breaking news
-
Sep 28, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
LIVE : Chandrababu Remand, Court matters and Ground updates 6:43 PM, సెప్టెంబర్ 28, 2023 మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ నేతల భేటీ ► తెలుగుదేశం పొత్తుపై నాదెండ్ల మనోహర్ చర్చలు ► జైలుకు వెళ్లిన పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మాట్లాడి పొత్తు ప్రకటించారు ► ఎన్ని సీట్లు అడుగుదాం?, ఏ ఏ జిల్లాల్లో అడుగుదాం? ► కనీసం 75 సీట్లు తక్కువ కాకుండా సీట్లు అడగాలన్న యోచనలో నేతలు ► తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టొద్దన్న పవన్ సూచనలను గుర్తు చేసిన నాదెండ్ల ► లోకేష్, బాలకృష్ణ పక్కన నిలబడ్డంత మాత్రాన ఎక్కువ ఊహించుకోవద్దంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసినట్టు సమాచారం ► జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం మద్ధతు ఎలా తీసుకోవాలన్న దానిపై చర్చ 6:12 PM, సెప్టెంబర్ 28, 2023 కేవియట్ పిటిషన్‌తో తెలుగుదేశం బేజారు ► అక్టోబర్ 3పై కోటి ఆశలు పెట్టుకున్నతెలుగుదేశం ► అన్యాయం జరిగిపోయిందని కలరింగ్ ఇచ్చేందుకు సన్నాహాలు ► గగ్గోలు పెట్టి స్టే తెచ్చుకోవాలని వ్యూహం ► ఈ కేసులో తమ వాదనలు వినాలంటూ ఏపీ సర్కారు కేవియట్ పిటిషన్ ► మొత్తం ఆధారాలను సుప్రీంకోర్టు ముందుంచనున్న ఏపీ సర్కారు ► చంద్రబాబు ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారో తెలియజేస్తూ సమగ్ర పిటిషన్ ► కేసు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఇప్పటికే టిడిపికి చెప్పిన సీనియర్ లాయర్లు ► ఈ కేసులో తమకు రిలీఫ్ దొరకడం కష్టమేనని తెలుగుదేశం ఆందోళన 4:20 PM, సెప్టెంబర్ 28, 2023 రింగ్ రోడ్డు పేరిట దోపిడి చేశారు : YSRCP ► రింగ్ రోడ్డును తమకు అనుకూలంగా మలుపులు తిప్పారు ► రోడ్డు పక్కనే ఉన్న తమ భూములకు విలువ పెంచుకున్నారు ► భారీ లాభాలతో విక్రయించారు : YSRCP అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడుగా నారా లోకేశ్ కీలక పాత్ర వహించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. లోకేశ్ పాత్రకు సంబంధించి 129 ఆధారాలను గుర్తించి జప్తు చేసింది. ఐఆర్ఆర్ లో లోకేశ్… pic.twitter.com/r8R8fu07cB — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 4:05 PM, సెప్టెంబర్ 28, 2023 పాదయాత్ర లేదు.. పార్టీ ప్రోగ్రాం లేదు.. ► పాదయాత్రను వాయిదా వేసాం : అచ్చెన్నాయుడు ► కేసులో లోకేష్ పేరు పెట్టారు ► చంద్రబాబునాయుడిపై PT వారంటు జారీ చేశారు ► వీటిన్నింటిని న్యాయపరంగా ఎదుర్కొవాలి ► ఢిల్లీలో సుప్రీంకోర్టులో లాయర్లతో లోకేష్ మాట్లాడాలి ► లోకేష్‌ను వాయిదా వేసుకొమ్మని మేమే కోరాం 3:52 PM, సెప్టెంబర్ 28, 2023 - BIG BREAKING చినబాబుకు భయం పట్టుకుంది.! పాదయాత్ర వాయిదా ► లోకేష్ యువగళం పాదయాత్ర వాయిదా ► యువగళం పాదయాత్ర తేదీ వాయిదా వేయాలని తెలుగుదేశం నిర్ణయం ► ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతే పునఃప్రారంభించాలని నిర్ణయం ► అప్పటివరకు ఢిల్లీలోనే ఉండాలని యోచిస్తోన్న లోకేష్ ► రాజమండ్రికి వస్తే జైలుకు పోవడమొక్కటే మిగిలిందని లోకేష్‌కు సూచించిన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా టాప్ మేనేజ్మెంట్లు ► అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ కేసు విచారణను బట్టి నిర్ణయం తీసుకుందామని సూచన ► ఢిల్లీలో మంచి లాయర్లను ముందస్తు బెయిల్ కోసం మాట్లాడుకొమ్మని సలహా ► ఇప్పుడే పాదయాత్రకు వెళ్లాలనుకుంటే అరెస్ట్ అవుతారని సూచన ► టీడీపీ నాయకులు, పచ్చమీడియా మేనేజ్మెంట్ల అభిప్రాయాలతో ఏకీభవించిన లోకేష్ ► పాదయాత్ర సంగతి తర్వాత చూద్దాం, ఢిల్లీ హోటల్లోనే ఉంటానన్న లోకేష్ పాదయాత్ర ఘనంగా ప్రారంభిస్తామని నిన్నటిదాకా ట్వీట్లు వేసిన తెలుగుదేశం అద్భుత ప్రజాదరణతో జైత్రయాత్రలా కొనసాగుతోన్న యువగళం పాదయాత్ర చంద్రబాబు గారి అక్రమ అరెస్టు కారణంగా ఆగింది. కానీ అది చిన్న విరామం మాత్రమే. ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ సెప్టెంబర్ 29, 2023, రాత్రి 8.15 గంటలకు పాదయాత్రను ప్రారంభిస్తున్నారు నారా లోకేష్ గారు#YuvaGalamPadayatra… pic.twitter.com/cSDQONUG8s — Telugu Desam Party (@JaiTDP) September 26, 2023 3:12 PM, సెప్టెంబర్ 28, 2023 - BIG BREAKING సుప్రీంకోర్టు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కేవియట్ ► సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ► చంద్రబాబుపై నమోదయిన కేసులో మా వాదన వినాలని విజ్ఞప్తి ► స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఎన్నో ఆధారాలున్నాయి ► విద్యార్థులకు శిక్షణ ఇస్తామని కోట్ల కుంభకోణం చేశారు ► నిధులను షెల్ కంపెనీల ద్వారా రూటు మళ్లించి ఎన్‌క్యాష్ చేసుకున్నారు ► కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటికే ఈ అంశాన్ని దర్యాప్తు చేస్తున్నాయి ► ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని GST శాఖ ► ఈ కేసులో మా వాదన మీ ముందుంచుతాం : ఏపీ ప్రభుత్వం 3:10 PM, సెప్టెంబర్ 28, 2023 తిట్టలేదట కానీ అన్నాడట : అదీ బుచ్చయ్య సంస్కారం.! ► నేను జడ్జిని తిట్టలేదు : గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► కానీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని అన్నాను ► నాకు కోర్టు నోటీసులు వచ్చాక, పరిశీలించి మాట్లాడుతా ► చంద్రబాబుని జైల్లో పెట్టి పొందేది తాత్కాలిక ఆనందమే 1:10 PM, సెప్టెంబర్ 28, 2023 జవాబులు చెప్పండి ప్లీజ్.! తెలుగుదేశం లీగల్ సెల్‌కు సగటు తెలుగు ప్రజల 10 ప్రశ్నలు.. 1. ఏ కోర్టులో అయినా బాబు లాయర్లు సెక్షన్ 17A అంటున్నారు, మరో వాదన వినిపించడం లేదేందుకు? 2. అరెస్ట్ చేసిన తీరును తప్పుబడుతున్నారు కానీ తప్పు చేయలేదని ఎందుకు చెప్పడం లేదు? 3. దేశంలోనే అత్యంత ఖరీదైన హరీష్ సాల్వేను పెట్టుకున్నా.. మీ కేసులో ఒక్కటంటే ఒక్క బలమైన కారణం దొరకడం లేదా? 4. మీడియా మీటింగ్‌ల్లో మీరు చేసే ప్రకటనలను కోర్టు ముందు ఎందుకు చెప్పడం లేదు? 5. Yes, మేం తప్పు చేయలేదు, ఈ డబ్బులు మా ఖాతాల్లో పడలేదు, ఈ సంతకాలు బాబు పెట్టలేదు అని కోర్టుకు చెప్పడం లేదెందుకు? 6. మీరు అన్నీ కరెక్ట్‌గానే చేస్తే.. మీ మనుష్యులు శ్రీనివాస్, మనోజ్ తదితరులంతా దేశం విడిచి ఎందుకు పారిపోయారు? 7. ప్రపంచమంతా అన్ని దేశాల్లో నిరసనలు చేస్తున్నారని ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్న మీరు జర్మనీలో సీమెన్స్ కంపెనీ ముందు ఎందుకు ధర్నాలు చేయడం లేదు? 8. కనీసం సీమెన్స్ కంపెనీకి తెలుగుదేశం పార్టీ నుంచి అధికారికంగా ఒక్క మెయిల్ అయినా రాయలేదేందుకు? 9. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్నది ఒప్పందం నుంచి ఎందుకు తొలగించారో.. ఏ మీడియా సమావేశంలో చూపించడం లేదెందుకు? 10. మేనేజర్ తప్పు చేస్తే ఓనర్‌ను శిక్షిస్తారా అన్న డొంక తిరుగుడు వాదన లోకేష్ ఎందుకు చేస్తున్నారు? 1:10 PM, సెప్టెంబర్ 28, 2023 అమరావతిలో రింగ్ అంతా లోకేష్‌దే ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో లోకేష్ కుట్ర సుస్పష్టం ► కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ వెల్లడి ► లోకేష్ పాత్రను స్పష్టం చేస్తున్న 129 ఆధారాలు ► ఈ ఆధారాలను జప్తు చేసిన సిట్ అధికారులు ► అప్పటి అధికారులు, అలైన్ మెంట్ లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు ► పక్కా పన్నాగంతోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు ► హెరిటేజ్‌కు, లింగమనేని రమేష్ కుటుంబానికి అడ్డగోలుగా లబ్ధి ► వారి భూములను ఆనుకొని వెళ్లేలా IRRలో మార్పులు ► క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా బహుమానంగా ఇచ్చిన లింగమనేని మాస్టర్ ప్లాన్ లోని ఇన్నర్ రింగు రోడ్డును ఇష్టానుసారం మార్చేసింది ప్రజల కోసం ఏమాత్రం కాదు. ఆ ప్రాంతాల్లోని నారాయణ కాలేజీల కోసమే ఈ ప్లాను.. తద్వారా నారాయణతో పాటు @naralokesh , @ncbn సైతం లబ్ది పొందారు. #CorruptBabuNaidu#SkilledCriminalCBNInJail #AmaravathiLandScam… pic.twitter.com/HwytVjPaVR — YSR Congress Party (@YSRCParty) September 28, 2023 1:00 PM, సెప్టెంబర్ 28, 2023 పాదయాత్ర నిలిపివేస్తే పరువు గోవిందా.! ► లోకేష్ తీరుపై తెలుగుదేశంలో తీవ్ర ఆందోళన, ఆగ్రహం ► ఇప్పటివరకు నడిచిన క్రెడిట్ అంతా పోతోందని ఆవేదన ► ఏపీ నుంచి ఢిల్లీ పారిపోయారన్న అపఖ్యాతి వద్దంటున్న టిడిపి క్యాడర్ ► ఎల్లో మీడియాలో వస్తున్న అప్డేట్స్ ప్రకారం టిడిపి ఇన్సైట్స్ ఇలా ఉన్నాయి రెండు వర్గాలుగా మారిన తెలుగుదేశం అగ్ర నేతలు ఒక వర్గం : ముందయితే ఎలాగైనా లోకేష్‌ను బుజ్జగించి రాజమండ్రికి రప్పించాలి రెండో వర్గం : పాదయాత్రను కనీసం వారం పాటు వాయిదా వేయాలి ఒక వర్గం : లోకేష్‌ను అరెస్ట్ చేస్తే బ్రాహ్మణితో పాదయాత్ర చేయించాలి రెండో వర్గం : ముందస్తు బెయిల్ వచ్చే వరకు లోకేష్‌ను ఢిల్లీలోనే ఉంచాలి ఒక వర్గం : లోకేష్ కంటే బ్రాహ్మణి బరిలో దిగితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, నారా+నందమూరి కుటుంబాలకు వారసురాలిగా గుర్తింపు వస్తుంది రెండో వర్గం : ఇన్నాళ్లు లోకేష్‌ను లీడర్‌గా ప్రచారం చేసి ఇప్పుడు వెనక్కు జరిపితే క్యాడర్ మనోస్థైర్యం దెబ్బ తింటుంది 12:45 PM, సెప్టెంబర్ 28, 2023 మా చినబాబు మంచోడే, కొనాలని ముందే కల పడింది : టిడిపి ► అమరావతిలో భూములు కొనాలని లోకేష్ ముందే అనుకున్నారు : పట్టాభి ► భూముల విషయంలో టిడిపి నేత పట్టాభి అధికారిక ప్రకటన ► అవును, నారా లోకేష్‌తో పాటు హెరిటేజ్ కూడా భూములు కొనుగోలు చేశారు ► సంస్ధ విస్తరణ కోసం అనేక చోట్ల హెరిటేజ్ భూములు కొంటుంది ► అదేవిధంగా ఆనాడు అమరావతి ప్రాంతంలోనూ భూములు కొనుగోలు చేసింది ► FIR ఫైల్ కాగానే CIDకి కూడా హెరిటేజ్ సంస్ధ అన్ని వివరాలతో లేఖ రాసింది ► జులై1న హెరిటేజ్ 7.21 ఎకరాలు కొనుగోలు చేసింది ► జులై 31తర్వాత మరి కొన్ని ఎకరాలు భూమి కొనుగోలు చేసింది ► లింగమనేని నుంచి కూడా 4.55 ఎకరాలు కొనుగోలు చేసింది ► ఈ భూమికి సంబంధించి లీగల్ ఇష్యూ ఉందని ఒప్పందం రద్దు చేసుకుంది ► లీగల్ ఇష్యూ ఉందని కోట్లు విలువచేసే 4.5 ఎకరాలను హెరిటేజ్ వదులుకుంది ► లింగమనేని భూమి ఒప్పందం రద్దుచేసుకున్నాక హెరిటేజ్‌కు మిగిలింది 9.6 ఎకరాలు ► కొనాలని ముందే అనుకున్నారు కాబట్టి తప్పు జరిగిందని ఎలా చెబుతారు? చంద్రబాబు అప్పట్లో అమరావతిని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దబోతున్నట్లు గ్రాఫిక్స్‌తో అందర్నీ నమ్మించాడు. కానీ.. చివరికి అమరావతి అంతర్జాతీయ స్కామ్‌గా మిగిలిపోయింది. ఈ స్కామ్‌కి డైరెక్షన్ చంద్రబాబు.. పర్యవేక్షణ నారా లోకేష్. - మంత్రి ఆదిమూలపు సురేష్#APAssembly#CorruptBabuNaidu… pic.twitter.com/XaSGHK5b8o — YSR Congress Party (@YSRCParty) September 27, 2023 12:30 PM, సెప్టెంబర్ 28, 2023 కిం కర్తవ్యం.? ► రేపు నంద్యాలలో టీడీపీ యాక్షన్ కమిటీ సమావేశం ► ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొననున్న నారా లోకేష్ ► చంద్రబాబును అరెస్ట్ చేసిన నంద్యాలలోనే యాక్షన్ కమిటీ భేటీ ► పార్టీ భవిష్యత్ కార్యాచరణతో పాటు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చ ► లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోర్టు ముందు నిలబడుతుందా? ► లోకేష్‌కు వ్యతిరేకంగా ఎలాంటి బలమైన ఆధారాలున్నాయి.? ► లోకేష్ పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడుతుందా? ► ఇప్పట్లో చంద్రబాబు బయటకు వస్తారా? ► చంద్రబాబుకు ప్రత్యామ్నయంగా పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు? ► భువనేశ్వరీ, బ్రాహ్మణికి ఎలాంటి బాధ్యతలు ఇస్తారు? ► ఎల్లో మీడియాలో జరుగుతున్నట్టు మహిళలిద్దరే పార్టీకి నేతృత్వం వహిస్తారా? ► లోకేష్ అరెస్ట్ అవుతారంటూ ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమేనా? సానుభూతి కోసమా? ► బాలకృష్ణ పాత్ర ఏంటీ? పార్టీ మీటింగ్‌లు రెండు పెట్టి మళ్లీ కనిపించడం లేదేందుకు? ► జైలు ముందు పొత్తు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ ఎందుకు తెర మీదికి రావడం లేదు? ► పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? ఏ ఏ సీట్లు ఇస్తారు? 12:00 PM, సెప్టెంబర్ 28, 2023 లోకేష్ యువగళానికి మంగళం.! ► మరింత వాయిదా దిశగా లోకేష్ పాదయాత్ర యువగళం ► ఢిల్లీలో చేసిన ప్రకటన ప్రకారం రేపు రాత్రి నుంచి పాదయాత్ర చేయాలని నిర్ణయం ► అరెస్ట్ భయంతో ఇప్పట్లో ఢిల్లీ నుంచి రాలేనంటున్న చిన బాబు ► పాదయాత్ర మధ్యలో నిలిపివేస్తే పరువు పోతుందంటున్న తెలుగుదేశం నేతలు ► హైకోర్టులో ముందస్తు బెయిల్ వస్తేనే ఏపీకి వస్తానని తేల్చి చెబుతోన్న లోకేష్ ► అరెస్ట్ అయితే మరింత సానుభూతి వస్తుందంటున్న టిడిపి నేతలు ► చంద్రబాబు అరెస్ట్‌కే రాలేదు, నాకేం వస్తుందని ఎదురు ప్రశ్నిస్తోన్న లోకేష్ ► యువగళం పాదయాత్ర వాయిదా వేస్తున్నారని ఎల్లో మీడియాలో బ్రేకింగ్‌లు ► వారం వాయిదా వేస్తేనే బాగుంటుందని కొందరు నేతలు లోకేష్‌కు సూచించారు : ఎల్లో మీడియా ► ఎవరా కొందరు.? ఎందుకు వాయిదా? అన్న వివరాలు వెల్లడించని ఎల్లో మీడియా 11:45AM, సెప్టెంబర్ 28, 2023 ఏసీబీ జడ్జిపై పోస్టు.. మరో టీడీపీ నేత అరెస్ట్ ►ఏసీబీ జడ్జిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన కృష్ణా జిల్లా టీడీపీ నేత ►టీడీపీ నాయకుడు బుర్ర వెంకట్‌ను అదుపులోకి తీసుకున్న కంకిపాడు పోలీసులు ►మచిలీపట్నం సైబర్ బ్రాంచ్ కి అప్పగించిన పోలీసులు ► స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ న్యాయమూర్తి 10:20AM, సెప్టెంబర్ 28, 2023 ఏ వయస్సులో చేసినా నేరం నేరమే ►చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయి ►ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసింది ►కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణం ►బాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి ►చంద్రబాబుకు 23 లక్కీ నంబర్ ►మా పార్టీకి చెందిన 23 మందికి లాక్కున్నాడు ►2019లో ఆయనకి వచ్చిన సీట్లు 23 ►జైలుకు వెళ్లిన డేట్ కూడా 23 యే ►చంద్రబాబు అరెస్ట్ పై జంప్ అయిన ఎమ్మెల్యే ల హడావుడి ఎక్కువైంది. ►మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరు ►తప్పు చేస్తే మా ప్రభుత్వంలో ఎంతటి వారికైనా జైలు జీవితం తప్పదు ►ఏ వయస్సులో చేసినా తప్పు తప్పే.. నేరం నేరమే.. ►భవిష్యత్తు లో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది :: ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ 07:30AM, సెప్టెంబర్ 28, 2023 రింగ్‌రోడ్డు కేసులో లోకేష్ పాత్రపై 129 ఆధారాలు ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో లోకేశ్ కుట్ర సుస్పష్టం ►ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో సిట్ వెల్లడి ►లోకేశ్ పాత్రను స్పష్టం చేస్తున్న 129 ఆధారాలు ►ఈ ఆధారాలను జప్తు చేసిన సిట్ అధికారులు ►అప్పటి అధికారులు, అలైన్మెంట్లో పాల్గొన్న సంస్థల వాంగ్మూలాలూ నమోదు ►పక్కా పన్నాగంతోనే ఐఆర్ఆర్ అలైన్మెంట్లో మార్పులు ►హెరిటేజ్‌కు, లింగమనేని రమేశ్ కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం ►వారి భూములను ఆనుకొని వెళ్లేలా ఐఆర్ఆర్లో మార్పులు ►క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబుకు కరకట్ట బంగ్లా ఇదీ చదవండి: హెరిటేజ్ అంటేనే నారా కుటుంబం 07:00AM, సెప్టెంబర్ 28, 2023 సుప్రీం జడ్జిల వద్ద బాబు లాయర్ల పట్టు.. నో రిలీఫ్ ►నిన్న(బుధవారం) సుప్రీంలో చంద్రబాబు లాయర్ల ఇబ్బందికర ప్రవర్తన ►తక్షణ ఉపశమనానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌పై ఒత్తిడి ► తిరస్కరించిన సీజేఐ ►కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని నియంత్రించలేమని స్పష్టీకరణ ►అక్టోబర్ 3వ తేదీనే ఎస్ఎల్పీపై విచారణ జాబితాలోకి అని బాబు లాయర్లకు చెప్పిన చీఫ్ జస్టిస్ ►అంతకు ముందు.. బాబు పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ►సోమవారం జాబితా చేయాలని బాబు లాయర్ హరీష్ సాల్వే పట్టు ►సాధ్యం కాదని.. వచ్చే వారమే లిస్ట్ చేస్తామని స్పష్టం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 06:45AM, సెప్టెంబర్ 28, 2023 ఏసీబీ జడ్జిపై పోస్టులు.. టీడీపీ నేత అరెస్ట్ ► చంద్రబాబు కేసును విచారణ చేసిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానించిన టీడీపీ నేత ►సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్ ► జడ్జిపై అనుచిత పోస్ట్ చేసినందుకు టీడీపీ నేత ముల్లా ఖాజాను అరెస్ట్ చేసిన నంద్యాల పోలీసులు ►ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన ఖాజా హుస్సేన్ ►టీడీపీ తరపునే పోస్ట్ చేసినట్లు ఒప్పుకోలు! ►నేడు కోర్టులో హాజరు పరచనున్న పోలీసులు. ఇదీ చదవండి: జడ్జిలపై కులం పేరుతో దూషణల పర్వం 06:30AM, సెప్టెంబర్ 28, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @19 ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడి రిమాండ్ 19వ రోజుకి చేరుకుంది ► సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకుంది ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు ► ఇప్పటికే రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు టీడీపీ & గ్యాంగ్ చిల్లర వేషాలు: వైఎస్సార్సీపీ ►చంద్రబాబు ఇప్పటికే 20కిపైగా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. ►అప్పుడు న్యాయస్థానాలను టీడీపీ వాళ్లు ఆహా ఓహో అని పొగిడారు. ►ఇప్పుడు చంద్రబాబుకి రిమాండ్ విధించగానే.. కోర్టులు చెడ్డవి అయిపోయాయా? ►జడ్జిలపై టీడీపీ నేతలు అసభ్యకర కామెంట్స్ పెట్టడం.. వాళ్ల పైశాచికత్వానికి నిదర్శనం చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలతో టీడీపీ అండ్ గ్యాంగ్ చిల్లర వేషాలు వేస్తోంది. @ncbn ఇప్పటికే 20కిపైగా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. అప్పుడు న్యాయస్థానాలను టీడీపీ వాళ్లు ఆహా ఓహో అని పొగిడారు.. ఇప్పుడు బాబుకి రిమాండ్ విధించగానే కోర్టులు చెడ్డవి అయిపోయాయా? గౌరవ జడ్జిలపైనే సోషల్… pic.twitter.com/1PjfV0rabV — YSR Congress Party (@YSRCParty) September 27, 2023 -
టీడీపీ తెలుగు మహిళా కార్యదర్శి అరెస్ట్
గుంటూరు లీగల్: సీఎం వైఎస్ జగన్ పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టిన టీడీపీ గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళ కార్యదర్శి పిడికిటి శివ పార్వతిని బుధవారం పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన శివ పార్వతి నగరంలోని జేకేసీ రోడ్డులోని విజయపురి కాలనీలో ఉంటుంది. ఆమె టీడీపీ గుంటూరు పార్లమెంట్ తెలుగు మహిళా కార్యదర్శిగా పనిచేస్తూ ఫేస్బుక్లో ‘లక్ష్మీగణేష్ ఐడీతో పోస్టింగ్‌లు పెడుతుంది. ఈ నెల 25న సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలతో వీడియో పోస్టు చేసింది. దీనిపై స్తంబాలగరువుకు చెందిన వైఎస్సార్ సీపీ 42వ డివిజన్ ఇన్చార్జ్ చల్లా శేషిరెడ్డి, ఏటి అగ్రహారానికి చెందిన వైఎస్సార్ సీపీ గుంటూరు వెస్ట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాజవరపు జగదీష్ పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం పరువుకు భంగం కలిగించేలా, కించపరిచేలా ఉండటమే కాకుండా అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వీడియో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలు ఇదే తేదీన పోస్టు చేసిన మరో వీడియోపై మారుతీనగర్‌కు చెందిన షేక్ ఉస్మాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో కూడా పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. నిందితురాలు సోషల్ మీడియాలో తరచూ ఇలాంటి పోస్టింగ్స్ పెడుతుందనీ, గతంలో సీసీ నం.1247/2021 లో కూడా ముద్దాయి అని పేర్కొంటూ , ఆమెకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ పట్టాభిపురం పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టులో దాఖలు చేశారు. వాదనలు విన్న ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి జి.స్పందన రిమాండ్‌ను తిరస్కరిస్తూ రూ.10 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. -
కేటుగాడు దొరికాడు !
