Extra marrital affair
-
వివాహేతర సంబంధం.. మహిళ దారుణ హత్య
కొత్తకోట రూరల్ (పెద్దమందడి): ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేసి చెరువులో పడేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దమందడి మండలం చీకురుచెట్టుతండాకు చెందిన ముడావత్ దుబ్లీ (26) కి వనపర్తి మండలంలోని చిట్యాల–పడమటితండా వాసి వెంకటేష్‌తో సుమారు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆరు నెలల క్రితం భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జిల్లా కేంద్రంలో రోజువారీ కూలీగా పనికి వెళ్లొచ్చేది. ఎప్పటిలాగే ఈనెల 7న అక్కడికి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. అనుమానం వచ్చిన తల్లి ముడావత్ ముత్యాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 10న పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం గోపాల్పేట మండలం తాడిపత్రిలోని చెరువులో ఆమె మృతదేహం తేలడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్ఐ హరిప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆమెతో తాడిపత్రికి చెందిన రమేష్, గోపాల్ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు బయటపడింది. ఈ క్రమంలోనే వీరి నుంచి డబ్బులు ఎక్కువ అడిగిందనే నెపంతో ఈనెల 7న కారులో తిరుమలాపూర్ శివారులోకి దుబ్లీని తీసుకెళ్లి గొంతునులిమి చంపి తాడిపత్రి చెరువులో పడేసినట్టు విచారణలో నిందితులు అంగీకరించారు. అనంతరం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
Crime News: ఏడేళ్ల కిందట దారుణ హత్య.. తీగ లాగితే డొంక కదిలింది!
బెంగళూరు: ఏడేళ్ల కిందటి హత్య కేసులో దంపతులను కామాక్షి పాళ్య పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ గౌస్, హీనా కౌసర్ కాగా, హతుడు వజీర్‌బాషా. ఈ దంపతులు ఏపీ నుంచి వచ్చి బెంగళూరులోని హగ్గనహళ్ళిలో ఉండేవారు. గౌస్ టైలర్‌గా పని చేసేవాడు. హీనా కౌసర్.. వజీర్ అనే వ్యక్తి నుంచి కొంత డబ్బు అప్పు తీసుకుంది. చదవండి: కన్నతల్లి నిద్రపోతుండగా ప్రియుడితో కలిసి.. ఆ సమయంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది తెలిసిన భర్త గౌస్ అతన్ని అంతమొందించాలని పథకం వేశాడు. ఒకరోజు భార్య ద్వారా అతన్ని పిలిపించి ఇద్దరూ కలిసి ప్రాణాలు తీశారు. శవాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టి వజీర్ తీసుకొచ్చిన వాహనం ద్వారానే హిందూపురం సమీపంలో పడేసి అనంతపురం జిల్లాలో తలదాచుకున్నారు. ఇటీవల హీనా కౌసర్ తాత చనిపోగా అంత్యక్రియల కోసం దంపతులు వచ్చారు. హతుని భార్య ఆయేషా ఆ దంపతులపై ఫిర్యాదు చేయగా కామాక్షి పాళ్య పోలీస్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలో అరెస్టు చేసి విచారించగా నేరం తామే చేశామని అంగీకరించారు. -
వదినమ్మ కనిపించడం లేదని.. ఆఖరికి అతడే!
సాక్షి, మోర్తాడ్: తన వదినమ్మ కనిపించడం లేదు.. ఎలాగైనా వెతికి పెట్టండి అంటూ రోజు పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతూ అమాయకుడిగా నటించిన వ్యక్తే వివాహిత హత్య కేసులో ప్రధాన సూత్రధారి అని పోలీసులు తేల్చారు. ఏమి ఎరగని వాడిలా తిరుగుతున్న నిందితుడిని పక్కా వ్యూహంతో ఊచలు లెక్కించేలా చేశారు. సుంకెట్‌కు చెందిన అంజమ్మ(35) జనవరి 24న అదృశ్యం అయింది. ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అంజమ్మ తన చిన్న మామ కుమారుడు నరేష్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో వివాదం ముదరడంతో నరేష్ పక్కా ప్లాన్‌తో ఆమెను పెర్కిట్ శివారులోని గుట్టపై హత్య చేశాడు. ఇదంతా చేసిన నరేష్ తనకు ఏమి తెలియనట్లు ఇంటికి చేరుకుని అంజమ్మ అత్త, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వచ్చి మిస్సింగ్ కేసు నమోదు చేయించాడు. అంతేకాక తరుచూ స్టేషన్‌కు వచ్చి తన వదిన మిస్సింగ్ కేసులో ఏమైనా వివరాలు తెలిశాయా అంటూ అడిగేవాడు. నరేష్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో నరేష్ తప్పు ఒప్పుకొని పెర్కిట్ శివారులో దాచి ఉంచిన మృతదేహాన్ని చూపించాడు. -
