రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
సాక్షి, తాడేపల్లి: రేపు ఉదయం (జూన్ 11, గురువారం) 11 గంటలకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, రెండేళ్ల ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన మాట్లాడనున్నారు.
పొన్నూరులో టీడీపీకి భారీ షాక్
సాక్షి, తాడేపల్లి: పొన్నూరులో టీడీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీలోకి వంద టీడీపీ కుటుంబాలు చేరాయి. పొన్నూరు ఇంఛార్జి అంబటి మురళీ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఆటవిక రాజ్యంగా మారిందన్నారు.రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారని.. దేశంలో ఎక్కడాలేని అరాచకం, హింసాకాండ ఏపీలో జరుగుతోందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘సమర్ధత కలిగిన పోలీసు అధికారులను పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన పోలీసులతో ప్రత్యర్ధులను వేధిస్తున్నారు. అక్రమ కేసులు నిత్యకృత్యంగా మారాయి. అత్యంత దారుణమైన పాలనను ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చూపాలి. ప్రజల కోసం ప్రతి కార్యకర్త పని చేయాలి....పొన్నూరులో చట్టమే రౌడీయిజానికి పాల్పడుతోంది. పొన్నూరు ఎమ్మెల్యే అరాచకాలను జనం చూస్తున్నారు. మామిళ్లపల్లి ఘటనలో పోలీసుల తీరు జాతీయ స్థాయిలో వివాదాస్పదం అయింది. అంబటి మురళి ఆధ్వర్యంలో గట్టిగా నిలబడిన పార్టీ కేడర్‌కి అభినందనలు. రానున్న రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేయాలి’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
మమత ముందున్న 4 మార్గాలు ఇవే.. ఇలాచేస్తేనా సామిరంగా..
ఒకే ఒక్క ఓటమి.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం, ఆ తర్వాతి నుంచి పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్‌బై చెబుతుండడంతో ఆ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అసలు ఏం చేయాలో కూడా అర్థంకాని పరిస్థితి తలెత్తుతోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం కంటే మమతా బెనర్జీ వ్యక్తిగత నాయకత్వంపైనే ఎక్కువగా ఆధారపడింది. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలో తిరుగుబాట్లు, వలసలు పెరగడంతో ఆ బలహీనత బయటపడింది. అధికారంలో ఉన్నప్పుడు బలంగా కనిపించిన టీఎంసీ.. ఇప్పుడు నిజమైన రాజకీయ పార్టీగా తిరిగి నిలబడుతుందా? లేక క్రమంగా విచ్ఛిన్నమవుతుందా?తృణమూల్ కాంగ్రెస్ సాధారణ రాజకీయ పార్టీలా ఎదగలేదు. అది ముందుగా ఒక భావోద్వేగంగా రూపుదిద్దుకుంది. మమతా బెనర్జీ చుట్టూ ఆవేదన, ప్రతిఘటన, వామపక్ష వ్యతిరేక భావన, వీధి పోరాట స్ఫూర్తి, ప్రాంతీయత వంటి అంశాలు చేరి ఒక రాజకీయ శక్తిగా మారాయి. ఈ విధానం ఎన్నో సంవత్సరాలు విజయవంతమైంది. మమతా ప్రజల అసంతృప్తిని ఉద్యమంగా మార్చి, దాని ద్వారా అధికారంలోకి వచ్చారు. బెంగాల్లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు 2011లో ముగింపు పలికారు. వరుసగా మూడు పర్యాయాలు అధికారాన్ని నిలబెట్టుకున్నారు.అయితే 2026 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారింది. భారతీయ జనతా పార్టీ భారీ విజయం సాధించగా, తృణమూల్ సుమారు 80 స్థానాలకు పరిమితమైంది. మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో ఓడిపోవడం పెద్ద దెబ్బగా మారింది. ఓటమి ఒక్కటే సమస్య కాదు. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ అంతర్గత బలహీనతలు బయటపడ్డాయి.పార్టీలో పెద్ద ఎత్తున తిరుగుబాటు ప్రారంభమైంది. అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు వర్గానికి మద్దతు ఇస్తున్నారనే వార్తలు వచ్చాయి. తిరుగుబాటు నేతలపై చర్యలు తీసుకున్నా పార్టీ నియంత్రణ బలహీనంగా కనిపించింది. మమతా నిర్వహించిన సమావేశాలకు తక్కువ మంది నేతలు రావడం, పలు కమిటీలను రద్దు చేయడం వంటి పరిణామాలు సంస్థాగత సంక్షోభాన్ని సూచించాయి.పార్లమెంటులో తృణమూల్ స్థితి కూడా అస్థిరంగా మారింది. రాష్ట్ర అధికార యంత్రాంగం, స్థానిక రాజకీయ బలం, ఎన్నికల వ్యవస్థపై ప్రభావం లేకపోవడంతో ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించడం ప్రారంభించారు. తిరుగుబాటు వర్గం నిజమైన తృణమూల్‌గా నిలిస్తే, చాలామంది తమ రాజకీయ మనుగడ దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.మమతా బెనర్జీ వ్యక్తిగతంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఎదిగిన నాయకురాలు. కానీ ఆమె చుట్టూ పెరిగిన నాయకత్వంలో చాలామంది అధికార రాజకీయాలకు మాత్రమే అలవాటు పడ్డారు. అధికారం ఉన్నప్పుడు విశ్వాసంగా కనిపించిన నాయకులు, ఓటమి తర్వాత వైఖరి మార్చుకోవడం దీనికి ఉదాహరణ.చేయాల్సినవి ఇవే.. ప్రస్తుతం మమతా ముందు నాలుగు మార్గాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీపై నియంత్రణ కొనసాగించడం, తిరుగుబాటు వర్గంతో రాజీకి రావడం, కింది స్థాయి నుంచి తిరిగి నిర్మాణం చేపట్టడం, లేక కాంగ్రెస్-వామపక్షాలతో పెద్ద కూటమి ఏర్పాటుపై ఆలోచించడం. ఇవి అంత ఈజీ కాదు. అసాధ్యమైన విషయాన్ని సుసాధ్యం చేయగలిగితేనే పార్టీ మళ్లీ పుంజుకుంటుంది.తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికీ నిజమైన రాజకీయ పార్టీగా నిలిచి పునర్నిర్మాణం చేసుకోగలదా? లేక నాయకురాలి వ్యక్తిగత ప్రజాదరణపై ఆధారపడిన వ్యవస్థగా క్రమంగా విచ్ఛిన్నమవుతుందా? అన్నదే ఇప్పుడు ప్రశ్న.
ప్రతీ ఆదివారం రెండు బిర్యానీలు ఫ్రీ : అవాక్కయ్యారా?
లక్షలాది మంది భారతీయులకు ఇష్టమైన వంటకం బిర్యానీ. సందర్భం ఏదైనా బిర్యానీ ఒక ఎమోషన్. అయితే ఒక ప్లేట్ బిర్యానీ చివరకు కోర్టు కేసు వరకు వెళ్తుందని ఎవరైనా ఊహిస్తారా? దీనికి సంబంధించి పుదుచ్చేరిలో జరిగిన ఒక విచిత్రమైన విషయం నెట్టింట సందడిగా మారింది.‘లైవ్‌లా’ (LiveLaw) నివేదిక ప్రకారం. స్థానిక రెస్టారెంట్లో పి. సుందరకుమార మణికందన్ అనే వినియోగ దారుడు తన స్నేహితుడు మహమ్మద్ నియాజుద్దీన్‌తో పుదుచ్చేరి ఎంజీ రోడ్డులోని ఎంతో ఇష్టంగా బిర్యానీ ఆర్డర్ చేసి తింటూ ఉండగా, బిర్యానీలో చనిపోయిన పురుగు కనిపించింది. దీని తీవ్రతను గమనించిన అతను వీడియోలు, ఫోటోలు తీశారు. రెస్టారెంట్లో పరిశుభ్రత లోపించిందని, దీనివల్ల తనకు మానసిక ఆందోళన కలగడమే కాకుండా, ఆరోగ్యం పాడవుతుందనే భయం, హోటళ్లపై నమ్మకం పోయిందని ఆరోపించాడు. ఇదీ చదవండి: భారత మామిడి దిగుమతులను నిషేధించిన నేపాల్ఆ తర్వాత, మణికందన్ ఆ రెస్టారెంట్‌కు లీగల్ నోటీసు జారీ చేశారు. నిర్లక్ష్యం, ఆరోగ్య సమస్యలు, మానసిక వేదన , న్యాయపరమైన ఖర్చులను పేర్కొంటూ, అతను రూ. 1.3 లక్షల పరిహారం కోరారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. దీనికి ఎలాంటి స్పందన రాకపోవడంతో పుదుచ్చేరిలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. సురక్షితమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్ విఫలమైందని, ఇది ‘వినియోగదారుల రక్షణ చట్టం, 2019’ కింద సేవా లోపమేనని ఫిర్యాదు చేశారు.ఈ కేసులో రెస్టారెంట్ చేసిన ఒక పెద్ద తప్పు వారికి మైనస్ అయింది. కోర్టు నుంచి నోటీసులు అందినప్పటికీ 'బిర్యానీ అండ్ కో' ప్రతినిధులు కమిషన్ ముందు హాజరు కాలేదు. దీంతో ఈ కేసును కోర్టు ఏకపక్షంగా విచారించింది. కస్టమర్ ఇచ్చిన ఫోటోలు అంత స్పష్టంగా లేకపోయినా, వీడియో ఫుటేజీని కమిషన్ నిశితంగా పరిశీలించింది. ఆ వీడియోలో బిర్యానీలో చనిపోయిన ఈగ లాంటి పురుగు స్పష్టంగా కనిపించింది. అలాగే గూగుల్ రివ్యూలో కస్టమర్ పెట్టిన పోస్టుకు రెస్టారెంట్ మొదట స్పందిస్తూ.. క్షమాపణలు చెప్పి, ఇలాంటివి మళ్లీ జరగవని పేర్కొంది. కానీ లీగల్ నోటీసుకు ఇచ్చిన రిప్లైలో మాత్రం తాము తప్పు చేయలేదని బుకాయించింది. ఈ పరస్పర విరుద్ధమైన సమాధానాల వల్ల రెస్టారెంట్ నమ్మకాన్ని కోల్పోయిందని కమిషన్ అభిప్రాయపడింది.ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్తవినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత హోటళ్లకు ఉందని స్పష్టం చేసింది. కస్టమర్‌కు ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రాకపోయినప్పటికీ, ఈ ఘటన వల్ల ఆయన మానసిక వేదనకు, ఇబ్బందులకు గురయ్యారని కోర్టు అంగీకరించింది. దీని ప్రకారం వినియోగదారుడి మానసిక క్షోభ, శారీరక ఇబ్బందులకుగానూ కస్టమర్‌కు 10వేల రూపాయలు,కోర్టు ఖర్చుల కింద అదనంగా మరో రూ. 3,000 ఇవ్వాలని చెల్లించాలని రెస్టారెంట్‌ను ఆదేశించింది.అయితే, అందరినీ ఆశ్చర్యపరిచిన అసలైన విషయం మరొకటి ఉంది. ఈ నగదు పరిహారంతో పాటు, ఫిర్యాదు దారుడికి 10 ప్లేట్ల హైదరాబాదీ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలంటూ వినూత్న ఆదేశాలు జారీ చేసింది. ఐదు వారాల పాటు ప్రతి ఆదివారం రెండు ప్లేట్ల చొప్పున ఈ బిర్యానీని అందించాలని, అది కూడా పూర్తి ఆహార భద్రతా ప్రమాణాలను పాటిస్తూ తయారు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ ఉచిత బిర్యానీ పంపిణీ కోర్డు ఆర్డర్ అందిన రెండు వారాల్లోగా ప్రారంభం కావాలని ఆదేశించింది.ఇదీ చదవండి: హాట్ టాపిక్‌గా 'మా బెహన్' నటి రూ. 14 కోట్ల బంగ్లా
రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
మా సినిమాలో ‘ట్రాన్స్ జెండర్స్’ కష్టాలను చూపించాం: సునీల్ కుమార్ రెడ్డి
బాలయ్య బర్త్ డే.. యాక్షన్ గ్లింప్స్ రిలీజ్
ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్, తెల్లాపూర్: ప్రకృతి మధ్య ప్రీమియం లైఫ్!