అనంతపురం క్రైం:C రూ.లక్షలు దండుకుని ముఖం చాటేసిన మోసగాడు రాయచోటి శశిని చిత్తూరు జిల్లా కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు బీటెక్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలిప్పిసామని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 150 మందిని మోసగించాడు. జిల్లాల వారీగా ఏజెంట్లను నియమించి వారి ద్వారా నిరుద్యోగుల నుంచి డబ్బు దండుకున్నాడు. నాలుగు రోజుల క్రితం పలువురు బాధితులు కుప్పం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు బుధవారం ఉదయం రాయచోటిలోని తన స్వగృహంలో ఉన్న నిందితుడు శశిని అదుపులోకి తీసుకున్నారు. కుప్పంలోని బాధితులకు మాత్రమే డబ్బు తిరిగిస్తానని నిందితుడు చెప్పినట్లు ఏజెంట్ల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే అనంతపురం జిల్లాతో పాటు మిగిలిన ప్రాంతాల్లోని బాధితుల పరిస్థితి ఏంటనేది అగమ్యగోచరమే. ఏజెంట్లు బలమైన సామాజికవర్గానికి చెందినవారు కావడంతో డబ్బు రికవరీపై బాధితులు ఆందోళన చెందుతున్నారు. డబ్బు కోసం నిలదీస్తే ఏజెంట్లు టీడీపీకి చెందిన నాయకుల పేర్లు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారని వాపోతున్నారు. వీరికి అల్లరిమూకలు, రౌడీషీటర్లు అండగా ఉండటంతో ఒత్తిడి చేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఖతర్నాక్ లేడీ బెదిరింపుల పర్వం.. ఉద్యోగాలిప్పిస్తామని తమ నుంచి తీసుకున్న నగదు తిరిగివ్వాలని అడిగిన నిరుద్యోగులను ‘ఖతర్నాక్ లేడీ’ పోలీసుల ద్వారా బెదిరిస్తోంది. నెల క్రితం అప్పటి అనంతపురం ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు కొంతమంది నిరుద్యోగులు తమకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. బెంగళూరుకు చెందిన సదరు మహిళ ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు డబ్బు తీసుకుందని ఆరోపించారు. ఏడాది దాటినా ఉద్యోగం చూపకపోవడంతో బాధితులు ఆ మహిళను నిలదీసి డబ్బు కోసం ఒత్తిడి తెచ్చారు. దీంతో సదరు మహిళ వైఎస్సార్ జిల్లా పోలీసుల ద్వారా బాధితులను బెదిరింపులకు గురి చేస్తోంది. మహిళకు ఎందుకు ఫోన్ చేస్తున్నారంటూ పోలీసులు ప్రశ్నిస్తుండటంతో.. బాధితులు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి జరిగిన విషయం తెలిపారు. అయితే న్యాయస్థానంలో కేసు వేసుకోండని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని బాధితులు తెలిపారు.ఉ -
నిమజ్జనోత్సవంలో అపశ్రుతి
ప్రకాశం: మండలంలోని పొట్లపాడు గ్రామంలో వినాయక నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. నిమజ్జన సమయంలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహానికి 9 రోజుల పాటు పూజలు చేశారు. మంగళవారం రాత్రి గ్రామోత్సవం చేసి నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఒక ట్రాక్టర్ ట్రక్కులో గణపతి విగ్రహాన్ని ఉంచి లైటింగ్ ఏర్పాటు చేశారు. విగ్రహానికి నాలుగు వైపులా ఇనుప పైపులు ఉంచి డెకరేషన్ చేశారు. గ్రామోత్సవం అనంతరం పొలాల్లోని నీటి గుంటల్లో నిమజ్జనం చేసేందుకు పొలాల బాటలో వెళుతుండగా విద్యుత్ తీగలు డెకరేషన్ కోసం ఏర్పాటు చేసిన పైపులకు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురవడంతో ట్రాక్టర్ పై ఉన్న వారంతా కిందకు దిగారు. ప్రమాదంలో చమిడిశెట్టి శ్రీను(35), తడకమల్ల నాగేంద్రం (11) విద్యుదాఘాతానికి గురై స్పృహ తప్పడంతో వెంటనే వినుకొండలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. హాస్పిటల్లో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడు శ్రీనుకు భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. నాగేంద్రం 8వ తరగతి చదువుతున్నాడు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యం దేవకుమార్ తెలిపారు. అన్ని విధాలా అండగా ఉంటాం పొట్లపాడులో విద్యుత్ షాక్‌తో మృతి చెందిన వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. పార్టీలో చురుకై న పాత్రను శ్రీను పోషించాడని, ఒక కార్యకర్తను పోగొట్టుకోవటం బాధాకరమన్నారు. వారి కుటుంబసభ్యులకు అండగా ఉండి శ్రీను లేని లోటును తీర్చుతానని హామీ ఇచ్చారు. ఆయన వెంట రాష్ట్ర గ్రీనరి అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ షేక్.సైదా, ఏఎంసీ ఉపాధ్యక్షుడు కండె గంగయ్య, దర్శి ఏఎంసీ మాజీ అధ్యక్షుడు వైవీ సుబ్బయ్య, కురిచేడు సొసైటీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నాగిరెడ్డి, మండల సచివాలయాల కన్వీనర్ మేరువ సుబ్బారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ కాకర్ల కాశయ్య, నాయకులు ఉన్నారు. -
చంద్రబాబుకు నో రిలీఫ్..!
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పోలీసు కస్టడీ పిటిషన్‌పై వాదనలు వినకుండా ట్రయల్ జడ్జిని తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ కేసును తగిన ధర్మాసనం ముందు జాబితా చేస్తామని, అక్టోబరు 3న దీన్ని విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి తనపై దాఖలైన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే ఈ పిటిషన్ విచారణపై జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి కొన్ని రిజర్వేషన్లు (అభ్యంతరాలు) ఉన్నాయని జస్టిస్ సంజీవ్‌ఖన్నా పేర్కొన్నారు. దీంతో జస్టిస్ భట్టి నిర్ణయంపై తామేమీ చేయలేమని, కేసును త్వరగా జాబితా చేయాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. వచ్చే వారం జాబితా చేస్తామని జస్టిస్ సంజీవ్‌ఖన్నా పేర్కొనడంతో, జస్టిస్ భట్టి విచారణ నుంచి వైదొలిగిన అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు మరో సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అనుమతి కోరారు. ఇందుకు అనుమతించిన జస్టిస్ సంజీవ్‌ఖన్నా కేసును పాస్ ఓవర్ చేయాలా? అని న్యాయవాదుల్ని ప్రశ్నించారు. పాస్ ఓవర్‌తో ఉపయోగం ఉండదని, సోమవారం జాబితా చేయాలని హరీశ్ సాల్వే అభ్యర్థించారు. అది సాధ్యం కాదని, వచ్చే వారం జాబితా చేస్తామని, ప్రాసెస్‌కు కొంత సమయం పడుతుందని జస్టిస్ ఖన్నా స్పష్టం చేశారు. జస్టిస్ ఎస్వీఎన్ భట్టి లేని ధర్మాసనంలో అక్టోబరు 3న ప్రారంభయ్యే వారంలో కేసును జాబితా చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేం.. ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేం: సీజేఐ చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నిరాకరించారని, దీనిపై వెంటనే విచారణ జరిగేలా చూడాలని అనంతరం సీజేఐ ధర్మాసనం ఎదుట సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూత్రా అభ్యర్థించారు. అయితే ఈ అంశంలో లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని, వెంటనే విచారణ వద్దని సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ విన్నవించారు. ఈ దశలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ.. ‘అసలు మీకేం కావాలి? సెక్షన్ 17ఏతో బెయిలు కావాలని కోరుతున్నారా?’ అని ప్రశ్నించడంతో చంద్రబాబు ఎస్సెల్పీపై విచారణ జరపాలని లూత్రా కోరారు. అయితే బెయిలు కావాలని దరఖాస్తు చేసుకోవచ్చుగా? అని సీజేఐ సూచించారు. దీనిపై లూత్రా స్పందిస్తూ ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా చంద్రబాబును అరెస్టు చేశారని, 17 ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. దీంతో అక్టోబరు 3న విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తెలిపారు. సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు విచారిస్తోందని, చంద్రబాబును వారి కస్టడీకి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలని లూత్రా కోరారు. ఇప్పటికే పోలీసు కస్టడీ పూర్తయిందని, మరో 15 రోజులు పోలీసు కస్టడీ కోరుతున్నారని ఎన్నికల నేపథ్యంలో పదే పదే ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని లూత్రా ఆరోపించారు. తొలుత జ్యుడీషియల్ కస్టడీ తర్వాత పోలీసు కస్టడీకి ఇచ్చారన్నారు. ఈ క్రమంలో లూత్రా పదేపదే విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ, ఈ దశలో అలాంటి ఆదేశాలను ఇవ్వలేమని, ట్రయల్ కోర్టు జడ్జిని నియంత్రించలేమని, అక్టోబరు 3నే విచారణ జాబితాలో చేర్చుతామని సీజేఐ తేల్చి చెప్పారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలి: రంజిత్‌కుమార్ ఇదే సమయంలో సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది రంజిత్‌కుమార్ స్పందిస్తూ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో రూ.కోట్లలో కుంభకోణం జరిగిందని సీజేఐ దృష్టికి తెచ్చారు. రూ.3,330 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వం పది శాతం మాత్రమే వెచ్చిస్తుందంటూ నిధులు విడుదల చేశారన్నారు. ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులను ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా పది శాతం నిధులు చేతులు మారిపోయాయన్నారు. సొమ్ములు స్వాహా అయినట్లు జీఎస్టీ అధికారులు కూడా గుర్తించారన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడంతో గత ప్రభుత్వం ఫైళ్లు మాయం చేసిందన్నారు. ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని పిటిషనర్ వాదించడం సరి కాదన్నారు. ఆ చట్ట సవరణ కన్నా ముందుగానే ఈ కుంభకోణం జరిగిందన్నారు. దర్యాప్తు కొనసాగేలా చూడాలని అభ్యర్థించారు. -
నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
సాక్షి, గుంటూరు: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లోకేష్ తరపున న్యాయవాదులు హైకోర్టులో ఈ పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఏ14గా లోకేష్ ఉన్న సంగతి తెలిసిందే. రాజధాని పేరుతో అమరావతిలోని అన్ని రోడ్లను కలుపుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) వేసే ప్రాజెక్టు పేరిట నాటి టీడీపీ సర్కార్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడింది. ఈ విషయంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఫిర్యాదుతో ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. దర్యాప్తులో భాగంగా ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును ప్రధాన ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. తన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో జరిగిన స్కామ్‌లో నారా లోకేష్ కీలక భూమిక పోషించారని, అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను నారా లోకేష్ కొల్లగొట్టినట్లు దర్యాప్తు సంస్థ సీఐడీ నిర్ధారించుకుంది. చంద్రబాబు, నారాయణ, లోకేష్‌తోపాటు లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లు, అలాగే.. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది ఏపీ సీఐడీ. అయితే నారాయణ ఇప్పటికే ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. -
CBN Arrest: ‘క్యాంపెయిన్‌గా జడ్జిలను ట్రోల్ చేశారు’
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత.. ఆయన పిటిషన్లను విచారించిన జడ్జిలపై రాజకీయపరంగా.. ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ నేత బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది. క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. ‘‘క్యాంపెయిన్‌గా జడ్జిపై ట్రోలింగ్ చేశార’’ని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీ టార్గెట్‌గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి.. ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. యెల్లో బ్యాచ్‌తో పాటు చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల పర్వం కొనసాగింది. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసింది పచ్చ మీడియా. దీంతో ఈ వ్యవహారంలో బుద్దా వెంకన్న సహా 26 మంది ప్రతివాదులుగా చేర్చింది ప్రభుత్వం. బుద్దా వెంకన్నతో పాటు ఎస్. రామకృష్ణ, మరికొన్ని సోషల్ మీడియా పేజీల నిర్వాహకులకు పరిశీలన తర్వాత నోటీసులు జారీ కానున్నాయి. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ఎక్స్(ట్విటర్), ఫేస్‌బుక్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. మహాదారుణంగా.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో 10 గంటల వాదనల తరువాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ తీర్పులను ఇచ్చిన జడ్జీలను సామాజిక మాధ్యమాల వేదికగా వికృత రూపాల్లో తూలనాడుతూ పోస్టులు వెల్లువెడ్డాయి. రాష్ట్రపతి కార్యాలయం స్పందన మరోవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్ పై స్పందించి పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. తదనంతరం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. -
Sep 27th 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Chandrababu Arrest: Petitions in different courts - Live Updates 5:10 PM, సెప్టెంబర్ 27, 2023 కిం కర్తవ్యం.? ► ఢిల్లీ: ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టిడిపి ఎంపీలతో లోకేష్ మంతనాలు ► పారని లీగల్ వ్యూహంతో దిగాలు పడ్డ చిన బాబు ► ఇప్పట్లో ఏపీకి వెళ్లకపోవడమే మంచిదని లోకేష్‌కు సూచించిన ఎంపీలు ► ఆంధ్రప్రదేశ్‌కు వస్తే లోకేష్‌ను అరెస్ట్ చేస్తారని కొన్ని రోజులుగా ఎల్లోమీడియా వార్తలు ► లోకేష్ వెళ్లగానే అరెస్ట్ కావడానికి అన్ని రకాల అవకాశాలున్నాయన్న ఎంపీలు ► ముందస్తు బెయిల్‌కు ఎలాంటి బలమైన వాదనలు లేవన్న ఎంపీలు ► వెళ్లి అరెస్ట్ అయ్యేకంటే ఇక్కడే హోటల్లో ఉండడమే మంచిదన్న భావనలో లోకేష్ 4:50 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టు : బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై అక్టోబర్ 4న నిర్ణయం ► చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వచ్చే నెల నాలుగు విచారణ వాయిదా ► అదే రోజున రెండు వర్గాలు వాదనలు పూర్తి చేయాలని న్యాయమూర్తి ఆదేశం ► మరోసారి వాదనాలు వేయవద్దని చంద్రబాబు లాయర్లకు సూచన ►ఎవరు వాదనలు చెప్పకపోయినా ఆర్డర్ పాస్ చేస్తామన్న న్యాయమూర్తి 4:25 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై కొనసాగుతున్న వాదనలు ► చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి, దర్యాప్తు పూర్తి చేస్తాం : CID లాయర్ పొన్నవోలు ► మొన్నటి కస్టడీలో చంద్రబాబు సహకరించలేదు ► ఆధారాలు చూపించడంతో చంద్రబాబు సమాధానాలు దాటవేశారు ► కస్టడీకి ఇస్తే కేసులో పూర్తి కుట్ర కోణం బయటపెడతాం ► విచారణ అక్టోబర్ 5కు వాయిదా వేయాలనుకున్నట్టు చెప్పిన న్యాయమూర్తి ► కస్టడీపై తమ వాదనలు పూర్తి చేయనివ్వాలని విజ్ఞప్తి చేసిన AAG పొన్నవోలు ► విచారణ వాయిదా వేయాలని కోరిన చంద్రబాబు లాయర్లు ► శుక్రవారం వాదనలు వినిపిస్తామన్న బాబు న్యాయవాదులు ► చంద్రబాబు తరపు లాయర్లపై ఏసీబీ కోర్టు ఆగ్రహం ► పిటిషన్ దాఖలు చేస్తారు, పదేపదే వాయిదా వేయాలని ఎందుకు కోరతారు? ► బెయిల్ పిటిషన్ దాఖలు చేసి 17 రోజులైనా వాదనలు ఎందుకు వినిపించడం లేదు? ► విచారణ ఎందుకు ముందుకు జరగనివ్వడం లేదని బాబు లాయర్లను ప్రశ్నించిన జడ్జి ► కోర్టు సమయం వృధా ఎందుకుచ చేస్తున్నారంటూ ప్రశ్నించిన న్యాయమూర్తి ► ఎంతకాలం పిటిషన్‌ను పెండింగ్ లో ఉంచాలి? ► లిఖిత పూర్వక మెమో దాఖలు చేయండి 4:20 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ఎల్లుండికి వాయిదా ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కొనసాగిన వాదనలు ► చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దంటూ కోరిన CID ► ఈ స్కాంలో చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరింది : అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ► ఏ కేసుకి ఆ కేసు ప్రత్యేకమని కులకర్ణి కేసులో గౌరవ న్యాయస్థానం స్పష్టం చేసింది ► ఒక కేసులో అరెస్ట్ అయితే అన్ని కేసుల్లో అరెస్ట్ అయినట్టు కాదు ► ఒక కేసులో రిమాండ్ విధించినప్పుడు అది మరో కేసుకు వర్తించదు ► మరో కేసులో మళ్లీ రిమాండ్ విధించవచ్చు ► ఈ అంశానికి సంబంధించిన పలు తీర్పును న్యాయమూర్తికి అందజేసిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► కేసును ఈ నెల 29, శుక్రవారం మధ్యాహ్నంకు వాయిదా వేసిన కోర్టు 4:05 PM, సెప్టెంబర్ 27, 2023 బలమైన ఆధారాలు vs పసలేని వాదనలు : సీనియర్ లాయర్లు ► స్కిల్ స్కాం కేసులో చంద్రబాబువి అత్యంత బలహీనమైన వాదనలు ► తనను అరెస్ట్ చేసిన విధానమే చంద్రబాబు చెప్పుకుంటున్న ఏకైక పాయింట్ ► ఎల్లోమీడియాలో చెప్పేదొకటి, కోర్టుల ముందు వాదించేది ఒకటి ► ప్రజలను నమ్మించడానికి తెలుగుదేశం, ఎల్లో మీడియా అబద్డాల ప్రచారం ► 17A కింద అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరమంటూ గగ్గోలు ► తప్పు చేయలేదు అని కోర్టు ముందు బలంగా చెప్పుకోలేని దుస్థితి ► కోర్టుల ముందు తప్పనిసరి పరిస్థితుల్లో నిజాల ఒప్పుకోలు ► పీకల్లోతు ఆరోపణలు, ప్రతీ దాంట్లో బాబుకు వ్యతిరేకంగా ఆధారాలు ► ఏకంగా 13 చోట్ల స్వయంగా సంతకాలు చేసిన చంద్రబాబు ► ఈ కేసులో చంద్రబాబు తప్పించుకోవడం కష్టమంటున్న లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు ► చంద్రబాబు కేసును చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందుకు తీసుకెళ్లిన బాబు లాయర్ లూథ్రా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : మీకు ఏం కావాలి? సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి సిద్ధార్థ్ లూథ్రా : మేం బెయిల్ కావాలని అడగడం లేదు, త్వరగా లిస్ట్ చేయమని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు, మధ్యంతర ఉపశమనం కావాలని అడుగుతున్నాం చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం. సిద్ధార్థ్ లూథ్రా : Z కేటగిరి ఉన్న వ్యక్తిని జైల్లో పెట్టారు, కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం 3:30 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో CID వాదనలు ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు ► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి ► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు ► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు ► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది ► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి ► తొలుత ఈ స్కాంను GST అధికారులు గుర్తించారు ► 2018 , పిసి యాక్ట్ - 17ఏ సవరణ రాకముందే నేరం జరిగింది ► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి ► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్ 3:20 PM, సెప్టెంబర్ 27, 2023 రెండు కేసులు వేర్వేరు, బాబుకు బెయిల్ వద్దు : అడ్వొకేట్ జనరల్ శ్రీరాం ► హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై వాదనలు ► వేర్వేరు కేసుల్లో సెక్షన్ 428 వర్తించదన్న ఏజీ శ్రీరామ్ ► స్కిల్, ఇన్నర్ రింగ్‌రోడ్ కేసుల్లో 2 వేర్వేరు లావాదేవీలు జరిగాయి ► రెండు కేసుల్లో వేర్వేరు నిందితులు ఉన్నారు ► రెండు వేర్వేరు కుట్రలు, రెండు వేర్వేరు కుంభకోణాలు ► ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబు కీలక సూత్రధారి, కీలక పాత్రధారి ► చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు : AP అడ్వొకేట్ జనరల్ శ్రీరాం 3:00 PM, సెప్టెంబర్ 27, 2023 "నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే.. ► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి ► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి ► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి ► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి ► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా 2:45 PM, సెప్టెంబర్ 27, 2023 చంద్రబాబు పిటిషన్ వాయిదా ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వాయిదా ► పిటిషన్‌పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్ ఖన్నా జస్టిస్ ఖన్నా : మా సహచరుడు జస్టిస్ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు హరీష్ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు జస్టిస్ ఖన్నా : వచ్చే వారం చూద్దాం సిద్ధార్థ లూథ్రా : ఒక సారి చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తాను జస్టిస్ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను హరీష్ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు జస్టిస్ ఖన్నా : చీఫ్ జస్టిస్‌ను కలిసి మరో బెంచ్ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు హరీష్ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సరే, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను జస్టిస్ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్‌లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుంది". 2:35 PM, సెప్టెంబర్ 27, 2023 నాట్ బిఫోర్ : సుప్రీంకోర్టు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ► చంద్రబాబు పిటిషన్‌పై "నాట్ బిఫోర్ మి" అని స్పందించిన జస్టిస్ SVN భట్టి ► మరో బెంచ్‌కు పిటిషన్‌ను మార్చాల్సిన అవశ్యకత ► ఈ కేసును విచారించలేనని తేల్చిచెప్పిన జస్టిస్ భట్టి ► బాబు పిటిషన్‌పై వచ్చే వారం విచారణ జరిగే అవకాశం ► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 2:15 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు హాల్ నెంబర్ 3కు ఇరుపక్షాల లాయర్లు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్‌పై కొద్దిసేపట్లో విచారణ ► చంద్రబాబు తరపున మరోసారి హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► కిక్కిరిసిన హాల్ నెంబర్ 3, వాదనలు వినేందుకు వచ్చిన లాయర్లు, ఇతరులు ► బెంచ్ మీదకు వచ్చిన కేసు 2:10 PM, సెప్టెంబర్ 27, 2023 న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు కిక్కిరిసిన హాల్ నెంబర్ 3 ► మరికొద్దిసేపట్లో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు ► విచారణ జరపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ SVN భట్టి ధర్మాసనం ► ఐటం నెంబర్ 61గా లిస్ట్ అయిన చంద్రబాబు పిటిషన్ ► స్పెషల్ లీవ్ పిటిషన్ నెంబర్ 12289/2023 ► చంద్రబాబు తరపున రికార్డు ప్రకారం అడ్వొకేట్ గుంటూరు ప్రమోద్ ► ఇప్పటికే హేమాహేమీలను రంగంలోకి దించుతామని చెబుతోన్న లోకేష్ ► గత 11 రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ సుప్రీంకోర్టు లాయర్లతో లోకేష్ మంతనాలు ► హైకోర్టులో క్వాష్ పిటిషన్ సందర్భంగా బాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా ► Follow www.sakshi.com LIVE updates 1:56 PM, సెప్టెంబర్ 27, 2023 బాబు దోచుకుంటే.. జగన్ ఫ్రీగా స్కిల్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు ► చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై మండలిలో స్వల్పకాలిక చర్చ.. ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు కామెంట్స్ ► స్కిల్ డెవలప్మెంట్ ను స్కామ్ గా మార్చి చంద్రబాబు తన ఆదాయవనరుగా చేసుకున్నారు ► చంద్రబాబు 371 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో కొల్లగొట్టాడు. ► ప్రజాధనాన్ని దోచుకుని తాను ఏమీ చేయలేదన్నట్లు మాట్లాడుతున్నాడు ► సీఎం జగన్ మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థుల భవితకు అండగా నిలుస్తున్నారు ► 26 జిల్లాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లఏర్పాటుకు ఒక్కొక్క దానికి ఐదు ఎకరాల భూమిని సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయించారు ► సీఎం జగన్.. ప్రభుత్వ నిధుల నుండి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వివిధ సంస్థల సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు 1:10 PM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో A14గా లోకేష్ ► అరెస్ట్ భయంతో గత 11 రోజులుగా ఢిల్లీకే పరిమితమైన లోకేష్ ► తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పాత్రను తేల్చిన CID ► లోకేష్‌కు ఏ రకంగా లబ్ది చేకూరిందో తెలుపుతూ A14గా తేల్చిన CID ► తనను అరెస్ట్ చేయకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ► ముందస్తు బెయిల్ ఇస్తే పాదయాత్ర చేసుకుంటానంటున్న లోకేష్ 1:00 PM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టులో లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు ► ఢిల్లీ: సుప్రీం కోర్టు లో లంచ్ బ్రేక్ ► లంచ్ బ్రేక్ తర్వాతే చంద్రబాబు కేసు విచారణ ► లంచ్ కోసం బెంచ్ నుంచి లేచిన జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ SVN భట్టి ► మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభం కానున్న విచారణ ► ఐటెం నెం.61 గా ఉన్న చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ 12:50 PM, సెప్టెంబర్ 27, 2023 ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా? ► ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌పై టిడిపికి YSRCP ఏడు ప్రశ్నలు 1. అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని ఎకరాను రూ.8 లక్షలకు విక్రయించారు, అలైన్మెంట్ తర్వాత రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చూపించారు. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకు పైగా పెరిగింది వాస్తవం కాదా? 2. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? 3. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు సీఎం హోదాలో చంద్రబాబే ప్రకటించింది వాస్తవం కాదా? 4. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది వాస్తవం కాదా? 5. అమరావతి నిర్మాణం పూర్తయితే ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనున్న 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా వాస్తవం కాదా? 6. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్‌ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లు పెరిగిందన్నది వాస్తవం కాదా? 7. ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు.. స్కాం జరగలేదంటారు.. మరి ఇన్నాళ్లు ప్రజలకు రాజధాని కట్టామని ఎందుకు చెప్పారు? చంద్రబాబు సృష్టించిన సంపద అంటే మాయా ప్రపంచమేనా? 12:40 PM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ జోలికి రావొద్దు : తెలుగుదేశం ► అర్జంటుగా భుజాలు తడుముకుంటోన్న తెలుగుదేశం బృందం ► లోకేష్‌ను A14గా అభియోగాలు మోపుతూ కోర్టులో CID పిటిషన్ ► A14 అని తెలియగానే ఢిల్లీలో చిందులు తొక్కిన చినబాబు ► ఏమైనా చేయండి, నాపై కేసును ఖండించాలని టిడిపి నేతలకు ఆదేశం ► ఆఘమేఘాల మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ పెట్టిన పంచుమర్తి అనురాధ ► అసలు మేం రాజధానే కట్టలేదు, ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడిది? : పంచుమర్తి ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు భూమి సేకరించలేదు, బడ్జెట్ కేటాయించలేదు ► హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చారన్న ఆరోపణలు కూడా సరికాదు ► లింగమనేనికి అనుకూలంగా ఇన్నర్ రింగ్ రోడ్ తయారు చేశారని ఎలా చెబుతారు?: పంచుమర్తి ► TDP తీరును తప్పుబట్టిన YSRCP, ఇదే విషయం కోర్టులో చెప్పగలరా? : YSRCP ► CID చూపించిన ఆధారాలకు ఏమని సమాధానం చెబుతారు? : YSRCP 12:10 PM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో మీ నిర్ణయమేంటీ? ► కస్టడీ, బెయిల్ పిటిషన్‌పై CID, బాబు లాయర్ల వాదనలు ► వెంటనే వాదనలు వినాలన్న CID లాయర్లు ► సుప్రీంకోర్టులో SLP ఉన్నందున దాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్న బాబు లాయర్లు ► వాదనల విషయంలో ఒక నిర్ణయానికి రావాలని ఇరుపక్షాల లాయర్లకు కోర్టు సూచన ► సాయంత్రం 5గంటలలోపు వాదనలపై ఏకాభిప్రాయానికి వస్తే వింటామన్న న్యాయమూర్తి 11:40 AM, సెప్టెంబర్ 27, 2023 కోర్టుల మీద నోరు పారేసుకుంటారా? క్రిమినల్ కేసు పెట్టమని హైకోర్టు సీరియస్ ► చంద్రబాబు అరెస్టు తర్వాత న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేసిన ఎల్లో బ్యాచ్ ► నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసిన పచ్చ మీడియా, టిడిపి నేతలు ► హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణలకు దిగిన గ్యాంగ్ ► ఈ వ్యవహారం అడ్వొకేట్ జనరల్ శ్రీరాం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ► ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ► తెలుగుదేశం నాయకులు, సానుభూతి పరులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన హైకోర్టు ► టిడిపి నేతలు బుచ్చయ్య చౌదరీ, బుద్ధా వెంకన్న, రామకృష్ణ సహా 26 మందికి నోటీసులు ► ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలకు నోటీసులు ఇవ్వాలని AP DGPకి ఆదేశం ► బుద్ధా వెంకన్న ► గోరంట్ల బుచ్చయ్య చౌదరీ ► ఎస్. రామకృష్ణ ► రామకృష్ణ గోనె ► మువ్వా తారక్ కృష్ణ యాదవ్ ► రవికుమార్ ముదిరాజు ► రుమాల రమేష్ ► ఎల్లా రావు ► కళ్యాణి ► అకౌంట్ : @NCHIRAN17457886 ► అకౌంట్ : In Jesus New Life @ NewIN34229 ► అకౌంట్ : @TrueAPDeveloper ► అకౌంట్ : Mosapu ► అకౌంట్ : Jail Jj ► అకౌంట్ : The Ark @ArkTheAce ► అకౌంట్ : @EdukondaluMupp2 ► అకౌంట్ : @Royanenenu ► అకౌంట్ : @Wish_cap ► అకౌంట్ : @Cdattu ► అకౌంట్ : @Bean9989 ► అకౌంట్ : Chary Veda ► అకౌంట్ : Paramasivaiah Gsanju Chandu ► అకౌంట్ : SriKishore Kumar ► సంస్థ : గూగుల్ ఇండియా ► సంస్థ : ట్విట్టర్ ఇండియా ► సంస్థ : ఫేస్బుక్ ఇండియా 11:30 AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీలో చంద్రబాబు అసలు రంగు బయటపెట్టిన MLA వరప్రసాద్ ► వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు ► ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్నాడు ► ఓటుకు కోట్లు అనే కాన్సెప్ట్‌ను చంద్రబాబు ఎప్పటినుంచో అనుసరిస్తున్నాడు ► తిరుపతి ఎంపీగా నేను ఉన్నప్పుడు టిడిపిలో చేరమని ఒత్తిడి తెచ్చాడు ► ఒకటి కాదు..రెండు కాదు.. వంద కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చాడు ► చంద్రబాబు లాంటి దిగజారిన రాజకీయాలు చేసే వ్యక్తి ఇంకొకరు లేరు 11:15AM, సెప్టెంబర్ 27, 2023 ACB కోర్టులో బాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు ► ACB కోర్టుకు చేరుకున్న ఇరు వర్గాల న్యాయవాదులు ► కస్టడీ పిటిషన్ పై విచారణ చేయాలన్న CID లాయర్ వివేకానంద ► బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలన్న చంద్రబాబు లాయర్ ప్రమోద్ దూబే ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాదనలు వింటానన్న న్యాయమూర్తి 11:10AM, సెప్టెంబర్ 27, 2023 సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుంది? ► అందరి చూపు సుప్రీంకోర్టు వైపు ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్లో నేడు వాదనలు జరిగే అవకాశం ► చంద్రబాబు తరపున దేశంలోనే అత్యంత ఖరీదైన లాయర్లు ► అరెస్ట్ జరిగిన తీరును ప్రశ్నిస్తూ పిటిషన్ వేసిన బాబు లాయర్లు ► 17A సెక్షన్ ప్రకారం గవర్నర్‌కు చెప్పలేదంటూ సాంకేతిక అంశాలు ► హైకోర్టులో ఇదే అంశంపై వాదనలు, బాబు లాయర్ల వాదనను తిరస్కరించిన కోర్టు ► కేసు కీలక దశలో ఉంది, దర్యాప్తును నిలిపివేయలేమని తేల్చిచెప్పిన హైకోర్టు ► ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తేల్చబోతుందన్న దానిపై ఉత్కంఠ ► రేపటి నుంచి అక్టోబర్ 3వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 11:00AM, సెప్టెంబర్ 27, 2023 ఏసీబీ కోర్టు ముందుకు చంద్రబాబు పిటిషన్లు ► చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ జరిగే అవకాశం ► విచారణ కోసం జడ్జి ముందు మెన్షన్ చేసిన చంద్రబాబు లాయర్లు ► రెండు పిటిషన్లను విచారించి ఉత్తర్వులు ఇస్తామని తెలిపిన జడ్జి ► స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ 10:50AM, సెప్టెంబర్ 27, 2023 హైకోర్టు ముందుకు ఉండవల్లి అరుణ్‌కుమార్ పిటిషన్ ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు మాజీ ఎంపీ ఉండవల్లి పిటిషన్ ►ఇప్పటికే బెంచ్‌ను కేటాయించిన హైకోర్టు రిజిస్ట్రీ ►పిల్ విచారించేందుకు తమలో ఒకరికి అభ్యంతరం ఉందని పేర్కొన్న బెంచ్ ►నాట్ బి ఫోర్ మీ అని పేర్కొన్న జస్టిస్ రఘునందన్ రావు ►మరో బెంచ్‌కు వెంటనే బదిలీ చేయాలని ఆదేశించిన చీఫ్ జస్టిస్ ►ప్రజా ప్రయోజనవ్యాజ్యానికి రిట్ నెంబర్ 38371/2023 కేటాయింపు ►చంద్రబాబు A1గా ఉన్న స్కిల్ స్కాం పరిధి చాలా పెద్దదని పేర్కొన్న ఉండవల్లి ►ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలు CBI, ED, ITలకు అప్పగించాలని విజ్ఞప్తి ►నిధులు పక్కదారి పట్టించేందుకు ఇతర ప్రాంతాల్లో షెల్ కంపెనీలు ఏర్పాటయ్యాయి ►ఈ కంపెనీల గుట్టు బయటపడాలంటే సమగ్ర దర్యాప్తు అవసరం ►కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలన్నీ ఏకమై విచారణ చేస్తేనే కుట్ర బహిర్గతమవుతుంది ►ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర పై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి ►44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ రిట్ పిటీషన్ దాఖలు ►హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రఘునందన్ రావు బెంచ్ ముందుకు పిటిషన్ 10:30AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్‌ను తప్పుపడుతున్నారంతే.! ►నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటం నెంబర్ 61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 10:00AM, సెప్టెంబర్ 27, 2023 తప్పు చేయలేదని చెప్పడం లేదు, అరెస్ట్‌ను తప్పుపడుతున్నారంతే.! ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి ►కానీ, 17 (ఏ) సెక్షన్ చంద్రబాబుకు వర్తించదని హైకోర్టు స్పష్టీకరణ ►ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ కొట్టివేత కూడా ► ఆ వెంటనే సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదైన స్కిల్ స్కాం కేసును కొట్టివేయాలని పిటిషన్ ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి.. నేడు విచారణ 09:22AM, సెప్టెంబర్ 27, 2023 ముందు ఏ పిటిషన్‌పై విచారణ? ►ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటీషన్లపై విచారణ ►చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరిన చంద్రబాబు తరపు న్యాయవాదులు ►రెండురోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని, మరో ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారుల పిటిషన్ ►ఏ పిటిషన్ పై ముందు వాదనలు జరుపుతామనేది ఈ రోజు ప్రకటించనున్న కోర్టు ►ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పిటి వారెంట్, ఏపి ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ పైనా ఈరోజు వాదనలు జరిగే అవకాశం ►ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారా లోకేష్ ను A14గా చేర్చి ఇంచార్జి ఎమ్ఎస్ జే కోర్టులో మెమో దాఖలు చేసిన సీఐడీ ►లోకేష్ పేరుతో కూడిన మెమోపై కూడా ఇవాళ విచారణ జరిగే అవకాశం.. 09:10AM, సెప్టెంబర్ 27, 2023 అసెంబ్లీ సమావేశాల్లో బాబు స్కామ్‌లపై చర్చ ►ఏపీ అసెంబ్లీ సెషన్.. చివరిరోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ►పలు బిల్లులతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంపై చర్చ జరగనుంది. ►అలాగే శాసనమండలిలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంపైనా చర్చ జరగనుంది 08:55AM, సెప్టెంబర్ 27, 2023 లోకేష్ పాత్ర ఉందనే ఫిర్యాదు చేశా: ఎమ్మెల్యే ఆర్కే ►ఇన్నర్ రోడ్ స్కాంలో లోకేష్ పాత్ర ఉందనే సీఐడీకి ఫిర్యాదు చేశా ►చట్టాలు గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, లోకేస్.. కోర్టు విషయంలో ఎందుకు భయపడుతున్నారు ►ఇన్నర్ రింగ రోడ్ అలైన్మెంట్ విషయంలో తన వారికి లబ్ధి చేకూరే విధంగా మార్పు చేశారనేది స్పష్టం. 08:00AM, సెప్టెంబర్ 27, 2023 తండ్రీకొడుకుల ఆట ముగిసింది: ఎంపీ విజయసాయిరెడ్డి ►తండ్రి ఎలాగో కొడుకు అలాగే! ►ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేష్ A14ని కలవండి. ►ఢిల్లీలో ఉన్నప్పుడు తను కలిసే లాయర్లకు బై-వన్-గెట్-వన్-ఫ్రీ స్కీమ్ అందించాలి. ►తండ్రి కేసును టేకప్ చేయండి.. కొడుకు కేసును ఉచితంగా పొందండి ►ఈ తండ్రీకొడుకుల ఆట ఇప్పుడు ముగిసింది. Like father, Like son! Meet Nara Lokesh A14 in the Inner Ring Road scam. While in Delhi he should offer a buy-one-get-one-free scheme to the lawyers he is meeting. Take up the father’s case and you’ll get the son's case for free. This father-son duo’s game is now over. pic.twitter.com/JIhpnXrA8R — Vijayasai Reddy V (@VSReddy_MP) September 27, 2023 06:52AM, సెప్టెంబర్ 27, 2023 క్రిమినల్ కంటెంప్ట్ పై నేడు ఏపీ హైకోర్టులో విచారణ ►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన ఏజీ ►నేడు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ 06:52AM, సెప్టెంబర్ 27, 2023 నేడు చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్ల పై విచారణ నేటికి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►రెండు పిటిషన్ల పై నేడు విచారణ జరిపి ఉత్తర్వులు ఇస్తామన్న ఏసీబీ కోర్టు ►చంద్రబాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ ►సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేసిన చంద్రబాబు న్యాయవాదులు 06:45AM, సెప్టెంబర్ 27, 2023 నేడు హైకోర్టులో అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణ ►అమరావతి రింగ్ రోడ్డు కేసు విచారణను నేటికి వాయిదా వేసిన హైకోర్టు ►మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వింటామన్న హైకోర్టు ►రింగ్ రోడ్డు కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 06:44AM, సెప్టెంబర్ 27, 2023 నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 06:00AM, సెప్టెంబర్ 27, 2023 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @18 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్. ► స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు ► రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► తాజా పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు -
ఫైబర్ నెట్లో రూ.114 కోట్లు దోచేశారు!
సాక్షి, అమరావతి: ఫైబర్‌నెట్ స్కామ్‌లో మాజీ సీఎం చంద్రబాబు రూ.114 కోట్లకుపైగా ప్రజాధనాన్ని లూటీ చేశారని, ఇది ఒక కేస్ స్టడీ లాంటిదని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. 2015 సెప్టెంబర్ నుంచి 2018 వరకు ఈ కుంభకోణం జరిగిందన్నారు. 2021లో ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైనట్లు చెప్పారు. చంద్రబాబు తన ఓఎస్డీ అభీష్ణ ద్వారా ఈవీఎంల దొంగ వేమూరి హరికృష్ణప్రసాద్ని మెంబర్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సి ల్గా నియమించాలని ఐటీ కార్యదర్శికి లేఖ రాశా రని చెప్పారు. ప్రాజెక్టు సాంకేతిక మదింపు కమిటీ, టెండర్ మదింపు కమిటీలోనూ హరికృష్ణప్రసాద్ సభ్యుడిగా ఉన్నాడని తెలిపారు. హెరిటేజ్ సంస్థల్లో డైరెక్టర్‌గా పనిచేసిన దేవినేని సీతారా మయ్య 2000 సెప్టెంబర్ 30 నుంచి 2014 వరకు టెరా సాఫ్ట్ సంస్థకు 14 ఏళ్లు డైరెక్టర్‌గా ఉన్నారని వెల్లడించారు. ఫైబర్‌నెట్ ప్రాజెక్టుపై మంగళవారం అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. బ్లాక్ లిస్టు కంపెనీకి టెండర్ అప్పటిదాకా బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్‌ను రూ.333 కోట్ల బిడ్డింగ్ ముగియటానికి ఒక్క రోజు ముందు బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించారు. అప్పటి ఏపీటీఎస్ వీసీ అండ్ ఎండీ సుందర్ దీనిపై అభ్యంతరం తెలిపితే ఆయన్ను బదిలీ చేశారు. టెండర్ ప్రక్రియ ముగిశాక హరికృష్ణప్రసాద్‌ను టెరా మీడి యా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి డైరెక్టర్‌గా తొలగించారు. ఈ స్కామ్ పూర్తిగా చంద్రబాబు కనుస న్నల్లోనే జరిగింది. ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి టెరా సాప్ట్‌కి రూ.284 కోట్లు విడుదల చేయగా అందులో రూ.117 కోట్లు ఫాస్ట్ లైన్ అనే సంస్థకి ఇచ్చా రు. ఆగస్టులో టెండర్లు జరిగితే సెప్టెంబర్‌లో ఆ కంపెనీ ఏర్పాటైంది. నెట్వర్క్, ఎక్స్‌వైజెడ్, కాపీ మీడియా లాంటి షెల్ కంపెనీల ద్వారా డబ్బును బదిలీ చేశారు. ఈ డబ్బంతా హరికృష్ణప్రసాద్ కుటుంబ సభ్యులు వేమూరి అభిజ్ఞ, వేమూరి నీలిమ తదితరులకు వెళ్లినట్లు తేలింది. ఈ కంపెనీలన్నింటి చిరునామా, టెరా సాఫ్ట్వేర్ అడ్రస్ ఒక్కటే. అప్పటికప్పుడు సృష్టించిన షెల్ కంపెనీల ద్వారా డబ్బులను తరలించారు. పెండ్యాల శ్రీనివాస్ ద్వారా ఈ డబ్బంతా చంద్రబాబు వద్దకు చేరింది. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సీమెన్స్ వెబ్సైట్లో ఏపీ ప్రాజెక్టు గురించి ఎక్కడా లేదు. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్నాటక ప్రాజెక్టుల గురించి మాత్రమే ఉంది. తమకున్న వ్యాపార సంస్థలో 2 శాతం అమ్మేస్తే రూ.400 కోట్లు వస్తాయని బాబు సతీమణి అంటున్నారు. ఆ వ్యాపారాలు ఉండడానికి ఆమె భర్త బ్యాక్‌గ్రౌండ్ ఏమిటి? 2 శాతం అమ్మితేనే రూ.400 కోట్ల వస్తాయంటే వంద శాతం అమ్మేస్తే రూ. 20 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? చంద్రబాబు రెండు ఎకరాల నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారు? అన్నీ అవకతవకలే: వేణుగోపాల్, ఎమ్మెల్యే టెండర్లలో నిబంధనలను పాటించలేదు. ఇతర సంస్థలతో కన్సార్టియమ్గా ఏర్పడి టెరాసాఫ్ట్ వేసిన టెండర్ డాక్యుమెంట్లు సరైనవి కాకపోవడంతో ఇతరులు అభ్యంతరం తెలిపారు. ఈ స్కామ్‌కు ప్రత్యక్ష సాక్షిని, బాధితుడిని నేనే కనుక ఈ విషయాలు స్పష్టంగా చెప్పగలుగుతున్నా. సూత్రధారులు బాబు, లోకేశ్‌లే: అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే ఫైబర్ గ్రిడ్ స్కామ్ సూత్రధారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్‌లే. వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా వీరు దోపిడీకి పాల్పడ్డారు. టెండర్లలోనే కాకుండా నాసిరకం పరికరాలతో ప్రజాధనాన్ని దోచేశారు. బాబు అవినీతిని ఎవరు కట్ చేస్తారు? (ఫైబర్ గ్రిడ్ స్కామ్‌పై 26.3.2016న ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో ఏమన్నారో తాజాగా సభలో ప్రదర్శించారు) ‘చంద్రబాబు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ప్రాజెక్టును రూ.333 కోట్లకు ఎంత దారుణంగా ఇచ్చారో, ఇందులో ఎన్ని వందల కోట్ల స్కామ్ జరిగిందో చెబుతా. చౌక దుకాణాల్లో ఈ–పోస్ యంత్రాలను అమర్చడంలో విఫలమై బ్లాక్ లిస్టులో పెట్టిన టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ అనే సంస్థకు ఫైబర్ గ్రిడ్ పనులను రూ.333 కోట్లకు ఎలా అప్పగించారో చంద్రబాబుకే తెలియాలి. హెరిటేజ్‌తో సంబం«ధాలున్న వేమూరి హరికృష్ణప్రసాద్కి టెరా సాఫ్ట్‌తో అనుబంధం ఉంది. ఈవీఎంల దొంగతనం కేసు నమోదైన వ్యక్తికి చెందిన సంస్థకు ఈ ప్రాజెక్టును ఇచ్చారు. టెండర్ల పర్యవేక్షణ కమిటీలో ఆయన్ను సభ్యుడిగా నియమించారు. ఆయనే టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్ సంస్థ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడు. పర్యవేక్షణ కమిటీ సభ్యుడుగా ఉంటూ తన సొంత సంస్థ టెరా సాఫ్ట్‌కు పనులు ఇచ్చేసుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న దేవినేని సీతారామయ్య 2014 సెప్టెంబర్ 30 వరకు టెరా సాఫ్ట్‌వేర్‌లోనూ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదే సంస్థకు ఫైబర్ ఆప్టికల్ పనుల్ని చంద్రబాబు అప్పగించారు. వేమూరి హరికృష్ణప్రసాద్, చంద్రబాబు కుటుంబం మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు తేటతెల్లమవు తుంటే ఇక ఇది ఏ రకంగా పారదర్శకం? ఇది సబబేనా? పెన్షన్లు, ఇళ్ల విషయంలో ఒకటో అరో అవినీతి జరిగితే కట్ చేయాలంటాడు చంద్రబాబు. మరి ఆయనే దగ్గరుండి చేస్తున్న అవినీతిని ఎవరు కట్ చేస్తారు?’ అని అప్పట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ఆన్లైన్ మాయగాళ్లు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లాలో ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులకు, యువతకు కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి అందిన మేరకు దోచుకొంటున్నారు. ఇలాంటి కేసులు నగరంలో ఇటీవల ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఆ ప్రకటనలు నమ్మి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, మోసగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. ఊడ్చేస్తున్నారు ఇలాగే విజయవాడలోని యువతి మొబైల్‌కు.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్ చేస్తే చాలని, అన్నింటికి లెక్కకట్టి డబ్బులు వేస్తామని నమ్మపలకగా ఆమె అంగీకరించి బ్యాంకు ఖాతా వివరాలను పంపింది. మొదట మూడు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.150, ఆరు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.300 బ్యాంకు ఖాతాలో వేశారు. ప్రీపెయిడ్ టాస్క్‌లు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని మాయగాళ్లు నమ్మబలికారు. తొలుత రూ.1000 చెల్లిస్తే, తిరిగి రూ.1600 బ్యాంకు ఖాతాలో వేశారు. ఇలా విడతల వారీగా ఆమె 19 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి మోస పోయింది. ఇలా నగరంలో ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చనే మొయిల్లను నమ్మి మోసపోతూనే ఉన్నారు. యువతను ఆకర్షించి.. కొంత మంది యువత ప్రభుత్వ పథకాల కోసం అకౌంట్లను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారిని కొన్ని ముఠాలు ఆకర్షిస్తున్నాయి. వారికి పార్ట్‌టైమ్ జాబ్‌లు, కమిషన్ వస్తుందని ఆశ చూపుతున్నారు. వీరి అకౌంట్లకు లింక్ అయిన ఫోన్ నంబర్లను అన్లైన్లోనే మార్చి, వారి ఫోన్ నంబర్లకు లింక్ చేసుకొని ఖాతాలను వాడుకొంటున్నారు. ఇలా పలు బ్యాంకు అకౌంట్ల నుంచి మాయ మాటలతో డబ్బులు సేకరించి, ఒక కరెంటు అకౌంట్‌కు బదిలీ చేసుకొని, దానిని క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. దీంతో ఆ డబ్బు ఏదేశానికి ఎక్కడికి వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. గల్ఫ్, హాంకాంగ్, బంగ్లాదేశ్, మలేషియా దేశాలకు ఉద్యోగాల కోసం ఇండియా నుంచి వెళ్లిన వారిని మాయగాళ్లు ఉపయోగించుకొంటున్నారు. యూఎస్బేస్ సర్వర్లు ఆ దేశాల నుంచి నిర్వహిస్తుండటంతో, మోసగాళ్ల ఆట కట్టించడం కూడా కష్టంగా మారింది. -