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. పట్టిచ్చిన సీసీ కెమెరా
కృష్ణలంక (విజయవాడ తూర్పు): వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. ఓ వివాహిత తన భర్తతో సహజీవనం చేస్తున్న మహిళ గొంతు కోసి, రోకలిబండతో తలపై మోది హత్య చేసింది. ఈ ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. సీఐ పి.సత్యానందం కథనం మేరకు.. రాణిగారితోటలోని కరెంట్ ఆఫీస్ రోడ్డులో రౌతు సత్య(35) తన భర్త, కుమార్తెతో నివసిస్తోంది. ఏడేళ్లుగా సత్య విజయవాడ నగర పాలక సంస్థలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె కుమార్తె సీవీఆర్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతూ అప్పుడప్పుడు క్యాటరింగ్ పనులకు వెళ్తుంటుంది. సత్య భర్తకు మద్యం, గుట్కా, ఖైనీ అలవాటు ఉండటంతో అప్పుడప్పుడు దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఏడాది క్రితం రాణిగారితోటకు చెందిన ముఠా పనిచేసే ఒరుసు ఆదినారాయణతో సత్యకు పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం నేపథ్యంలోనూ సత్య, ఆమె భర్త మధ్యలో గొడవలు జరిగేవి. సత్య భర్త ఇంటిలో లేని సమయంలో ఆదినారాయణ ఆమె వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ విషయం ఆదినారాయణ భార్య మల్లేశ్వరికి తెలియడంతో ఆమె తరచూ సత్యతో గొడవపడి కొట్టేందుకు కూడా ప్రయత్నించేది. సుమారు 20 రోజుల క్రితం సత్య తీరు నచ్చక ఆమె భర్త గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మూడు రోజులకు ఆదినారాయణ సత్యతో ఇంటిని ఖాళీ చేయించి, లక్కీ బార్ పక్క వీధిలో మరో ఇంటిలోకి తల్లీకుమార్తెలను చేర్చాడు. అప్పటి నుంచి ఆదినారాయణ నిత్యం ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మల్లేశ్వరి ఆగ్రహంతో సత్య వద్దకు వెళ్లి గొడవపడి, చంపేస్తానని బెదిరించింది. ఎలాగైనా సత్యను చంపాలని నిర్ణయించుకున్న మల్లేశ్వరి గురువారం రాత్రి సుమారు 8.30 నుంచి తొమ్మిది గంటల సమయంలో సత్య ఇంటికి వెళ్లింది. ఇద్దరి మధ్య కొంతసేపు ఘర్షణ జరిగింది. కోపోద్రిక్తురాలైన మల్లేశ్వరి తనతో తెచ్చుకున్న బ్లేడుతో సత్య గొంతు కోసింది. తీవ్రంగా రక్తస్రావమై కిందపడిపోయిన సత్య తలపై పక్కనే ఉన్న రోకలిబండతో బలంగా మోదింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత మల్లేశ్వరి తన వెంట తెచ్చుకున్న చాకు, బ్లేడ్‌ను తీసుకుని తలుపులు వేసి అక్కడ నుంచి వెళ్లిపోయింది. గురువారం మధ్యాహ్నం క్యాటరింగ్ పనికి వెళ్లిన సత్య కుమార్తె రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా తల్లి రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో వేలి ముద్రలు సేకరించి రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సత్య కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టిచ్చిన సీసీ కెమెరా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీఐ పి.సత్యానందం ఆధ్యర్యంలో సమీపంలోని సీసీ కెమెరా పుటేజీలు సేకరించారు. అందులో మల్లేశ్వరి సంచి తీసుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. డాగ్ స్క్వాడ్ కూడా ఘటనాస్థలం నుంచి మల్లేశ్వరి ఇంటి వద్దకు వెళ్లి ఆగింది. ఆమెను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తన భర్తతో వివాహేతర సంబంధం వద్దని పలుమార్లు హెచ్చరించినా లెక్కచేయకపోవడంతో సత్యను హత్య చేశానని మల్లేశ్వరి అంగీకరించిందని పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన బ్లేడు, దానితో పాటు ఒక చాకు ఉన్న సంచిని సైడు కాలువలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో మద్యం సీసా, రెండు కాల్చిన సిగరెట్ ముక్కలు ఉండడాన్ని బట్టి హత్యలో మల్లేశ్వరితో పాటు ఇంకా ఎవరి ప్రమే యమైనా ఉండి ఉంటుందని స్థానికుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
వివాహేతర సంబంధం: అడ్డుగా ఉందని కన్నతల్లి దారుణం!