మూల్యం చెల్లించుకోవాల్సిందే : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
T20 WC: జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల కీలక భేటీ
ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు.. గ్రేహౌండ్స్ రద్దు.. సీవీ ఆనంద్
టీమిండియా షెడ్యూల్లో మరో విదేశీ పర్యటన
భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్ వీడియో
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్‌కు రాహుల్ రామకృష్ణ చురకలు!
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
సకల శాఖలు లోకేశ్ చూస్తారు తన శాఖ తప్ప! సీఎం ఏ శాఖా చూడరు
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే..
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
పసిడి రీబౌండ్
సాక్షి కార్టూన్ 09-06-2026
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'
క్యాబ్ డ్రైవర్‌పై సినీ నటుడు దాడి
వరలక్ష్మి హారర్ థ్రిల్లర్.. సూపర్‌స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
రేపు వైఎస్ జగన్ ప్రెస్‌మీట్
మా సినిమాలో ‘ట్రాన్స్ జెండర్స్’ కష్టాలను చూపించాం: సునీల్ కుమార్ రెడ్డి
బాలయ్య బర్త్ డే.. యాక్షన్ గ్లింప్స్ రిలీజ్
ప్రెస్టీజ్ గోల్డెన్ గ్రోవ్, తెల్లాపూర్: ప్రకృతి మధ్య ప్రీమియం లైఫ్!
మూల్యం చెల్లించుకోవాల్సిందే : ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
T20 WC: జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
మోదీ అధ్యక్షతన ఎన్డీఏ నేతల కీలక భేటీ
ఇక ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదు.. గ్రేహౌండ్స్ రద్దు.. సీవీ ఆనంద్
టీమిండియా షెడ్యూల్లో మరో విదేశీ పర్యటన
భర్తను అలా చూసి కారు బోనెట్‌పైకి భార్య చివరికి.. వైరల్ వీడియో
పసిడి మళ్లీ పతనమే.. కొనేవాళ్లకు పండుగే!
పెద్ది.. ఎంతపని చేశావ్ బుచ్చిబాబు?
రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
‘పెద్ది’ వివాదం.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
ఆర్భాటాలు కాదు, లెక్కలు చెప్పు.. పవన్‌కు రాహుల్ రామకృష్ణ చురకలు!
వేటు పడ్డాక వీరంగం సృష్టిస్తున్న స్కై
సకల శాఖలు లోకేశ్ చూస్తారు తన శాఖ తప్ప! సీఎం ఏ శాఖా చూడరు
చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ
ఈజీగా ‘EPF 100% విత్‌డ్రా’.. కొత్తగా మారిందిదే..
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
పసిడి రీబౌండ్
సాక్షి కార్టూన్ 09-06-2026
ఫిక్స్డ్ డిపాజిట్.. ఫటాపట్!
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
‘ఇండియా’ను ముంచేసింది ఆ ఇద్దరే..’
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
'అతడు పేరుకే ఆల్‌రౌండర్.. జట్టులో ప్లేస్ దండుగ'
క్యాబ్ డ్రైవర్‌పై సినీ నటుడు దాడి
వరలక్ష్మి హారర్ థ్రిల్లర్.. సూపర్‌స్టార్ కృష్ణపై స్పెషల్ సాంగ్
ఫొటోలు
దర్శక దిగ్గజం భారతీ రాజాకు సినీ ప్రముఖుల నివాళి.. ఫోటోలు
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు)
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం...ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)
అందంతో కిక్కెక్కిస్తున్న భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)
వరంగల్ : కనుల పండువగా ఎస్సార్ స్నాతకోత్సవం (ఫొటోలు)
నాలుగో వెడ్డింగ్ యానివర్సరీ.. ఫ్యామిలీతో నయన్ ఫారిన్ వెకేషన్ (ఫోటోలు)
విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
హైదరాబాద్‌లో కుండపోత వర్షం (ఫొటోలు)
కొంచెం క్లాస్... కొంచెం మాస్.. అనిష్మా ‘యూత్’ఫుల్ ఫోటోస్
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. గుండెలు పిండేసే దృశ్యాలు
సినిమా
భారతీరాజా, రజనీకాంత్ మధ్య వివాదం ఏంటి? అసలేం జరిగింది?
