోకేష్‌ను అరెస్ట్ చేసేస్తారు కాబట్టి పార్టీ ప్రచారానికి బ్రాహ్మణి సిద్ధం కావాలని స్పెషల్ స్టోరీలు ► బాలకృష్ణ విషయంలో పచ్చమీడియా వ్యూహాత్మకంగా నెగెటివ్ క్యాంపెయిన్ ► నాయకత్వ లక్షణాలు లేవని, అల్లుడి కోసం త్యాగం చేయాలని హితవులు ► పార్టీ పగ్గాలు నారా వంశం చేతిలోనే ఉండాలని తెగ ఆరాటపడుతోన్న పచ్చమీడియా ► నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు, నేడు ఎన్టీఆర్ వంశానికి వెన్నుపోటా.? 10:15 AM, సెప్టెంబర్ 20, 2023 కిం కర్తవ్యం.? లాయర్లతో బాబు వరుస భేటీలు ► రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన అడ్వకేట్ లక్ష్మీనారాయణ ► తన కేసుల జాబితా, ఆయా కేసుల్లో తన పాత్ర, దానికి సంబంధించిన ఆధారాలపై చర్చ ► వేర్వేరు కేసుల్లో సాంకేతికంగా ఏ వాదన వినిపించవచ్చన్న దానిపై లాయర్‌తో చర్చ ► జైల్లో వరుసగా లాయర్లను కలుస్తోన్న చంద్రబాబు ► ఇటీవలే సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాతోనూ చర్చలు 9:50 AM, సెప్టెంబర్ 20, 2023 హైకోర్టు ముందు అంగళ్లు అల్లర్ల కేసు ► అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ ► పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు వాదనలు జరిగే అవకాశం ► నీటి ప్రాజెక్టుల సందర్శన పేరిట కార్యకర్తలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించిన చంద్రబాబు & కో ► టిడిపి కార్యకర్తల దాడిలో పలువురికి పోలీసులకు తీవ్ర గాయాలు ► వైఎస్సార్సిపి కార్యకర్తలపై రాజకీయ కక్షతో దాడులకు దిగిన టిడిపి కార్యకర్తలు ► ముందస్తు వ్యూహంతో దాడులకు పాల్పడిన టిడిపి కార్యకర్తలు ► అంగళ్లుకు రాకముందే పక్కాగా గొడవకు కుట్ర చేసినట్టు ఆధారాలు ► టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు 9:15 AM, సెప్టెంబర్ 20, 2023 లోకేష్‌లో భయం, రాజమండ్రికి టిడిపి బృందం ► లోకేష్‌ను అరెస్ట్ చేస్తారంటూ గత మూడు రోజులుగా ఎల్లో మీడియా ప్రచారం ► ఎల్లో మీడియా ప్రచారం ఆధారంగా తెలుగుదేశం సోషల్ మీడియా ప్రచారం ► లోకేష్ ఢిల్లీ నుంచి రాజమండ్రి రాగానే అరెస్ట్ అవుతాడంటూ పచ్చ మీడియాలో వార్తలు ► టిడిపి క్యాంపెయిన్‌తో రాజమండ్రికి భారీగా వస్తోన్న యువగళం బృందం ► ఇప్పటికే రాజమండ్రిలోని హోటళ్లు, లాడ్జీల్లో బస చేసిన యువగళం బృందం ► రాజమహేంద్రవరంలో పెరిగిన టిడిపి నేతల కదలికలను గమనిస్తోన్న పోలీసులు ► సున్నితమైన ప్రాంతంలో భారీగా సమీకరణ సరికాదని తెలిసినా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోన్న టిడిపి 8:15 AM, సెప్టెంబర్ 20, 2023 ACB కోర్టు ముందుకు చంద్రబాబు బెయిల్ పిటిషన్ ► చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపనున్న కోర్టు ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ సమర్పించనున్న CID ► వాదనల అనంతరం నిర్ణయం తీసుకోనున్న న్యాయమూర్తి 7:50 AM, సెప్టెంబర్ 20, 2023 ACB కోర్టులో నేడు కస్టడీ పిటిషన్ విచారణ ► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ ► కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు లాయర్లకు కోర్టు సూచన ► ఇవ్వాళ చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం 7:15 AM, సెప్టెంబర్ 20, 2023 అత్యంత భద్రత నడుమ చంద్రబాబు. ►పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు జైలు జీవితం. ►అత్యంత భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ►యథావిధిగా చంద్రబాబు రోజువారీ కార్యకలాపాలు. ►ఇంటి నుంచే చంద్రబాబుకు ఆహారం, మందులు పంపిణీ ►ఈ వారంలో కుటుంబ సభ్యులతో ముగిసిన ఒక ములాఖత్ ►రాజమండ్రిలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి 7.10 AM, సెప్టెంబర్ 20, 2023 నేడు టీడీపీ శాసనసభాపక్ష సమావేశం ►ఈరోజు ఉదయం 10.30 గంటలకి టీడీపీ శాసనసభాపక్ష సమావేశం. ►అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరగనున్న సమావేశం? ►అసెంబ్లీ సమావేశాలు, చంద్రబాబు అరెస్టు పరిణామాలపై చర్చ. 7.00 AM, సెప్టెంబర్ 20, 2023 నేడు బెయిల్ పిటిషన్లపై విచారణ ►నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపై విచారణ. ►చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్‌పై విచారణ. ►నేడు కౌంటర్ దాఖలు చేయనున్న సీఐడీ అధికారులు. ►చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీకోర్టులో విచారణ చంద్రబాబు @ A25 ► విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID ► ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో ►ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందిలా.. ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID. -
తల్లిని సజీవదహనం చేసిన తనయుడు
కంబదూరు: నవమాసాలు మోసి.. జన్మనిచ్చి.. కంటికి రెప్పలా కాపాడి.. పెంచి పెద్ద చేసిన కన్నతల్లినే ఓ కుమారుడు పెట్రోల్ పోసి సజీవదహనం చేశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కంబదూరులో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కంబదూరులోని ఓబయ్య కాలనీకి చెందిన ఈడిగ గోపీనాథ్, సుజాతమ్మ(59) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలు ఇద్దరికీ పెళ్లిళ్లు కావడంతోపాటు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇంటర్ చదివిన కుమారుడు ప్రణీత్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను ఉద్యోగం మానేసి స్వగ్రామం చేరుకున్నాడు. రోజూ మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను హింసించేవాడు. సోమవారం కూడా మద్యం తాగడానికి డబ్బు ఇవ్వాలని అనారోగ్యంతో మంచంలో పడుకుని ఉన్న తల్లి సుజాతమ్మను అడిగాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కలవారు మంటలను గమనించి సుజాతమ్మ భర్త గోపీనాథ్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చేలోపే పూర్తిగా కాలిపోయిన సుజాతమ్మ మృతి చెందింది. ఘటనాస్థలాన్ని కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితుడు ప్రణీత్‌ను అరెస్ట్ చేశారు. -