చంద్రబాబు ఏ–1.. లోకేశ్ ఏ–14
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు సహకార డెయిరీలను దెబ్బతీసి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం, ఆస్తులను అమాంతం పెంచగా ఆయన తనయుడు లోకేశ్ రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను కొల్లగొట్టారు. తమ బినామీ, సన్నిహితుడు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడి భారీ భూదోపిడీకి తెగబడటంలో చంద్రబాబు, లోకేశ్ చక్కటి సమన్వయం కనబరిచారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కరకట్ట నివాసాన్ని తీసుకోగా హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ భూములను కొల్లగొట్టారు. ఈ అవినీతి భూబాగోతాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈమేరకు న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవినీతి మెలికలు.. అమరావతి ముసుగులో చంద్రబాబు సాగించిన భారీ భూదందాలో ఐఆర్ఆర్ కుంభకోణం ఓ భాగం! మాజీ మంత్రి పొంగూరు నారాయణతోపాటు లోకేశ్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తమ బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేష్‌తో క్విడ్ ప్రోకోకు పాల్పడి ఆయన భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. అందుకు ప్రతిగా బినామీల పేరిట భారీగా భూములను పొందడమే కాకుండా కరకట్ట నివాసంతోపాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు కానుకగా దక్కించుకున్నారు. నాడు సీఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కి.మీ. అమరావతి ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి దాన్ని నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజాను పరిగణలోకి తీసుకున్నారు. అందుకోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఈ క్రమంలో తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకుని అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబం భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి ఉన్న 355 ఎకరాలను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా అదే ప్రాంతంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను పొందారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందగా 2014 జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కొనుగోలు చేసినట్టు చూపించారు. లింగమనేని కుటుంబ నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. లోకేశ్ కీలక ‘భూ’మిక క్విడ్‌ప్రోకోకు పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను దక్కేలా చేయడంలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఆయన 2008 జూలై 1 నుంచి 2013 జూన్ 29 వరకు హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అనంతరం 2017 మార్చి 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కొనుగోలు పేరిట భూములను దక్కించుకోవాలని నిర్ణయించిన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. క్విడ్ ప్రోకో కింద భూములను పొందే ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించారు. లోకేశ్ పేరిట హెరిటేజ్ ఫుడ్స్‌లో 23,66,400 షేర్లు ఉన్నాయి. అంటే హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్‌కు 10.20 శాతం వాటా ఉంది. బాబుకు కరకట్ట నివాసం క్విడ్‌ప్రోకోలో భాగంగా లింగమనేని రమేశ్ విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై ఉన్న తన బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారాన్ని మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ బుకాయించారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయపన్ను వివరాల్లో లేవు. తరువాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్‌ప్రోకో కింద ఇచ్చారని స్పష్టమైంది. లింగమనేని నుంచి కానుకగా స్వీకరించిన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్ దర్జాగా నివసించడం గమనార్హం. పవన్‌కూ వాటా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు చేరువలో పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. భారీగా పెరిగిన విలువ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారమైతే ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.62.4 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకుని రద్దు చేసినట్టు చూపిన మరో 4.55 ఎకరాల విలువ కూడా రూ.27.3 కోట్లకు చేరుతుంది. ఇక చంద్రబాబు బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాల విలువ అమాంతం పెరిగింది. -
Nara Lokesh: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14
సాక్షి, కృష్ణా: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రి నారాయణ, పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్‌ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు. అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ తయారీ ఆమోదంలో.. చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారాయణ, లింగమనేని రమేష్, నారా లోకేష్, మరికొందరు కూడబలుక్కొని వారికి, అనుయాయులకు భారీ లబ్ధి చేకూరేలా, వారి భూములకు మాత్రమే భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారు. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్‌లో సీఐడీ కేసు నమోదు చేసింది. దర్యాప్తు తదనంతరం.. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. లోకేశ్‌దే కీలక పాత్రే... అయితే.. ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్లో మార్పులు చేసి నారా లోకేష్ లబ్ధి పొందాలని ప్రయత్నించారని అభియోగాలు నమోదు చేసింది ఏసీ సీఐడీ. ఈ మేరకు మెమోలో ఏ14గా లోకేష్ పేరును మెన్షన్ చేసింది ఏపీ సీఐడీ. అంతకు ముందు క్విడ్ ప్రోకో కింద లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించారనే ఆరోపణలు లోకేష్‌పై ఉన్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసుతో పాటు ఫైబర్ నెట్ కేసులోనూ లోకేష్ నిందితుడిగా ఉన్నారు. ఇన్నర్‌రింగ్‌రోడ్డు కేసు వ్యవహారం.. అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. లింగమనేని కోసమే.. ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌తో పాటు ఇన్నర్‌రింగ్ రోడ్డు స్కాంలో క్విడ్ ప్రోకోలో భాగంగా.. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించిన కరకట్ట నివాసాన్ని వ్యక్తిగతంగానే ఇచ్చారు. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. -
మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం.. దూరం పెట్టడంతో!
తూర్పు గోదావరి: తనను తీసుకువెళ్తున్నది మేకవన్నె పులి అని.. అభం శుభం తెలియని ఆ చిన్నారి మనస్సుకు అర్థం కాలేదు.. నిలువెల్లా కాపట్యం నిండిన ఆ క్రూరుడు తనను కబళించేస్తాడని ఏ మాత్రం అనుకోలేదు.. బంధువే కదా అనుకుంటూ ఆ దుర్మార్గుడిని నమ్మింది.. మాయమాటలు విని, అతడితో వెళ్లింది.. చివరకు ఆ దౌర్భాగ్యుడి చేతుల్లో అత్యంత క్రూరంగా హతమారిపోయింది. పెద్దాపురం పట్టణంలో సంచలనం రేపిన బాలిక హత్యకు కారకుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం వేట మొదలుపెట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన దంపతులు ద్రోణ వీర్రాజు, జ్యోతి కొన్నాళ్ల కిందట మనస్పర్థల కారణంగా విడిపోయారు. దీంతో జ్యోతి తన పదేళ్ల కుమార్తె ప్రవీణ కుమారి అలియాస్ మానస, తన తల్లి సునీతతో కలసి పట్టణ శివారులోని ఎన్టీఆర్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన బత్తిన నాని జ్యోతికి సమీప బంధువు. వరుసకు మేనల్లుడు అవుతాడు. ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి, కొనసాగుతోంది. అయితే, తన కుమార్తె ఎదుగుతోందని, ఇంటికి రావడం సరికాదని అంటూ కొన్నాళ్లుగా నానిని జ్యోతి దూరం పెడుతోంది. అది తట్టుకోలేని నాని తమ సాన్నిహిత్యానికి అడ్డంగా ఉన్న మానసను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీనికి ప్రణాళిక సిద్ధం చేశాడు. అందులో భాగంగా బయటకు తీసుకువెళ్తానని ఈ నెల 19వ తేదీన మానసకు చెప్పాడు. బంధువే కావడంతో అతడి మాటల్ని ఆ బాలిక నమ్మింది. మానసను తన బైక్‌పై ఎక్కించుకున్న నాని, స్థానిక కట్టమూరు పుంత రోడ్డులోకి తీసుకువెళ్లి, ముందే వేసుకున్న పథకం ప్రకారం హతమార్చాడని పోలీసులు చెబుతున్నారు.బయటకు వెళ్లిన మానస ఎంతకూ ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఈ నెల 20వ తేదీన పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై దర్యాప్తు ఆరంభించిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న నానిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టేందుకు ప్రయతి్నంచారు. చివరకు అతడు పరారీలో ఉన్నాడని గుర్తించారు. మరోవైపు బాలిక ఆచూకీ కోసం కూడా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కట్టమూరు పుంతలో బాలిక మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే ఆ బాలిక మృతదేహం పూర్తిగా పాడైపోయింది. కుక్కలు ఈడ్చుకు రావడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. చివరకు దుస్తుల ఆధారంగా ఆ మృతదేహం మానసదేనని గుర్తించారు. చిన్నారి మృతదేహానికి పెద్దాపురం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, బంధువులకు అప్పగించి, సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. మానస హత్యకు కారకుడైన నాని ఫొటోను పోలీసులు విడుదల చేశారు. అతడిని పట్టించిన వారికి రూ.10 వేల పారితోíÙకం అందిస్తామని ప్రకటించారు. డీఎస్పీ లతాకుమారి నేతృత్వంలో సీఐ అబ్దుల్ నబీ, ఎస్సై సురే‹Ùలు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం
సాక్షి, పల్నాడు జిల్లా: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, వీధుల్లో, వ్యాపార సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల నిమజ్జనం మహోత్సవంలో పలు అపశ్రుతి, అనుకోని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కరెంట్ షాక్ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన నరసరావుపేటలో చోటుచేసుకుంది. సోమవారం వినాయకుడి ఊరేగింపు చూసేందుకు 13 ఏళ్ల బాలుడు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగిలి బాలుడు కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చదవండి: తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వేడుకగా చక్రస్నానం -
Sep 26, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
CBN Arrest: Chandrababu Petitions Hearing Live Updates 9:25PM, సెప్టెంబర్ 26, 2023 ►రేపు(బుధవారం)సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ ►విచారణ చేయనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్విఎన్ భట్టి ధర్మాసనం ►ఐటెం నెం.61 గా లిస్ట్ అయిన బాబు కేసు ►తన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 8:20PM, సెప్టెంబర్ 26, 2023 ►కొందరి భూముల ధరలను పెంచాలనే ఉద్దేశంతో ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ పూర్తిగా మార్చేశారు: సీఐడీ అధికారులు ►లింగమనేని భూములు కొన్నప్పుడు లోకేష్ హెరిటేజ్ డైరెక్టర్‌గా ఉన్నారు ►తండ్రి చంద్రబాబుతో కలిసి లోకేస్ కుట్రపూరితంగా హెరిటేజ్ ద్వారా భూములు కొనుగోలు చేశారు ►కరకట్ట వద్ద లింగమనేని ఎస్టేట్‌ను అటాచ్ చేస్తూ ఇప్పటికే సీఐడీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఇది రాజకీయ కక్షతో కూడిన కేసు కాదు: ఏజీ శ్రీరామ్ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై వాదనలు ►సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు ►ఇది రాజకీయ కక్షతో కూడిన కేసు కాదు ►కోర్టులో సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది ►కింది కోర్టులో పీటీ వారెంట్‌పై పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సరికాదు 7:20 PM, సెప్టెంబర్ 26, 2023 రేపు చంద్రబాబుకు కోర్టుల్లో అత్యంత కీలకమైన రోజు ► సుప్రీంకోర్టులో రేపు బెంచ్ మీదకు రానున్న స్పెషల్ లీవ్ పిటిషన్ ► వాదనలు వింటారా, లేక కౌంటర్ ఫైల్ చేయమంటారా? ► హైకోర్టులో రేపు రింగ్ రోడ్ కేసులో మిగతా వాదనలు విననున్న న్యాయస్థానం ► హైకోర్టు : అంగళ్లు అల్లర్ల కేసులో వాదనలు పూర్తి, బెయిల్‌పై తీర్పు రిజర్వ్ ► ACB కోర్టు : చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లు రేపు బెంచ్ మీదకు వచ్చే అవకాశం ► త్వరలో ఉండవల్లి పిటిషన్, CBI, EDకి ఇవ్వాలంటూ కేసు బెంచ్ మీదకు వచ్చే అవకాశం 7:00 PM, సెప్టెంబర్ 26, 2023 బాబుకు గ్రహణం పట్టింది : మురళీ మోహన్ ► చంద్రబాబుకు గ్రహణం పట్టింది ► చంద్రుడికి గ్రహణం పడుతుంది, అయితే అది కొద్దిసేపే ► చంద్రబాబుకు పట్టిన గ్రహణం త్వరలోనే వీడుతుంది 6:30 PM, సెప్టెంబర్ 26, 2023 తెలుగుదేశం పొలిటికల్ యాక్షన్ కమిటీ భేటీ ► పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం తర్వాత తొలి భేటీ ► హాజరైన యనమల, అచ్చెన్న, బాలకృష్ణ, నక్కా ఆనందబాబు, బీసీ జనార్థన్ రెడ్డి ► జైల్లో చంద్రబాబు ఇచ్చిన బ్రీఫింగ్ను సభ్యులకు వివరించిన యనమల, అచ్చెన్న ► చంద్రబాబు అరెస్టు, ఇతర కేసు పరిణామాల పై చర్చ ► కోర్టుల్లో ఎందుకు ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి? ► అంత పక్కాగా ఆధారాలతో సహా చంద్రబాబు ఎలా దొరికిపోయాడు? ► లోకేష్ ఎందుకు ఢిల్లీలో ఉంటున్నాడు? అరెస్ట్ భయం ఇంకెన్నాళ్లు? ► లోకేష్‌ను A14గా నమోదు చేసిన ప్రభావం ఎలా ఉండొచ్చు? ► అచ్చెన్నాయుడు, నారాయణ, గంటా కేసుల సంగతేంటీ? ► ఎవరు జైల్లో ఉంటారు? ఎవరు బయట తిరుగుతారు? ► ఇప్పుడు జనసేనతో పొత్తు సంగతి ఎవరు తేలుస్తారు? ► పొత్తులో భాగంగా ఎవరి సీట్లు ఇవ్వాలి? ఏ ఏ జిల్లాపై ప్రభావం? ► క్షేత్రస్థాయిలో రూపొందించుకోవాల్సిన కార్యక్రమాలపై యాక్షన్ ప్లాన్ ► జనసేనతో ఎవరు సమన్వయం చేయాలి? ► ఎవరెవరు సీట్లు త్యాగాలు చేయాలి? ► అసంతృప్తి నేతలను ఎవరు బుజ్జగించాలి? ఆర్థిక వనరులెవరు అందించాలి? ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన లోకేష్, పార్టీ నేతలకు పలు సూచనలు 6:00 PM, సెప్టెంబర్ 26, 2023 రేపు సుప్రీంకోర్టులో లిస్ట్ అయిన బాబు పిటిషన్ ► కేసు డెయిరీ నెంబర్ 39500/2023 ► ఫైల్ : శనివారం, సెప్టెంబర్ 23, 2023 ► కేసు నెంబర్ : SLP(Crl) 012289/2023 ► కేసు లిస్టింగ్ : 27 సెప్టెంబర్ 2023 ► కేటగిరీ : అవినీతి నిరోధక చట్టం గురించిన క్రిమినల్ మ్యాటర్ 5:00 PM, సెప్టెంబర్ 26, 2023 నేను ఢిల్లీలో ఎందుకు ఉన్నానంటే.. : లోకేష్ ► మాపై పెట్టిన కేసుల గురించి లాయర్లతో మాట్లాడుతున్నాను ► ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నేతలను, ప్రముఖులను కలుస్తున్నాను ► వాళ్లందరికి మా కేసుల గురించి వివరిస్తున్నాను ► అందులో భాగంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశాం ► రింగు రోడ్డు కేసులో నన్ను చేర్చారు, కొన్ని పుకార్లు బయటికి వదులుతున్నారు ► అసలు రింగు రోడ్డే లేదు, నాపై కేసు ఎలా ఉంటుంది? ► తెలంగాణలో మా వాళ్లు శాంతియుతంగా ఆందోళన చేశారు ► దానికి కెటిఆర్ ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు ► శాంతి భద్రతలకు ఎక్కడా విఘాతం కలిగించలేదు ► యువగళం పాదయాత్ర కోసం మళ్లీ అనుమతి కోరాం ► రేపు సుప్రీంకోర్టులో మా కేసు ఉంది 4:30 PM, సెప్టెంబర్ 26, 2023 చంద్రబాబు బెయిల్ పిటిషన్ రేపటికి వాయిదా ► AP హైకోర్టు : చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా ► చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్ధార్థ లోద్రా ► ప్రభుత్వం తరఫున రేపు వాదనలు వినిపించనున్న అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ ► రేపు 2.15pmకు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించనున్న AG శ్రీరామ్ ► ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ రేపటికి వాయిదా ► రేపు మధ్యాహ్నం తర్వాత బెంచ్ ముందుకు రానున్న కేసు (చదవండి : రింగ్ రోడ్డు పేరిట అక్రమ మలుపులు) 4:20 PM, సెప్టెంబర్ 26, 2023 మార్గదర్శి కేసు: సుప్రీంకోర్టులో వాదనలు ► సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసు విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ► రెండు వారాలపాటు వాయిదా వేయాలని కోరిన రామోజీరావు న్యాయవాది ► సవాల్ చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి ► RBI నిబంధనలకు విరుద్ధంగా HUF పేరుతో రామోజీరావు డిపాజిట్లు సేకరించాడు ► డిపాజిటర్ల చెల్లింపుల వివరాలన్నిటిని సమర్పించాలని గత విచారణలో రామోజీ రావుకు ఆదేశం ► అసలు డిపాజిట్ల సేకరణ తప్పు : ఉండవల్లి ► తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటిస్తామన్న ధర్మాసనం (చదవండి : మార్గదర్శి కుంభకోణమేంటీ.? రామోజీ సృష్టించిన మాయా ప్రపంచమేంటీ?) 4:00 PM, సెప్టెంబర్ 26, 2023 చంద్రబాబు అరెస్టుతో తెలంగాణకు సంబంధమేంటీ? : మంత్రి KTR ► చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అంశం ► చంద్రబాబు అరెస్టయితే ఇక్కడ ధర్నాలు, ర్యాలీలేంటీ? ► ఇక్కడి ఉద్యోగులకు చెబుతున్నా.. తెలంగాణలో ఎలాంటి ఆందోళనలు చేయొద్దు ► హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయొద్దని చెబుతున్నాను ► ఇక్కడి ఉద్యోగులు అనవసర రాజకీయాల్లోకి వచ్చి కెరియర్ పాడు చేసుకోవద్దు ► తెలంగాణకు ఏపీ రాజకీయాలు తెచ్చి అంటించొద్దు ► ర్యాలీలకు పర్మిషన్ ఇవ్వాలని లోకేష్ అడిగారు ► రాజకీయాల కంటే శాంతిభద్రతలే మాకు ముఖ్యమని చెప్పాం ► ఏపీ రాజకీయాల పేరుతో తెలంగాణ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు.? ► కోర్టులో ఉన్న సబ్ జ్యుడిష్ మ్యాటర్ మీద ఐటీ ఉద్యోగులు ఎందుకు రోడ్డెక్కాలి? ► ఇక్కడ ఉన్న వారికి కక్ష కార్పణ్యాలను నేర్పి రోడ్డు మీదకు ఎందుకు వదులుతున్నారు? ► తెలంగాణ ఉద్యమంలోనే ఐటీ కారిడార్‌లో ఆందోళనలు జరగలేదు ► ఇప్పుడు ఐటి కారిడార్‌లో పరిస్థితిని దెబ్బతీసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ► సున్నిత అంశం అంటూ లోకేష్ ఫోన్ చేశారు, ఇలాంటివాటిపై సున్నితంగానే ఉండాలి 3:45 PM, సెప్టెంబర్ 26, 2023 AP హైకోర్టు : ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లూథ్రా వాదనలు ► ఇన్నర్ రింగు రోడ్డు స్కాంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ► ఏపీ హైకోర్టులో వర్చువల్ గా బాబు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు ► రాజకీయ కారణాలతో కేసు నమోదు చేశారు ► ఇన్నర్ రింగు రోడ్డు ఫైనల్ అలైన్మెంట్ జరిగి ఆరేళ్లవుతోంది ► ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటి వరకు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు 3:35 PM, సెప్టెంబర్ 26, 2023 అప్పుడెందుకు రెచ్చిపోయాడు? ఇప్పుడెందుకు సానుభూతి? ► లోకేష్ తీరును తప్పుబట్టిన కొడాలినాని ► చంద్రబాబు అరెస్టైయితే లోకేష్ బిత్తర చూపులు చూస్తున్నాడు ► పీకండి....కొట్టండి....జైల్లో పెట్టండి అన్నాడు ► ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ► ఢిల్లీలో దాక్కుని ట్వీట్లు వేసుకుంటున్నాడు ► లోకేష్ పాదయాత్ర చేస్తే కేసులు పెట్టాల్సిన పనేముంది.? ► లోకేష్ మా పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నాడు ► మేం లోకేష్ పేరు చిత్తు కాగితంపై కూడా రాయము..! ► ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని ప్రకటించిన లోకేష్ తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడు? ► చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా? 