దిగ్గజ దర్శకుడు భారతీరాజా(84) మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు ఆయనకు నివాళులుల అర్పించారు. మరికొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలో భారతీరాజాకు సంబంధించిన కొన్ని విషయాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో ప్రధానంగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో ఆయనకు ఉన్న వివాదం గురించి చర్చిస్తున్నారు.భారతీరాజా దర్శకత్వం వహించిన తొలిచిత్రం '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') లో రజనీకాంత్ ప్రధాన పాత్ర పోషించాడు. 1977లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత దాదాపు పదేళ్లు గ్యాప్ తీసుకొని కోడి పరాకుత్తు(1988) అనే మూవీతోనూ ప్రేక్షకులను అలరించారు. ఇలా రెండు సినిమాలు తీసినప్పటికీ విరిద్దరి మధ్య దాదాపు ఐదు దశాబ్దాలుగా సైద్ధాంతిక విభేధాలు ఉన్నాయి. రజనీకాంత్‌పై పలుమార్లు భారతీరాజా బహిరంగంగా విమర్శలు చేశారు. అసలు రజనీకాంత్‌ది అసలు తమిళనాడు కాదని.. ఆయన కర్ణాటక వ్యక్తి అంటూ ఆరోపణలు చేశాడు.కావేరీ జలవివాదంతో మొదలు.. రజనీకాంత్, భారతీరాజాల మధ్య ఒప్పుడు మంచి అనుబంధం ఉండేది. అయితే 2002లో జరిగిన కావేరి జలవివాదమే వీరిద్దరిని దూరం చేసింది. అప్పట్లో కావేరి జలాల కోసం తమిళ నటీనటులంతా కర్ణాటకకు వ్యతిరేకంగా దీక్ష చేశారు. ఈ నిరసనలకు భారతీరాజా న్యాయకత్వం వహించారు. అయితే శాంతియుతంగా చేపట్టిన నిరసనలు కాస్త ఘర్షణకు దారి తీసింది. కొంతమంది పోలీసులపై దాడి చేశారు. ఈ దాడిని రజనీకాంత్ బహిరంగంగా ఖండించాడు. తమిళనటులు చేపట్టిన దీక్షకు కూడా మద్దతు ప్రకటించలేదు. అదే భారతీరాజా కోపానికి కారణం అయింది. కావేరీ ఉద్యమ కమిటీ కన్వినర్‌గా ఉన్న భారతీరాజా.. తమిళ ప్రజలకు రజనీకాంత్ ద్రోహం చేస్తున్నాడని బహిరంగంగా ఆరోపించాడు. ఆయనను సూపర్ స్టార్‌గా చేసిన తమిళప్రజలకు వెన్నుపోటు పొడిచాడంటూ తీవ్ర విమర్శలు చేశాడు. ఒకానొక దశలో అసలు రజనీకాంత్ తమిళవాడు కాదనీ, కర్ణాటకకు చెందిన వ్యక్తి అని ఆరోపించాడు.రజనీ రాజకీయ ఎంట్రీపై కూడా.. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు వచ్చినప్పుడు కూడా భారతీరాజా ఆయనపై విమర్శలు చేశాడు. తమిళనాడు రాజకీయాల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, కానీ రాష్ట్ర నాయకత్వం మాత్రం తమిళనాడుకు చెందిన వారి చేతుల్లోనే ఉండాలని ఆయన వాదించారు. కొన్ని సందర్భాల్లో సూపర్‌స్టార్ పేరును నేరుగా ప్రస్తావించకుండా, రజనీకాంత్ రాజకీయ ప్రవేశం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను భారతిరాజా తీవ్రంగా ఖండించాడు. రాజకీయాల్లోకి రావాలని బయటివారిని ప్రజలు 'యాచించకూడదు' అని సూచించారు. అలాగే 2018లో జరిగిన ఐపీఎల్ నిరసన వివాద సమయంలోనూ రజనీకాంత్‌ని ‘కర్ణాటక కాషాయ రాయబారి’అని విమర్శించాడు. చివరిదశలో ఇలా.. భారతీరాజా ఎన్ని సార్లు విమర్శలు చేసినా రజనీకాంత్ మాత్రం ఆయనను ఎప్పుడు ఒక్క మాట అనలేదు. ఒకే ఒక్కసారి మాత్రం ఓ ఈవెంట్లో.. భారతీరాజాని నేను గొప్ప దర్శకుడు అని ఒప్పుకుంటాను, పొగుడుతాను కానీ ఆయన మాత్రం నన్ను నటుడిగా గుర్తించరు అని కౌంటర్ వేశారు రజనీకాంత్. భారతీరాజా కూడా తన మాటలతో కొన్ని సందర్భాల్లో రజనీకాంత్‌ని ఇబ్బంది పెట్టానని ఒప్పుకున్నాడు. అయితే తాను ఎన్ని మాటలు అన్నా..ఆయన ఒక్కసారి కూడా తిరిగి అనలేదని..అది అతని గొప్పదనం అని పొగిడాడు. ‘నేను అతడిని చాలా బాధపెట్టాను. కానీ అతను అదంతా మర్చిపోయి నాపై ఆప్యాయత చూపించాడు. అతనికి ప్రతీకార మనస్తత్వం లేదు. అతను గొప్ప వ్యక్తి’ అని ఓ ఇంటర్వ్యూలో భారతీరాజా అన్నాడు. అలా తమిళనాడులో భారతీరాజా – రజినీకాంత్ వివాదం చాలా ఏళ్ళు నడిచింది. చివరి దశలో మాత్రం భారతీరాజాని రజని పలుమార్లు కలుసుకొని ఒకర్నొకరు అభినందించుకున్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు: సీఎం విజయ్
దర్శక శిఖరం భారతీరాజా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రకటించారు. తమిళ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. భారతీరాజా(84) మరణ వార్త వినగానే విజయ్ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం చెన్నైలోని భారతీరాజా నివాసానికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు. ఆయన మృతి భారతీయ సినిమాకు తీరని లోటని సతాపం తెలిపారు. విజయ్‌తో పాటు తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్, సీనీ నటి సినీ నటి రాధికా, హీరో సూర్య కూడా భారతీరాజా నివాసానికి చేరుకొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ భారతీరాజాతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
‘R’..సెంటిమెంట్, అలా ప్రేమలో పడి.. భారతీరాజా ప్రత్యేకతలివే!
భారతీయ చలనచిత్ర రంగానికి, ముఖ్యంగా దక్షిణాది సినిమాకు సరికొత్త వ్యాకరణాన్ని నేర్పిన దర్శక శిఖరం భారతీరాజా. అప్పటివరకు నాలుగు గోడల మధ్య స్టూడియో సెట్లలోనే సాగుతున్న సినిమాను, పచ్చని పల్లెటూరి పొలాల్లోకి, మట్టి రోడ్ల పైకి తీసుకెళ్లిన ఘనత ఆయనది. అందుకే ఆయన్ని తమిళ చిత్రసీమ ‘ఇయక్కునర్ ఇమయం’ (దర్శక శిఖరం) అని ఎంతో గౌరవంగా పిలుచుకుంటుంది. నేడు(జూన్ 10) ఆయన మనకు భౌతికంగా దూరమయ్యాడు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకతలు ఏంటి? ఆయన సినీ ప్రస్థానం ఎలా సాగింది? ఓ సారి చూద్దాం. తొలి చిత్రంతోనే సంచలనం1941 జూలై 17న మదురై (తేని) జిల్లాలో జన్మించిన భారతీరాజా, 1977లో '16 వయదినిలే' (తెలుగులో 'పదహారేళ్ల వయసు') సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. స్టూడియో సెట్టింగుల యుగానికి స్వస్తి చెప్పి, అవుట్డోర్ షూటింగ్‌లకు ఈ సినిమాతోనే ఆయన శ్రీకారం చుట్టారు.తెలుగులోనూ చెరగని ముద్రఆయన తమిళంలో తీసిన ఎన్నో క్లాసిక్ సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యాయి. మరికొన్ని రీమేక్ రూపంలో వచ్చి ఇక్కడి ప్రేక్షకులను కూడా అలరించాయి. నేరుగా తెలుగులో ఆయన చేసిన 'సీతాకోకచిలుక' (1981) సినిమా ఇండస్ట్రీ హిట్ కావడమే కాకుండా నేటికీ ఒక అద్భుత ప్రేమకావ్యంగా నిలిచిపోయింది. ‘ఆరాధన’, ‘జమ్మిచెట్టు’ వంటి చిత్రాలు కూడా ఆయన సృజనాత్మకతకు అద్దం పడతాయి. కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా నటుడిగానూ ఆయన ప్రత్యకతను చాటుకున్నాడు. ‘ఆయుత ఎళుతు’ (యువ), ‘పాండియనాడు’, ‘తిరుచిత్రంబలమ్’ (తిరు), ఆ మధ్య వచ్చిన విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. మోహన్‌లాల్ ‘తుడరుమ్’లో చివరిసారి తెరపై కనిపించారు. అలాగే ఆయన నటించిన ‘పులవర్’ చిత్రం ఇంకా విడుదల కావాల్సి ఉంది.'R' సెంటిమెంట్భారతీరాజా సినిమాల ద్వారా పరిచయమైన ఎందరో కథానాయికలు స్టార్ హీరోయిన్లుగా వెలిగారు. ముఖ్యంగా ఆయన పరిచయం చేసే హీరోయిన్ల పేర్లు 'R' అక్షరంతో (రాధిక, రాధ, రేవతి, రంజని, రేఖ) ప్రారంభం కావడం ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్‌గా నిలిచింది.ఆమెతో ప్రేమలో..పల్లెటూరి సంస్కృతిని, అక్కడి మనుషుల భావోద్వేగాలను, కుల వ్యవస్థలోని సంక్లిష్టతలను అత్యంత సహజంగా తెరకెక్కించడంలో భారతీరాజా సిద్ధహస్తుడు. హీరోయిన్లకు మేకప్ లేకుండా తెరపై చాలా సహజంగా చూపించేవాడు. దీనికి గల కారణాన్ని కూడా ఒక సందర్భంలో ఆయన వివరించాడు. ‘నేను ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డా. ఆమెను వెతుక్కుంటూ వెళ్తుటా. ఆశ్చర్యంగా ప్రతిసారి ఆమె నాకు పల్లెటూరిలోనే కనిపిస్తుంది. చాలా అందంగానూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు ‘ప్రకృతికాంత’. ఆమె అందానికి నేను ఫిదా అయ్యాను. అందుకే కెమెరా పట్టుకొని ఆ అందాన్ని వెతుక్కుంటా’ అంటూ పల్లెటూరిపై తనకున్న ప్రేమను చతురతను జోడించి తనదైన శైలీలో చెప్పుకొచ్చాడు.అవార్డులు - పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం: భారతీరాజా సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అత్యున్నత పురస్కారాలతో ఆయన్ను సత్కరించాయి.చలనచిత్ర రంగానికి చేసిన విశేష సేవలకు గానూ 2004లో కేంద్ర ప్రభుత్వం ప్రద్మశ్రీ పురస్కారాన్ని అందించింది.జాతీయ చలనచిత్ర అవార్డులు: ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తమిళం, తెలుగు), సామాజిక అంశాలపై ఉత్తమ చిత్రం విభాగాల్లో కలిపి మొత్తం 6 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు.నంది అవార్డు: 'సీతాకోకచిలుక' చిత్రానికి గానూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉత్తమ దర్శకుడిగా 'నంది' పురస్కారాన్ని అందుకున్నారు. ఇతర పురస్కారాలుదక్షిణ భారత ఫిల్మ్‌ఫేర్ అవార్డులు (4), తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను (6) సొంతం చేసుకున్నారు.