పోలీసులపై టీడీపీ గూండాల దాడి
నరసరావుపేట టౌన్: పోలీసులపై మరోసారి టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం నరసరావుపేట ప్రకాశ్‌నగర్‌లో డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావుకు చెందిన వైద్యశాల ప్రాంగణంలో హోమం చేపట్టారు. ఒక్కసారిగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ అరవిందబాబు, కడియాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు హోమం జరుగుతున్న స్థలం నుంచి మెయిన్‌రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వైపునకు వచ్చేందుకు ప్రయత్నించారు. అక్కడ విధుల్లో ఉన్న సీఐ అశోక్‌కుమార్, సిబ్బంది అడ్డుకుని అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించవద్దని కోరారు. టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి పోలీసుల చొక్కాలు పట్టుకుని నెట్టివేశారు. దీంతో కిందపడిన స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బందితోపాటు వన్‌టౌన్ ఏఎస్ఐ మీరావలికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులను నెట్టివేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసుకూంటూ ర్యాలీగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపైకి చేరారు. అక్కడ నిలువరించేందుకు ప్రయత్నించిన స్పెషల్ పార్టీ పోలీసులపైనా దాడికి పాల్పడ్డారు. అనుమతి లేకుండా టీడీపీ చేపట్టిన ర్యాలీ కారణంగా ఆర్టీసీ బస్టాండ్, మల్లమ్మ సెంటర్, ఓవర్ బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు దాడికి పాల్పడిన 20 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసరావుపేట వన్‌టౌన్ సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. -
పండగ పూట విషాదం
శ్రీకాకుళం: పండగ పూట ఆ కుటుంబంలో విషాదం అలముకుంది. వినాయక చవితి వైభవంగా నిర్వహించుకుందామని భార్యకు చెప్పి వెళ్లిన భర్త మార్గం మధ్యలో బైక్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. విశాఖలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేర కు ఆనందపురం పంచాయతీ ఆబోతులపేట గ్రామానికి చెందిన కీస రవి(27) వినాయక చవితి సామాన్లు కొనుగోలు చేయడానికి ఆదివారం రాత్రి పొందూరు వెళ్లి తిరిగి ఆబోతులపేట గ్రామానికి వస్తుండగా.. ఆనందపురం, వాండ్రంగి గ్రామ సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద మరో బైక్ రవి బైక్‌ను ఢీకొట్టింది. ఘటనలో రవి తీవ్రంగా గాయపడ్డాడు. మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని శ్రీకాకుళంలోని కిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి విశాఖ పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి సోమవారం కన్నుమూశాడు. రవి వెనుక కూర్చున్న సోమరాజుల కృష్ణ కిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అలాగే పొందూరుకు చెందిన స్వరూప సాయి, హరి సాయి, పేడాడ దామోదరరావు రాజాం కేర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. మృతుడికి భార్య స్వామి, తొమ్మిది నెలల బాబు ఉన్నారు. పండగ వేళ ఇంతటి విషాదం జరగడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సామంతుల రామారావు తెలిపారు. -
రితీ సాహా మృతిపై వైద్యుల కమిటీ విచారణ
మహారాణిపేట : ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థిని రితీ సాహా కేసుకు సంబంధించి కేజీహెచ్‌లో విచారణ మొదలైంది. అయిదుగురు వైద్యులతో కూడిన విచారణ కమిటీ మంగళవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. పలువురి నుంచి వివరాలు సేకరించిన కమిటీ మరోసారి విచారణ చేయాలని నిర్ణయించింది. నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన రితీ సాహా జూలై 14వ తేదీన ఆ కళాశాల అవుట్సోర్సింగ్ ద్వారా నిర్వహిస్తున్న సాధన హాస్టల్ భవనంపై నుంచి పడి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆమెకు ముందుగా వెంకటరామ ఆస్పత్రిలోను, తరువాత కేర్ ఆస్పత్రికి చికిత్స అందించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మరణించిందని మృతురాలి తండ్రి డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ పి.అశోక్‌కుమార్‌కు డీఎంహెచ్‌వో సూచించడంతో కేజీహెచ్ న్యూరో మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ బి.హయగ్రీవరావు, జనరల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ వి.సత్యప్రసాద్, అనస్థీషియా ప్రొఫెసర్ డాక్టర్ వి.రవి, కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మణిత, ఆర్థోపెడిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి.రజనీ కుమార్‌లతో విచారణ కమిటీ వేశారు. మంగళవారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో నిర్వహించిన కమిటీ విచారణకు రితీ సాహా తల్లిదండ్రులు, చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు, ల్యాబ్ సిబ్బంది, నిర్వాహకులు హాజరయ్యారు. అన్ని రికార్డులు, రిజిస్టర్లతో పాటు సీటీ ఫిల్మ్ అండ్ రిపోర్ట్, ఎక్స్ రే ఛాతి ఫిల్మ్, రిపోర్ట్, సీటీ బ్రెయిన్ రిపోర్ట్, డెత్ కేసుకు సంబంధించిన ఇతర నివేదికలు విచారణ కమిటీకి సమర్పించారు. -
వివాహేతర సంబంధం.. భర్త చెంపపై భార్య కొట్టడంతో భర్త మృతి