పాడేరు: అనుమానాస్పద రీతిలో ఓ చిన్నారి కన్నుమూసింది. ప్రియుడితో కలిసి తల్లే చంపేసిందని తండ్రి ఆరోపిస్తుండగా.. ఆరోగ్యం బాగులేక మృతి చెందిందని తల్లి చెబుతోంది. లగిశపల్లి పంచాయతీ పార్వతీపురం గ్రామ సమీపంలోని కోళ్ల ఫారంలో శుక్రవారం రాత్రి ఈ దారుణం జరిగింది. శనివారం ఉదయం వీఆర్వో కొండమ్మ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. ఈ కోళ్ల ఫారంలో గొల్లోరి రాంబాబు, అతని భార్య రెండేళ్ల నుంచి పనిచేస్తున్నారు. వారికి శ్రీవల్లి అనే ఐదేళ్ల కుమార్తె ఉంది. రాంబాబు భార్యతో కోళ్లఫారం యజమాని కమలాకర్‌కు వివాహేతర సంబంధం ఉండడంతో భార్యభర్తల మధ్య తరచు తగాదాలు జరిగేవి. పదిరోజుల కిందట రాంబాబు హుకుంపేట మండలంలోని తన స్వగ్రామం తడిగిరి వచ్చాడు. తమకు అడ్డుగా ఉందన్న కోపంతో భర్త లేని సమయంలో ప్రియుడు కమలాకర్‌తో కలిసి తల్లే శ్రీవల్లిని హత్య చేసిందని గ్రామపెద్దలు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన చిన్నారికి కడుపు, వీపు భాగంలో గాయాలు ఉండడంతోపాటు కడుపు ఉబ్బిపోయింది. తల్లి మాత్రం రెండు రోజుల క్రితం మామిడి చెట్టు వద్ద జారి పడిపోవడంతో శ్రీవల్లికి కడుపులో గాయమైందని, కోళ్లఫారం యజమాని చిట్టిమోజు కమలాకర్ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించాడని చెబుతోంది. కడుపు ఉబ్బిపోయి శుక్రవారం సాయంత్రం మృతి చెందిందని పోలీసులకు తెలిపింది. కుమార్తె శ్రీవల్లిని తన భార్య, కోళ్లఫారం యజమాని కమలాకర్ చంపేశారని రాంబాబు, అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్య కేసుగా పరిగణించి, విచారణ చేయాలని తడిగిరి పంచాయతీ సర్పంచ్ పి.రంజిత్‌కుమార్, ఇతర గ్రామ పెద్దలంతా ఎస్ఐ శ్రీనివాస్‌ను కోరారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు జిల్లా ఆస్పత్రిలోని శవపరీక్షల గది ప్రాంతంలో కొద్దిసేపు ఆందోళన చేపట్టారు. చిన్నారికి శవపరీక్షలు జరిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆరోపణలు ఎదుర్కొంటున్న కోళ్లఫారం యజమాని కమలాకర్, మృతురాలి తల్లి అనురాధలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: ఓటు వేశాక అనుకోని ప్రమాదం: ఇద్దరు ఉద్యోగులు మృతి -
విషయం తెలియడంతో భార్యపై సిద్ధిఖీ ఆగ్రహం, దాంతో
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో టైలర్ సిద్దిఖీ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో సిద్దిఖీ భార్య రుబీనా పక్కా ప్రణాళికతో ప్రియుడు సయ్యద్ మహ్మద్ అలీచే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్‌రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. కార్మికనగర్‌లో నివసించే మహ్మద్ సిద్దిఖీ అహ్మద్ (40), రుబీనా దంపతులు. సిద్దిఖీ టైలర్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో బోరబండ అక్బర్ మసీద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ మహ్మద్ అలీ (22)తో రుబీనాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో భార్యపై సిద్దిఖీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ ‘బంధానికి’ అడ్డుగా ఉన్న సిద్దిఖీని అంతమొందించేందుకు మహ్మద్ అలీ పక్కా పథకం వేశాడు. గత నెల 31న అర్ధరాత్రి ఇంటిలో ఒంటరిగా ఉన్న సిద్దిఖీ తలపై బైక్ షాక్ అబ్జర్వర్ రాడ్‌తో బలంగా బాది హత్య చేశాడు. ఈ నెల 1న మృతుడి సోదరుడు అతీక్ అహ్మద్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీలు, సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుణ్ని అదే రోజు రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ చేయగా.. అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసినట్లుగా అంగీకరించాడు. హత్యకు ముందు.. ఆ తర్వాత మృతుడి భార్య రుబీనాతో నిందితుడు మహ్మద్ అలీ మాట్లాడినట్లు విచారణలో తేలింది. వీరిద్దరూ కలిసే సిద్దిఖీ హత్యకు పథకం వేసినట్లు నిర్ధారించి నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధం: బకెట్‌తో భర్తను చంపిన భార్య
పద్మనాభం(భీమిలి): తాళికట్టిన భర్తనే కడతేర్చింది ఓ భార్య.. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన అత్తమామలే అతన్ని తిరిగిరాని లోకాలకు పంపించేశారు. పద్మనాభం మండలంలోని కృష్ణాపురం రెల్లికాలనీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీఐ విశ్వేశ్వరరావు తెలిపిన వివరాలివి. రెల్లి కాలనీకి చెందిన పల్లా కనకరాజు(40)కు విజయనగరం జిల్లా గుర్ల మండలం దమరసింగికి చెందిన పైడమ్మతో 15 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కృష్ణాపురంలోని స్ప్రింగ్ ఫీల్డ్ పాఠశాల బస్సులో క్లీనర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భార్య పైడమ్మ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని కనకరాజు గతంలో ఆమెను నిలదీశాడు. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల కిందట వీరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. కనకరాజు మామ సోమాదులు సోములు, అత్త పాపయ్యమ్మ, బావమరిది కంచయ్య, బావమరిది భార్య లక్ష్మి ఈ నెల ఒకటో తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కనకరాజు ఇంటికి వచ్చారు. భార్యతో సహా వీరందరూ కనకరాజు తలపై బకెట్‌తో దారుణంగా కొట్టారు. ఎవరికి చెప్పకుండా అందరూ తిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో అతని తల్లి లక్ష్మి ఇంటికి వచ్చి చూస్తే.. తల, పెదవుల మీద గాయాలతో కనకరాజు మంచం మీద పడి ఉండడం చూసి షాక్‌కు గురైంది. ఏం జరిగిందని అతన్ని అడగ్గా.. జరిగిన విషయం చెప్పారు. వెంటనే ఆమె విజయనగరం మహారాజా ఆస్పత్రిలో కనకరాజును చేర్పించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జాము నాలుగు గంటల సమయంలో అతను మృతి చెందాడు. తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతని భార్యతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. చదవండి: రూ.100 కోసం హత్య: తొమ్మిది మంది అరెస్ట్ -
ప్రియురాలికి వేధింపులు.. ప్రియుడి అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్ : ఓ యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వివరాల ప్రకారం. .జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందమూరి నగర్ కాలనీలో ఓ యువతితో సునీల్(38)అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. గత కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న వీరిద్దరి మధ్య ఇటీవలే మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి సునీల్..ఆ యువతిని వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం వీరిద్దరి మధ్య మాటామాటా పెరిగి హత్య వరకు వెళ్లిందని అనుమానిస్తున్నారు. మృతుని శరీరంపై బలమైన గాయాలు ఉండటంతో ఇది హత్యా లేక అనుమానాస్పద మృతి అన్నది తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..యువతితో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని అన్న శ్యామ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : నా కోరిక తీర్చు.. లేదంటే నీ భర్త, కొడుకును.. మహిళ హత్య కేసులో యువకుడి అరెస్టు -
ఛీఛీ ఇదేం పని, 7వ తరగతి పిల్లాడితో ముగ్గురు పిల్లల తల్లి..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో విస్తుపోయే సంఘటన జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి 7వ తరగతి చదువుతున్న పిల్లాడితో పరారీ అయిన సంఘటన స్థానికంగా చర్చనియాంశంగా మరింది. దీనిపై బాలుడి కుటుంబ సభ్యలు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేడయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు.. కంపియాగంజ్‌కు చెందిన ఓ వివాహితకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల కుర్రాడితో ఆమె ఇటీవల పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ కుర్రాడు తరచూ వివాహిత దగ్గరికి వస్తుండేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మరింత సన్నిహితం పెరిగింది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సదరు మహిళ కుర్రాడితో ఈనెల 10న పరారైయింది. అది తెలిసి పిల్లాడి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఇక ఈ విషయం బయటకు రాకుండా కుటుంబ సభ్యులు పిల్లాడి కోసం వెతకడం మొదలు పెట్టారు. ఎంతకి వారి ఆచూకి తెలియకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన సంగతి చెప్పి తమ పిల్లాడి వెతికి పెట్టమని పోలీసులను అతడి కుటుంబ సభ్యులు కోరారు. మొదట ఈ విషయం తెలిసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికి పోలీసులకు కూడా వారి ఆచూకి తెలియరాలేదని సమాచారం చదవండి: మైనర్‌తో ప్రేమ.. పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్లో.. భర్తపై హత్యాయత్నం కేసులో వీడిన ట్విస్ట్ -
సహజీవనం: అప్పు చెల్లించమన్నందుకు ప్రియురాలి హత్య
సాక్షి, వికారాబాద్: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కోరిన ప్రియురాలిని హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన బేగారి లక్ష్మీ అనే మహిళ భర్త కొంతకాలం కిందట మరణించాడు. భర్త మృతితో ఒంటరిగా ఉంటున్న లక్ష్మి పద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన నర్సింలుతో సహాజీనవం చేస్తోంది. ఈ క్రమంలో లక్ష్మీ, నర్సింలుకు 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని లక్ష్మీ నర్సింలును పలుమార్లు కోరింది. దీంతో డబ్బు తిరిగి ఇవ్వాల్సి వస్తుందేమోనని అతడు లక్ష్మిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజుల క్రితం డబ్బు ఇస్తానని లక్ష్మీని నమ్మించి తన వెంట తీసుకెళ్లాడు. నమ్మి నర్సింలు వెంట వెళ్లిన లక్ష్మిని రాస్నం అడవిలో దారుణంగా హత్య చేశాడు. లక్ష్మి కనిపించకపోడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నర్సింలును విచారించగా జరిగిన విషయం చెప్పాడు. దీంతో సీఐ జలంధర్ రెడ్డి, ఎస్ఐ అశోక్ బాబు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. చదవండి: సుంకి చెక్ పోస్టు: సంచుల కొద్దీ నకిలీ నోట్ల పట్టివేత భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని.. -
భర్త అడ్డుతొలగిస్తే సంతోషంగా ఉండొచ్చని..