రెండేళ్లుగా ఖాళీ.. పిచ్చిదానిలా ప్రవర్తించినా సరే..: దీప్తి ఎమోషనల్
దీప్తి సునయన.. ఒకప్పుడు యూట్యూబ్‌లో సెన్సేషన్.. కవర్ సాంగ్స్, డబ్ స్మాష్‌తో పాపులర్ అయిన ఈ బ్యూటీ తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్లో పాల్గొంది. అమాయకత్వం, చిలిపితనంతో అభిమానులను సంపాదించుకున్న ఈ నటి అప్పట్లో యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు కలిసిమెలిసి ఉన్న వీరిద్దరూ 2022లో బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఎవరి దారి వారు చూసుకున్నారు.టైంపాస్ చేస్తున్న దీప్తిఇటీవలే షణ్ముఖ్ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కలిసి కొత్తింట్లో కొత్త జీవితం ప్రారంభించాడు. మరోపక్క ఈ మధ్యే ఓ ప్రైవేట్ సాంగ్ చేశాడు. అలాగే ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఇటు దీప్తి సునయన మాత్రం పనిని పక్కనపెట్టేసి జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేస్తోంది. మధ్యమధ్యలో గుళ్లుగోపురాలు కూడా తిరుగుతోంది. అయితే ఆమె ఏ ప్రాజెక్టులు చేయకపోయినా తనపై ప్రేమను అలాగే కొనసాగిస్తున్న అభిమానులకు తాజాగా కృతజ్ఞతలు తెలిపిందీ బ్యూటీ.ఏం చేశానని ఇంత ప్రేమ?'గత 10 ఏళ్లుగా మీరు నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎలా ఉన్నా ప్రేమించారు. పిచ్చిగా ప్రవర్తించినా ఇష్టపడ్డారు. ప్రతిదానిలో నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంతటి స్వచ్ఛమైన ప్రేమను పొందేందుకు నేను ఏం చేశానో నాకే తెలీదు. మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నిజం చెప్పనా.. నాకు పని చేయడానికి ఒంట్లో శక్తి లేదు. రెండేళ్లుగా విశ్రాంతి తీసుకోవడంలోనే గడిపేశాను. అయినా మీరు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మళ్లీ వర్క్‌లో బిజీ అవమని ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీరిచ్చే ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిది.ఆ ప్రయత్నంలోనే ఉన్నా..నేను ఎందుకిలా డీలా పడిపోయానో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. నేను మళ్లీ పూర్తి ఉత్సాహంతో మీ ముందు నిలబడతాను. నేను ఏ పనీ చేయకపోయినా సరే.. నన్ను ప్రేమిస్తున్నందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నాకోసం నిలబడినందుకు థాంక్యూ సో మచ్' అని దీప్తి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇది చూసిన అభిమానులు ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు.చదవండి: వరుస కష్టాలు.. నాకే ఎందుకిలా జరుగుతోంది?: శ్రీజ కొణిదెల
క్రీడలు
టెస్ట్‌ల్లో సరికొత్త 'నంబర్ వన్'
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ సరికొత్త నంబర్ వన్ టెస్ట్ బ్యాటర్‌గా అవతరించాడు. సహచరుడు జో రూట్‌ను వెనక్కు నెట్టి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. తాజాగా లార్డ్స్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో అర్ద సెంచరీ సాధించి నంబర్ వన్ స్థానానికి చేరాడు. ఇదే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో ఘోరంగా విఫలమైన రూట్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మధ్యలో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు.తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో సూపర్ సెంచరీతో సత్తా చాటిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. 743 రేటింగ్ పాయింట్లు కలిగిన గిల్.. ప్రస్తుతం భారత్ తరఫున అత్యధిక రేటింగ్ కలిగిన బ్యాటర్‌గా నిలిచాడు.ఇదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన మరో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ర్యాంక్‌లో (34) ఎలాంటి మార్పు లేదు. గిల్‌తో పాటు టాప్-10లో ఉన్న మరో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓ స్థానంలో కోల్పోయి తొమ్మిదో స్థానానికి చేరాడు. ఓవరాల్‌గా తాజా ర్యాంకింగ్స్‌లో అత్యధిక లబ్ది పొందిన బ్యాటర్‌గా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. ఫిలిప్స్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో ఓ మోస్తరు ప్రదర్శన చేసినప్పటికీ.. 15 స్థానాలు మెరుగుపర్చుకొని 40వ స్థానానికి ఎగబాకాడు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ టెస్ట్‌లో కళ్లు చెదిరే ప్రదర్శన ఇచ్చిన ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ 7 స్థానాలు మెరుగుపర్చుకొని పదో స్థానానికి ఎగబాకాడు. ఆఫ్ఘన్ టెస్ట్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చిన టీమిండియా అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ తొలిసారి టాప్-100లోకి ప్రవేశించాడు. ఆ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన సుతార్ 272 రేటింగ్ పాయింట్లు సాధించి 72వ స్థానంలో నిలిచాడు.మిగతా భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 14వ స్థానానికి చేరగా.. సిరాజ్ ఓ స్థానం కోల్పోయి 15వ స్థానానికి పడిపోయాడు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. టీమిండియా వెటరన్ ఆటగాడు రవీంద్ర జడేజా టాప్ ప్లేస్‌ను నిలుపుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు.
ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా యమా క్రేజ్ ఉన్న ఫిఫా ప్రపంచకప్ ప్రారంభానికి ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఫిఫా వరల్డ్‌కప్‌కు ఈసారి అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 39 రోజుల పాటు జరగనున్న సాకర్ సమరంలో 48 దేశాలు పాల్గొన నున్నాయి. ఫైనల్ సహా మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ్యాచ్‌ల నిర్వహణ, ఆరంభ వేడుకలకే పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ఫిఫా నిర్వాహకులు.. టోర్నీలో విజేతగా నిలిచే జట్టుతో పాటు రన్నరప్ సహా సెమీఫైనలిస్ట్లు, క్వారర్ ఫైనలిస్ట్‌లు, గ్రూప్ దశలో వెనుదిరిగే జట్లకు అందించే ప్రైజ్‌మనీ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2022 ఫిఫా ప్రపంచకప్ విజేత అర్జెంటీనాఅయితే 1998 వరకు ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ సాధారణంగానే ఉండేది. అయితే 1998 ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రైజ్‌మనీ విలువ భారీగా పెరిగిపోయింది. ప్రస్తుత ఫిఫా వరల్డ్‌కప్‌లో మొత్తం ప్రైజ్‌మనీ విలువ 655 మిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 6 వేల కోట్లకు పైమాటే). 2022 ఫిఫా ప్రపంచకప్‌తో పోలిస్తే ప్రైజ్‌మనీ విలువ దాదాపు 50శాతం పెరగడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నీగా పిలవబడే ఈవెంట్ అయిన ఫిఫా ప్రపంచకప్‌తో క్రికెట్లో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌తో పోల్చలేమని క్రీడా పండితులు పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీలో టీ20 ప్రపంచకప్ ప్రైజ్‌మనీ సగం కూడా తూగదు. ఎందుకంటే ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో 17 నుంచి 32 స్థానాల్లో నిలిచే జట్లకు అందించే 11 మిలియన్ డాలర్లే ఐసీసీ టీ20 ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ విలువ కావడం గమనార్హం. 2026 టీ20 ప్రపంచకప్ విజేత భారత్అందుకే ఐసీసీ టీ20 ప్రపంచకప్ విలువను ఫిఫా ప్రపంచకప్ విలువతో పోలిస్తే దాని కాలిగోటికి కూడా సరిపోదు. ఇక ఫిఫా ప్రపంచకప్ ప్రైజ్‌మనీ అయిన 655 మిలియన్ అమెరికా డాలర్లను టోర్నీలో చాంపియన్స్‌గా నిలిచే జట్టు నుంచి లీగ్‌లో ఆఖరి స్థానంలో నిలిచే జట్లకు ఎలా పంచుతారనేది ఇప్పుడు తెలుసుకుందాం.ఫిఫా ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ: 655 మిలియన్ డాలర్లుచాంపియన్స్: 50 మిలియన్ డాలర్లురన్నరప్: 33 మిలియన్ డాలర్లుమూడు, నాలుగు స్థానాలు: 27 మిలియన్ డాలర్లు5 నుంచి 8వ స్థానం : 19 మిలియన్ డాలర్లు9 నుంచి 16వ స్థానం: 15 మిలియన్ డాలర్లు17 నుంచి 32వ స్థానం: 11 మిలియన్ డాలర్లు 33 నుంచి 48వ స్థానం: 9 మిలియన్ డాలర్లు. దీనికి అదనంగా అర్హత సాధించిన ప్రతీ జట్టుకు సన్నాహక ఖర్చుల కింద మరో 1.5 మిలియన్ డాలర్లు అదనంగా లభిస్తాయి.మరోవైపు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మొత్తం ప్రైజ్‌మనీ విలువ 11.25 మిలియన్ డాలర్లు.చాంపియన్స్ (భారత్): 2.6 మిలియన్ డాలర్లురన్నరప్ (న్యూజిలాండ్): 1.42 మిలియన్ డాలర్లుమూడో స్థానం (దక్షిణాఫ్రికా): 1 మిలియన్ డాలర్లునాలుగో స్థానం (ఇంగ్లండ్): 974,423 డాలర్లు5 నుంచి 8వ స్థానం వరకువెస్టిండీస్ - 538,269 డాలర్లుపాకిస్తాన్ - 522,692 డాలర్లుజింబాబ్వే - 491,538 డాలర్లుశ్రీలంక - 475,962 డాలర్లుచదవండి: చతికిలపడ్డ బాలీవుడ్ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!