తూర్పు గోదావరి: పండగ వేళ పాశర్లపూడి బాడవలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఘర్షణలో భార్య చేతిలో భర్త హత్యకు గురయ్యాడు. వివరాలివీ.. పాశర్లపూడి బాడవ పల్లవపాలేనికి చెందిన కొల్లు సాయికుమార్ (24).. అదే గ్రామానికి చెందిన యువతిని ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. సాయికుమార్ ఇళ్ల సీలింగ్ పనులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. అతడి భార్య.. అదే గ్రామానికి చెందిన కొల్లు వెంకటేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇదే విధంగా ఈ నెల 17వ తేదీ రాత్రి ఇద్దరి మధ్యా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సాయికుమార్ చెంపపై భార్య గట్టిగా కొట్టడంతో అతడు మృతి చెందాడు. ఈ మేరకు హతుని తండ్రి కొల్లు వీరపండు నగరం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై పి.గన్నవరం సీఐ ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యాన నగరం ఎస్సై పి.సురేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. సాయికుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
Babu Case : గవర్నర్ అనుమతి చుట్టే బాబు లాయర్ల పట్టు
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన చంద్రబాబు నాయుడు.. క్వాష్ పిటిషన్‌కు అనర్హుడని సీఐడీ తరపు న్యాయవాదులు మంగళవారం ఏపీ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదని.. రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారని తెలిపారు న్యాయవాదులు. కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టును కోరారు. ► 2018 జూన్ 5వ తేదీనే ప్రాథమిక విచారణ ప్రారంభమైంది.ఐపీసీ ప్రకారం నేరం కనిపిస్తున్నప్పుడు.. గవర్నర్ నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేదని ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది. 2015లోనే ఈ స్కాంకు సంబంధించి ప్రశ్నలు తలెత్తాయి. ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు అని హైకోర్టు ముందు వాదించారాయన. ► పథకం ప్రకారం కుంభకోణం జరిగింది. ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. షెల్ కంపెనీల కోసమే డబ్బు విడుదల చేశారు. ఎంవోయూలో సబ్‌కాంట్రాక్టుల అంశం ప్రస్తావనే లేదు. చంద్రబాబు నాయకత్వంలో నెమ్మదిగా మానిప్యులేషన్ చేశారు. ఆరు షెల్ కంపెనీలకు డబ్బు తరలించారు. ప్రభుత్వం ముందుగా డబ్బు ఇవ్వడం ఎప్పుడూ ఉండదు. మొదటి నుంచి కూడా ఇదొక బొమ్మ మాదిరిగా జరిగింది. కక్ష సాధింపు అనుకుంటే చంద్రబాబును ఏనాడో అరెస్ట్ చేసేవారు.ఏపీ ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తోంది. ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం. అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. . ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు. చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది. దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. పోలీసులపైనే నిందలు మోపుతున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► 2021కు ముందు చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టకుండానే కంపెనీలకు రూ.300 కోట్లు విడుదల చేశారు. అవినీతి చేసిన వారు సెక్షన్ 17ఏ పేరుతో తప్పించుకోలేరు. సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. కాబట్టి.. పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి. సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి అని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
Live: చంద్రబాబు కేసు అప్డేట్స్.. Click & Refresh
Updates.. 08:52PM, సెప్టెంబర్ 19, 2023 సీఐడీ కౌంటర్ దాఖలు ► విజయవాడ: చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సీఐడీ కౌంటర్ ► బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా 06:50PM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు @ A25 ► విజయవాడ : ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID ► ఫైబర్ నెట్ కుంభకోణంలో 25వ నిందితుడిగా చంద్రబాబు పేరు చేరుస్తూ మెమో ►ఫైబర్ నెట్‌పై వేసిన పిటి వారెంట్‌కు అనుబంధంగా మెమో దాఖలు 06:00PM, సెప్టెంబర్ 19, 2023 ఫైబర్ గ్రిడ్ కుంభకోణం జరిగిందిలా.. ► గతంలో ఏపీ సివిల్ సప్లైస్‌కు సర్వీసులు అందించిన టెర్రాసాఫ్ట్ కంపెనీ ► నాసిరకం ఈ- పోస్ మిషన్లు పంపిణీ చేసినందుకు టెర్రా సాఫ్ట్‌ను నాడు బ్లాక్ లిస్టులో పెట్టిన ప్రభుత్వం ► అయినా టెర్రాసాఫ్ట్‌పై అంతులేని ప్రేమ కురిపించిన చంద్రబాబు సర్కారు ► టెర్రాసాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు నాడు చంద్రబాబు సర్కారు అవకతవకలు ► బ్లాక్‌లిస్ట్‌లో టెర్రాసాఫ్ట్‌ను రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే తప్పించిన వైనం ► బ్లాక్ లిస్ట్ లో పెట్టిన 2 నెలలకే టెర్రాసాఫ్ట్‌ను లిస్ట్ నుంచి తొలగించిన అప్పటి సివిల్ సప్లైస్ డైరక్టర్ రవిబాబు ► హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీతో జట్టు కట్టి ప్రాజెక్టు దక్కించుకున్న టెర్రాసాఫ్ట్ ► టెండర్లు దక్కించుకున్న తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ కంపెనీని నిబంధనలకి విరుద్దంగా బయటకి పంపిన టెర్రాసాఫ్ట్ ► ఇప్పటికే హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనీల్ జైన్ స్టేట్ మెంట్ రికార్డు చేసిన CID ► తమని మోసం చేసినట్టు వాంగ్మూలమిచ్చిన హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ VP అనీల్ జైన్ ► నిబంధనలకి విరుద్దంగా మరొక కంపెనీ నుంచి రూ.115 కోట్ల నాసిరకం మెటీరియల్‌ను కొనుగోలు చేసి ఫైబర్ నెట్‌కు సరఫరా చేసిన టెర్రా సాఫ్ట్ ► చంద్రబాబు సూచనల మేరకే టెర్రాసాఫ్ట్ వ్యవహరం మలుపులు తిరిగిందని తేల్చిన CID 05:40PM, సెప్టెంబర్ 19, 2023 ACB కోర్టులో చంద్రబాబుపై