3:30PM, సెప్టెంబర్ 26, 2023 ఇంకా కేరాఫ్ ఢిల్లీనే.. చినబాబు మదిలో ఎన్నో సందేహాలు ► ఇంకా దేశ రాజధాని ఢిల్లీకే పరిమితమయిన నారా లోకేష్ ► అక్కడి నుంచే టీడీపీ ఎంపీలు, ముఖ్య నేతలతో మంతనాలు ► ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడితే అరెస్ట్ చేస్తారా? ► అరెస్ట్ చేస్తే ఏ జైలుకు పంపే ఆస్కారం ఉంటుంది? ► ఏపీకి రాకుండా ఢిల్లీలోనే గడిపిస్తే వచ్చే నష్టమేంటీ? ► ఏపీ పోలీసులు ఢిల్లీకి వచ్చి అరెస్ట్ చేసే అవకాశాలుంటాయా? ► నన్ను అరెస్ట్ చేస్తే రాజకీయ కక్ష అని ప్రచారం చేసుకోవచ్చా? ► చంద్రబాబునే పట్టించుకోవడం లేదు, రేపు నన్నెవరు పట్టించుకుంటారు? ► ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే నష్టమేంటీ? లాభమేంటీ? ► ఒక వేళ పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తే.. వెంటనే అరెస్ట్ చేస్తారా? ► నేరుగా ప్రజల్లోకి వెళ్తే అందరి మధ్య అరెస్ట్ చేసే అవకాశముంటుందా? ► అసలు A14ని అరెస్ట్ చేయాలంటే ముందున్న 13 మంది తర్వాతేనా? లేక ఎప్పుడయినా చేయవచ్చా? ► టిడిపి ఎమ్మెల్యేలు, నేతలను ప్రశ్నలతో వేధిస్తోన్న లోకేష్ ► తప్పుడు కేసులు తెలుగుదేశాన్ని ఏం చేయలేవంటూ ప్రకటనలు ఇవ్వాలని సూచన 3:10 PM, సెప్టెంబర్ 26, 2023 యువగళం ఎందుకు చేయలేకపోతున్నానంటే.? : లోకేష్ ► నా పాదయాత్రను అడ్డుకునేందుకే జీవో నం.1 తెచ్చారు ► మళ్లీ యువగళం ఆరంభిస్తామనేసరికి కొత్త అడ్డంకులు ► రింగ్ రోడ్డు కేసులో నన్ను నిందితుడిగా (A14) చేర్చారు ► రిపేర్ల పేరుతో రాజమహేంద్రవరం బ్రిడ్జి మూసేయించారు ► కేసులు పెట్టి అరెస్టులు చేసినా యువగళం ఆగదు 2:30PM, సెప్టెంబర్ 26, 2023 తప్పు చేయలేదని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? : TDPకి YSRCP సూటి ప్రశ్న ►చంద్రబాబు హయాంలో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లో రూ. 114 కోట్లు కొట్టేశారు: అసెంబ్లీలో మంత్రి గుడివాడ్ అమర్నాథ్ ►స్కిల్ స్కామ్‌లో రూ. 331 కోట్లు అక్రమాలు జరిగాయి ►ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సీమెన్స్ సంస్థ తెలిపింది. ►సీమెన్స్ ఉచితంగా అందించే కోర్సులను ఒప్పించి తెచ్చామని చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు ►సీమెన్స్ నుంచి ఒక్క రూపాయి కూడా రాష్ట్రానికి పెట్టుబడి రాలేదు ►చంద్రబాబు అనుకూల వ్యక్తులకే ఫైబర్‌నెట్ టెండర్ కట్టబెట్టారు ►షెల్ కంపెనీల ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ►హెరిటేజ్‌లో పనిచేసేవారే టెరాసాఫ్ట్‌లో డైరెక్టర్లుగా పనిచేశారు ►2016లోనే చంద్రబాబు అవినీతిని ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఎండగట్టారు 1:58 PM, సెప్టెంబర్ 26, 2023 స్కిల్ స్కామ్.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ ► చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ► కొందరిని కొంతకాలం పాటే మోసం చేయగలరు ►చంద్రబాబు ఎన్నో ఏళ్లుగా మోసం చేస్తూ వచ్చారు ►పక్కా ప్లానింగ్‌తోనే స్కిల్ స్కామ్ జరిగింది ►చంద్రబాబు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయారు ►ఏ విధంగా స్కిల్ స్కామ్ చేశారనేది అందరికీ అర్థమైంది ►లోకేష్ విదేశాల్లో చదివి ఫేక్ స్కామ్‌లపై స్పెషలైజేషన్ చేశాడు ►ఫేక్ ఎంవోయూలు ఎలా చేయాలో లోకేష్‌కు బాగా నేర్చుకున్నాడు ►కక్ష సాధింపు ప్రభుత్వానికి అవసరం లేదు ►స్కిల్ స్కామ్.. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్‌గా మారిపోయింది :::దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య కామెంట్స్ 1:20 PM, సెప్టెంబర్ 26, 2023 అంగళ్లు కేసులో వాదనలు పూర్తి ► ఏపీ హైకోర్టులో అంగళ్ల విధ్వంసం కేసుకు సంబంధించి వాదనలు పూర్తి ► బెయిల్ మంజూరు చేయాలంటూ చంద్రబాబు విజ్ఞప్తి ► దాడికి ఉసిగొల్పింది, చేయించింది చంద్రబాబేనని వెల్లడించిన ప్రభుత్వ లాయర్ల ►అంగళ్లు విధ్వంసం కేసులో పోలీసుల తరఫున పొన్నవోలు వాదనలు ►అంగళ్లు విధ్వంసానికి కారణం చంద్రబాబే ►టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు రెచ్చగొట్టారు: పొన్నవోలు ►చంద్రబాబు బెదిరించిన వీడియోను కోర్టకు చూపించిన పొన్నవోలు ► పూర్తయిన వాదనలు, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు 1:20 PM, సెప్టెంబర్ 26, 2023 ఆరు వ్యాక్యాల్లో అంగళ్లు కేసు 1. ప్రాజెక్టుల పరిశీలన పేరిట జులై/ఆగస్టు నెలల్లో గ్రౌండ్లోకి చంద్రబాబు, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో అల్లర్లకు కుట్ర, ఆగస్టు 1వ తేదీనే అల్లర్లకు చంద్రబాబు అండ్‌కో స్కెచ్, పుంగనూరు హైవేపై మీటింగ్ పెట్టుకుని పుంగనూరు పట్టణంలోకి బలవంతంగా దూసుకెళ్లాలని పథకం 2. పోలీసులు అడ్డుకుంటే కర్రలు, రాళ్లు బీర్ బాటిళ్లతో దాడి చేయాలని కుట్ర, పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా బాబుకు ముందే ఆదేశాలు 3. ఆగస్టు 4, శుక్రవారం మధ్యాహ్నం బాబు ఆదేశాలతో తెలుగుదేశం మూకదాడులు, తలలు పగిలి తీవ్రంగా గాయపడ్డ పోలీసులు, కన్ను కోల్పోయిన కానిస్టేబుల్, మొత్తమ్మీద ఆస్పత్రి పాలైన 27 మంది 4. ముందుగానే 2వేలకు మందిని సమకూర్చుకున్న టిడిపి, ఘటనా స్థలంలో 5వేల సిమ్‌లు పని చేశాయని దర్యాప్తులో వెల్లడి 5. అన్నమయ్య జిల్లా అంగళ్లులో పోలీసులు, ప్రజలపై దాడులు, కొద్ది గంటలైనా గడవకముందే చిత్తూరు జిల్లా పుంగనూరులో అల్లర్లు, దాడులు, విధ్వంసం, టీడీపీ శ్రేణులే కాకుండా అల్లరి మూకలు, గూండాలు ఉన్నట్టు గుర్తింపు 6. పోలీసు వాహనాలు, ఆస్తుల విధ్వంసం, తగులబెట్టిన తెలుగుదేశం కార్యకర్తలు, పోలీసుల కాల్పులకు దారి తీస్తేనే మైలేజ్ వస్తుందని భావించిన చంద్రబాబు, సంయమనం పాటించి ఆగిపోయిన పోలీసులు 12:50 PM, సెప్టెంబర్ 26, 2023 హైకోర్టు: అంగళ్లు అల్లర్ల కేసులో బెయిల్ పిటిషన్ ► అన్నమయ్య జిల్లా అంగళ్లు గ్రామంలో అల్లర్లకు ఉసిగొల్పిన చంద్రబాబు ► ఈ ఘటనలో అమాయకులతో పాటు పోలీసులపై దాడి చేసిన తెలుగుదేశం కార్యకర్తలు ► చంద్రబాబు ఉసిగొల్పడం, పక్కాగా కుట్ర చేసి దాడి చేసినట్టు ఆధారాలు ► పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ► అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ 12:30 PM, సెప్టెంబర్ 26, 2023 హైకోర్టు: రింగ్ రోడ్ కేసులో బాబు బెయిల్ పిటిషన్ ► హైకోర్టులో అమరావతి రింగ్‌రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసు ► మధ్యాహ్నం 2.15 గం.కు వాదనలు వినే అవకాశం ►ఈ కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ 12:15 PM, సెప్టెంబర్ 26, 2023 న్యాయస్థానాలపై నిందలు వేస్తారా? ► క్రిమినల్ కంటెంప్ట్ పై రేపు ఏపీ హైకోర్టులో విచారణ ► హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన అడ్వొకేట్ జనరల్ ► చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరిన ఏజీ ► కేసును డివిజన్ బెంచ్ ముందు మెన్షన్ చేసిన ఏజీ ► రేపు విచారిస్తామన్న హైకోర్టు డివిజన్ బెంచ్ ► చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణలకు దిగిన ఎల్లో గ్యాంగ్ ► క్రిమినల్ కంటెంప్ట్‌గా పరిగణించి చర్య తీసుకోవాలని కోరిన ఏజీ ► ఇప్పటికే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్రపతి కార్యాలయం ► జడ్జిలపై నిందలు, కామెంట్లు చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలన చీఫ్ సెక్రటరీని ఆదేశించిన రాష్ట్రపతి కార్యాలయం 12:10 PM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంకోర్టులో బాబు భవితవ్యం ► రేపు సుప్రీంకోర్టులో లిస్టింగ్ అయ్యే అవకాశం ► హైకోర్టులో రద్దయిన క్వాష్ పిటిషన్‌తోనే సుప్రీం తలుపు తట్టిన బాబు ► సర్వోన్నత న్యాయస్థానానికి చంద్రబాబు 3 విన్నపాలు ► తనపై నమోదైన FIRను కొట్టేయాలని విజ్ఞప్తి ► జ్యూడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి ► తనపై విచారణను పూర్తిగా నిలిపివేయాలని విజ్ఞప్తి 12:05 PM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంకోర్టు : బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ వల్ల సెలవు ► సెప్టెంబర్ 29న ఢిల్లీలో స్థానికంగా సెలవు ► సెప్టెంబర్ 30న శని, అక్టోబర్ 1న ఆదివారం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి వల్ల సెలవు ► రేపు వాదనలు జరగకపోతే అక్టోబర్ 3కు వాయిదా పడే అవకాశం ఉందంటున్న లాయర్లు 12:00 PM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసు ► కాసేపట్లో సుప్రీంకోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్ కేసుపై విచారణ ► విచారణ చేయనున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్త ధర్మాసనం ► కేసును 2 వారాల వాయిదా వేయాలని కోర్టుకు రామోజీ రావు తరపు న్యాయవాది లెటర్ ► RBI నిబంధనలకు విరుద్ధంగా HUF పేరుతో రామోజీరావు డిపాజిట్లు సేకరించడాన్ని పిటిషన్ లో సవాల్ చేసిన మాజీ MP ఉండవల్లి ► డిపాజిటర్ల చెల్లింపుల వివరాలన్నిటిని సమర్పించాలని గత విచారణలో రామోజీ రావును ఆదేశించిన సుప్రీంకోర్టు ► అసలు డిపాజిట్ల సేకరణ తప్పని వాదిస్తున్న ఉండవల్లి ► గత విచారణలో ప్లీడింగ్స్ పూర్తి చేయాలని ఆదేశించిన న్యాయస్థానం 11:26AM, సెప్టెంబర్ 26, 2023 ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమ అలైన్మెంట్ కేసులో లోకేష్ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో 14వ నిందితుడిగా నారాలోకేష్ (A-14) ►నారా లోకేష్ పేరు చేరుస్తూ ACB కోర్టులో మెమో దాఖలు చేసిన CID (అసలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు వివరాలేంటీ?) 11:26AM, సెప్టెంబర్ 26, 2023 ఏసీబీ కోర్టులో విచారణ రేపటికి వాయిదా ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన ఏసీబీ కోర్టు ►కస్టడీ పిటిషన్‌పై విచారణ సైతం వాయిదా వేసింది ► జడ్జి లీవ్‌లో ఉండడంతో విచారణ వాయిదా ►నేడు విచారణ చేపట్టడం సాధ్యం కాదన్న ఇన్‌ఛార్జి న్యాయమూర్తి ► కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా 10:52AM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంకోర్టులో మెన్షన్ కాని చంద్రబాబు కేసు ►సుప్రీంకోర్టు లో ప్రారంభమైన రాజ్యాంగ ధర్మాసనం విచారణ ►విచారణ చేస్తున్న చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ►చీఫ్ జస్టిస్ ముందుకు రాని చంద్రబాబు కేసు మెన్షనింగ్ ► సాధారణ కేసుల విచారణ ఇవాళ ఉండబోదని స్పష్టీకరణ ► ఇక రేపే సుప్రీం బెంచ్ ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ► రేపు లేకుంటే గనుక అక్టోబర్ 3నే బాబు కేసు విచారణ జరిగే ఛాన్స్ 10:44AM, సెప్టెంబర్ 26, 2023 ఏసీబీ కోర్టుకి చేరుకున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు ►చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న ప్రమోద్ కుమార్ దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ ►చంద్రబాబు కస్టడీ పొడిగింపుపై ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన బాబు లాయర్లు ►ఏసీబీ జడ్జి లీవ్‌తో.. నేడు విచారణ ఉంటుందా రేపటికి వాయిదా పడుతుందా? అనే దానిపై కొనసాగుతున్న సందిగ్దత 10:25AM, సెప్టెంబర్ 26, 2023 ఏసీబీ కోర్టులో పిటిషన్లు వాయిదా పడే ఛాన్స్? ►స్కిల్ స్కాంలో ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ ►మరోవైపు సీఐడీ కస్టడీ పిటిషన్ ►నేడు కూడా ఇరు పిటిషన్లపై కొనసాగాల్సిన వాదనలు ►అయితే ఇవాళ వ్యక్తిగత కారణాలతో ఏసీబీ జడ్జి సెలవు ►ఇన్చార్జిగా వేరే న్యాయమూర్తికి బాధ్యత అప్పగించే ఛాన్స్ ►లేకుంటే విచారణ రేపటికి వాయిదా ►వేరే జడ్జి బెంచ్‌పై కూర్చుంటే.. బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలని కోరనున్న చంద్రబాబు లాయర్లు ►మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరనున్న సీఐడీ ►చంద్రబాబు విచారణకు సహకరించట్లేదని ఇప్పటికే కోర్టుకు తెలియజేసిన సీఐడీ ►సీఐడీ పిటిషన్‌పై కౌంటర్ వేసిన బాబు లాయర్లు 09:30AM, సెప్టెంబర్ 26, 2023 సుప్రీంలో బాబు పిటిషన్‌పై నో క్లారిటీ ►సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ పై కొనసాగుతున్న అస్పష్టత ►నేటి చీఫ్ జస్టిస్ కోర్టు మెన్షన్ లిస్టు వెలువరించని రిజిస్ట్రీ ►చీఫ్ జస్టిస్ కోర్టులో రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిగే అవకాశం ►ఇప్పటివరకు చంద్రబాబు కేసును ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ►విచారణ తేదీని ఖరారు చేయని రిజిస్ట్రీ ►ఎల్లుండి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టు సెలవులు 09:17AM, సెప్టెంబర్ 26, 2023 చంద్రబాబు కేసు.. కోర్టు ధిక్కరణ పిటిషన్ ►చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో.. హైకోర్టు జడ్జిలు, దిగువ కోర్టు న్యాయమూర్తులపై దూషణల వ్యవహారం ►హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన అడ్వొకేట్ జనరల్ ►ఇప్పటికే అనేక ఫిర్యాదులు వచ్చాయని పిటిషన్లో వెల్లడి ►గడచిన రెండు వారాల్లో పరిణామాలను వివరిస్తూ పిటిషన్ ►కోర్టుల గౌరవానికి భంగం కలిగించారు ►న్యాయవిధులను నిర్వర్తిస్తున్న వారిపై దూషణలకు దిగారు ►న్యాయవ్యవస్థకున్న విలువలను ధ్వంసంచేసేలా వ్యవహరించారు ►చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరిన ఏజీ 08:50AM, సెప్టెంబర్ 26, 2023 లీవ్‌లో ఏసీబీ జడ్జి.. సుప్రీం హాలీడేస్.. టీడీపీ నేతల్లో టెన్షన్ ►ఏసీబీ కోర్టులో ఇవాళ చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ ►ఇప్పటికే రెండు రోజుల కస్టడీ ఇంటరాగేషన్ చేపట్టిన సీఐడీ ►కానీ, విచారణలో సహకరించకపోవడంతో మరో ఐదురోజులు ఇవ్వాలని పిటిషన్ ►పోలీస్ కస్టడీ పొడిగింపుతో పాటు చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ పైనా ఒకేసారి వాదనలు ►అయితే.. వ్యక్తిగత కారణాలతో ఏసీబీ కోర్టు జడ్జి ఒకరోజు సెలవు! ►వాదనలు జరుగుతాయా లేదా రేపటికి వాయిదా పడతాయా అనే దానిపై రాని క్లారిటీ ►టీడీపీ నేతల్లో టెన్షన్.. టెన్షన్ ►సుప్రీంకోర్టులో మరో తరహా పరిస్థితి ►చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ తేదీని ఇవ్వనున్న సుప్రీంకోర్టు ►ఎల్లుండి నుంచి అక్టోబర్ రెండు వరకు సుప్రీంకోర్టుకు సెలవులు 08:25AM, సెప్టెంబర్ 26, 2023 జడ్జిలను ట్రోలింగ్ చేస్తే ఉపేక్షించొద్దు ►సోషల్ మీడియాలో చంద్రబాబు కేసులపై వాదనలు వింటున్న జడ్జిల ట్రోలింగ్ ►జడ్జిలను ట్రోల్ చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రపతికి న్యాయవాదుల ఫిర్యాదు ►జడ్జిలను ట్రోల్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించిన రాష్ట్రపతి 08:04AM, సెప్టెంబర్ 26, 2023 చంద్రబాబు అరెస్ట్‌పై అసదుద్దీన్ ఒవైసీ ►చంద్రబాబు అరెస్ట్‌పై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ►ఏపీలో చంద్రబాబు హ్యాపీగా జైల్లో ఉన్నారు ►ఆయన ఎందుకు జైలుకెళ్లారో అందరికీ తెలుసు ►చంద్రబాబును నమ్మలేం, ప్రజలు కూడా నమ్మొద్దు ►ఏపీలో రెండే పార్టీలు ఉన్నాయి... వైసీపీ, టీడీపీ ►ఏపీలో సీఎం జగన్ పాలన బాగుంది 08:02AM, సెప్టెంబర్ 26, 2023 నేడు టీడీఎల్పీ సమావేశం ►కిమ్ కర్తవ్యం? ►మన వాదన అంత బలంగా లేదు ►కేసు లో మనకు వ్యతిరేకంగా ఎన్నో ఆధారాలు ►మద్ధతు కోసం చంద్రబాబు, జనసేనతో పొత్తు పెట్టుకున్నారు ►మన పార్టీ ని నమ్ముకున్న కొందరికి ఇప్పుడు మొండి చెయ్యి ►ఏమి చేద్దాం.. ఎలా ఒప్పిద్దాం? 08:00AM, సెప్టెంబర్ 26, 2023 అసలు గంట పాత్ర ఏంటి? ►గంటా అంటే గయ్ గయ్ ►నారాయణ పేరెత్తినా చంద్రబాబు చిర్రుబుర్రులు ►స్కిల్ స్కామ్ లో వారిద్దరి ప్రమేయంపై దాటవేత ►గంటా సుబ్బారావుకు ఏకకాలంలో నాలుగు పోస్టులు ►రిటైర్ట్ అధికారి, బాబు బాల్య మిత్రుడు లక్ష్మీనారాయణది కీలకపాత్ర ►వారిద్దరి ద్వారానే నకిలీ కుంభకోణం ►నిధుల తరలింపులో కీలకంగా పెండ్యాల, పార్ధసాని, యోగేష్ గుప్తా ►వారి ప్రస్తావన తేగానే ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన చంద్రబాబు 07:52AM, సెప్టెంబర్ 26 సుప్రీం కోర్టులో చంద్రబాబు కేసు ►స్కిల్ స్కాం కేసులో సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు ►ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయడంతో పాటు ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ ►ఆగమేఘాల మీద ముందుకు రావడంతో నిన్న క్వాష్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించని చీఫ్ జస్టిస్ బెంచ్ ►నేడు లిస్టింగ్‌లో చేరుస్తామని బాబు లాయర్ లూథ్రాకు స్పష్టీకరణ ►అన్ని విషయాలూ మెన్షన్ చేయాలని లూథ్రాకు సీజేఐ సూచన ► సుప్రీంలో నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను విచారణ స్వీకరించే అంశంపై రానున్న స్పష్టత 07:48AM, సెప్టెంబర్ 26 ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్లు ►ఏపీ హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన రెండు బెయిల్ పిటిషన్ పై విచారణ ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణంతో పాటు అంగళ్లు విధ్వంసం కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు ►అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం లో A1 గా ఉన్న చంద్రబాబు నాయుడు 07:37AM, సెప్టెంబర్ 26 ఏసీబీ కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లు ►ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణకు రానున్న కస్టడీ పిటిషన్, చంద్రబాబు బెయిల్ పిటిషన్లు 07:19AM, సెప్టెంబర్ 26 నిన్న కుటుంబ సభ్యుల ములాఖత్ ►చంద్రబాబును సోమవారం ములాఖత్‌లో కలిసిన భార్య భువనేశ్వరి ,కోడలు బ్రాహ్మణి, పార్టీ నేత అచ్చెన్నాయుడు ►జైలు వేదికగా రాజకీయ చర్చలు ►బయటకు వచ్చాక అచ్చెన్నాయుడి ఓవరాక్షన్ ► జైలు అధికారులు పదే పదే చెబుతున్నా.. చంద్రబాబు భద్రతపై సందేహాలు ► సీఐడీ కస్టడీపైనా లేనిపోని ఆరోపణలు 06:30AM, సెప్టెంబర్ 26 రాజమండ్రి జైల్లో చంద్రబాబు @17 ►రాజమండ్రి సెంట్రల్ జైల్లో 17వ రోజుకు చేరుకున్న చంద్రబాబు రిమాండ్. ► స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో సెప్టెంబర్ 9వ తేదీన నంద్యాలలో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ ► ఏసీబీ కోర్టు రిమాండ్‌తో ఖైదీ నెంబర్ 7691గా రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు ► జైలు శాఖ పటిష్ట భద్రత నడుమ చంద్రబాబు ►రోజూ ఇంటి భోజనానికి కోర్టు అనుమతి ► రెండుసార్లు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగింపు ► తాజా పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ వరకు జైల్లోనే చంద్రబాబు ► రెండు రోజుల సీఐడీ కస్టడీలో కాలయాపన చేసిన వైనం ► దీంతో మరోసారి కస్టడీకి కోరిన ఏపీ సీఐడీ తప్పు చేయకుంటే.. ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా!: YSRCP ►స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఐడీ అధికారులు కూడా రెండేళ్లపాటు సుధీర్ఘంగా విచారణ చేశారు ►చంద్రబాబు పాత్ర ఉందని నిర్ధారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు ►పాత్ర ఉందనడానికి తగిన రుజువులు కోర్టుకు సమర్పించారు ►కాబట్టే బాబును న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. ► తదనంతరం సీఐడీ కస్టడీకి అనుమతిచ్చింది. ►చంద్రబాబు ఏమాత్రం తప్పు చేయకపోతే పిటిషన్ల మీద పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు? ధైర్యంగా కేసును ఎదుర్కోవచ్చు కదా? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఐడీ అధికారులు కూడా రెండేళ్లపాటు సుధీర్ఘంగా విచారణ చేసి.. చంద్రబాబు పాత్ర ఉందని నిర్ధారించుకున్న తర్వాతే మీ నాయకుడిని అరెస్టు చేశారు @JaiTDP. ఈ స్కామ్‌లో @ncbn పాత్ర ఉందనడానికి తగిన రుజువులు కోర్టుకు సమర్పించారు కాబట్టే ఆయన్ను న్యాయస్థానం జ్యుడీషియల్… https://t.co/6UHlDX77nD — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 -
ఊపిరి తీసిన పెట్రోల్ ట్యాంకు
విజయనగరం: రెప్పపాటులో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కూలి పనికి వెళ్లిన ఒకరు.. సహా యం చేసేందుకు వెళ్లిన మరొకరిని మృత్యువు కాటేసింది. వారి కుటుంబాలకు తీరని శోకం మిగిల్చింది. మూతపడిన పెట్రోల్ బంకును మళ్లీ తెరిపించే ప్రయత్నంలో అండర్ గ్రౌండ్ ట్యాంకును పరి శుభ్రం చేస్తున్న వ్యక్తి ఒకరు ఊపిరాడక మృతి చెందగా, సహాయం కోసం వెళ్లిన వ్యక్తి కూడా ఊపిరాడక టాంకులోనే మృతి చెందిన దుర్ఘటన బొబ్బిలి లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంకును సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నడుపుతున్నారు. ఈ బంకు కొద్ది రోజులుగా మూతపడి ఉంది. మళ్లీ తెరిపిద్దామన్న ఉద్దేశంతో బంకులోని ట్యాంకులను శుభ్రం చేసేందుకు సోమవారం చింతాడకు చెందిన పెద్దింటి పోలినాయుడు, యామలపల్లి తవిటినాయుడు, అల్లు నారాయణరావును కూలికి పిలిచారు. ఈ క్రమంలో అండర్ గ్రౌండ్లో ఉన్న బంకు టాంకు ఓపెన్ చేశారు. శుభ్రం చేయాలంటే కిందకు దిగాలనడంతో... కూలీల్లో ఒకరైన పెద్దింటి పోలినాయుడు (55)కు నూతుల్లో దిగే అనుభవం ఉండడంలో వెంటనే దిగాడు. దిగిన క్షణాల్లోనే ఊపిరాడక ట్యాంకులోనే ఉండిపోయాడు. పైన ఉన్న కూలీలు కేకలు వేయడంతో పెట్రోల్ బంకు ఎదురుగా ఉన్న మరో రోడ్డులో మరమ్మతుల కోసం నిలిచిఉన్న లారీ క్లీనర్ పాట్నాకు చెందిన అన్షు (35) సహాయం చేసేందుకు పరుగున వెళ్లాడు. ట్యాంకులో దిగాడు. అంతే.. క్షణాల్లో ఆయన ప్రాణం కూడా గాలిలో కలిసిపోయింది. ఇద్దరి మృతితో ఆ ప్రాంతమంతా కన్నీటిసంద్రంగా మారింది. ఎస్సై చదలవాడ సత్యనారాయణ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పెట్రోల్ బంకు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడు పెద్దింటి పోలినాయుడుకు హైదబాద్‌లో ఉద్యోగం చేస్తున్న కుమారుడు సురేష్, పెళ్లయిన కుమార్తె పోలీసు ఉన్నారు. మేనల్లుడు హోంగార్డు ఘటనా స్థలంలోనే ఉండి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మరో మృతుడు అన్షు పాట్నాకు చెందిన వ్యక్తికాగా, లారీ ఓనర్ బరంపురానికి చెందినవారు. -
చంద్రబాబు చేలో మేస్తే.. ఈయన గట్టున మేస్తాడా?