టీమిండియా యువ సంచలనానికి బంపరాఫర్
తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో అద్భుత ప్రదర్శనతో (7 వికెట్లు) ఆకట్టుకున్న టీమిండియా యువ సంచలనం మానవ్ సుతార్‌కు ఊహించని అవకాశం లభించింది. అరంగేట్రంలోనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన ఇచ్చిన అతడితో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లోని ప్రముఖ జట్టైన వార్విక్షైర్ రెండు కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్‌ల ఒప్పందం చేసుకుంది.సుతార్‌కు ఈ డీల్ చాలా లక్కీగా పరిగణించబడుతోంది. టీమిండియా భవిష్యత్ ఇంగ్లండ్ పర్యటనల్లో అతడికి ఈ అనుభవం చాలా పనికొస్తుంది. స్పిన్నర్లకు పెద్దగా సహకరించని ఇంగ్లండ్ పిచ్‌లపై సుతార్ తన బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవచ్చు. ఇంగ్లండ్‌లో రాణిస్తే సుతార్ భవిష్యత్తుకు తిరుగుండదు.అశ్విన్ రిటైర్మెంట్, జడేజా తరచుగా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం భారత టెస్ట్ జట్టుకు విదేశీ పరిస్థితుల్లో స్థిరమైన స్పిన్నర్ అవసరం చాలా ఉంది. ఈ నేపథ్యంలో సుతార్ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అనుభవం సాధించడం టీమిండియాకు చాలా ఉపయోగపడుతుంది.దేశీయ క్రికెట్లో అత్యుత్తమ ట్రాక్ రికార్డు (30 మ్యాచ్‌ల్లో 136 వికెట్లు) కలిగిన సుతార్.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌తో టీమిండియా అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ స్పెల్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా భారత్ వైపుకు తిప్పింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ సుతార్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ మరో వికెట్ సాధించాడు. మొత్తంగా అరంగేట్ర టెస్ట్‌లో 7 వికెట్లు తీసి, భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకుగానూ అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది.
బిగ్ అనౌన్స్మెంట్..!
భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్లో కొత్త మలుపు తీసుకురావచ్చని భావిస్తున్న ఓ ప్రతిపాదన ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ ఫ్రాంచైజీ టి20 లీగ్ అయిన బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లను తొలిసారిగా భారత్‌లో నిర్వహించే దిశగా ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదన నిజమైతే, ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది ఓ కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.ఈ ప్రణాళికలో భాగంగా చెన్నై నగరం ప్రధాన వేదికగా పరిశీలనలో ఉన్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఐకానిక్ క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన చిదంబరం స్టేడియంను ఓ ప్రత్యేక బీబీఎల్ రెగ్యులర్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వడానికి అనుకూలమైన వేదికగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ విషయమై గత కొన్ని నెలలుగా క్రికెట్ ఆస్ట్రేలియా , బీసీసీఐ మరియు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మధ్య అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం.తాజాగా ఈ అంశానికి అధిక ప్రాధాన్యత లభించడానికి కారణం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారని వస్తున్న వార్తలు. ఆ పర్యటనలో మోదీ బిగ్‌బాష్ లీగ్ భారత ఎంట్రీపై "గ్రౌండ్ బ్రేకింగ్" ప్రకటన చేస్తారని అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. అలాగే భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాలపై పలు సానుకూల ప్రకటనలు చేస్తారని సమాచారం.ఒకవేళ బిగ్‌బాష్ లీగ్ భారత ఎంట్రీ ప్రాజెక్ట్ సాకారమైతే, అంతర్జాతీయ టీ20 లీగ్‌లు పరస్పర దేశాల్లో మ్యాచ్‌లు నిర్వహించే కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. అయితే ఈ ప్రతిపాదనకు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా భారత ఆటగాళ్లు విదేశీ లీగ్‌లలో పాల్గొనడంపై ఉన్న పరిమితులు, ఐపీఎల్ షెడ్యూల్‌తో సర్దుబాటు, ప్రసార హక్కుల పంపకం, లాజిస్టిక్స్ వంటి అంశాలు పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
న్యూస్ పాడ్‌కాస్ట్
నేడు విశాఖకు వైఎస్ జగన్మోహన్రెడ్డి... స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు పరామర్శ
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. తొమ్మిది మంది మృతి... ఆరుగురికి తీవ్ర గాయాలు
విష ప్రచారం చేయడం దుర్మార్గం.. మేం రైతులం కాదా?... సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఉండవల్లి రైతుల ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న అక్రమాల రాకెట్
మనోడే.. ఇచ్చేద్దాం. ‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్్సకు పోలవరం పనులు
ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల రాక్షస పాలనపై రణభేరి.. రాష్ట్రవ్యాప్తంగా కదంతొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్.
అమరావతి రైతులకు అండగా ఉంటాం... వైఎస్సార్సీపీ తరఫున లీగల్ ప్యానెల్ ఏర్పాటు... రాజధాని గ్రామాల రైతులకు వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా
చంద్రబాబు సర్కారుపై సమరభేరి. డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువతరం. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి
ఐపీఎల్ బాద్షా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై జయకేతనం
బిజినెస్
రిలయన్స్, మెటా.. మెగా ప్రాజెక్టు
ప్రపంచ సాంకేతిక దిగ్గజం మెటా, దేశీయ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంయుక్తంగా భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. గ్లోబల్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా భారత్‌ను నిలబెట్టే క్రమంలో మెటా సంస్థ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో నిర్మిస్తున్న మొట్టమొదటి ‘బిల్ట్-టు-సూట్’(కస్టమైజ్డ్) డేటా సెంటర్ ఇదే కావడం విశేషం.ప్రాజెక్టు ముఖ్యాంశాలుప్రాథమికంగా 168 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నిర్మాణం కానుంది. భవిష్యత్తులో దీనిని మరింత విస్తరించే అవకాశం ఉంది.రాబోయే రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.డేటా సెంటర్ డిజైన్, నిర్మాణం, యుటిలిటీల నిర్వహణ, నెట్వర్క్ కనెక్టివిటీ, మేనేజ్డ్ సర్వీసెస్ వంటి అన్ని బాధ్యతలను రిలయన్స్ గ్రూప్ నిర్వహించనుంది.ఈ డేటా సెంటర్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనంతో పనిచేస్తుంది. అంతేకాకుండా, ప్లాంట్ శీతలీకరణ (కూలింగ్) కోసం లవణరహితం(ఉప్పు తొలగించిన) చేసిన సముద్రపు నీటిని ఉపయోగించనున్నారు.జామ్‌నగర్ ఎంపికకు గల కారణాలువ్యూహాత్మకంగా జామ్‌నగర్ ఈ ప్రాజెక్టుకు అత్యంత అనుకూలమైన ప్రాంతంగా నిలిచింది. పారిశ్రామికంగా అనుకూలమైన వాతావరణం, మెరుగైన పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి లభ్యతతో పాటు సముద్రగర్భ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లకు ఇది సమీపంలో ఉంది. దీనికి తోడు జియోకు చెందిన విస్తృతమైన ఫైబర్ నెట్వర్క్ ఈ డేటా సెంటర్‌కు అదనపు బలాన్ని చేకూర్చనుంది.‘మెటాతో కుదిరిన ఈ భాగస్వామ్యం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టం. గ్లోబల్ టెక్నాలజీ లీడర్ మెటాతో కలిసి ఇలాంటి అధునాతన డేటా సెంటర్‌ను నిర్మించడం, ప్రపంచ ఏఐ విప్లవానికి నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధంగా ఉందనే సంకేతాన్ని ఇస్తోంది. జామ్‌నగర్ ఇకపై గ్లోబల్ హైపర్‌స్కేల్ ఏఐ కంప్యూటింగ్‌కు ప్రధాన కేంద్రంగా మారుతుంది’ అని ముకేష్ అంబానీ అన్నారు.‘భారతదేశంలో మా మొదటి ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను నిర్మించడానికి రిలయన్స్‌తో చేతులు కలపడం మాకు గర్వకారణం. జామ్‌నగర్‌లోని ఈ ప్రపంచ స్థాయి ఫెసిలిటీ ద్వారా మా ఏఐ మౌలిక సదుపాయాలను విస్తరించడానికి సహాయపడుతుంది. అలాగే భారత ఆర్థిక వ్యవస్థలో మా దీర్ఘకాలిక పెట్టుబడులను మరింత బలోపేతం చేస్తుంది’ అని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.ఇదీ చదవండి: హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!
హ్యాట్రిక్ తగ్గింపు.. మళ్లీ ఈ సమయం రాదేమో!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
గ్రీన్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:29 సమయానికి నిఫ్టీ(Nifty) 87 పాయింట్లు పెరిగి 23,327 వద్దకు చేరింది. సెన్సెక్స్(Sensex) 358 పాయింట్లు ఎగబాకి 74,274 వద్ద ట్రేడవుతోంది.అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 99.97బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 92.1 డాలర్లుయూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.54 శాతానికి చేరాయి.గడిచిన సెషన్లో యూఎస్ ఎస్ అండ్ పీ 0.26 శాతం పడిపోయింది.నాస్డాక్ 0.97 శాతం తగ్గింది.Today Nifty position 10-06-2026(time: 09:29 am)(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
ఇన్ఫోసిస్‌లో అసెస్మెంట్ పరీక్షలు వాయిదా!