మరో కేసులో PT వారంట్ ► చంద్రబాబుపై మరో పిటి వారెంట్ దాఖలు, ఫైల్ నంబర్ 2916/2023 ► ఫైబర్‌నెట్ కుంభకోణంలో చంద్రబాబు ప్రదాన ముద్దాయిగా పిటి వారెంట్ ► రూ.115 కోట్ల నిధులు గోల్ మాల్ అయ్యాయని దర్యాప్తులో తేల్చిన సిట్ ► 2021 లోనే ఫైబర్ నెట్ కుంభకోణంలో 19 మందిపై సిఐడి కేసు నమోదు ► నాటి FIRలో A1గా వేమూరి హరిప్రసాద్, A2గా మాజీ MD సాంబశివరావు ► చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు వేమూరి హరిప్రసాద్ 05:12PM, సెప్టెంబర్ 19, 2023 ACB కేసులో విచారణ రేపటికి వాయిదా ► CID కస్టడీ పిటిషన్‌పై సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు కొనసాగుతున్న దృష్ట్యా కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలన్న చంద్రబాబు లాయర్లు ► రేపటి వరకు సమయం అడిగిన చంద్రబాబు లాయర్లు, సరేనన్న ACB కోర్టు ► CID వేసిన చంద్రబాబు కస్టడీ పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా 05:00PM, సెప్టెంబర్ 19, 2023 వాదనలు ముగిసాయి, 2 రోజుల్లో తీర్పు : హైకోర్టు ► ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి ► ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోనివ్వండి ► రెండు రోజుల్లో ఈ పిటిషన్‌పై తీర్పు ఇస్తాం 04:50PM, సెప్టెంబర్ 19, 2023 చివరిగా మరోసారి మా విజ్ఞప్తి వినండి : బాబు లాయర్ లూథ్రా ► చంద్రబాబును ఈ కేసులో A1 అంటున్నారు ► నిధులు విడుదల చేసిన వ్యక్తే అసెంబ్లీలో ప్రకటన చేశారు ► నిజంగా తప్పు చేసి ఉంటే, లేదా కుంభకోణం కుట్ర ఉంటే సభలో ఎందుకు ప్రకటన చేస్తారు? ► సెక్షన్ 17A సవరణ ఈ కేసుకు వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు ► ఈ కేసును రఫెల్ కేసుతో పోల్చవచ్చు. ఆ కేసులో జస్టిస్ జోసెఫ్ ఇచ్చిన ఆదేశాలను గుర్తు చేసుకోవాలి ► మా వాదన అంతా 17A చుట్టే ఉంది. CID వాదనల్లో 90%, 10% అన్న దగ్గర కన్ఫ్యూజన్ ఉంది ► సీమెన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఈ మెయిల్‌కు రిమాండ్ రిపోర్ట్‌కు తేడా ఉంది 04:45PM, సెప్టెంబర్ 19, 2023 ఈ కేసును ఇవ్వాళే ముగిస్తాం : హైకోర్టు ► ఈ కేసులో ఇంకేదైనా చెప్పుకోవాలంటే ఇప్పుడే అవకాశం ఇస్తున్నాం ► ఉదయం నుంచి ఇప్పటిదాకా ఇదే కేసులో వాదనలు విన్నాం ► ఈ కేసులో స్పష్టత వచ్చింది. చివరి అవకాశం ఇస్తున్నాం 04:35PM, సెప్టెంబర్ 19, 2023 బాబు లాయర్లు ఇచ్చినవి సరైన రిఫరెన్స్‌లు కావు.! : CID లాయర్లు ► ఈ కేసులో బాబు లాయర్లు అర్నబ్ గోస్వామి కేసును ఉదహరించారు ► అర్నబ్ గోస్వామిది వాక్ స్వాతంత్ర హక్కుకు సంబంధించినది ► ఆ కేసుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు ► ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి పథకం ప్రకారం జరిగింది ► సెక్షన్482 పిటిషన్లపై నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది ► అరెస్టు చేయకూడదంటూ హైకోర్టులు ప్రతీసారి జోక్యం చేసుకోవద్దంటూ నిహారిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసులో సుప్రీం తీర్పునిచ్చింది ► పోలీసులకు పూర్తి విచారణ చేసుకునే వెసులుబాటు కల్పించాలి ► ఈ కేసులో విచారణ ఇప్పుడే ప్రారంభమైంది… ఈడీ, ఇన్‌కంటాక్స్ కూడా విచారిస్తున్నాయి. దీనిని కోర్టు పరిగణలోకి తీసుకోవాలి 04:32PM, సెప్టెంబర్ 19, 2023 CID వాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయి : బాబు లాయర్ సాల్వే ► ఈ ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నరేళ్లు పూర్తయ్యాయి ► ఈ ప్రభుత్వం ఇప్పుడు పైల్స్ కనిపించడం లేదని, అవి చంద్రబాబు మాయం చేశారని ఆరోపిస్తున్నారు ► 2018లోనే ఫిర్యాదు వచ్చిందన్న వాదనను మేం ఒప్పుకోం ► 2021లో నమోదయిన ఫిర్యాదునే కోర్టు పరిగణించాలి 04:32PM, సెప్టెంబర్ 19, 2023 సెక్షన్ 17A సవరణ ఈ కేసులో వర్తించదు : CID లాయర్ ► ఈ కేసులో ప్రాథమిక విచారణ జూన్ 5, 2018న జరిగింది : పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► అంటే 2018లో సెక్షన్ 17A సవరణకు ముందే ఇది పూర్తయింది ► 2015 నుంచే స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై ఆరోపణలున్నాయి ► ఒక సెక్షన్‌కు సంబంధించిన సవరణ కోసం దర్యాప్తు ఆగదు ► ఈ కేసులో శుక్రవారం కౌంటర్ ఫైల్ చేయగలం 04:25PM, సెప్టెంబర్ 19, 2023 సెక్షన్ 17A గురించి చర్చిద్దాం : బాబు లాయర్ హరీష్ సాల్వే ► CID లాయర్ వాదిస్తుండగా.. జోక్యం చేసుకున్న సాల్వే ► కేసు పెట్టింది 2020లో కాబట్టి 2018లో చేసిన సవరణ వర్తిస్తుంది ► సీమెన్స్ గుజరాత్లో కూడా ప్రాజెక్టు చేపట్టింది ► గుజరాత్లో ఎలా జరిగిందో.. ఏపీలో కూడా చంద్రబాబు అలాగే నిర్వహించారు ► ప్రభుత్వం కోరినట్టు ప్రాజెక్టు పూర్తయింది ► ఇక్కడ తప్పు ఎక్కడ జరిగి ఉండొచ్చంటే.. పన్ను ఎగ్గొట్టడానికి డిజైన్ టెక్ చేసిన ప్రయత్నంలో చంద్రబాబును ఇరికించారు ► 2024లో ఏపీ శాసనసభకు, లోక్‌సభకు ఎన్నికలున్నాయి ► చంద్రబాబును లోపల పెట్టడమన్నది రాజకీయ కక్ష కాకుంటే మరొకటని భావించలేం ► ఒక వేళ చంద్రబాబు విదేశాలకు పారిపోయి ఉంటే.. దాన్ని ఈ ప్రభుత్వం సంతోషంగా అనుమతించేది 04:20PM, సెప్టెంబర్ 19, 2023 క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టేయాలంటే... : CID లాయర్ ► NCT ఢిల్లీ X ప్రీతీ సరఫ్ కేసును ప్రస్తావించిన CID లాయర్ ► సాంకేతిక కారణాలు చూపించి క్వాష్ కొట్టేయడం సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది ► సెక్షన్ CrPC 482 ప్రకారం దర్యాప్తు అధికారులను విచారణ పూర్తి చేసుకోనివ్వాలి 04:10PM, సెప్టెంబర్ 19, 2023 స్కిల్ డెవలప్ స్కాంలో ఎప్పుడు ఏం జరిగిందంటే.. కోర్టుకు వివరించిన CID లాయర్ రంజిత్ ►నిందితులకు ఆదాయపుపన్నుశాఖ నోటీసులు జారీచేసింది ► స్కిల్ స్కాంపై ఆదాయంపన్ను శాఖ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది ► వాళ్ల మోడస్ ఆపరండీని మొత్తం ఇన్‌కంటాక్స్ పసిగట్టింది ► రూ.200 కోట్ల మేర నిధులను మళ్లించినట్టుగా IT తన ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తించింది ► స్కిల్ డెవలప్మెంట్ కోసం నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్లో ఎలాంటి తేదీ కూడా లేదు ► ఒప్పందం చేసుకున్న వెంటనే డిజైన్ టెక్ స్కిల్లర్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది ► ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకుండానే ఈ కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు ► స్కిలర్ నుంచి రూ.178 కోట్లు కొనుగోలు చేసినట్టుగా డిజైన్‌టెక్ చూపింది ► ఒప్పదంలోకాని, ప్రతిపాదనలోకాని ఎలాంటి తేదీ కూడా లేదు ► డాక్యుమెంట్లలో ఎలాంటి తేదీలు కూడా లేవు, ఇది ఉద్దేశపూర్వకంగా విస్మరించారు ► ప్రభుత్వం ఉత్తర్వుల్లో కానీ, MOUల్లో ఎలాంటి స్థిరత్వం లేదు ► సంతకాలకు ముందే ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా 164 స్టేట్మెంట్లో నిందితులు అంగీకరించారు 04:00PM, సెప్టెంబర్ 19, 2023 ఇది పక్కా కుంభకోణమే, చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి : CID లాయర్లు ► నేరం జరిగినప్పుడు తాను ముఖ్యమంత్రిని కాబట్టి ఇది రాజకీయ కక్ష్య అని చంద్రబాబు అంటున్నారు. ► విచారణ పూర్తై అధికారులు నివేదిక సమర్పించిన తరువాతే కోర్టు జోక్యం చేసుకోవాలి. ► FIRలో తన పేరులేదు కాబట్టి అరెస్టు చేయకూడదని చెప్పడం తప్పు ► FIR సర్వస్వం కాదు కోర్టులో కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా పేరు చేర్చవచ్చు. ► ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో వ్యవహరించింది… అందుకే 2021లో చంద్రబాబు పేరును ఎఫ్ఐఆర్లో చేర్చలేదు ► ప్రైవేటు కంపెనీలు ఒక్క రూపాయి ఇవ్వకుండానే ప్రభుత్వానికి చెందిన 300కోట్లు రిలీజ్ చేశారు ► ముందుగానే ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయడం అనేది ఎక్కడా ఉండదు. ► చంద్రబాబు ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరిగింది.. షెల్ కంపెనీలకు సైతం చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి 03:48PM, సెప్టెంబర్ 19, 2023 కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే అరెస్ట్ జరగలేదు: CID లాయర్లు ► దర్యాప్తు బృందంపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, వీళ్లంతా శిక్షణ పొందిన అధికారులు. ఆరోపించేవాళ్లు ముందు ఈ విషయం గుర్తించాలి. ► సీమెన్స్ కంపెనీతో జరిపిన మెయిల్ సంభాషణలు మా దగ్గర ఉన్నాయి. ► చంద్రబాబు సెక్రటరీకి ఈడీ, ఐటీ నోటీసులు ఇచ్చాయి. ఆయన దేశం విడిచి అమెరికాకు పారిపోయారు. ► సీమెన్స్‌కు నిందితుడు సుబ్బారావు, గంటా ఈమెయిల్స్ పంపారు.. అప్పటి ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కూడా ఇందులో బాగం అయ్యారు. ► కేవలం ఎఫ్ఐఆర్ ఆధారంగానే చంద్రబాబు అరెస్ట్ జరగలేదు. 03:23PM, సెప్టెంబర్ 19, 2023 పోలీసులపై నిందలు మోపుతారా? : CID లాయర్లు ►ఈ కేసు ప్రారంభ దశలోనే ఉంది. బెయిల్ దరఖాస్తు చేసుకున్న దరిమిలా.. 10 రోజుల్లో దర్యాప్తు పూర్తి కాదు. ►ప్రభుత్వం ప్రతీకారమే తీర్చుకోవాలనుకుంటే.. ఈ పెద్దమనిషి (చంద్రబాబు నాయుడు) ఏనాడో అరెస్టు అయ్యేవారు కదా. ►సెక్షన్ 17A ప్రజా ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకున్న అమాయక సేవకులను (innocent servants) రక్షించడం కోసం మాత్రమే. ►శంభూ నాథ్ మిశ్రా కేసును ఉదహరిస్తూ.. ‘‘రికార్డులను రూపొందించడం, నిధుల్ని దుర్వినియోగం చేయడం అధికారిక విధి కాదు." ►కేసు దర్యాప్తు దశలోనే ఉంది. ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. ఈడీ దర్యాప్తు చేస్తోంది. ►నేను సీఎంను(మాజీ) కాబట్టే.. అనే అంశం ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇది రాజకీయమైంది ►ఎంవోయూలో సబ్ కాంట్రాక్ట్ ప్రస్తావనే లేదు. ఎలాంటి సేవలు అందించకుండానే షెల్ కంపెనీలకు నిధులు వెళ్లాయి. ► రూ. 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది ► షెల్ కంపెనీల జాడ తీస్తున్నాం ► నిబంధనలకు వ్యతిరేకంగా ఎంవోయూ నుంచి సబ్ కాంట్రాక్టుకు ఎలా వెళ్లింది? ► అన్ని బోగస్ కంపెనీలు కలిపి ప్రజాధనాన్ని లూటీ చేశాయి. ► ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది ► ఈ డీల్‌కు కేబినెట్ ఆమోదం లేదు ► చంద్రబాబు పథకం ప్రకారమే తన అనుచరులతో కలిసి బోగస్ కంపెనీల పేరుతో రూ.371 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ►మార్గదర్శకాలను కూడా కోర్టు అనుసరించాలి. విచారణ పూర్తయ్యే దాకా ఆగాలి. దర్యాప్తు సంస్థను నివేదిక సమర్పించేదాకా వేచి చూడాలి. మెరిట్స్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేదు ఇక్కడ. 02:55PM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు క్వాష్పిటిషన్కు అనర్హుడు : CID తరపు లాయర్లు ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడు ► ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే చంద్రబాబును అరెస్ట్ చేయలేదు. ► రెండేళ్లు అన్ని సాక్ష్యాలు సేకరించాకే అరెస్ట్ చేశారు. ► పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇచ్చి.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి ► సెక్షన్ 319 ప్రకారం ఎన్ని ఛార్జిషీట్లు అయినా వేయొచ్చు.. ఎంత మంది సాక్ష్యులను అయినా చేర్చొచ్చు. 