సాక్షి, పటాన్చెరు టౌన్ : వివాహేతర సంబంధంతో వరసకు బావతో కలసి భర్తను భార్య హత్య చేయించిన ఘటన మంగళవారం అమీన్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. క్రైం సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. చత్తీస్ఘడ్ రాష్ట్రం... దురుగు జిల్లా..మరోదా గ్రామానికి చెందిన అనిల్ కుమార్ దారు (35) బతుకుదెరువు కోసం మూడు నెలల క్రితం స్నేహితుడు హరినారాయణ (అలియాస్) సంజీవుతో కలసి అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు వచ్చాడు. సమీపంలోని మెడికల్ డివైజ్ పార్క్ సమీపంలో సెంటరింగ్ పని చేసుకుంటూ, అక్కడే నివాసం ఉంటున్నాడు. పది రోజుల క్రితం వరసకు సడ్డకుడు నర్వోత్తంతో కలిసి మృతుడి భార్య భువనేశ్వరి అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ వచ్చింది. భువనేశ్వరి, నర్వోత్తంల మధ్య వివాహేతర సంబంధం ఉంది. భర్త అనిల్ కుమార్‌ను హతమారిస్తే ఇద్దరం సంతోషంగా ఉండవచ్చని మృతుడి భార్య బావ నర్వోత్తంతో చెప్పింది. దీంతో అతను అనిల్ కుమార్‌ను ఆదివారం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ సమీపంలో ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లి రాయితో తలపై బాది హత్య చేశాడు. ఒక్కసారిగా అనిల్‌కుమార్ కనిపించకుండా పోవడంతో తోటి కార్మికులు, స్నేహితుడు సంజీవు .. నర్వోత్తంని అడిగారు. ఎవరో వచ్చి బైక్‌పై తీసుకెళ్లారని అబద్ధం చెప్పాడు. అనంతరం కాసేపు వెతికినా అనిల్‌కుమార్ దొరక్కపోవడంతో మరోసారి నర్వోత్తంను గట్టిగా నిలదీశారు. అనిల్‌కుమార్ భార్యకు తనకు వివాహేతర సంబంధం ఉందని ఆమె చెబితేనే హత్య చేశానని చెప్పాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో డీఎస్పీ భీంరెడ్డి, పటాన్చెరు క్రైం సీఐ శ్రీనివాసులు, అమీన్పూర్ ఎస్ఐలు మురళి, కిష్టారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతుడి భార్య భువనేశ్వరిని, నర్వోత్తంను అదుపులోకి తీసుకున్నారు. మృతుడి స్నేహితుడు సంజీవు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై ప్రేమోన్మాది కత్తితో దాడి సంతానం కలగలేదని మేనల్లుడి దారుణ హత్య? -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
సాక్షి, చెన్నై: వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసింది. భార్య ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ ఘటన తేని జిల్లా దేవనాంపట్టిలో చోటుచేసుకుంది. కొంగువార్ పట్టికి చెందిన శివకుమార్ (43) రైతు. ఇతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య పాపాత్తికి ముగ్గురు కుమార్తెలు. 24వ తేదీ కల్లుపెట్టి, కామక్కాపట్టిలోని మైదాన ప్రాంతంలో శివకుమార్ తీవ్రగాయాలతో మృతి చెంది పడివున్నాడు. ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. అతని మృతిపై అనుమానం ఉందని బంధువులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాపాత్తిని అనుమానించిన పోలీసులు విచారణ జరిపారు. పోలీసుల వద్ద పాపాత్తి ఇచ్చిన వాంగ్మూలంలో తనకు, తన భర్త శివకుమార్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న సెల్వరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడిందని, ఈ విషయం శివకుమార్‌కు తెలియడంతో అతను తనను మందలించినట్టు తెలిపింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్నాడని శివకుమార్‌ను సెల్వరాజుతో కలిసి హత్య చేసేందుకు మరో ట్రాక్టర్ డ్రైవర్ అయ్యనార్ వద్ద సాయం కోరినట్టు పేర్కొంది. శివకుమార్‌కు మద్యం తాగించిన అయ్యనార్ అతన్ని బైకులో ఎక్కించుకుని వెళ్లి మైలేజీ రాయికి ఢీకొట్టించి తరువాత శివకుమార్ గొంతు కోసి హత్య చేశాడని పాపాత్తి పోలీసులకు విచారణలో తెలిపింది. -
ఆల్రెడీ పెళ్లైన ప్రేయసి ఇంటికి సొరంగం
మెక్సికో: ప్రేమకు అవధులు లేవంటారు.. కానీ ప్రేమికుల చేష్టలకు కూడా అవధులు లేకుండా పోతున్నాయి. ఇక్కడ చెప్పుకునే ప్రేమ పక్షులకు ఇది వరకే పెళ్లైంది, వేరేవారితో! అయినా సరే దారులు వేరైనా కొత్త దారి ఏర్పాటు చేసుకుని మరీ ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు. అర్థం కాలేదా? అయితే ఓసారి ఇది చదివేయండి.. మెక్సికోకు చెందిన అల్బర్టో వివాహితుడు. కానీ కట్టుకున్న భార్యను పక్కన పెట్టి అదే వీధిలో ఉన్న పమేలా అనే మహిళ మీద మనసు పారేసుకున్నాడు. అక్కడ ఆమె కూడా అంతే! తనకు భర్త ఉన్నాడన్న విషయం మర్చిపోయి ఇతడితో ఎఫైర్ మొదలు పెట్టింది. ఇక వీళ్లు ఏకాంతంగా మాట్లాడుకునేందుకు ఓ ప్లాన్ వేశారు. అందులో భాగంగా అల్బర్ట్ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఏకంగా ప్రియురాలి ఇంటికి సొరంగం తవ్వాడు. పమేలా కూడా భర్త వెళ్లగానే ప్రియుడికి సిగ్నల్ ఇచ్చేది. అలా అల్బర్ట్ నిత్యం తన ఇంట్లో నుంచి సొరంగ మార్గం గుండా వెళ్లి ప్రియురాలి ఇంట్లో తేలేవాడు. (చదవండి: ఆన్లైన్ పెళ్లి; ఇన్ని రకాల వంటలా!) ఈ క్రమంలో ఒకరోజు పమేలా భర్త త్వరగా ఆఫీసు ముగించుకుని వచ్చేయగా తన భార్య మరొకరితో ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. అతడిని చూసిన అల్బర్టో వెంటనే వచ్చిన దారిలోనే పారిపోయే ప్రయత్నం చేయడంతో సొరంగ మార్గం బయటపడింది. వీళ్ల వ్యవహారంతో ఆగ్రహించిన జార్జ్ అతడి ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. ఈ లడాయి కాస్తా కొట్లాటగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకోక తప్పలేదు. కాగా ఈ రహస్య ప్రేమికుల సొరంగం ఎంత పొడవుందో తెలియదు కానీ దీనికి సంబంధించిన ఫొటోలు మాత్రం నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. (చదవండి: అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల) -