తప్పుడు సర్వేలతో ముదపాక భూముల వ్యవహారంలో బండారు.. మోసపూరిత విధానంతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తమ ‘స్కిల్’ కనబరిచారు. ఐటీ రిటర్న్స్ కూడా దాఖలు చేయని తన సతీమణి పేరుతో ఏకంగా రూ.92 లక్షలకుపైగా నగదుతో గంటా భీమిలిలో కొనుగోలు చేసిన భూ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా భారీ నగదుతో జరిపిన లావాదేవీల్లో పేర్కొన్న పాన్ నంబర్ కూడా తేడాగా ఉండటం గమనార్హం. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా! అన్న చందంగా.. తెలుగుదేశం పార్టీ నేతలు తమ నాయకుడి తరహాలోనే కనికట్టు చేయడంలో ఆరితేరిపోయారు. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారంలో బోగస్ కంపెనీలతో కోట్లు కొట్టేసి జైలులో చంద్రబాబు ఉన్నారు. తాను తక్కువేమీ కాదన్నట్టు... భీమిలిలో తన సతీమణి పేరు మీద కొనుగోలు చేసిన భూ వ్యవహారంలో గంటా కూడా అదే తరహా ‘స్కిల్’ కనబరిచారు. ఆదాయపన్నుశాఖ నిబంధనలకు విరుద్ధంగా కేవలం నగదు రూపంలో రూ.92 లక్షలకుపైగా చెల్లింపులు ఆయన సతీమణి పేరు మీద చేసినట్టు లెక్కల్లో చూపారు. అయితే, ఆమె తరపున ఐటీ రిటర్న్స్‌ను ఎక్కడా దాఖలు చేయకపోవడం గమనార్హం. గంటా శ్రీనివాసరావు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే... భీమిలి ప్రాంతంలో 1,936 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన కొనుగోలు ఒప్పందంలో గంటా వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అంతా నగదు రూపంలోనే...! ఆదాయపన్నుశాఖ చట్ట ప్రకారం రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు చేపట్టరాదు. ఈ నిబంధనలేవీ తెలియని వ్యక్తి కాదు గంటా శ్రీనివాసరావు. అయితే తన సతీమణి పేరుతో 2018లో భూముల కోనుగోలులో నగదు రూపంలోనే మెజార్టీ వ్యవహారం నడవడం విమర్శలపాలవుతోంది. అంతేకాకుండా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఈ విధంగా జరగడం బహుశా యాదృచ్ఛికం కాకపోవచ్చు. రూ.92.98 లక్షలు కేవలం నగదు రూపంలో ఇచ్చినట్టు చూపారు. మరో రూ. 25 లక్షలను ఆర్టీజీఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపి.. సర్వే నెంబరు.. టీఎస్ నెంబరు 1490, బ్లాక్ నెంబరు 17, వార్డు నెంబరు 24లోని 1936 గజాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఒకవేళ ఇంత భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపితే పాన్నెంబరు పేర్కొనడంతో పాటు ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒకవైపు తన అఫిడవిట్లో గంటా శారద 2014–15 నుంచి 2018–19 మధ్య ఒక్కసారి కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్లు చూపించలేదు. మరోవైపు గంటా శ్రీనివాసరావు మాత్రం 2014–15 నుంచి ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసినప్పటికీ 2018–19 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.30,39,338 ఆదాయంగా చూపడం గమనార్హం. ఆదాయపన్నుశాఖ సెక్షన్ 271 డి ప్రకారం... రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలను నిర్వహిస్తే శిక్షార్హుడు అవుతారు. ఆదాయపన్నుశాఖ సెక్షన్ 269 ఎస్టీ ప్రకారం అంతే మొత్తాన్ని పెనాల్టీ రూపంలో వసూలు చేసే అధికారం ఉంది. రెండు పాన్‌కార్డులు ఉండొచ్చా..! భీమిలిలో భూములు కొనుగోలు చేసిన సందర్భంలో ఆయన సతీమణి పేరు మీద పేర్కొన్న పాన్‌కార్డు నెంబరు ఏబీపీపీజీ2216ఏ. అయితే, ఆయన అఫిడవిట్లో మాత్రం తన సతీమణి పాన్ నెంబరు ఏబీపీపీజీ2215ఏగా పేర్కొన్నారు. వాస్తవానికి ఐటీశాఖ నిబంధనల ప్రకారం రెండు పాన్‌కార్డు నెంబర్లను కలిగి ఉండటం చట్టరీత్యా నేరం. రెండు పాన్‌కార్డులు ఏ సమయంలో ఉంటాయంటే... ► అప్పటికే ఉన్న పాన్‌కార్డులో ఏవైనా తప్పులు ఉంటే... వాటిని సరిచేసుకోకుండా కొత్త దానికి దరఖాస్తు చేయడం. ►పాన్‌కార్డు కోసం పలుమార్లు దరఖాస్తు చేయడం ►పెళ్లికి ముందు ఒక పాన్‌కార్డు... పెళ్లి తర్వాత మరో పాన్‌కార్డుకు మహిళలు దరఖాస్తు చేసిన సమయంలో... ►ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే ఉద్దేశంతో అక్రమంగా రెండు పాన్‌కార్డులను కలిగి ఉండటం. ► ఇందులో ఏదైనా చట్టరీత్యా నేరమే. తమకు ఉన్న రెండు పాన్‌కార్డులను వెంటనే తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో ఆదాయపన్నుశాఖ చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవహారంలో నిజంగా రెండు పాన్‌కార్డులు ఉన్నాయా? ఒకే సిరీస్‌లో కేవలం నెంబరు మార్చి తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈ వ్యవహారం నడిచిందా? అనేది లోతుగా విచారిస్తే మినహా తెలిసే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదీ ఏమైనా తెలుగుదేశం నేతలు అవినీతి వ్యవహారంలో చూపుతున్న ‘స్కిల్’ మాత్రం కొంగొత్త పుంతలు తొక్కుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
చంద్రబాబును మరో 5 రోజులు మా కస్టడీకి ఇవ్వండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుని మరో 5 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు ఇచ్చిన 2 రోజుల కస్టడీలో తమ విచారణకు చంద్రబాబు ఏ మాత్రం సహకరించలేదని సీఐడీ వివరించింది. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను చదివే పేరుతో గంటల కొద్దీ సమయాన్ని వృథా చేశారని తెలిపింది. 2 రోజుల కస్టడీకి మాత్రమే ఇవ్వడంతో ఆ గడువును ఆయన అడ్డంపెట్టుకుని ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారంది. ఆయన నుంచి పలు అంశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, అందువల్ల ఆయనను తమ కస్టడీకి అప్పగించడం అత్యావశ్యకమని తమ పిటిషన్లో కోర్టుకు నివేదించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులను ఆదేశించింది. మధ్యాహ్నం వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు ‘చంద్రబాబును 5 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ మొదట ఈ నెల 11న పిటిషన్ దాఖలు చేశాం. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు పలు షరతులతో కేవలం 2 రోజుల కస్టడీకే అప్పగిస్తూ ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు విధించిన షరతులకు లోబడి చంద్రబాబును విచారించాం. విచారణ సందర్భంగా ఆయన నుంచి పలు వివరాలు రాబట్టేందుకు ఈ కేసుకు సంబంధించిన విషయాలతో ప్రశ్నలను సిద్ధం చేశాం. మా ప్రశ్నల తీరు మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేశాం. మొదటి రోజు విచారణలో చంద్రబాబు మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేశారు. కోర్టు ఇచ్చిన పోలీసు కస్టడీ ఉత్తర్వులను ప్రశ్నించారు. పోలీసు కస్టడీ ఉత్తర్వుల కాపీని తనకు అందచేస్తే తప్ప, దర్యాప్తు అధికారి అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పారు. తనకు ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండానే పోలీసు కస్టడీకి ఇచ్చారని, న్యాయవాదిని కలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. కోర్టు ఇరుపక్షాల వాదనలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తరువాతనే మిమ్మల్ని పోలీసు కస్టడీకి ఇవ్వడం జరిగిందని దర్యాప్తు అధికారి ఆయనకు చెప్పారు. ఒకవేళ పోలీసు కస్టడీ ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే, న్యాయవాది ద్వారా ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని కూడా చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టం చేశారు. మిమ్మల్ని విచారించేందుకు కోర్టు మాకు అనుమతినిచ్చిందని, మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయనకు దర్యాప్తు అధికారి తేల్చి చెప్పారు. కస్టడీ ఉత్తర్వులను తీసుకున్న చంద్రబాబు వాటిని మధ్యాహ్నం 1 గంట వరకు చదివారు. దర్యాప్తు అధికారి గంట పాటు భోజన విరామ సమయం ఇచ్చారు. భోజన విరామం తరువాత వచ్చి కూడా 2 గంటల వరకు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు. 2.20 గంటల సమయంలో మాకు కోర్టు కేవలం రెండు రోజుల కస్టడీ మాత్రమే ఇచ్చిందని చంద్రబాబుకు దర్యాప్తు అధికారి స్పష్టంగా చెప్పారు. చదవడం ఆపి, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయనను దర్యాప్తు అధికారి కోరారు. అయితే దీనిని చంద్రబాబు పట్టించుకోలేదు. అలా మరికొద్దిసేపు కోర్టు ఉత్తర్వులను చదువుతూనే ఉన్నారు.’ అని సీఐడీ తన పిటిషన్లో పేర్కొంది. 15 రోజుల తరువాత విచారణకు ఆస్కారం లేదనే.. ‘మేం ఏ సరళిలో ప్రశ్నలు అడగాలనుకున్నామో మమ్మల్ని అలా చంద్రబాబు అడగనివ్వలేదు. అంతేకాక ఆయన చెప్పే విషయాలను రాసుకోవాలని దర్యాప్తు అధికారికి చెప్పారు. తనకు తెలిసిన విషయాలకు సంబంధించి కూడా ఆయన నోరు మెదపలేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. చాలా సందర్భాల్లో దర్యాప్తు అధికారిని మాటలతో వంచించే వైఖరిని అవలంభించారు. తాను విచారణ సందర్భంగా ఇలానే వ్యవహరించాలని చంద్రబాబు ముందే ఓ నిర్ణయానికి రావడంతో, ఈ కేసులో కీలక నిందితులైన వికాస్ ఖన్వీల్కర్, షెల్ కంపెనీల డైరెక్టర్లు, ఇతర కుట్రదారులైన గంటా సుబ్బారావు (ఏ1), లక్ష్మీనారాయణ (ఏ2)ల వాంగ్మూలాలను ఆయన ముందుంచి వివరాలు రాబట్టే అవకాశం లేకుండా పోయింది. అలాగే కీలక సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా చంద్రబాబు నుంచి తగిన వివరాలు తెలుసుకోలేకపోయాం. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ, కావాల్సిన సమాచారాన్ని రాబట్టనివ్వకుండా దర్యాప్తు సంస్థను నిరోధిస్తూ వచ్చారు. విచారణ సందర్భంగా తీసిన వీడియోను పరిశీలిస్తే చంద్రబాబు వేసిన కాలయాపన ఎత్తులు సులభంగా అర్థమవుతాయి. అరెస్ట్ చేసిన నాటి నుంచి 15 రోజుల తరువాత ఎలాంటి జ్యుడీషియల్ ఇంటరాగేషన్ ఉండదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు కావాలనే దర్యాప్తు అధికారి కోరిన సమాచారాన్ని ఇవ్వలేదు.’ అని సీఐడీ వివరించింది. హైకోర్టు ఉత్తర్వుల వల్ల 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోలేకపోయాం... ‘కోట్లాది రూపాయల డబ్బు 2018–20 సంవత్సరాల మధ్య తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు దర్యాప్తులో గుర్తించాం. ఆ బ్యాంకు ఖాతాలకు తానే అథరైజ్డ్ సిగ్నేటరీ అన్న విషయాన్ని చంద్రబాబు కూడా అంగీకరించారు. భారీ స్థాయిలో వచ్చిన నగదు డిపాజిట్ల వివరాలను చంద్రబాబు ముందు ఉంచి, వాటి గురించి ఆయన్ను ప్రశ్నించాల్సి ఉంది. టీడీపీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన అన్ని వివరాలు అందించాలని హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా జోనల్ మేనేజర్‌ను కోరాం. ఆ వివరాలు రావాల్సి ఉంది. వచ్చిన తరువాత వాటిని విశ్లేషించి చంద్రబాబును విచారిస్తాం. తనపై మేం నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఈ నెల 13న విచారణ జరిపిన హైకోర్టు, 18వ తేదీ వరకు మా పోలీసు కస్టడీ పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబును ఒత్తిడి చేయవద్దని ఉత్తర్వులిచ్చింది. ఈ ఆరు రోజులను మొదటి 15 రోజుల గడువు నుంచి మినహాయించాల్సిన అవసరం ఉంది. హైకోర్టు ఆదేశాల వల్ల మా కస్టడీ పిటిషన్‌పై ఈ ఏసీబీ కోర్టు విచారణ జరిపే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో తగినంత గడువు లేకపోవడంతో మేం కోరుకున్న విధంగా చంద్రబాబును 5 రోజుల పోలీసు కస్టడీకి తీసుకోలేకపోయాం’ అని సీఐడీ తన పిటిషన్లో తెలిపింది. చంద్రబాబు సహాయ నిరాకరణ వల్ల అది సాధ్యం కాలేదు... ‘ఈ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో లోతైన కుట్ర దాగి ఉంది. ఈ కుట్ర వెనుక వాస్తవాలను వెలికితీసేందుకు చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధికార దుర్వినియోగం, ప్రైవేటు వ్యక్తులకు చేకూర్చిన లబ్ధి గురించి ప్రశ్నించాల్సి ఉంది. సాక్షులు చెప్పిన వివరాలను ఆయన ముందుంచి వాటి ఆధారంగా వాస్తవాలను రాబట్టాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థగా మాపై ఉంది. చంద్రబాబు సహాయ నిరాకరణ వల్ల పలు వివరాలను రాబట్టలేకపోయాం. కీలక ఫైళ్లు గల్లంతయ్యాయి. ఈ ఫైళ్ల గల్లంతు వ్యవహారంలో చంద్రబాబు, అచ్చెన్నాయుడు, గంటా సుబ్బారావు, డాక్టర్ లక్ష్మీనారాయణ ప్రధాన లబ్ధిదారులుగా అనుమానిస్తున్నాం. గల్లంతైన ఫైళ్ల ఆచూకీ తెలుసుకునేందుకు చంద్రబాబు కస్టోడియల్ విచారణ అత్యావశ్యకం’ అని సీఐడీ తన పిటిషన్లో పేర్కొంది. ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని దర్యాప్తులో తేలింది... ‘ఈ స్కిల్ కుంభకోణం డబ్బు మొత్తం చివరకు నగదు రూపంలో చేరింది వికాస్ ఖన్వీల్కర్, షెల్ కంపెనీలకు. ఇందుకు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అని దర్యాప్తులో తేలింది. షెల్ కంపెనీల ద్వారా డబ్బు మొత్తం తిరిగి ఆయనకే చేరింది. సుమన్ బోస్, వికాస్ ఖన్వీల్కర్, లక్ష్మీనారాయణ, గంటా సుబ్బారావు, సంజయ్ దాగాలు చెప్పిన వివరాల ఆధారంగా చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉంది. ఈ కుంభకోణం అంతిమ లబ్ధిదారులు చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అని మా దర్యాప్తులో తేలింది. నిధుల మళ్లింపులో ఎవరెవరి పాత్ర ఏమిటన్న విషయాలు చంద్రబాబుకు పూర్తిగా తెలుసు. కుట్ర పన్నిన తీరు, ఇతర నిందితుల పాత్ర, ఇతర కీలక వివరాలన్నీ చంద్రబాబుకు తెలుసు. ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబును 5 రోజుల పాటు మా కస్టడీకి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం’ అని సీఐడీ తన పిటిషన్లో తెలిపింది. -
నిండు ప్రాణాన్ని బలికొన్న వివాహేతర సంబంధం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్టణంలో దారుణం వెలుగుచూసింది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టకున్నడనే కారణంతో ఓ యువకుడిని భర్త కిరాతకంగా హత్య చేశారు. వివరాలు.. 4వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శివారెడ్డి అనే వ్యక్తి తన భార్యతో నివసిస్తున్నాడు. కొంతకాలంగా శివారెడ్డి భార్యతో కిషోర్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శివారెడ్డి పలుమార్లు ఇద్దరిని మందలించాడు. అయినా వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కిషోర్ అడ్డుతొలగించుకోవాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి కిషోర్‌కు ఫోన్ చేసి బయటకు రావాలని చెప్పాడు. కిషోర్ రామ టాకిస్ వద్దకు చేరుకోగా అతన్ని శివారెడ్డి మేడపై నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన కిషోర్ చికిత్స పొందుతూ మృతిచెందాడు -
Sep 25, 2023 : చంద్రబాబు కేసు అప్డేట్స్
CBN Case Live Updates 6:52PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుకు సింపతీ డ్రామాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ ►రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు ►ఇది వాళ్లకు కొత్తేం కాదు ►డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ ►ఆ పార్టీ పునాదులే దోపిడీపైన ఏర్పడ్డాయి. రాజమండ్రిలో చంద్రబాబు గారి కుటుంబసభ్యుల పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టించడానికి డబ్బిచ్చి జనాన్ని తీసుకొస్తున్నారు. ఇది వాళ్లకు కొత్తేం కాదు. డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఇప్పటికీ, ఎప్పటికీ గట్టిగా నమ్మే పార్టీ టీడీపీ. ఆ పార్టీ పునాదులే దోపిడీపైన… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2023 5:50 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు పనులకు అక్షింతలు వేసిన కాగ్ ► అమరావతి రాజధాని ప్లాన్‌పై కాగ్ సంచలన నివేదిక ► CRDA వల్ల రాష్ట్రం పై భారీ ఆర్థిక భారం ► వర్తమానంతో పాటు భవిష్యత్తులో కూడా CRDA వల్ల ఆర్థిక భారమే ► నిపుణుల కమిటీ సిఫార్సులను నాడు చంద్రబాబు సర్కారు పరిగణనలోకి తీసుకోలేదు ► మాస్టర్ ప్లాన్స్ తయారీ కాంట్రాక్ట్‌లను నామినేషన్ పద్ధతిలో ఇచ్చేసారు ► సలహాదారు సంస్థలకు నామినేషన్లపై రూ.28 కోట్లు ఇవ్వడం తప్పు ► నిబంధనలకు విరుద్ధంగా ప్రజా వేదిక నిర్మించారు 5:35 PM, సెప్టెంబర్ 25, 2023 అమవాస్య చీకటిలో తెలుగుదేశం : మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ► చంద్రబాబు అరెస్ట్‌తో అశాంతిని సృష్టించి లాభం పొందాలని ప్రతిపక్షం ప్రయత్నించింది ► బలహీన వర్గాలను అన్ని రకాలుగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు ► టీడీపీ పార్టీ బీసీలకు క్షమాపణ చేయాలి ► అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇచ్చాడే కానీ కనీస గౌరవం లేదు, ప్రాధాన్యత ఇవ్వలేదు ► అచ్చెన్నాయుడు పనికిరాడనే పవన్‌ను తెచ్చుకున్నట్టున్నాడు ► చంద్రబాబు నాయకత్వానికి చీకటి రోజులు వచ్చాయి ► అమావాస్య చీకటిలో టీడీపీ కూరుకుపోయింది 5:15 PM, సెప్టెంబర్ 25, 2023 లోకేష్‌కు అరెస్ట్ భయం లేదు ► లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు : అచ్చెన్నాయుడు ► సుప్రీంకోర్టు న్యాయవాదులతో లోకేష్ మాట్లాడుతున్నారు ► నేషనల్ మీడియాకు చెప్పేందుకు లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు ► లోకేష్‌కు అరెస్ట్ అంటే భయమేమీ లేదు ► నన్ను కూడా అరెస్ట్ చేసినా భయమేమీ లేదు ► నాకు కూడా కేసులు, అరెస్ట్‌లు కొత్త కాదు 5:00 PM, సెప్టెంబర్ 25, 2023 ములాఖత్ ముగిసింది ► చంద్రబాబుతో ముగిసిన కుటుంబసభ్యుల ములాఖత్ ► సుమారు 40 నిమిషాల పాటు చంద్రబాబుతో సమావేశం ► బాబుతో భువనేశ్వరి, బ్రాహ్మణి, అచ్చెన్నాయుడు సమావేశం ► కోర్టులో వాదనలు, ఇప్పుడున్న పరిస్థితులు వివరించిన బృందం 4:00 PM, సెప్టెంబర్ 25, 2023 కేసులు ఇవి, స్టేటస్ ఇది ► జైల్లో చంద్రబాబుకు బ్రీఫింగ్ ఇవ్వనున్న కుటుంబ సభ్యులు ► రిమాండ్ తర్వాత చంద్రబాబును మూడోసారి కలిసిన భువనేశ్వరి, బ్రాహ్మణి ► లోకేష్ ఢిల్లీలో చేపట్టిన లాయర్ల కన్సల్టేషన్ గురించి వివరించనున్న కుటుంబ సభ్యులు ► జనసేన నేతలతో జరిగిన చర్చల గురించి చంద్రబాబుకు వివరించనున్న కుటుంబ సభ్యులు 3:50 PM, సెప్టెంబర్ 25, 2023 భువనేశ్వరీ వ్యాఖ్యలను తప్పుబట్టిన YSRCP ► చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిందే మీ నాన్న ఎన్టీఆర్ ► మీ నాన్న స్వయంగా చెప్పినా.. ఇంకా చంద్రబాబుకే మద్ధతిస్తారా? నక్కను తెచ్చి మీరు సింహం అని లేనిపోని ఎలివేషన్లు ఇవ్వకండి మేడం. ముసలి నక్క గర్జించినా ఏమీ కాదు. ఆయనేమీ చేసేది ఉండదు. ఆయన్ను గొడ్డుకన్నా హీనం.. పశువుకన్నా ఘోరం అని మీ నాన్న ఎన్టీఆర్ గారే స్వయంగా చెబితే మీరేమో ఆయన్ను సింహం అంటుంటే ప్రజలకు నవ్వొస్తోంది.. మీ ఆయన్ను అరెస్ట్ చేయడంతో మీ… https://t.co/bJHolk6EM3 — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 3:50 PM, సెప్టెంబర్ 25, 2023 రాజమండ్రి జైల్లో బాబుతో ములాఖత్‌కు అచ్చెన్నాయుడు ► చంద్రబాబును కలిసేందుకు జైలుకు వచ్చిన భువనేశ్వరీ, బ్రాహ్మణి ► బాబు కుటుంబ సభ్యులతో పాటు జైలుకు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి ► పార్టీ సీనియర్ నేతలతో వరుసగా బాబు మంత్రాంగం ► ఇటీవలే జైల్లో యనమలతో ములాఖత్ అయిన చంద్రబాబు ► అనుమతి లేకపోవడంతో జైలు బయటే ఆగిపోయిన ప్రత్తిపాటి 3:45 PM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో బాబు పిటిషన్ల హోరు ► సాంకేతిక కారణాల కోసం బాబు లాయర్ల తాపత్రయం ► అరెస్ట్ సమయంలో CID అధికారుల కాల్ డాటా కావాలంటూ పిటిషన్ ► తన అరెస్ట్‌కు సంబంధించి కొన్ని ఆదేశాలొచ్చాయంటూ పిటిషన్ ► కాల్ రికార్డులు ఇవ్వాలంటూ రిమాండ్ సమయంలోనూ లూథ్రా విజ్ఞప్తి ► కాల్ రికార్డుల కేసులో వాదనలు వినిపిస్తోన్న బాబు లాయర్లు 3:40 PM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో విచారణ రేపటికి వాయిదా ► చంద్రబాబుకు సంబంధించి వరుస పిటిషన్లు ► కస్టడీ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగానే బెయిల్ పిటిషన్ ► బెయిల్ పిటిషన్‌పైనే వాదనలు జరపాలని పట్టుబట్టిన బాబు లాయర్లు ► ఏ అంశంపై విచారణ చేపట్టాలో రేపు తేలుస్తామని చెప్పిన కోర్టు ► అవసరమయితే రెండు పిటిషన్లను ఏకకాలంలో విచారణ చేపడుతామన్న కోర్టు 3:30 PM, సెప్టెంబర్ 25, 2023 రూల్స్ ఏం చెబుతున్నాయి? కస్టడీనా? బెయిలా? ► CRPC ప్రకారం ముందు కస్టడీ పిటిషన్‌పై విచారణ చేపట్టాలంటున్న లాయర్లు ► జడ్జి ఏ అంశంపై విచారణ జరపాలో చంద్రబాబు లాయర్లు పట్టుబట్టడం సరికాదంటున్న లాయర్లు ► కస్టడీ అంశంపై వాదనలు పూర్తి కాగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినడం సబబు అంటోన్న లాయర్లు ► కస్టడీపై నిర్ణయం వచ్చిన తర్వాతే ఏ కోర్టయినా బెయిల్‌పై వాదనలు వింటుందంటున్న లాయర్లు 3:15 PM. సెప్టెంబర్ 25, 2023 షెల్ కంపెనీలకు డైరెక్టర్లుగా తమ్ముళ్లే : CID ► బాబు సృష్టించిన షెల్ కంపెనీకి డైరెక్టర్లంతా బాబు అనుచరులే ► షెల్ కంపెనీ డైరెక్టర్లుగా సుమన్ బోస్, వికాస్ కన్విల్కర్ ► షెల్ కంపెనీ ఖాతాల నుంచి బాబు చెప్పిన ఖాతాలకు డబ్బు రూటింగ్ ► ఆధారాలు చూపించి ప్రశ్నలడిగినా బాబు నోరు మెదపట్లేదు ► విచారణలో ఏ రకంగా సహకరించడం లేదు ► చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు, ఘంటా సుబ్బారావు, డా.