02:38PM, సెప్టెంబర్ 19, 2023 సీఐడీ తరపున వాదనలు ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ► గణపతి వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు తో పాటు శంభునాథ్ మిశ్రా కేసు లో తీర్పుల్ని వివరిస్తున్న ముకుల్ రోహత్గీ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు అనర్హుడంటూ వాదనలు ► ఈ దశలో నిందితుడికి అనుకూలంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని హైకోర్టుకు విజ్ఞప్తి 02:25PM, సెప్టెంబర్ 19, 2023 లంచ్ విరామం తర్వాత మొదలైన కోర్టు ►లంచ్ తర్వాత మొదలైన హైకోర్టు ► క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు 1:58 PM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టుకు లంచ్ బ్రేక్.. ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ లంచ్ తర్వాతకు వాయిదా ►లంచ్ తర్వాత వాదనలు వినిపించనున్న చంద్రబాబు లాయర్లు 1:40 PM, సెప్టెంబర్ 19, 2023 స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు తరపున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు ► చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరుపై అభ్యంతరాలున్నాయి ► ఒక వేళ ఈ FIR 2018 సవరణ కంటే ముందు నమోదై ఉంటే అడిగేవాళ్లం కాదు ► కానీ FIR 2020లో నమోదయింది కాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి ► 2020లో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఇలాగే జరిగింది ► కర్ణాటక కేసును ఉదహరించిన లూథ్రా, 17Aలో ముందస్తు అనుమతి అవసరమని వాదన 1:30 PM, సెప్టెంబర్ 19, 2023 ► చంద్రబాబును అరెస్ట్‌పై కాంగ్రెస్ ప్రకటన ► చంద్రబాబును అరెస్ట్‌పై మాట్లాడిన మధుయాష్కీ ► చంద్రబాబును జైలుకు పంపడం వెనుక మోదీ, కేసీఆర్ ఉన్నారు ► కేసీఆర్ పాత్ర పై మాకు పూర్తిస్థాయి సమాచారం ఉంది ► ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పనిచేసినందుకే చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలు ► చంద్రబాబు అరెస్టు పై కేసీఆర్, కేటీఆర్ ఎందుకు స్పందించలేదు? : మధుయాష్కి 12:30 PM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బాబు తరపున హరీష్ సాల్వే వాదనలు ► చంద్రబాబు అరెస్టులో సరైన నియామవళి పాటించలేదు ► చంద్రబాబు అరెస్టులో గవర్నర్ అనుమతి తీసుకోలేదు ► ప్రీవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారం అరెస్ట్ చూపించారు ► దీని ప్రకారం పోలీసులు గవర్నర్ అనుమతి తర్వాతే అరెస్ట్ చేయాలి ► ఈ కేసులో 2020లో FIR నమోదయింది, అప్పుడు బాబు పేరు లేదు ► అరెస్ట్ చేసే సమయానికి బాబు పేరు FIRలో లేదు ► FIRలో పేరు ఉంటేనే అరెస్ట్ చేయాలి కాబట్టి ప్రోసీజర్ సరిగా ఫాలో కాలేదు ► ఎన్నికలు వచ్చాయి కాబట్టి రాజకీయ కక్షతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారు ► సీమెన్స్ కంపెనీ రాసిన మెయిల్ ఆధారంగా APSSDC ఛైర్మన్ ఫిర్యాదు చేశారు ► స్కిల్ డెవలప్మెంట్లో సేవలందించింది సీమెన్స్‌కు చెందిన ఉప కంపెనీనే ► ప్రభుత్వం బాధ్యత నిధులు విడుదల చేయడం, సేవలు పొందడం ► CID ఆరోపించినట్టు ఎక్కడా సాక్ష్యాలను తారుమారు చేయలేదు ► ఈ కేసులో చంద్రబాబు సహకరిస్తున్నా.. అరెస్ట్‌కు తొందరపడ్డారు ► ముగిసిన హరీష్ సాల్వే వాదనలు 12:20 PM, సెప్టెంబర్ 19, 2023 ► స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసును విచారిస్తోన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ► కేసు నుంచి చంద్రబాబు పేరును తొలగించాలని క్వాష్ పిటిషన్ ► చంద్రబాబు తరపున వర్చువల్‌లో (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా) హరీష్ సాల్వే వాదనలు ► చంద్రబాబు తరపున రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సిద్థార్థ లూథ్రా, హరీష్ సాల్వే, సిద్దార్థ్ అగర్వాల్ ► CID తరపున సుప్రీం న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు 12:09PM, సెప్టెంబర్ 19, 2023 ► హైకోర్టు ముందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం ► ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు లాయర్ల పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ స్కాం కేసును ఎల్లుండికి (ఈ నెల 21కి) వాయిదా వేసిన హైకోర్టు 11:30 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో మధ్యాహ్నం 12 తర్వాత రింగ్‌రోడ్డు కేసు విచారణ ► చంద్రబాబు రిమాండ్ పిటిషన్‌పై మధ్యాహ్నం 12 గంటలకు వాదనలు జరిగే అవకాశం ► సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే హాజరవుతారు, సమయం కావాలన్న బాబు లాయర్లు ► చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్ధనను అంగీకరించిన హైకోర్టు ► హరీష్ సాల్వే వల్ల జరిగిన ఆలస్యంపై CIDని అడిగిన హైకోర్టు ► తమకు అభ్యంతరం లేదని చెప్పిన ప్రభుత్వ న్యాయవాదులు 11:20 AM, సెప్టెంబర్ 19, 2023 పచ్చ మీడియా చెప్పని/చెప్పలేని అసలు నిజాలు ► అరెస్ట్ అక్రమమంటూ గొంతు చించుకుంటోన్న పచ్చమీడియా ► కేంద్ర సంస్థల నుంచి బాబుకు ఇప్పటివరకు వచ్చిన నోటీసులు ► కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి వచ్చిన ఏ ఒక్క నోటీసునూ బయటపెట్టని పచ్చ మీడియా Case - 1 ► ఆగష్టు 4న ఇన్‌కమ్‌టాక్స్ నుంచి చంద్రబాబుకు అందిన నోటీసు ► అమరావతి కాంట్రాక్టర్ల నుంచి 600 కోట్ల కాంట్రాక్టులో (సచివాలయం బిల్డింగ్) 119 కోట్లు (20 శాతం ) ముడుపులు ► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ చౌదరికి ఇచ్చానని చెప్పిన షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ► ఆ నోటీసు గురించి ఇప్పటివరకు నోరు మెదపని బాబు, ఎల్లో మీడియా Case - 2 ► స్కిల్ డెవలప్మెంట్తో మాకు సంబంధం లేదని లిఖితపూర్వకంగా పంపిన సీమెన్స్ ► అయినా సీమెన్స్ కంపెనీ, చాలా గొప్ప పని బాబు చేశారంటూ ఎల్లోమీడియా ప్రచారం ► టెండర్ లేకుండా తరలిపోయిన 371 కోట్ల