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీలో ప్రతిష్టాత్మకమైన స్పెషలిస్ట్ ప్రోగ్రామర్, డిజిటల్ సిస్టమ్స్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం జరగాల్సిన ఆన్లైన్ నియామక పరీక్షలు, వ్యక్తిగత అసెస్మెంట్లను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించింది.అక్రమాల గుర్తింపుతోనే బ్రేక్!ఇటీవల నిర్వహించిన మూల్యాంకన ప్రక్రియలో అభ్యర్థుల ప్రవర్తనకు సంబంధించి కొన్ని అవకతవకలు, దుర్వినియోగం జరిగినట్లు కంపెనీ అంతర్గత తనిఖీల్లో వెల్లడైంది. నియామక ప్రక్రియలో వక్రీకరణలు చోటుచేసుకున్నాయన్న నివేదికల నేపథ్యంలో పరీక్షల విధానాన్ని కాపాడేందుకు ఇన్ఫోసిస్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. బాధిత అభ్యర్థులందరికీ ఇప్పటికే ఈ వాయిదా సమాచారాన్ని ఈమెయిల్స్ ద్వారా చేరవేసినట్లు స్పష్టం చేసింది. సవరించిన కొత్త అసెస్మెంట్ షెడ్యూల్స్ ఖరారు కాగానే అభ్యర్థులకు మళ్లీ సమాచారం అందిస్తామని కంపెనీ పేర్కొంది. ‘ఈ తాత్కాలిక వాయిదా వల్ల మా నియామక కట్టుబాట్లకు ఎలాంటి ఆటంకం కలగదు. అగ్రశ్రేణి ప్రతిభావంతులను గుర్తించడం, వారికి సరైన అవకాశాలు కల్పించి పెంపొందించడంపైనే మా పూర్తి దృష్టి ఉంది’ అని ఇన్ఫోసిస్ అధికారిక ప్రకటనలో తెలిపింది.క్యాంపస్ రిక్రూట్మెంట్లు యథాతథం..కొన్ని వార్తా సంస్థల నివేదిక ప్రకారం.. ఈ పరీక్షల వాయిదా ప్రభావం కంపెనీ దూకుడుగా చేపడుతున్న క్యాంపస్ సెలక్షన్లపై పడబోదని తెలుస్తుంది. ఇన్ఫోసిస్ తన నియామక లక్ష్యాలను యథాతథంగా కొనసాగించనుంది. అయితే ఈ అంశంపై అధికారికంగా మరింత స్పష్టత రావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ సుమారు 20,000 కంటే ఎక్కువ మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా అదే స్థాయి లక్ష్యంతో ముందుకు సాగుతోంది.ఇదీ చదవండి: కాలం కరిగేలోపే.. కలల నిధిని గెలిచేద్దాం!
ఫ్యామిలీ
ఊరి ఆడబిడ్డల సందడి.. వినూత్న సమ్మేళనం
బెజ్జంకి (సిద్దిపేట): పూర్వ విద్యార్థుల సమ్మేళనం మాదిరి.. ఊరి ఆడబిడ్డలంతా సందడి చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లె రెడ్డి ఆడబిడ్డలు వినూత్న వేడుకను జరుపుకొన్నారు. గ్రామంలో పుట్టిపెరిగిన మహిళలు.. పెళ్లై అత్తారింటికి వెళ్లిన ఆడబిడ్డలతో పాటు వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన యువతులు ఆదివారం గ్రామంలో ఆడబిడ్డల సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలోని యువతులకు ఈగ్రామ ఆడబిడ్డలను పరిచయం చేసేందుకే ఈకార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సుమారు 60 మంది వరకు మహిళలు పాల్గొన్నారు.
చాయ్-ఇడ్లీ కలిపి తినకూడదా..? కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఏమన్నారంటే..
దక్షిణ భారతదేశంలో చాలామందికి చాయ్ తోపాటు ఏదో ఒకటి ముంచుకునే తినే అలవాటు ఉంది. అలాంటి వాటిలో ఈ చాయ్ ఇడ్లీ కలిపి తినడం అనేది కూడా ఒకటి. అయితే ఇలా తినొచ్చా అంటే..ఇటీవల సోషల్ మీడియాలో చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట హాట్‌టాపిక్‌గా మారి చర్చలకు తెరతీసింది. ఆ పోస్ట్‌పై సీనియర్ కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ..ఆయన ఆ పోస్ట్‌లో షేర్ చేసిన ఫోటోలో.. చాయ్ ఇడ్లీ కనిపించిన విధం గురించి మాట్లాడారు. ఆ చిత్రంలో ఇడ్లీ పసుపు వర్ణంలో చాలా గట్టిగా ఉన్నట్లుగా కనిపిస్తుందన్నారు. "బహుశా అందుకే ఇలా చాయ్ ఇడ్లీ కాంబినేషన్ సూపర్ అంటున్నారేమె. మాములుగా ఆ ఇడ్లీని తినడం కష్టం..ఇలా గట్టిదైతే వేడివేడి చాయ్‌లో ముంచుకుంటే సులభంగా నోటిలో కరిగిపోతుంది. అందుకు ఇలా అభిప్రాయ పడి ఉండొచ్చు. కానీ ఇడ్లీ అనేది మల్లెపువ్వుతా స్పాంజ్‌లా ఉండాలి. అలాంటి ఇడ్డీని కచ్చితంగా చాయ్‌లో ముంచి తినడం అంత ఈజీ కాదు. ఆయన చివరికి చెప్పేందేంటంటే..ఆ రెండింటిని వేర్వేరుగా ఆస్వాదించడమే మంచిదన్నారు." ఇడ్లీని చాయ్‌లో ముంచడం కంటే ఇడ్లీ తినేశాక చాయ్ తీసుకుంటే బెటర్ అని అన్నారు. తాను బ్రేక్‌ఫాస్ట్ లేదా భోజనం చేశాకే టీ తాగడానికి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. అలాగే తనకు చాయ్ అంటే మహా ఇష్టమని, ఇక అల్పాహారంలో ఇడ్లీ అంటే చాలా ఇష్టంగా తింటానని అన్నారు. నిపుణులు ఏం అంటున్నారంటే..టీ తాగేటప్పుడు తినే కొన్ని రకాల స్నాక్స్, ఆహారాల కాంబినేషన్ మంచిదికాదంటున్నారు. ముఖ్యంగా ఇడ్లీలు, బిస్కెట్ల కాంబినేషన్‌తో చాయ్ తాగడం అస్సలు మంచిది కాదనే చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా టీ కాంబినేషన్‌తో తింటే అరుగుదల,జీర్ణాశయం సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అంతేగాదు కడుపు ఉబ్బరం, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు వస్తాయని అంటున్నారు. పైగా మెటబాలిజం కూడా నెమ్మదించి అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇవే కాదు మరే ఇతర పోషకమైన వాటిని కూడా చాయ్ కాంబినేషన్‌తో వద్దనే అంటున్నారు. దానివల్ల ఆయా పోషకాలు శరీరానికి సరిగా అందవని అంటున్నారు. అందువల్ల కాస్త విరామం ఇచ్చి వేర్వేరుగా తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.Oh, I see what you're doing here! Aside from provoking me, that is.I have to be honest: that idli looks a bit too solid and dense for my liking. And the discolouration in the pic is not very appetising. There’s something about a perfectly soft, snowy-white, fluffy idli that… https://t.co/O9GsGAGPa6— Shashi Tharoor (@ShashiTharoor) June 7, 2026 (చదవండి: 145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..)
145 కేజీల నుంచి 90 కేజీలకు..! ఆ ఏడు ఆహారాలు..