లక్ష్మీనారాయణ పాత్రలపై ఆధారాలున్నాయి ► ఈ ఆధారాలను చూపించి కుట్ర కోణం అడిగితే.. చంద్రబాబు నోరు మెదపట్లేదు 2:45PM. సెప్టెంబర్ 25, 2023 ఖాతాల్లోకి వచ్చిన కోట్లు ఎక్కడివి? ► చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు ప్రారంభం ► నిధుల గోల్‌మాల్‌కు సంబంధించి CID దగ్గర పక్కా ఆధారాలు ► 2014-18 మధ్య స్కిల్ కుంభకోణం ► 2018 నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కౌంట్లకు తరలివచ్చిన భారీగా నిధులు ► ఈ అక్కౌంట్లు అన్నింటికీ సంతకం హోదా ఉన్నది చంద్రబాబుకే ► పార్టీకి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా, హైదరాబాద్ జోన్ ఖాతాలో భారీగా డిపాజిట్లు ► వాటి లెక్క చెప్పేందుకు నిరాకరించిన చంద్రబాబు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 మహిళల్లో శక్తి ఉంది, దేన్నయినా నడిపించగలరు : భువనేశ్వరీ ► టిడిపి నాయకత్వంపై చర్చ జరుగుతున్న సమయంలో భువనేశ్వరీ కీలక వ్యాఖ్యలు ► దేవుడు ఉన్నాడు, నన్ను ముందుకు నడిపించగలడు ► మగవాళ్ల కంటే ఆడవాళ్లే బాగా నడిపించగలరని నమ్ముతున్నాను ► మనలో దుర్గాదేవీ శక్తి ఉంది, ఝాన్సీ రాణీ పట్టుదల ఉంది ► నాకు పెళ్లయిన కొత్తలో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించారు ► కేవలం మూడు నెలల్లో సంస్థను నడిపించడం నేర్చుకున్నాను ► మహిళలు కుటుంబాన్నే కాదు, దేన్నయినా నడిపించగలరు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► ఏపి హైకోర్టులో శనివారం దాఖలైన చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ ► చంద్రబాబు సీఐడీ కస్టడీ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయిన క్వాష్ పిటిషన్ ► ఇప్పటికే కస్టడీ ముగిసినందున అర్హత కోల్పోయిన పిటిషన్ ► నేడు విచారణకు వచ్చిన క్వాష్ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన హైకోర్టు 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు సామ్రాజ్యం విలువ ఎంత? : YSRCP ► జగ్గంపేటలో తమ వ్యాపార సామ్రాజ్యం గురించి వెల్లడించిన భువనేశ్వరీ ► మా కంపెనీలో మాకున్న వంద శాతం షేర్లలో 2% అమ్ముకుంటే రూ.400 కోట్లు ► భువనేశ్వరీ లెక్క ప్రకారం 1%=రూ.200 కోట్లు, 100%=రూ.20వేల కోట్లు ► ఈ లెక్కన కేవలం హెరిటేజ్‌లో చంద్రబాబు కుటుంబానికి ఉన్న షేర్ల విలువ రూ.20వేల కోట్లు.! ► ఇవీ కాక, మెట్రో నగరాల్లో, దేశ విదేశాల్లో వందలాది ఎకరాలు, వేల కోట్ల విలువ చేసే ఇతర ఆస్తుల విలువ ఎంత? ► హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో ఇంటి విలువ ఎంత? మదీనాగూడ 14 ఎకరాల ఫాంహౌజ్ విలువ ఎంత? ► ఎన్నికల సంఘం లెక్కల్లో ఎన్ని ఆస్తులు చూపించారు? ఎంత విలువ కట్టారు? మా కుటుంబం అంతా ఒకటే నమ్ముతాం... మా కుటుంబానికి ప్రజల సొమ్ము తినాల్సిన అవసరం లేదు. ప్రజల సొమ్ముకు ఆశపడితే ఎలా వచ్చిన సొమ్ము అలాగే పోతుంది. #CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidu #CBNWillBeBackWithABang pic.twitter.com/SqVhXhFpte — Telugu Desam Party (@JaiTDP) September 25, 2023 1:30 PM, సెప్టెంబర్ 25, 2023 రంగంలోకి భువనేశ్వరీ, బ్రాహ్మణి ► లోకేష్ ఇప్పట్లో ఢిల్లీ నుంచి వచ్చే అవకాశం లేదా.? ► గత పది రోజులుగా ఢిల్లీకే పరిమితమయిన లోకేష్ ► లోకేష్ ఢిల్లీలోనే ఉండిపోవడంతో పార్టీ నేతృత్వంపై చర్చ ► గత కొద్ది రోజులుగా బ్రాహ్మణి రావాలని ఎల్లో మీడియా డిమాండ్ ► బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమయిందంట సంపాదకీయాలు ► బ్రాహ్మణి ఇప్పుడు పార్టీ పగ్గాలు చేపట్టాలంటూ ఎల్లో మీడియా ప్రత్యేక డిబేట్ ► దానికి తగ్గట్టుగానే బ్రాహ్మణి, భువనేశ్వరీ కార్యాచరణ ప్రణాళిక ► నిన్నంతా రాజకీయ సమావేశాలు నిర్వహించిన బ్రాహ్మణి ► పొత్తులో భాగంగా జనసేన నాయకులతో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై బ్రాహ్మణి చర్చలు ► ఇవ్వాళ జగ్గంపేట ఆందోళనల్లో పాల్గొన్న భువనేశ్వరీ ► భవిష్యత్ పార్టీ పగ్గాల విషయంలో ఎల్లోమీడియా డైరెక్షన్లో టిడిపికి స్పష్టత ఇస్తోన్న బ్రాహ్మణి, భువనేశ్వరీ ► చంద్రబాబు ఔట్ సోర్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని YSRCP విమర్శలు “చంద్రబాబు అవుట్ సోర్సింగ్ రాజకీయాలు” చంద్రబాబు రాజకీయాలు మొత్తం పక్కరాష్ట్రం నుంచి అవుట్ సోర్సింగ్ మీదనే నడిపిస్తున్నారు. అయన ఏపీ నివాసి కాదు, భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి సైతం హైదరాబాదీలే.. అప్పుడప్పుడు ఏపీకి వచ్చే చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ కావడంతో… — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 1:25 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు కస్టడి పొడిగించండి : CID పిటిషన్ ► విజయవాడ ACB కోర్టులో సీఐడీ పిటిషన్ ► సీఐడీ విచారణకు చంద్రబాబు సహకరించలేదు ► మొదటి రెండు రోజుల కస్టడీలో విచారణకు సహకరించ లేదు ► అందుకే మరో 3 రోజులు కస్టడీ పొడిగించాలని కోరుతున్నాము ► కేసు ఇప్పుడు కీలక విచారణ దశలో ఉంది ► కస్టడీ పొడిగింపు పిటిషన్‌పై మా వాదనలు వినాలి : CID ► పోలీస్ కస్టడీ పిటిషన్‌పై మెమో ఫైల్ చేయాలని CIDకి జడ్జి ఆదేశం ► ముందు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినాలి : చంద్రబాబు లాయర్లు ► కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తవగానే బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామన్న కోర్టు 1:22 PM, సెప్టెంబర్ 25, 2023 మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే కోర్టు మీద నిందలేస్తారా? ► రాష్ట్ర అధికార భాషా సంఘం మరియు తెలుగు భాషాభివృద్ది ప్రాధికార సంస్థ అధ్యక్షులు విజయబాబు ► కొందరు సొంత లబ్ది కోసం జర్నలిజానికి భ్రష్టు పట్టిస్తున్నారు ► కోర్టు మీద విమర్శలు చేసి జర్నలిజాన్ని చంపేశారు ► ఓ వర్గం మీడియా సమాంతర వ్యవస్థను నడుపుతోంది, అన్నీ తాను చెప్పినట్టుగా జరగాలంటోంది ► న్యాయ వ్యవస్థను కొన్ని ఛానెల్స్ కించపరుస్తున్నాయి 1:18 PM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబు స్థాయి ఏంటో తెలుసా? : భువనేశ్వరీ ► మా కుటుంబానికి వ్యాపారాలున్నాయి ► నేను స్వయంగా ఒక సంస్థను నడుపుతున్నా ► నా సంస్థలో 2శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయి ► ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుచుకుంటున్నారు ► ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఏటా రూ.వందలకోట్లు ఖర్చు చేస్తున్నాం 1:18 PM, సెప్టెంబర్ 25, 2023 ఇది రాజకీయ కక్ష ఎలా అవుతుంది? : అంబటి ► చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష అని అనుకుంటున్నవారికి ఇప్పుడు వాస్తవాలు అర్థమవుతున్నాయి ► ఈ కేసులో సమగ్ర ఆధారాలు బయటపడుతుండడంతో ప్రజలకు అన్నీ అర్థం అవుతున్నాయి ► గతంలోలా సమాజమంతా ఎల్లో మీడియా మీద ఆధారపడనవసరం లేదు ► ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతీ విషయం ప్రజలు తెలుసుకుంటున్నారు ► ఒకాయిన ఢిల్లీలో ఉన్నాడు, మద్దతు ఇచ్చిన ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు ► స్కాముల రూపంలో ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బును రాబట్టుకునే ప్రయత్నం జరిగింది 12:55 PM, సెప్టెంబర్ 25, 2023 ఇది చట్టం చేస్తున్న పని, దీనికి రాజకీయాలతో సంబంధమేంటీ? ► చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన సినీ నటుడు సుమన్ ► మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన సుమన్ ► జైల్‌కు వెళ్లాడంటే సీఎం జగన్ చేశారంటున్నారు కానీ అది సరికాదు ► ఒకరు జైలుకు వెళ్లారంటే దాని వెనక చాలా కారణాలుండొచ్చు ► ఆ అరెస్ట్ గురించి నిర్ణయించే బాధ్యత కోర్టులపై ఉంటుంది ► మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటప్పుడు అధికారులు అన్ని ఆలోచించే వుంటారు ► టైం బాగుంటే లోకల్ కోర్టులో కూడా అనుకూలంగా వస్తుంది ► టైం బాడ్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ► చంద్రబాబు బయటకు ఎప్పుడు వస్తాడో జ్యోతిష్యులు చెప్పగలరేమో.! 12:48 PM, సెప్టెంబర్ 25, 2023 మరిన్ని రోజులు కస్టడీ కోరిన సీఐడీ ►చంద్రబాబు పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ ►బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై వాదనలు ►ముందు కస్టడీ పిటిషన్ వాదనలు వినాలని కోరిన సీఐడీ ►కస్టడీలో చంద్రబాబు సహకరించలేదంటున్న సీఐడీ ►కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు లాయర్లను ఆదేశించిన జడ్జి 12:22 PM, సెప్టెంబర్ 25, 2023 దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు: అంబటి స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మంత్రి అంబటి అసెంబ్లీలో మాట్లాడారు ►చర్చకు రమ్మంటే టీడీపీ సభ్యులు పారిపోయారు ►సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది ►బాబు పిటిషన్లను కోర్టు తిరస్కరిస్తుందంటే కేసు ఎంత బలంగా ఉందో అందరికీ అర్థమవుతోంది ►ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు ►అసెంబ్లీలో మీసాలు మెలేసి, తొడలు కొడుతున్నారు ►అన్యాయాలు, అక్రమాలతో చంద్రబాబు రాజ్యాధికారం ►దొరికినవి కొన్నే.. దొరకని స్కామ్‌లు చాలానే ఉండొచ్చు ► దొరికిన దొంగ ఇక తప్పించుకోలేడు 12:00 PM, సెప్టెంబర్ 25, 2023 మరో 3 రోజులు కస్టడీ కావాలి : CID ► ACB కోర్టులో మరోసారి కస్టడీ పిటీషన్ దాఖలు చేసిన CID ► రెండు రోజుల కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని తెలిపిన CID ► మరో మూడు రోజులు విచారణ జరుపుతామని విజ్ఞప్తి 11:45AM, సెప్టెంబర్ 25, 2023 తాజా పరిణామాలపై పక్కాగా ప్రిపేరయిన CID ► ఈ కేసులో కీలకమయిన వ్యక్తులు దేశం విడిచి పారిపోతున్నారు ►శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పరారీలో ఉన్నారు ►వీరి వెనుక చంద్రబాబు ఉన్నారని ప్రాథమికంగా తెలుస్తోంది. ►ఈ ఇద్దరూ షెల్ కంపెనీలకు మళ్లించిన సొమ్మును నగదుగా మార్చారు ►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు ►విచారణ ప్రక్రియకు భంగం కలిగేలా.. మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ మాట్లాడుతున్నారు ►పీవీ రమేష్ మాట్లాడిన విధానం చూస్తే బాబు, ఆయన అనుచరులు..సాక్షులను ఏ విధంగా ప్రభావితం చేస్తారో అర్థమవుతుంది ►చంద్రబాబు బెయిల్ విషయంలో పై అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరుతోన్న CID 11:32AM, సెప్టెంబర్ 25, 2023 ACB కోర్టులో మధ్యాహ్నం తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ ► మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంద్రబాబు బెయిల్ పిటీషన్లు, పిటి వారెంట్లపై విచారణ ► బెయిల్‌పై ఇరుపక్షాల వాదనలు వింటామన్న ACB కోర్టు ► ACB కోర్టుకి చేరుకున్న కేసు దర్యాప్తు అధికారి ధనుంజయ ఆధ్వర్యంలోని సిట్ బృందం 11:30AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంకోర్టులో చంద్రబాబు SLP ► సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్ల స్పెషల్ లీవ్ పిటిషన్ ► 284 పేజీలతో SLP దాఖలు చేసిన బాబు లాయర్ల బృందం ► చంద్రబాబుకు తక్షణం ఉపశమనం ఇవ్వాలని విజ్ఞప్తి ► ప్రతివాదులుగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 11:25AM, సెప్టెంబర్ 25, 2023 అరెస్ట్‌పై చర్చించేందుకు అసెంబ్లీకి రారా? ► చర్చిస్తామని చెప్పిన టిడిపి ఎమ్మెల్యేలు ఎందుకు బాయ్‌కాట్ చేశారు? : YSRCP ► ఈ కేసుపై సమగ్రంగా చర్చిద్దాం, రండి సభకు వచ్చి మాట్లాడండి : YSRCP స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 11:15AM, సెప్టెంబర్ 25, 2023 హైకోర్టులో తెలుగుదేశం వరుస పిటిషన్లు ► క్వాష్ పిటిషన్ల దారి పట్టిన తెలుగుదేశం నేతలు ► ఏపీ హైకోర్టులో కొల్లురవీంద్ర , బుద్ధా వెంకన్న క్వాష్ పిటిషన్లు ► గన్నవరం సభలో వ్యాఖ్యలపై పేర్ని నాని ఫిర్యాదు ► ఈ FIRను క్వాష్ చేయాలన్న బుద్ధా వెంకన్న ► గన్నవరంలో వీరవల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో FIRను క్వాష్ చేయాలని కొల్లురవీంద్ర పిటిషన్ ► ఇప్పటికే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు 11:00AM, సెప్టెంబర్ 25, 2023 ఏసీబీ కోర్టులో చంద్రబాబు వరుస పిటిషన్లు ► పిటిషన్లతో కోర్టును ఇరకాటంలో పెడుతోన్న చంద్రబాబు లాయర్లు ► సుప్రీంకోర్టు, హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో వరుస పిటిషన్లు ► ప్రతీ పిటిషన్ అర్జంటుగా స్వీకరించి వాదనలు వినాలంటూ విజ్ఞప్తులు ► సుప్రీంకోర్టులో లూథ్రా, ఏసీబీ కోర్టులో ప్రమోద్ దూబే ► పిటిషన్ ఎప్పుడు విచారించాలన్నది కోర్టు చూసుకుంటుందన్న న్యాయమూర్తి 10:55AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీం ముందుకు రేపు చంద్రబాబు పిటిషన్ ► రేపు విచారణ తేదీని ఖరారు చేయనున్న సుప్రీంకోర్టు ► త్వరంగా తమ వాదనలు వినాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను విజ్ఞప్తి చేసిన లూథ్రా ► చంద్రబాబును ఎప్పుడు కస్టడీలోకి తీసుకున్నారని అడిగిన సీజే ► ఈ నెల 8న అరెస్ట్ చేశారన్న లుత్రా ► కేసు వివరాలు చెప్పేందుకు ప్రయత్నించిన సీనియర్ న్యాయవాది లూథ్రా ► సరే, ఇప్పుడెందుకు అన్ని వివరాలు రేపే మెన్షన్ చేయమన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ► పిటిషన్‌ను రేపు మెన్షన్ లిస్టులో చేరుస్తామని చెప్పిన చీఫ్ జస్టిస్ 10:45AM, సెప్టెంబర్ 25, 2023 మధ్యాహ్నం తర్వాత ములాఖత్‌లు ► రాజమండ్రి : మధ్యాహ్నం తర్వాత సెంట్రల్ జైల్లో చంద్రబాబు ములాఖత్ ► చంద్రబాబును కలవనునున్న భువనేశ్వరీ, బ్రహ్మణి, టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ► మరికొద్ది సేపట్లో రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లనున్న నారా భువనేశ్వరి ► అన్నవరం సత్యన్నారాయణ స్వామి వారి దర్శనం చేసుకోనున్న భువేనేశ్వరి ► అక్కడినుంచి జగ్గంపేటలో జరుగుతున్న దీక్షా శిబిరానికి వెళ్లనున్న భువనేశ్వరి ► మధ్యాహ్నం తర్వాత రాజమండ్రికి వచ్చి ములాఖత్‌లో చంద్రబాబును కలవాలని ప్రోగ్రామ్ 10:35AM, సెప్టెంబర్ 25, 2023 బాబు పిటిషన్లకు వెకేషన్ ఎఫెక్ట్ ► ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకి సెలవులు ► సెప్టెంబర్ 28న మిలాదున్ నబీ వల్ల సెలవు ► సెప్టెంబర్ 29న ఢిల్లీలో స్థానికంగా సెలవు ► సెప్టెంబర్ 30న శని, అక్టోబర్ 1న ఆదివారం ► అక్టోబర్ 2న గాంధీ జయంతి వల్ల సెలవు ► ఇవ్వాళ బెంచ్ కేటాయిస్తేనే 28లోపు వాదనలు జరిగే అవకాశం ► ఇదే విషయాన్ని సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించాలని సిద్ధార్ధ్ లూథ్రా నిర్ణయం ► తన పిటిషన్‌పై వెంటనే పూర్తి స్ధాయి విచారణ చేపట్టాలని కోరనున్న సిద్ధార్ధ్ లూథ్రా 10:30AM, సెప్టెంబర్ 25, 2023 హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు ► ఇవాళ హైకోర్టు ముందుకు మాజీ మంత్రి నారాయణ పిటిషన్లు ► అసైన్డ్ భూముల కేసులో ముందస్తు బెయిల్ కోసం నారాయణ పిటిషన్ ► తనపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు ► అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోనూ నారాయణ పిటిషన్ ► నాలుగు పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ 10:26AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంకోర్టులో స్టేటస్ ఏంటీ? ► సుప్రీంకోర్టుకు మరోసారి నేడు చంద్రబాబు లాయర్లు ► చంద్రబాబు పిటిషన్‌ను త్వరగా విచారించాలని కోరనున్న న్యాయవాదులు ► ఈ నెల 23న (శనివారం) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ► చంద్రబాబు పిటిషన్‌ను ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ► ఇవ్వాళ ఏ బెంచ్ అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ► రేపు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని బాబు లాయర్ల విజ్ఞప్తి 10:16AM, సెప్టెంబర్ 25, 2023 ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు ►స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు ముందుకు ముఖ్యమైన అంశాలు ►చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ ►చంద్రబాబు తరపున వాదనలు వినిపించనున్న సీనియర్ లాయర్ ప్రమోద్ దూబే ►చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోరుతున్న CID ►ఇంకోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్ లపై విచారించాలని కూడా కోరిన సీఐడీ 09:48AM, సెప్టెంబర్ 25, 2023 ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే ►తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? ►అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు ►ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే :::ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు గారి, లోకేష్ బాబు సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు. ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమే. — Vijayasai Reddy V (@VSReddy_MP) September 25, 2023 09:25AM, సెప్టెంబర్ 25, 2023 అవినీతి బయటపడుతుందనే.. అసెంబ్లీ బాయ్‌కాట్ ►స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. ►చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. ►వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే స్కిల్ స్కామ్‌లో అన్ని ఆధారాలు సేకరించి.. చంద్రబాబు తప్పు చేశారని నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశారు. @ncbn చేసిన అవినీతి బయటపడుతుందనే టీడీపీ నేతలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేశారు. వాళ్లు ఏం చేసినా ఈసారి గెలిచేది సీఎం వైయస్ జగన్ గారే. #PublicVoice #AndhraPradesh #YSJaganAgain pic.twitter.com/c3hQqJSwSv — YSR Congress Party (@YSRCParty) September 25, 2023 09:20AM, సెప్టెంబర్ 25, 2023 ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి ►నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ ►రాజమండ్రి: మధ్యాహ్నం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్న భువనేశ్వరి, బ్రాహ్మణి 08:59AM, సెప్టెంబర్ 25, 2023 సుప్రీంలో పెండింగ్ కేసుగా కనిపిస్తున్న బాబు పిటిషన్ ►చంద్రబాబు పిటిషన్ ను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టును కోరేందుకు బాబు తరపు న్యాయవాదుల ప్రయత్నాలు ►ఓరల్ మెన్షన్ జాబితాలో కనిపించని బాబు కేసు ►ఈనెల 23న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు ►బాబు పిటీషన్ ఏ బెంచ్ కు కేటాయించని రిజిస్ట్రీ ►పెండింగ్ కేసు గా కనిపిస్తున్న బాబు పిటిషన్ ►తన క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు తీర్పును కొట్టేయాలని అభ్యర్థన ►తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ , రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో వినతి ►అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ తనకు వర్తిస్తుందని వాదన ►గవర్నర్ అనుమతి లేకుండా తన అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని పిటిషన్ లో వెల్లడి 08:40AM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుకి బెయిల్ ఇవ్వొద్దు: సీఐడీ ►ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై నేడు ఏసీబీ కోర్టులో వాదనలు ►మరో మూడు రోజులపాటు చంద్రబాబు కస్టడీ పొడిగించాలని.. ఏసీబీ కోర్టును సీఐడీ కోరే అవకాశం ►చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారంటున్న సీఐడీ ►ఇందుకు సంబంధించిన ఆధారాల్ని కోర్టుకు సమర్పించిన సీఐడీ ►మరోవైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు వాదనలు ►బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరుతూ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన సీఐడీ ►స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున.. బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్లో పేర్కొన్న సీఐడీ 08:03AM, సెప్టెంబర్ 25, 2023 నేడు వివిధ కోర్టుల్లో చంద్రబాబు కేసులపై విచారణ ►ఇన్నర్ రింగ్‌రోడ్డు, ఫైబర్ గ్రిడ్ స్కాంలో సీఐడీ వేసిన పీటీ వారెంట్‌పై విచారణ ►ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ►ఫైబర్ గ్రిడ్ స్కాంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ ►సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు లాయర్లు ►హైకోర్టు క్వాష్ పిటిషన కొట్టివేతపై సుప్రీం కోర్టులో సవాల్ 07:16AM, సెప్టెంబర్ 25, 2023 స్కిల్ కేసుల్లో కస్టడీ పిటిషన్ ఛాన్స్ ►చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ వేసే ఛాన్స్ ► రెండు రోజుల విచారణలో కాలయాపన చేసినట్లు చెబుతున్న సీఐడీ వర్గాల/ ► ఇంతకు ముందు ఐదు రోజులు కోరితే.. 2 రోజులకు అనుమతి ఇచ్చిన కోర్టు ► శని, ఆదివారాల్లో మొత్తం కలిపి 12 గంటలపాటు ఇంటరాగేష్ చేసిన సీఐడీ బృందం ►కీలక డాక్యుమెంట్లు ముందు ఉంచి ప్రశ్నించినా.. దాటవేత ప్రదర్శించిన చంద్రబాబు ► మరో మూడు రోజులు కస్టడీ కోరుతూ సీఐడీ పిటిషన్ వేసే అవకాశాలు 06:52AM, సెప్టెంబర్ 25, 2023 చంద్రబాబుతో నేడు కుటుంబ సభ్యుల ములాఖత్! ►16వ రోజుకు చేరిన చంద్రబాబు నాయుడు రిమాండ్ ►నేడు కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యే అవకాశం ►ఉదయం ఎనిమిది గంటలకు ములాఖత్ కోసం జైళ్ల శాఖను అనుమతి కోరనున్న నారా భువనేశ్వరి 06:48AM, సెప్టెంబర్ 25, 2023 రిమాండ్ పొడిగింపుతో మరికొన్ని రోజులు జైల్లోనే చంద్రబాబు ►స్కిల్ స్కామ్ కేసులో రిమాండ్ పొడిగింపుతో అక్టోబర్ 5వ తేదీ దాకా రాజమండ్రి జైల్లోనే చంద్రబాబు ►ఆదివారంతో ముగిసిన సీఐడీ కస్టడీ ►ఆదివారంతోనే ముగిసిన రిమాండ్ కూడా ►కస్టడీ ముగిశాక వర్చువల్‌గా ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపర్చిన అధికారులు ►కేసు విచారణ దశలో ఉన్నందున ఇప్పుడే అంతా అయిపోలేదని చంద్రబాబుతో వ్యాఖ్యానించిన జడ్జి ► బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ చేపడతామని వ్యాఖ్య ►చంద్రబాబు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీఐడీ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి ► వరుస పిటిషన్ల నేపథ్యంతో చంద్రబాబు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి సీరియస్ -