గురించి అధికారులను అడగాలని తిరకాసు ► ఈ కేసులో నలుగురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్ట్ చేసిన విషయం రహస్యం.! ► బాబు పర్సనల్ సెక్రటరీ మరియు మనోజ్ విదేశాలకు పారిపోయిన విషయం అత్యంత గోప్యం Case - 3 ► ఫిబ్రవరి 17,2020న ప్రెస్ నోట్ విడుదల చేసిన ఆదాయంపన్ను శాఖ ► స్వయంగా విడుదల చేసిన ఐటీ శాఖ కమిషనర్ సురభి అహ్లువాలియా ► బాబు పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాసచౌదరి ఇంట్లో ఫిబ్రవరి 13 ,2020న తనిఖీలు ► ఐటీ అధికారులు సోదాల్లో 2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబందించి నల్లధన వివరాలు ► దీనికి సంబంధించి చంద్రబాబుకు ఇన్‌కంటాక్స్ నోటీసులు ► ఇప్పటివరకు నోటీసుల గురించి ఎక్కడా కోట్ చేయని పచ్చమీడియా 11:15 AM, సెప్టెంబర్ 19, 2023 అల్లర్లను నమ్ముకున్న తెలుగుదేశం టీం ► గుంటూరు, విశాఖ, విజయవాడలో రోడ్లపైకి టిడిపి నేతలు ► ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేస్తామంటూ ఏర్పాట్లు ► జన జీవనానికి ఇబ్బందులు వస్తాయని వద్దని చెప్పిన పోలీసులు ► పలు చోట్ల పోలీసులతో వాగ్వాదం, అల్లర్లు చేసేందుకు ప్రయత్నాలు ► గుంటూరులో తెలుగుదేశం ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ► నక్కా ఆనంద్ బాబు, డేగల ప్రభాకర్, నన్నపనేని రాజకుమారిని నిలువరించిన పోలీసులు ► పూజలు చేస్తామంటూ వేర్వేరు దారుల్లో గుళ్లకు వస్తోన్న టిడిపి నేతలు ► దుర్గగుడికి ఆటోలో వచ్చిన దేవినేని ఉమ, వినాయకుడి గుడి వద్ద ఉమను గమనించి నిలువరించిన పోలీసులు 11:00 AM, సెప్టెంబర్ 19, 2023 హైబ్రీడ్ మోడ్‌లో చంద్రబాబు కేసు విచారణ.! ► నేరుగా వాదిస్తాం, వర్చువల్‌గా వాదిస్తాం... ► హైకోర్టుకు చంద్రబాబు తరపున లాయర్ల విజ్ఞప్తి ► ఒక సీనియర్ లాయర్, మరో సీనియర్ లాయర్ వర్చువల్‌గా ► ఆన్లైన్లో వాదనలు వినాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి ► మధ్యాహ్నం తర్వాత కేసు విచారణ చేపట్టనున్న హైకోర్టు 10:30 AM, సెప్టెంబర్ 19, 2023 కస్టడీ ఇస్తారా? రిమాండ్ పొడిగిస్తారా? ► హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబు పిటిషన్లపై నేడు విచారణ ► నేటితో ముగియనున్న నేటితో ముగియనున్న రిమాండ్ ► సాధారణ ప్రక్రియలో భాగంగా రిమాండ్ పొడిగించే అవకాశం ► హైకోర్టుకు చేరుకున్న అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం 10:30 AM, సెప్టెంబర్ 19, 2023 ఏ కేసులో ఏ లాయర్ ? గంటకు ఫీజు ఎంత? ► చంద్రబాబు పిటిషన్లపై హేమాహేమీలను దించిన టిడిపి లీగల్ సెల్ ► చంద్రబాబు కోసం రంగంలోకి దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► క్వాష్ పిటిషన్‌పై వాదనలు వినిపించనున్న సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లోథ్రా ► రిమాండ్ ఉత్తర్వుల సస్పెన్షన్, కస్టడీ ఇవ్వొందంటూ వాదించనున్న ముఖుల్ రోహత్గీ ► ఏపీ హైకోర్టులోనే మరో బెంచ్‌లో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ ► ఈ పిటిషన్‌పై చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే వర్చువల్ వాదనలు ► గంటకు కోటి అయినా ఇచ్చేందుకు టిడిపి లీగల్ సెల్ సిద్ధమని ఢిల్లీలో చర్చలు 10:10 AM, సెప్టెంబర్ 19, 2023 ఏపీ హైకోర్టుకు చేరుకున్న లూథ్రా ► ఏపీ హైకోర్టుకు చేరుకున్న సీనియర్ లాయర్ సిద్ధార్ధ్ లూథ్రా ► చంద్రబాబుపై నమోదయిన స్కిల్ కేసును కొట్టేయాలని లూథ్రా పిటిషన్ ► లూథ్రా వేసిన క్వాష్ పిటిషన్ ఇవ్వాళ హైకోర్టులో విచారణ ► గత పది రోజులుగా కేసుపై వీపరీతంగా ప్రిపేర్ అయిన లూథ్రా ► చంద్రబాబును విడిపించే బలమైన లాజిక్ దొరక్క లూథ్రా నిర్వేదం ► నిర్వేదంలో గురు గోవింద్ సింగ్, స్వామి వివేకానంద కొటేషన్లతో ట్వీట్లు Swami Vivekananda says in Karma Yoga - "A man must go about his duties without taking notice of the sneers and the ridicule of the world." And definitely not by those who have neither read nor understood the words of the venerable 1Oth guru who stood for justice and piety!! — Sidharth Luthra (@Luthra_Sidharth) September 14, 2023 10:00 AM, సెప్టెంబర్ 19, 2023 చంద్రబాబు కోసం దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► ముగ్గురు టాప్ మోస్ట్ లాయర్లతో టిడిపి లీగల్ సెల్ మంతనాలు ► ఇవ్వాళ హైకోర్టులో వాదనలు వినిపించనున్న ముగ్గురు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ► సిద్ధార్ధ లూథ్రాతో పాటు హారీశ్ సాల్వే, సిద్ధార్ధ్ అగర్వాల్ ► ఇతర పనుల నిమిత్తం ఫ్రాన్స్‌లో ఉన్న హారీశ్ సాల్వే ► ఎక్కడ ఉన్నా.. ఇక్కడ వాదనలు వినిపించాలని హారీశ్ సాల్వేకు టిడిప లీగల్ సెల్ విజ్ఞప్తి ► ఫ్రాన్స్ నుంచి వర్చువల్ గా వాదనలు వినిపించనున్న హరీశ్ సాల్వే 9:00 AM, సెప్టెంబర్ 19, 2023 యనమలపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు.. ►చంద్రబాబు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారు. ►జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. ►బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా!. చంద్రబాబు గారు జైల్లో కూర్చుని విజన్ 2047 గురించి ఆలోచిస్తున్నారని, జాతీయ నేతలకు ధన్యవాదాలు చెప్పమన్నారని స్వయంప్రకటిత మేధావి యనమల రామకృష్ణుడు సెలవిస్తున్నారు. బెయిల్ కోసం ఆయన బెంబేలెత్తిపోతుంటే మీ బిల్డప్స్ ఏంటి రామా కృష్ణా! — Vijayasai Reddy V (@VSReddy_MP) September 19, 2023 08:12AM, సెప్టెంబర్ 19, 2023 ►గుంటూరులో టీడీపీ నేతల పూజా కార్యక్రమాలు ►చంద్రబాబు బెయిల్ కోసం ప్రత్యేక పూజలు ►వినాయక మండపాల వద్ద టీడీపీ నేతల పూజలు ►ఆధ్యాత్మిక ప్రాంతాల్లో రాజకీయాలు చేయడం ఏంటని భక్తుల ఆగ్రహం 