బరువు తగ్గడం అంటే కేలరీల లోటు, జిమ్‌లో ఎక్కువ గంటలు గడపడం వంటివి మాత్రమే అనుకుంటాం. కానీ దాంతోపాటు ఇతర మార్పులు కూడా తప్పనిసరి. ముఖ్యంగా జీవనశైలిలోని ఆహారపు అలవాట్లే అత్యంత ప్రధానం. తీసుకునే ఆహారం పోషకవంతమైనది, బరువు అదుపులో ఉంచేది తీసుకుంటే అద్భుతాలు సృష్టించొచ్చు అని అంటోంది ఈ ముంబై ఇన్ఫ్లుయెన్సర్. ఆమె ఒకప్పుడు ఏకంగా 145 కేజీల పైనే బరువు ఉండేదాన్ని అని తెలిపింది. ఇప్పుడు ఏకంగా 55 కేజీల బరువు తగ్గి నాజుగ్గా మారానని, అందుకోసం ఆ ఏడు ఆహారాలను తీసుకుంటున్నానంటూ తన వెయిట్‌లాస్ సీక్రెట్‌ని వెల్లడించారామె. మరి ఆ ఆహారాలేంటో సవివరంగా తెలుసుకుందామా..!.ముంబై ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ డాలీ సుమారు 145 నుంచి 90 కేజీ బరువు తగ్గేందుకు చేసిన ఆ ఏడు ఆహార మార్పుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఆ పోస్ట్‌లో తాను చేసిన ఈ ఆహారపు మార్పులు అదనపు కేలరీలను తగ్గించి..వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడిందని నమ్మకంగా చెబుతోందామె. మరి అవేంటంటే..చక్కెర పానీయాలుడాలీ చక్కెర పానీయాలను పూర్తిగా దూరంగా ఉన్నట్లు తెలిపింది. ఈ చక్కెర పానీయాలను అధికంగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు శరీరంలోకి చేరి, బరువు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. దానికి బదులుగా, తాను నిమ్మరసం, కొబ్బరి నీరు, చక్కెర లేని గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను తీసుకున్నట్లు డాలీ వెల్లడించింది. తెల్ల రొట్టె(మైదాతో చేసేవి)శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచి, అతిగా తినడానికి దారితీస్తుంది. కాబట్లి ఆమె తెల్ల రొట్టెను పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా ఆ ఇన్ఫ్లుయెన్సర్ గోధుమ రొట్టె, మల్టీగ్రెయిన్ బ్రెడ్, ఓట్స్‌ను తీసుకోవడం ప్రారంభించింది.చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్వాటిలో ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల ఆమె చిప్స్, ప్యాక్ చేసిన స్నాక్స్ తినడం మానేసినట్లు పేర్కొంది. దానికి బదులుగా ఆమె మితంగా వేయించిన మఖానా, వేయించిన శనగలు, నట్స్‌ను ఎంచుకుంది.ఫాస్ట్ ఫుడ్ఫాస్ట్ ఫుడ్‌లో కొవ్వు, ఉప్పు, కేలరీలు అధికంగా ఉండటం వల్ల దానిని పూర్తిగా తగ్గించేసింది. దానికి బదులుగా డాలీ పనీర్ శాండ్విచ్లు, గోధుమ కూరగాయల ర్యాప్‌లు లేదా ఇంట్లో తయారుచేసిన భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకుందామె.ఐస్ క్రీమ్ఐస్ క్రీమ్‌లో తరచుగా చక్కెర,కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానిని తన ఆహారం నుంచి తొలగించింది. గ్రీక్ యోగర్ట్, పండ్లు, ఫ్రోజెన్ బనానా స్మూతీలు లేదా చిన్న మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం ద్వారా ఆమె తన కోరికలను నియంత్రించుకుంది.మద్యంమద్యపానం డీహైడ్రేషన్‌కు, ముఖం ఉబ్బడానికి కారణమవుతుందని అందుకే తాను దానిని పూర్తిగా మానేసినట్లు తెలిపింది డాలీ. నిమ్మరసం కలిపిన సోడా నీరు, చక్కెర కలపని తాజా పండ్ల రసం, డిటాక్స్ వాటర్ ఆమె ఇష్టపడే ప్రత్యామ్నాయాలుగా మారాయి.ప్రాసెస్ చేసిన ఆహారాలుప్రాసెస్ చేసిన ఆహారాలలో తరచుగా సోడియం సంకలితాలు అధికంగా ఉంటాయి కాబట్టి వాటిని మానేశారు. దానికి బదులుగా, ఆమె గుడ్లు, టోఫు, పనీర్, పెరుగు, పప్పుధాన్యాలు, మొక్కల ఆధారిత ప్రోటీన్ వంటి సహజమైన ఆహార వనరులపై దృష్టి సారించింది.పైన చెప్పిన ఈ ఆహార పదార్థాలను పూర్తిగా తగ్గించి.. ఎక్కువ నీరు తీసుకుంటూ.. బాగా నిద్రపోండి. అలాగే మీరు నిర్దేశించుకున్న డైట్ క్రమం తప్పకుండా ఉండేలా చూసుకోమని సూచిస్తోంది. ఇలా చేస్తే కచ్చితంగా శరీరం వేగంగా నాజూకుగా మారుతుందంటూ తన పోస్ట్‌ని ముగించింది డాలీ.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: ఒక్క ఏడాదిలో 35 కిలోలు..!ఆ ఆరుబోరింగ్ అలవాట్లు..)
పప్పు కూర
చెన్నైకి చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ప్రతి శనివారం తిరుమలకి వచ్చి వెళ్ళడం అలవాటు. ఉదయమే చెన్నై నుంచి కారులో బయలుదేరి కొండకు చేరేవాడు. కొండ దిగేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా తాగేవాడు కాడు. కుదిరితే స్వామివారి దర్శనం చేసుకునే వాడు. కుదరకపోతే ప్రశాంతంగా గుడి ముందర కూర్చునేవాడు. పుష్కరిణి దగ్గరకు వెళ్ళి తలమీద నీళ్ళు చల్లుకునే వాడు. వరాహస్వామి దర్శనం చేసుకునే వాడు. ఆపైన బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నిలబడి ఆలయ గోపురానికి నమస్కరించే వాడు. కర్పూర హారతి ఇచ్చి కొండ దిగేసే వాడు. తిరుపతిలో అతడికి పిల్లనిచ్చిన అత్తగారు ఉన్నారు. కొండ దిగిన ప్రతిసారీ అత్తగారి ఇంటికి వెళ్లి ఆమె బాగోగులు తెలుసుకునేవాడు. అల్లుడు వచ్చిన ప్రతిసారీ ఇంటి పెరట్లో ఉన్న అరటి చెట్టులోని కొన ఆకు కోసి తను చేసిన వేడి వేడి వంటలు వడ్డించేది. పచ్చటి అరిటాకులో పప్పుకూర వడ్డించేది. ఘుమఘుమలాడే నెయ్యి కూడా వేసేది. వెళ్ళిన ప్రతిసారీ ఆమె పప్పుకూరే చేసేది. ఎందుకంటే ఆమె పప్పు కూర మాత్రమే బాగా చేయగలదు. ఎంతో రుచిగా ఉన్నప్పటికీ వారం వారం పప్పుకూర తినలేక అల్లుడికి విసుగు వచ్చింది. ఒకరోజు ఏడుపు ముఖం పెట్టి ‘‘అత్తా, ఎప్పుడూ పప్పు కూరేనా? తినాలంటే మొహం మొత్తుతోంది’’ అన్నాడు. ఆమె నవ్వింది.‘‘అల్లుడూ... పప్పుకూర సరే, పదేళ్ళుగా తిరుమల వచ్చి వెళ్తున్నావు. గుడిలోని స్వామి అప్పుడూ, ఇప్పుడూ ఒక్కరే కదా... ఏ మాత్రం మార్పు లేదు కదా, నీకెప్పుడూ స్వామిని ‘చూసింది చాల్లే’ అనిపించలేదా?’’ అని అడిగింది.అతడు నవ్వాడు.‘‘స్వామిని చూడటం ‘చాలు’ అనిపించదత్తా. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఎన్నిసార్లు దర్శించినా తనివి తీరదు. కొండకి వచ్చిన ప్రతిసారీ దర్శనం చేసుకుని బంగారు వాకిలి దాటి వచ్చేలోగా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఏమిటో ఈ మాయ’’ అంటూ చేయి కడిగాడు. అత్త తాను చేసిన పప్పు కూర కొద్దిగా గిన్నెలో పెట్టి కూతురికిమ్మనిచెప్పింది. అలాగేనని తల ఊపి ‘రాకుండా ఉండలేను నీ కొండకు... చూడకుండా ఉండలేను ఏ నాటికీ’ అని పాడుకుంటూ చెన్నైకి బయలుదేరాడు. ఆ రోజునుంచి అత్త ముందు పప్పు కూర మాట ఎత్తలేదు అల్లుడు.– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
అంతర్జాతీయం
అమెరికా పౌరసత్వం రద్దు.. ఎవరీ నీరజ్ శర్మ?
న్యూఢిల్లీ: ట్రంప్ ప్రభుత్వం అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో పౌరసత్వాల రద్దు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. మోసపూరిత పద్ధతుల్లో, తప్పుడు సమాచారంతో అమెరికా పౌరసత్వం పొందిన 17 మంది పౌరులను లక్ష్యంగా చేసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది. ఈ జాబితాలో న్యూజెర్సీకి చెందిన భారతీయ సంతతి వ్యాపారవేత్త, మాజీ సీఈఓ నీరజ్ శర్మ (50) పేరు ఉండటం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.వీసా మోసం.. ఫోర్జరీ భారత్‌లో జన్మించిన నీరజ్ శర్మ, ‘మాగ్నానివిజన్ ఎల్ఎల్సీ’ అనే ఐటీ స్టాఫింగ్ కంపెనీని నిర్వహిస్తూ విదేశీ ఉద్యోగుల తరపున హెచ్-1బీ వీసా పిటిషన్లను దాఖలు చేసేవారు. ఒక ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలో ఈ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నట్లు చూపుతూ.. ఆయన 11 నకిలీ హెచ్-1బీ పిటిషన్లను సమర్పించారని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ దరఖాస్తుల కోసం సదరు సంస్థ ఎగ్జిక్యూటివ్‌ల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ పత్రాలను కూడా సృష్టించినట్లు తేలింది. ఈ మోసం 2015 నుండి 2017 మధ్య కాలంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు.పౌరసత్వం రద్దుకు దారితీసిన అబద్ధం నీరజ్ శర్మ డిసెంబర్ 2017లో అమెరికా పౌరసత్వం పొందారు. అయితే పౌరసత్వ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా ఆయన .. తాను ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, ప్రభుత్వ అధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన వీసా మోసం కేసులో దోషిగా తేలారు. తాజా కోర్టు ఫైలింగ్స్ ప్రకారం.. పౌరసత్వ అర్హతను దెబ్బతీసే తన నేరపూరిత ప్రవర్తనను శర్మ ఉద్దేశపూర్వకంగా దాచారని న్యాయ శాఖ వాదిస్తోంది. మోసపూరిత సమాచారంతో పొందిన పౌరసత్వాన్ని చట్టప్రకారం రద్దు చేయాలని అమెరికా ప్రభుత్వం పట్టుబడుతోంది.ట్రంప్ సర్కార్ వేటలో మరికొందరు అమెరికా ప్రభుత్వం కేవలం వలసల మోసాలకే పరిమితం కాకుండా.. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని కూడా ఏరివేస్తోంది. ఈ 17 మంది జాబితాలో చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, మనీలాండరింగ్, వైర్ ఫ్రాడ్, డ్రగ్స్ వంటి ఘోరమైన నేరాలకు పాల్పడి పౌరసత్వం పొందిన వారు ఉన్నారు. వీరిలో ఒక హైతీ వలసదారుడు, కొలంబియాకు చెందిన మాజీ క్యాథలిక్ ప్రీస్ట్, మెక్సికోకు చెందిన వ్యక్తితో పాటు మాజీ యుగోస్లావ్ పౌరుడు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.ఇది కూడా చదవండి: సైనికులకు ఘోర అవమానం: సాయంత్రం ఐదుకు బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా..