టీడీపీ నాయకుల అరాచకం
ఆదోని (అర్బన్): కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందిగుత్తి గ్రామంలో టీడీపీ నాయకులు అరాచకానికి తెగబడ్డారు. 20 మంది వైఎస్సార్సీపీ నాయకులపై సుమారు 70 మంది టీడీపీ నాయకులు ప్రణాళికాబద్ధంగా వేట కొడవళ్లు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు ఆదోని పోలీసులకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అలసందగుత్తిలో చిగిళి తాయప్ప అనే వ్యక్తి ఇల్లు టీడీపీ నాయకుల ఇళ్ల మధ్యలో ఉంది. జంబయ్య సోమలింగ, లక్ష్మన్న, శంకరప్పతోపాటు మరికొంతమంది టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా చిగిళి తాయప్ప ఇంటి ముందు ఎద్దుల బండి ఆపి దానిపై కూర్చుని వారి ఇంట్లో ఉన్న మహిళలను దుర్భాషలాడారు. ఇలా చేయడం తప్పని, బండి వేరేచోట ఆపి అక్కడే కూర్చోవాలని చెప్పడంతో చిగిళి తాయప్పపై ఆదివారం ఉదయం దాడి చేశారు. బాధితుడి తరఫున మాట్లాడేందుకు వైఎస్సార్సీపీ నాయకులు రాజీ కోసం వస్తున్నారని తెలుసుకుని పథకం ఇంటి మిద్దెలపై రాళ్లు, సీసాలు, కర్రలు, వేట కొడవళ్లతో 70 మంది టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. ఆదివారం రాత్రి మాట్లాడేందుకు వచ్చిన 20మంది వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఉచీ్చరప్పకు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంకటేశ్, భీరప్ప, భరత్‌తో పాటు మరో 17 మందికి గాయాలయ్యాలని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే బంధువులు వాహనాల్లో ఆదోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు క్షతగాత్రులపై మరోసారి దాడికి యత్నించారు. అక్కడే స్పెషల్ బ్రాంచ్ సీఐ రామాంజులు ఉండటంతో టీడీపీ నాయకులను చెదరగొట్టారు. దాడి చేసిన వారిలో జంబయ్య సోమలింగ, లక్ష్మన్న, శంకరప్ప, శీను, వెంకటేశ్, సోము, పాలబుడ్డితోపాటు మహిళలు, నాయకులు 60 మంది ఉన్నట్టు బాధితులు తెలిపారు. కేసులు పెడితే దాడి చేస్తామని టీడీపీ నాయకులు బెదిరించినట్టు వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. -
5 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్‌ను ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది. చంద్రబాబు రెండు రోజుల పోలీసు కస్టడీ ఆదివారం సాయంత్రంతో ముగిసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు కస్టడీ ముగియడంతో జైలు అధికారులు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకుంది. విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? కఠినంగా ఏమైనా వ్యవహరించారా? అని ఆరా తీసింది. అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు కోర్టుకు నివేదించారు. విచారణ సందర్భంగా ఆహారం, మందులతోపాటు న్యాయవాదులతో మాట్లాడుకునే వెసులుబాటు తదితర అవకాశాలిస్తూ ఆదేశాలిచ్చామని, వాటిని ఏమైనా అధికారులు ఉల్లంఘించారా? అని న్యాయస్థానం ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. భౌతికంగా ఇబ్బందులకు గురి చేశారా? అని కోర్టు ప్రశ్నించగా, లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఇంకేమైనా చెప్పాల్సి ఉందా? అని న్యాయస్థానం ప్రశ్నించడంతో, తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, అక్రమంగా జైలులో ఉంచారని చంద్రబాబు పేర్కొన్నారు. మీ పాత్రపై 600కిపైగా డాక్యుమెంట్లు... మీపై ప్రస్తుతం ఉన్నవి ఆరోపణలేనని కోర్టు చంద్రబాబుకు తెలిపింది. సీఐడీ దర్యాప్తు చేస్తోందని, ఇప్పటి వరకు సాగించిన దర్యాప్తులో మీ పాత్రకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచిందని పేర్కొంది. సీఐడీ సమర్పించిన ఆధారాలను పరిశీలించి వాటికి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారణకు వచ్చిన తరువాతే జుడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు కోర్టు చంద్రబాబుకు తేల్చి చెప్పింది. సీఐడీ అధికారులు చార్జిషీట్ దాఖలు చేసిన అనంతరం అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాతనే మీరు దోషినా? నిర్ధోషినా? అన్నది కోర్టు తేలుస్తుందని చంద్రబాబుకు స్పష్టం చేసింది. చట్టాన్ని అనుసరించే ఈ కోర్టు ముందుకెళుతుందని తెలిపింది. సీఐడీ అధికారులు ఈ కేసులో మీ పాత్రకు సంబంధించి 600కిపైగా డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారని తెలిపింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అవన్నీ ఈ దశలో రహస్య డాక్యుమెంట్లే అవుతాయని చంద్రబాబుకు స్పష్టం చేసింది. దర్యాప్తు జరగాల్సిందే.. అది ప్రొసీజర్ దర్యాప్తు అధికారులకు విశిష్ట అధికారాలుంటాయని కోర్టు పేర్కొంది. అయితే మీ హక్కులను, దర్యాప్తు సంస్థ విశిష్టాధికారాన్ని పరిగణలోకి తీసుకుని తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని, ఇప్పుడు తాము అదే చేస్తున్నామని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు తేల్చి చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని, సీఐడీ ఈ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వలేదని చంద్రబాబు పేర్కొనగా, మీకు ఇవ్వదగ్గ డాక్యుమెంట్లు కొన్ని ఉంటాయని, వాటిని మీ న్యాయవాదుల ద్వారా తీసుకోవచ్చని సూచించింది. వాటిని పరిశీలిస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారన్న సంగతి మీకు అర్థం కావచ్చని చంద్రబాబునుద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు జరగాల్సిందేనని, అది ప్రొసీజర్ అని కోర్టు గుర్తు చేసింది. మీ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని, దానిపై విచారణ జరపాల్సి ఉందని కోర్టు తెలిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే బెయిల్ ఇవ్వాలా?వద్దా? అనే విషయాన్ని నిర్ణయించడం జరుగుతుందని, ఇందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. అందుకోసమే జుడీషియల్ రిమాండ్‌ను అక్టోబర్ 5 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మీరు ప్రస్తుతం పోలీసు కస్టడీలో లేరని, కోర్టు కస్టడీలో ఉన్నారని పేర్కొంటూ చంద్రబాబును జాగ్రత్తగా చూసుకోవాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. యాంత్రికంగా ఉత్తర్వులిస్తున్నామా? అంతకు ముందు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో చిన్నపాటి హైడ్రామా నడిపారు. జుడీషియల్ రిమాండ్ పొడిగింపుపై చంద్రబాబు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం తెలిపారు. కోర్టు తనంతట తానుగా రిమాండ్‌ను పొడిగించలేదన్నారు. రిమాండ్‌ను పొడిగించవద్దని కోరారు. పొడిగింపు కోసం సీఐడీ మెమో దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రిమాండ్ పొడిగింపు పిటిషన్ వేయలేదా? అని ఏసీబీ కోర్టు ప్రశ్నించడంతో తాము రిమాండ్ పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదించారు. ఆ కాపీని చంద్రబాబు న్యాయవాదులకు అందచేయాలని పీపీని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం పోసాని స్పందిస్తూ కోర్టు యాంత్రికంగా జుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొనడంపై న్యాయస్థానం ఒకింత తీవ్రంగా స్పందించింది. సీఐడీ తమ ముందుంచిన కేసు డైరీని, సెక్షన్ 164 స్టేట్మెంట్లన్నింటినీ చదివామని, అలాగే 2000 పేజీలపైగా డాక్యుమెంట్లను పరిశీలించామని, వాటన్నింటినీ చూసిన తరువాతనే చంద్రబాబు పాత్రకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారణకు రావడం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. ప్రాథమిక ఆధారాలకు అనుగుణంగానే జుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తేల్చి చెప్పింది. అంతేకానీ మీరు చెబుతున్నట్లు యాంత్రికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. కోర్టు ఆగ్రహంతో ఖంగుతిన్న చంద్రబాబు న్యాయవాది తమ ఉద్దేశం అది కాదంటూ సమర్థించుకునే యత్నం చేశారు. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం న్యాయస్థానం ఆయన రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మాకు సమయం ఎక్కడిస్తున్నారు..? అటు తరువాత ఏసీబీ కోర్టు ఇరుపక్షాలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కోర్టు ఏదీ యాంత్రికంగా చేయడం లేదని పేర్కొంది. ప్రతి చిన్న విషయానికి పలు పిటిషన్లు వేస్తున్నారని, ఒకదాని వెంట మరొకటి పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారని గుర్తు చేసింది. ‘మీరు వేసిన దానికి వారు, వారు వేసిన దానికి మీరు కౌంటర్లు వేస్తారు. వాటిన్నింటినీ ఈ కోర్టు క్షుణ్ణంగా చదవాలి. అర్థం చేసుకోవాలి. చట్టం ఏం చెబుతుందో చూడాలి. కోర్టు ఇన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసేందుకు మీరు కోర్టుకు సమయం ఎక్కడ ఇస్తున్నారు? ఇప్పుడు పిటిషన్ వేశాం, వినాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందరూ కోర్టుకు సహకరిస్తేనే పనిచేయడం సాధ్యం అవుతుంది. చట్టానికి లోబడే వ్యవహరించాలి. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’ అని న్యాయస్థానం పేర్కొంది. -
జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్
కృష్ణా: మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గత గురువారం సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులు ఐదుగురిని కూచిపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు వారు హత్యకు వినియోగించిన ఆయుధాలతో సహా 72 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ సందర్భంగా మొవ్వ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఆదివారం గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్ విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం... బోయపాటి ధనలక్ష్మి తన సొంత బాబాయి కొడుకులు గణేష్, లోకేష్, భువనేష్, పిన్ని స్వర్ణ పంచాయతీ ఆఫీస్ వద్ద తన తండ్రిని, గ్రామంలోని కృష్ణ వీధి మొదట్లో తన తల్లిని నరికి చంపారంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కృష్ణాజిల్లా ఎస్పీ పి.జాషువా ఆదేశాల మేరకు గుడివాడ డీఎస్పీ పి.శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకట నారాయణ ఆదేశాల మేరకు కూచిపూడి ఎస్ఐ డి.సందీప్, సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆదివారం నిందితులను పమిడిముక్కల మండలం వీరమాచినేనిపాలెంలో అదుపులోకి తీసుకున్నారు. హత్యకు కారణాలు మృతులకు(వీరంకి వీర కృష్ణ, వరలక్ష్మి), నిందితులకు మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో 3 ఎకరాల భూమి గురించి గత కొన్నేళ్లుగా వివాదాలు ఉన్నాయి. వీరంకి కృష్ణ 1.50 ఎకరాలు, నిందితులు 1.50 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. మృతుడికి చెందిన 1.50 ఎకరాలను కూడా నిందితులు ఆక్రమించాలని ప్రయత్నిస్తూ మూడుసార్లు పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేయగా, మూడుసార్లు రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. తిరిగా తాజాగా నాలుగోసారి దరఖాస్తు చేశారు. తహసీల్దార్ సదరు పొలం పొజిషన్లో ఎవరు ఉన్నారని విచారణ చేయాలని ఆర్ఐ, వీఆర్వోలను ఆదేశించగా, ఈనెల 21న ఇరు వర్గాలను అయ్యంకి పంచాయతీ కార్యాలయానికి రావాలని పిలిపించారు. ఈ నేపథ్యంలో వీరంకి వీర కృష్ణ బతికి ఉండగా తమకు పాస్ పుస్తకాలు రానివ్వరని, అయ్యంకి గ్రామానికి కూడా వెళ్లలేమనే ఉద్దేశంతో నిందితులు పథకం ప్రకారం వీర కృష్ణతో గొడవ పెట్టుకుని తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో సుమారు ఒంటి గంట సమయంలో పంచాయతీ కార్యాలయం వద్ద కత్తులతో నరికి చంపారు. అనంతరం వీరంకి కృష్ణ భార్య వరలక్ష్మిని కూడా గ్రామంలో కృష్ణ వీధి మొదట్లో నరికి చంపారు. ఈ కేసులో ఏ1గా వీరంకి గణేష్(23), ఏ2గా వీరంకి నాగ లోకేష్(22), ఏ3గా వీరంకి భువనేశ్వర్(20), ఏ4గా వీరంకి స్వర్ణ(42), ఏ5గా భట్టిప్రోలు మండలం చింతమోటు గ్రామానికి చెందిన సమీప బంధువు శొంఠి జానేష్ కుమార్(22)లపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో డీఎస్పీతో పాటు పామర్రు సీఐ ఎన్.వెంకట నారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ పాల్గొన్నారు. -
మిస్టరీగా ఇంటర్ విద్యార్ధిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి
సాక్షి, చిత్తూరు జిల్లా: ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. న్యాయం కోసం పెనమూరు పీఎస్ ఎదుట బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆదివారం ఆందోళన చేపట్టారు. కాగా వేణుగోపాలపురానికి చెందిన భవ్యశ్రీ ఈ నెల 17న అదృశ్యమైంది. 18వ తేదీన విద్యార్ధిని తండ్రి మునికృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. 20న ఎగువ చెరువు వద్ద బావిలో భవ్యశ్రీ శవమై కనిపించింది. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కాగా పోస్టుమార్టంలో ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవని ప్రాథమికంగా తెలిసిందని ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. అఘాయిత్యం జరిగిందా, విషప్రయోగం జరిగిందా అని పరీక్షించేందుకు సాంపిల్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయిందా? ఎక్కడి నుంచి అయినా తెచ్చి ఆమె మృతదేహాన్ని బావిలో పడేశారా అన్న విషయం తేల్చేందుకు స్టెరమ్‌బోన్ సాంపిల్స్‌ను కెమికల్ అనాలసిస్ కోసం తిరుపతి ఆర్ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ నివేదికలు వచ్చిన అనంతరం అనుమా నితులను సమగ్రంగా, నిష్పాక్షికంగా విచారిస్తామన్నారు. విచారణను తప్పుదారి పట్టించేలా అసత్య ప్రచారాలను, నిరాధార వార్తలను ప్రచారంచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చదవండి: రూ.2 లక్షలు లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆర్ఐ -
మరో 11 రోజులు జైల్లోనే చంద్రబాబు
సాక్షి, కృష్ణా/తూర్పు గోదావరి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టైన టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి రిమాండ్‌ను ఆదివారం విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. అక్టోబర్ 05 తేదీ దాకా ఆయన రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించిన ఏసీబీ జడ్జి.. తక్షణమే ఆయన్ని జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆయన మరో 11 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. ఈ తరుణంలో రెండు రోజుల కస్టడీ విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు.. ఆదివారం సాయంత్రం వర్చువల్‌గా ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టారు. చంద్రబాబు విచారణలో సహకరించలేదని.. అందుకే ఆయన రిమాండ్‌ను పొడిగించాలని మోమో దాఖలు చేసింది సీఐడీ. పరిశీలించిన న్యాయమూర్తి, కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. చంద్రబాబును ఆరా తీసిన జడ్జి వర్చువల్‌గా హాజరైన చంద్రబాబును జడ్జి కొన్ని విషయాలు అడిగారు. విచారణలో ఏమైనా ఇబ్బంది పెట్టారా? అని చంద్రబాబును ప్రశ్నించగా.. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అలాగే.. వైద్య పరీక్షలు నిర్వహించారా? అని ప్రశ్నించగా.. నిర్వహించారు అని సమాధానం ఇచ్చారాయన. థర్డ్ డిగ్రీ ఏమైనా ప్రయోగించారా?.. ఏమైనా అసౌకర్యం అనిపించిందా? అనే ప్రశ్నలకు.. అలాంటిదేమీ లేదని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. దీంతో జడ్జి.. ‘‘మీరు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు, మీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని, ఇప్పుడే అంతా అయిపోలేదు. బెయిల్ పిటిషన్‌పై రేపు(సెప్టెంబర్ 25, సోమవారం) వాదనలు వింటాం’’ అని చంద్రబాబుకి స్పష్టం చేసింది. చంద్రబాబు లాయర్లపై అసహనం సీఐడీ పిటిషన్‌పై చంద్రబాబు తరపు లాయర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన క్రమంలో.. సదరు లాయర్లపై ఏసీబీ న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఒకటికి పది పిటిషన్లు వేయడం వల్ల విచారణ చేయడం ఎలా? అని బాబు లాయర్లను ప్రశ్నించారు ఏసీబీ జడ్జి. ‘‘ఒకే అంశంపై వరుస పిటిషన్ల వల్ల కోర్టు సమయం వృథా అవుతుంది’’అని చంద్రబాబు తరపు న్యాయవాదుల్ని, ఏసీబీ జడ్జి మందలించారు. అదే సమయంలో ‘‘ విచారణలో ఇప్పటిదాకా ఏం గుర్తించారనేది బయటపెట్టాలి’ అని చంద్రబాబు, ఏసీబీ జడ్జిని కోరారు చంద్రబాబు. అయితే.. విచారణ సమయంలో విషయాలను బయటపెట్టడం సరికాదన్న జడ్జి, ప్రాథమిక సాక్ష్యాలను సీఐడీ ఇప్పటికే సమర్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ క్రమంలో అందుకు సంబంధించిన పత్రాలను మీ లాయర్లను అడిగి తీసుకోవాలంటూ చంద్రబాబుకి సూచించారు. కస్టడీ పొడిగింపు కోరాల్సి ఉంది సీఐడీ కస్టడీలో.. విచారణకు చంద్రబాబు సహకరించలేదు. అందుకే జ్యుడీషియల్ కస్టడీ పొడిగించమని కోరాం. చంద్రబాబు గతంలో సాక్ష్యులను ప్రభావితం చేసిన అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. సీఐడీ కస్టడీ పొడిగించమని కోరలేదు. రేపు పీటీ వారెంట్ పిటిషన్లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. సీఐడీ కస్టడీకి మళ్ళీ కోరాలా? వద్దా? అనేది నిర్ణయం తీసుకుంటాం అని సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద మీడియాకు వెల్లడించారు.