వివాహేతర సంబంధం.. బ్లేడుతో గొంతుకోసి
సాక్షి, భువనగిరిఅర్బన్ : ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన భువనగిరి శివారులోని వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గుట్టల్లో చోటుచేసుకుంది. ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్దమాడురు గ్రామానికి చెందిన లక్ష్మి(35) భర్త కొంత కాలం క్రితం మృతిచెందాడు. అనంతరం హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కుమార్ అనే వ్యక్తితో పరిచడం ఏర్పడింది. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమంలో లక్ష్మికి మహబూబ్‌నగర్‌కు చెందిన విజయ్ అనే యువకుడితో కూడా సంబంధం ఉన్నట్లు కుమార్ అనుమానించాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు లక్ష్మిని అడిగేందుకు ప్రయత్నించినా కుదరలేదు. విషయాన్ని తేల్చుకోవాలని కుమార్ భావించాడు. అది నిజమని తెలిస్తే హతమార్చాలని కూడా ముందుగానే నిర్ణయించుకొని బ్లేడును వెంట తీసుకెళ్లాడు. బుధవారం లక్ష్మి, కుమార్ ఇద్దరూ కలిసి భువనగిరి బైపాస్ పక్కన ఉన్న ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అనంతరం కుమార్ తనకున్న అనుమానం గురించి లక్ష్మిని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. దీంతో కుమార్ అక్కడే ఉన్న బండరాయితో లక్ష్మి తలపై దాడి చేశాడు. అలాగే తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తీసుకొని గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం నేరుగా భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కుమార్ లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు డీసీపీ నారాయణరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న బీరు బాటిళ్లు, కూల్ డ్రింక్, బిర్యానీ ప్యాకెట్, ఒక బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. -
భార్యపై అనుమానంతో తల నరికి..
నారాయణఖేడ్: అనుమానం పెనుభూత మైంది. వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని భార్యను అతి కిరాతకంగా నరికి చంపాడో భర్త. శరీరం నుంచి తలను వేరు చేసి.. వివాహేతర సంబంధం కలిగి ఉన్న వ్యక్తి ఇంటి గుమ్మం ఎదుట పడేశాడు. ఈ దారుణం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అనంతసాగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జుర్రు సాయిలు, అనుషమ్మ (35) దంపతులు. తన భార్యఅనంతసాగర్ గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సాయిలు అనుమానం వ్యక్తం చేసేవాడు. జైపాల్‌రెడ్డి నారాయణఖేడ్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. వివాహేతర సంబంధం విషయమై భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కోపోద్రిక్తుడైన సాయిలు.. గొడ్డలితో ఆమెను నరికి చంపాడు. మొండెంను ఇంటికి కొద్ది దూరంలో పడేశాడు. తలను వేరు చేసి జైపాల్‌రెడ్డి ఇంటి గుమ్మం ముందు ఉంచాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు దర్యాప్తులో ఉంది. (చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం) ఘటనాస్థలంలో రోధిస్తున్న కుటుంబ సభ్యులు, గుమిగూడిన గ్రామస్తులు -
హోటల్ గదిలో కానిస్టేబుల్ రాసలీలలు
సాక్షి, అనంతపూర్: హోటల్ గదిలో ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ఏఆర్ కానిస్టేబుల్ మరో మహిళతో హోటల్ గదిలో ఉండగా.. సదరు మహిళ భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ వ్యవహారం వెలుగు చూసింది. బ్యూటిషిషన్గా పనిచేస్తున్నానంటూ తన భార్య ఏఆర్ కానిస్టేబుల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త ఆరోపించాడు. భార్య ప్రవర్తనపై పోలీసుల వద్ద వాపోయాడు. ఏర్ కానిస్టేబుల్ని, మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించారు. (చదవండి: క్యాంపస్‌లోనే మహిళపై లైంగిక దాడి) (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
20 ఏళ్ల వ్యత్యాసం.. ప్రియుడితో కలిసి భర్తను