7:59 AM ఢిల్లీలో లోకేష్ వెంటే రఘురామ కృష్ణంరాజు ►రాజ్‌ఘాట్‌కు నారా లోకేష్, టీడీపీ మంత్రులు, ఎంపీలు ►అదే టీంలో రఘురామ కృష్ణంరాజు ►ఢిల్లీ వెళ్లినప్పటి నుంచి రఘురామ లాబీయింగ్‌పై ఆధారపడ్డ లోకేష్ ►బీజేపీ పెద్దల అపాయింట్మెంట్లు ఇప్పించాలని విజ్ఞప్తి ►పార్లమెంటు సమావేశాలతో కేంద్ర పెద్దలు బిజీ బిజీ ►ఎలాగైనా వారి దృష్టిలో పడేందుకు టీడీపీ బృందం విశ్వప్రయత్నాలు 07:30 AM, సెప్టెంబర్ 19, 2023 లోకేష్‌లో గుబులు ► ఇంకా ఢిల్లీలోనే చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ► ఎల్లో మీడియాలో లోకేష్ పై విపరీతంగా ప్రచారం ► రాజమండ్రి రాగానే లోకేష్ ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► రాజమండ్రికి రావాలా? వద్దా? ఇంకొన్నాళ్లు ఢిల్లీలోనే ఉండాలా? ► ఎల్లో మీడియా చెప్పినట్టు అరెస్ట్ చేస్తే రాజమండ్రి కంటే ఢిల్లీ బెటరా? ► ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► తనకు వ్యతిరేకంగా ఏయే ఆధారాలున్నాయన్నదానిపై చర్చ ► ఇవ్వాళ ఢిల్లీలో ఎంపీలతో కలిసి ధర్నాలో పాల్గొనున్న లోకేష్ ► ఢిల్లీలో ఉదయం రాజ్ ఘాట్ సందర్శించనున్న లోకేష్ ► ఎక్కడికి వెళ్లినా వెంట టిడిపి ఎంపీలు ఉండాలని సూచించిన లోకేష్ 07:20 AM, సెప్టెంబర్ 19, 2023 పీక్స్‌కు చేరిన ఎల్లో మీడియా సానుభూతి ఆరాటం ► లోకేష్ ను అరెస్ట్ చేస్తారని ఎల్లో మీడియాలో భారీ ప్రచారం ► బాబును అరెస్ట్ కు లోకేష్ ను జత చేయాలని ఎల్లో మీడియా ఆరాటం ► ప్రజల్లో సానుభూతి తెచ్చుకొనేందుకు ప్రయాసలు ► ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారంటున్న ఎల్లో మీడియా ► ఫైబర్ గ్రిడ్ కేసులో ఇప్పటికే కొందరి అరెస్ట్ ► రెండేళ్ల నుంచి ఫైబర్ గ్రిడ్ కేసులో దర్యాప్తు ► ఈ రోజు రాత్రి లోకేశ్ రాజమండ్రి చేరుకునే అవకాశం ► రాజమండ్రికి లోకేష్ రాగానే CID అరెస్ట్ చేస్తుందంటూ పచ్చ ప్రచారం 07:00 AM, సెప్టెంబర్ 19, 2023 అసలు మన లాయర్లు ఏం చేస్తున్నారు? : చంద్రబాబు రుసరుస ► తన కేసు వాదిస్తోన్న లాయర్లతో కలుస్తానని నిన్న యనమలకు చెప్పిన చంద్రబాబు ► నేడు చంద్రబాబుతో సుప్రీంకోర్టు లాయర్ తో పాటు టీడీపీ లీగల్ సెల్ లాయర్లు కలిసే అవకాశం ► కేసులో సాంకేతిక లోపాలు ఏమున్నాయన్న దానిపై టిడిపి లీగల్ సెల్ రంధ్రాన్వేషణ ► ఏసీబీ కోర్టులో ఏం వాదించాలి? హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా ఏం చెప్పాలి? ► బాబు కోసం భారీ కసరత్తు చేస్తోన్న సుప్రీంకోర్టు లాయర్లు 6:50 AM, సెప్టెంబర్ 19, 2023 టీడీపీవి బూటకపు వాదనలు.. ► స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు. ► వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ► ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు. ► స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ నిర్ధారించాయి. ► చంద్రబాబు షెల్ కంపెనీలకు నిధులు మళ్లించి, తర్వాత వాటిని స్వాహా చేశాడు. ► ఇన్నేళ్ళ తర్వాత ఈ కేసులో చట్టం చంద్రబాబును పట్టుకుంది. “స్కిల్ స్కామ్ కేసులో మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాసరావు దేశం విడిచి పారిపోయారు” - వీరికి చంద్రబాబుతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. - ఈ కేసు విషయంలో టీడీపీ చేస్తున్నవన్నీ బూటకపు వాదనలు. - స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.371 కోట్ల అవినీతి జరిగినట్టు ఐటీ, ఈడీ… pic.twitter.com/LScpdrWDGE — YSR Congress Party (@YSRCParty) September 18, 2023 06:30 AM, సెప్టెంబర్ 19, 2023 ఏసీ లేని గదిలో ఎవరయినా ఉంటారా? : బాబుకు కోపమొచ్చింది..! ► రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్ లో చంద్రబాబు ► పదో రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్ ► నిన్న కుటుంబ సభ్యులను ములాఖత్ లో కలిసిన చంద్రబాబు ► కుటుంబ సభ్యులతో పాటు పార్టీ నేత యనమలతో బాబు చర్చలు ► తనకు గదిలో ఏసీ లేదని, ఇబ్బందిగా ఉందని బాబు తనతో చెప్పాడన్న యనమల ► కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్న జైలు అధికారులు ► చంద్రబాబు కాలక్షేపం కోసం అయిదు న్యూస్ పేపర్లు, టీవీ ► స్నేహా బ్లాక్ లో ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న చంద్రబాబు ► ఇంటి నుంచి అన్ని పూటల భోజనం, స్నానానికి వేడి నీళ్ల సదుపాయం 06:20 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నేడు హైకోర్టులో విచారణ ► చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ► జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరిన చంద్రబాబు ► చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని వాదించారన్న లాయర్ సిద్దార్థ లూథ్రా ► ఇవ్వాళ కౌంటర్ దాఖలు చేయనున్న CID ► అనంతరం ఇరు పక్షాల వాదనలు విననున్న హైకోర్టు 06:15 AM, సెప్టెంబర్ 19, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు హైకోర్టులో విచారణ ► బెయిల్ కోరుతూ పిటిషన్ వేసిన చంద్రబాబు ► చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగే అవకాశం 06:10 AM, సెప్టెంబర్ 19, 2023 బాబును కస్టడీకి ఇవ్వండి : CID విజ్ఞప్తి ► ఏసీబీ కోర్టులో CID కస్టడీ పిటిషన్ ► స్కిల్ కుంభకోణం కేసులో చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ ► కస్టడీకి ఇస్తే స్కాంకు సంబంధించి కీలక వివరాలు రాబడతామన్న సీఐడీ 6:00 AM, సెప్టెంబర్ 19, 2023 బెయిల్, మధ్యంతర బెయిల్.. ACB కోర్టులో నేడు విచారణలు ► ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ ► చంద్రబాబు తరపున మరో పిటిషన్, మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ ► బెయిల్ తో పాటు మధ్యంతర పిటిషన్ పై నేడు విచారణ.