ఢిల్లీ : ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసిన మహిళను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మొదట ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించినా పోలీసుల విచారణలో ఆమె నిజం ఒప్పేసుకుంది. వివరాల ప్రకారం..ఢిల్లీకి చెందిన ప్రియాంక (30) అనే మహిళ వివాహేతర సంబంధం నడుపుతూ కట్టుకున్న భర్తనే కడతేర్చి ఏమీ ఎరగనట్లు హాస్పిటల్లో ఆత్మహత్య కథ అల్లేయాలనుకుంది. కానీ డాక్టర్లకు అనుమానం వచ్చి విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఆమె రట్టు బయటపడింది. ప్రియాంకకు ఆమె భర్తకు మధ్య 20 సంవత్సరాల వ్యత్యాసం ఉండటంతో తాను సంతోషంగా లేనని, ఇప్పటివరకు తమకు పిల్లలు పుట్టలేదని తెలిపింది. తన వివాహం పట్ల ఏమాత్రం సంతోషంగా లేనని, అందుకే ప్రియుడు వీరు బుర్మా, అతని సోదరుడు కరణ్‌లతో కలిసి పథకం ప్రకారం భర్తను హత్య చేశానని పోలీసులకు తెలిపింది. ఆస్తి కూడా లాగేసుకోవాలని ప్లాన్ ప్రియాంక గతకాలంగా బర్మా అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దీంతో ఎలాగైనా భర్తను హత్య చేయాలని పథకం రచించారు. ఆగస్టు 18న విషం కలిపిన ఆహారం ఇవ్వడంతో ప్రియాంక భర్త స్పృహ కోల్పోయాడు. దీంతో కరణ్, బర్మాల సహాయంతో భర్త గొంతు నులిపి చంపేసింది. ఆ తర్వాత ఏమీ ఎరగనట్లు స్థానిక బుద్ విహార్ లోని బ్రహ్మశక్తి ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నాడని మొసలి కన్నీళ్లు పెట్టుకుంది. అయితే బాధితుడి గొంతుపై గుర్తులు ఉండటంతో అనుమానం వచ్చిన వైద్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విచారణలో ప్రియాంక గుట్టు బయటపడటంతో వెంటనే ఆమెను, కరణ్‌లను అరెస్టు చేయగా, ఆమె ప్రియుడు బర్మా ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రియాంక భర్త ఢిల్లీలోని మాయపురి ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి ఆస్తిని కూడా తనపై బదిలీ చేయుంచుకోవాలని చూసినట్లు విచారణలో ప్రియంక అంగీకరించింది. ఆమె తరుచూ భర్తతో గొడవపడుతూ ఉండేదని కానీ ఇంత ఘాతుకానికి పాల్పడుతుందని ఊహించలేదని ప్రియాంక అత్తమామలు వాపోయారు. -
అందుకే మోనికాతో ఎఫైర్: బిల్ క్లింటన్
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్లపై 'హిల్లరీ' అనే పేరుతో రూపొందించిన నాలుగు గంటల డాక్యుమెంటరీ సంచలనం రేపుతోంది. మోనికా లెవిన్స్కీతో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు బిల్ క్లింటన్ మొదటిసారిగా ఒప్పుకున్నారు. అధ్యక్షుడిగా ఉన్నసమయంలో ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన ఇప్పుడు నిజాన్ని అంగీకరించారు. ఒత్తిడి, నిరాశ, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకే ఇలాంటి పనిచేశానని తెలిపారు. ఆమెతో గడపడం వల్ల ఒత్తిడి తగ్గి కాస్త ప్రశాంతంగా ఉండగలిగేవాడనని పేర్కొన్నారు. అయితే కొన్ని విషయాలు మనల్ని జీవితాంతం వెంటాడతాయని.. ఇది కూడా అలాంటి తప్పేనని ఆయన అంగీకరించారు. మోనికాతో సంబంధం తన జీవితంలోనూ ఎన్నో మలుపులకు దారితీసిందని చెప్పారు. రాజకీయంగా, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వెల్లడించారు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. దీంతో 1998, డిసెంబరు 19న అభిశంసనను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. గతంలో ఆయన చాలాసార్లు తన ఎఫైర్ వార్తలను ఖండించారు. తాజాగా అది నిజమేనని బిల్ క్లింటన్ ప్రకటించడం గమనార్హం. కాగా, ఇద్దరి అంగీకారం, పరస్పర అవగాహనతోనే బిల్ క్లింటన్‌తో అఫైర్ సాగిందని మోనికా లెవిన్స్కీ గతంలో వెల్లడించారు. తమ అఫైర్‌లో క్లింటన్ చొరవ తీసుకున్నారని ‘వానిటీ ఫెయిర్’ పత్రిక కోసం రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. తమ ఇద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై తాను తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యానని ఆవేదన చెందారు. ఇక వ్యవహారానికి ముగింపు చెప్పాల్సిన సమయం వచ్చిందని అప్పట్లోనే అన్నారు. చదవండి: ఎన్పీడీఆర్ఆర్ చైర్మన్‌గా అమిత్ షా అవినీతి అధికారులకు కేంద్రం షాక్ -
ఉసురు తీస్తున్న.. వివాహేతర సంబంధాలు
మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. అన్యోన్యంగా, ఆదర్శంగా ఉండాల్సిన భార్యభర్తల బంధం బీటలువారుతోంది. మూడో వ్యక్తి ఆకర్షణలో పడుతున్న భార్యలు కట్టుకున్న భర్తల ప్రాణాలు తృణప్రాయంగా తీసేస్తున్నారు. వారం వ్యవధిలో కోదాడ నియోజకవర్గ పరిధిలో జరిగిన మూడు ఘటనలు సభ్యసమాజాన్ని కలవరపరుస్తున్నాయి. మూడు ఘటనల్లో రెండింటిలో భార్యలే భర్తల హత్యకు సూత్రధారులుగా వ్యవహరించగా ప్రియులు పాత్రధారులుగా మారి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నారు. మరో ఘటనలో ఓ భర్త తన భార్యతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని ఆమె ప్రియుడిని దారుణంగా హత్యచేసాడు. తండ్రి హత్యకు గురికాగా, తల్లి జైలుపాలు కావడంతో మూడు కుటుంబాల్లో చిన్న పిల్లలు అనాథలుగా మారారు. సాక్షి, కోదాడ : మూడు హత్యలను పరిశీలిస్తే తాత్కాలిక ఆకర్షణకు లోనైన వీరు కుంటుంబ పరిస్థితులను పట్టించుకోకుండా వివాహేతర సంబంధాలను కొనసాగించారు. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తలను పొట్టన పెట్టుకున్నారు. గుడిబండ గ్రామానికి చెందిన పులికాశయ్య హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్ద ఓ అపార్టుమెంట్లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. వీరు ఉంటున్న ఇంటి పక్కనే ఉన్న యువకుడితో కాశయ్య భార్య నాగలక్ష్మి విహహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి నిలదీయడంతో ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. మరో ఘటనలో చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడేనికి చెందిన కుక్కల గోపిని అతని భార్య రేణుక వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో దారుణంగా హత్య చేయించింది. వీరికి వివాహం జరిగి 8 సంవత్సరాలు కాగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి మృతి చెందడం, తల్లిని పోలీసులు అరెస్టు చేయడంతో పట్టుమని పది సంవత్సరాలు కూడా లేని వీరి ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలుగా మారారు. భార్యభర్త చేతిలో ప్రియుడు ఇక నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఓ భర్త తన భార్యతో కలిసి యువకుడిని దారుణంగా హత్య చేసి సాగర్ కాలువలో పడవేశాడు. పక్షం రోజుల తర్వాత ఘటన వెలుగు చూడడంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో యువకుడు రహీం హత్యకు గురికాగా భార్యభర్తలు కోటయ్య, త్రీవేణిలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో వీరి కొడుకు ఇపుడు దిక్కులేనివాడయ్యాడు. ఇటీవల హత్యకు గురైన కుక్కల గోపి గుడిబండ వాసి పులి కాశయ్యరహీమ్ (ఫైల్) పాపం పసివాళ్లు ఇలాంటి బంధాల వల్ల అభం శుభం తెలియని పసిపిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయ్యారయ్యింది. కోదాడలో చోటు చేసుకున్న మూడు ఘటనల్లో పదేళ్ల లోపు ఐదుగురు పిల్ల అనాథలు గా మారారు. తండ్రి మరణించడం, తల్లి జైలుపాలు కావడంతో వారి అలనాపాలనా చూసే వారు కరువయ్యారు. అసలేం జరిగిందో కూడా అర్థం చేసుకోలేని వయస్సులో జరిగిన ఈ ఘటనలు వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతా యని ఇలాంటి బంధాలకు దూరంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. -
అక్రమ సంబంధం; నమ్మించి తోసేశాడు
గురుగ్రామ్ : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను మేడపై నుంచి తోసి చంపేశాడు. అనంతరం ప్రమాదవశాత్తు కింద పడిందని పోలీసులతో నమ్మబలికాడు. ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె చావుకు కారణమైన భర్తను, అతని ప్రియురాలిని అరెస్టు చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లోని ‘వాలీ వ్యూ ఎస్టేట్’ అపార్ట్మెంట్లో గత అక్టోబర్, 27న చోటుచేసుకుంది. వివరాలు.. దీపికా చౌహన్ (32), విక్రం చౌహన్ (35) భార్యభర్తలు. వీరికి నాలుగేళ్ల పాప, 5 నెలల బాబు ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా విక్రం ఎదురు ఫ్లాట్స్‌లో ఉండే షెఫాలి భాసిన్తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగేవి. ఘటన జరిగిన రోజు సాయంత్రం విక్రం దీపికా మరోమారు గొడవపడ్డారు. ‘నీ వ్యవహారాలు నచ్చడం లేదు. నన్నూ.. నా పిల్లల్ని అన్యాయం చేయొద్దు. ఇప్పుడే వెళ్లి భాసిన్ అంతు చూస్తా’ అని దీపిక హెచ్చరించింది. దీంతో తన అక్రమ సంబంధం ‘చెడిపోతుంది’ అని భావించిన విక్రం తన భార్యను హతమార్చాలని పథకం రచించాడు. మంచిగా నటించి ఆ రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో దీపికతో బాల్కనీలో కాసేపు ముచ్చటించాడు. ఆమెను నమ్మించి ఒక్కసారిగా 8 అంతస్తుల ఎత్తు నుంచి కిందకు తోసేశాడు. తీవ్ర గాయాలపాలైన దీపిక ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని పోలీసులు తెలిపారు. కాగా, ఈ హత్యలో విక్రమ్‌కి సహకరించాడనే అనుమానంతో మరోవ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు డీఎల్ఎఫ్ ఫేజ్-1 పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓ సంజీవ్ కుమార్ వెల్లడించారు. -
ప్రియుడి చేతిలో వివాహిత..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని సంతోష్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదని పగ పెంచుకున్న ఓ కిరాతకుడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన బుధవారం ఉదయం జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు.. పంజాబ్‌కు చెందిన సానియాకు ఇదివరకే వివాహమైంది. ఆమె నగరానికి చెందిన సల్మాన్‌తో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. అయితే, గత కొంతకాలంగా సానియా తనను పట్టించుకోవడం లేదంటూ రగిలిపోయిన సల్మాన్ ఆమెపై కిరోసిన్ పోసి సజీవదహనం చేశాడు. అనంతరం సంతోష్‌నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. -
భర్త బాగోతాన్ని స్వయంగా రట్టు చేసిన భార్య
-
జంట ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
చిత్తూరు (తంబళ్లపల్లి) : వివాహేతర సంబంధం కారణంగా జంట హత్యలు జరిగాయి. ఈ ఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం సమీపంలో.. కర్నాటక రాష్ట్ర పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తంబళ్లపల్లికి చెందిన సుకన్య(35), భర్త నుంచి విడాకులు తీసుకుని కర్నాటకలోని ఉండోళ్లపల్లిలో ఉంటుంది. అయితే అనంతపురం జిల్లాకు చెందిన వెంకటేశ్(42)కూడా వ్యవసాయం చేస్తూ ఉండోళ్లపల్లిలోనే ఉంటున్నాడు. కొన్నేళ్లుగా వెంకేటేశ్, సుకన్యల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే సుకన్య, వెంకటేశ్‌లను సుకన్య ఇంట్లో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.