ఆశలన్నీ ఇంక ఆ నలుగురి మీదే!
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మరో ముందడుగు వేసింది. దశాబ్దాల తర్వాత చంద్రుడిపైకి మనుషుల్ని దింపాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ఆర్టిమిస్ మిషన్‌కు సంబంధించిన ఓ ప్రకటన చేసింది. ఆర్టెమిస్-3 మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించింది. భవిష్యత్‌లో చంద్రుడిపై మానవుల శాశ్వత ఉనికికి బాటలు వేసే కీలక మిషన్ ఇది. అలాంటప్పుడు ఈ నలుగురినే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ ఇప్పుడు జోరందుకుంది. నాసా ఎంపిక చేసిన ఈ బృందంలో కమాండర్ రాండీ బ్రెస్నిక్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన పైలట్ లూకా పార్మిటానో, నాసా వ్యోమగాములు ఫ్రాంక్ రూబియో, ఆండ్రే డగ్లస్ ఉన్నారు. ఇందులో ఆండ్రే డగ్లస్‌ను మినహాయిస్తే మిగతా ముగ్గురు అంతరిక్షయానం చేసి ఉన్నారు. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించిన అనుభవం, టెస్ట్ పైలటింగ్ నైపుణ్యాలు, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరిని ఎంపిక చేసినట్లు నాసా వెల్లడించింది. అలాగని వాళ్ల బ్యాక్గ్రౌండ్లు ఆషామాషీగా లేవు.. రాండీ బ్రెస్నిక్: మిషన్‌కు సారథిఆర్టెమిస్-3 కమాండర్‌గా ఎంపికైన రాండీ బ్రెస్నిక్ నాసాలో అత్యంత అనుభవజ్ఞులైన వ్యోమగాముల్లో ఒకరు. అమెరికా మెరైన్ కార్ప్స్ మాజీ పైలట్ అయిన ఆయన వేల గంటలపాటు యుద్ధ విమానాలను, టెస్టింగ్ ఫ్లైట్స్ నడిపారు. ఇప్పటికే రెండు అంతరిక్ష ప్రయాణాలు పూర్తి చేసిన ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కమాండర్‌గా కూడా సేవలందించారు. పలు స్పేస్‌వాక్‌లలో పాల్గొని అంతరిక్షంలో క్లిష్టమైన పనులను విజయవంతంగా పూర్తి చేశారు. దీర్ఘకాలిక మిషన్ల నిర్వహణలో ఆయన అనుభవమే ఆర్టెమిస్-3లో ప్రధాన బలంగా భావిస్తున్నారు.లూకా పార్మిటానో: యూరప్ అంతరిక్ష వీరుడుఇటలీకి చెందిన లూకా పార్మిటానో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) తరఫున ఈ బృందంలో చోటు దక్కించుకున్నారు. మాజీ ఫైటర్ పైలట్ అయిన ఆయన ఇప్పటికే రెండు అంతరిక్ష యాత్రలు పూర్తి చేశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కమాండర్‌గా వ్యవహరించిన తొలి ఇటాలియన్గా రికార్డు సృష్టించారు. స్పేస్‌వాక్‌లలో విశేష అనుభవం ఉన్న ఆయన అంతరిక్షంలో సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆర్టెమిస్-3లో ఆయన ఎంపిక నాసా-యూరప్ అంతరిక్ష సహకారానికి ప్రతీకగా నిలుస్తోంది.ఫ్రాంక్ రూబియో: రికార్డు సృష్టించిన వ్యోమగామినాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో పేరు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి కారణం ఆయన అంతరిక్షంలో గడిపిన సమయం. అమెరికన్ వ్యోమగాముల్లో అత్యధిక కాలం నిరవధికంగా అంతరిక్షంలో ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. వైద్యుడిగా, సైనిక అధికారిగా సేవలందించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. మానవ శరీరంపై అంతరిక్ష ప్రభావాలను అధ్యయనం చేయడంలో ఆయన అనుభవం ఆర్టెమిస్-3 మిషన్‌కు ఎంతో ఉపయోగపడనుంది.ఆండ్రే డగ్లస్: ఇంట్రెస్టింగ్ఈ బృందంలో అత్యంత ఆసక్తికరమైన ఎంపిక ఆండ్రే డగ్లస్. ఇంజినీరింగ్, రోబోటిక్స్, మానవ-యంత్ర వ్యవస్థలపై నైపుణ్యం కలిగిన ఆయన చంద్రుడిపై భవిష్యత్ కార్యకలాపాల కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అంతరిక్ష ప్రయాణ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్ చంద్రయాత్రల సాంకేతిక రూపకల్పనలో ఆయన చేసిన కృషిని గుర్తించి నాసా ఈ బృందంలో చోటు కల్పించింది.అమెరికా-యూరప్ కలయికఆర్టెమిస్-3 బృందంలో ముగ్గురు అమెరికన్ వ్యోమగాములతో పాటు ఒక యూరోపియన్ వ్యోమగామికి చోటు కల్పించడం యాదృచ్ఛికం కాదు. చంద్రుడిపై భవిష్యత్ అన్వేషణలు ఒక్క దేశం ఆధిపత్యంలో కాకుండా అంతర్జాతీయ భాగస్వామ్యంతో సాగుతాయనే సందేశాన్ని నాసా ఇవ్వాలనుకుంటోంది. ఆర్టెమిస్ కార్యక్రమంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అందుకే లూకా పార్మిటానో ఎంపికకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.ఇది ట్రయల్ మాత్రమే!ఈ నలుగురి బాధ్యత చంద్రుడిపై అడుగుపెట్టడం మాత్రమే కాదు. భవిష్యత్‌లో చంద్రుడిపై మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం వంటి మహత్తర లక్ష్యాలకు అవసరమైన సాంకేతికతను పరీక్షించడం. అందుకే ఆర్టెమిస్-3 బృందాన్ని నాసా సాధారణ వ్యోమగాముల బృందంగా కాకుండా, మానవ అంతరిక్ష అన్వేషణ తదుపరి అధ్యాయాన్ని రాసే బృందంగా అభివర్ణిస్తోంది.ఇప్పటికే ఆర్టెమిస్-1 ద్వారా మానవరహిత పరీక్షా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన నాసా, ఆర్టెమిస్-2 ద్వారా వ్యోమగాములను చంద్రుడి చుట్టూ తిప్పి భూమికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆర్టెమిస్-3తో మరింత కీలక దశలోకి ప్రవేశిస్తోంది. కానీ, ఇక్కడో క్లారిటీ అవసరం. ఆర్టెమిస్-3 మనుషుల్ని చంద్రుడి మీదకు దించే యాత్ర కాదు. భవిష్యత్‌లో చంద్రుడిపై వ్యోమగాములను సురక్షితంగా దించేందుకు అవసరమైన అత్యంత కీలక సాంకేతిక ప్రక్రియలను పరీక్షించడమే దీని ప్రధాన లక్ష్యం. సుమారు రెండు వారాల పాటు కొనసాగే ఈ మిషన్‌లో వ్యోమగాములు భూమి కక్ష్యలోనే ఉండి చంద్రుడిపై దిగే ల్యాండర్లతో డాకింగ్ ప్రక్రియను సాధన చేస్తారు. భవిష్యత్ చంద్రయాత్రల్లో ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వాటికి సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మిషన్‌లో మరో ఆసక్తికర అంశం.. ప్రైవేట్ కంపెనీల పాత్ర. జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఒరిజిన్ అభివృద్ధి చేస్తున్న ‘బ్లూ మూన్’ ల్యాండర్, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ రూపొందిస్తున్న ‘స్టార్‌షిప్’ హ్యూమన్ ల్యాండింగ్ సిస్టమ్‌లతో ఈ వ్యోమగాములు డాకింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. భవిష్యత్ అంతరిక్ష యుగంలో ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు కలిసి ఎలా పనిచేయబోతున్నాయో ఈ మిషన్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలవనుంది. కాబట్టి.. నాసా "మూన్ ల్యాండింగ్‌కు ముందు ఫైనల్ రిహార్సల్"గా అభివర్ణిస్తోంది.అందుకే కీలకంఅంటే ఆర్టెమిస్-3 అనేది చంద్రయాత్రకు ముందు చివరి పరీక్ష. భవిష్యత్‌లో చంద్రుడిపై దిగే వ్యోమగాముల భద్రతకు అవసరమైన సాంకేతిక, శాస్త్రీయ సమాచారాన్ని నాసా సేకరిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్టెమిస్-3 బృందం ప్రకటన ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇప్పటివరకు డిజైన్, ఇంజినీరింగ్ దశలో ఉన్న మిషన్ ఇప్పుడు మానవ ప్రయాణానికి సిద్ధమవుతోందనే సంకేతం. 1972లో అపోలో-17 మిషన్ అనంతరం మానవుడు మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టలేదు. దాదాపు ఐదు దశాబ్దాల విరామం తర్వాత మానవులను తిరిగి చంద్రుడిపై దించాలన్న లక్ష్యంతో నాసా ఆర్టెమిస్ కార్యక్రమాన్ని చేపట్టింది. దీర్ఘకాలికంగా చంద్రుడిపై స్థిరమైన మానవ స్థావరాలు ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి అంగారక గ్రహ యాత్రలకు పునాది వేయడం నాసా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఆర్టెమిస్-3 కీలక మలుపుగా మారనుంది. ఈ మిషన్ విజయవంతమైతే 2028లో చేపట్టే ఆర్టెమిస్-4 ద్వారా మానవులు చంద్రుడిపై అడుగుపెట్టే మార్గం మరింత సుగమం కానుంది. అయితే.. ఈ నలుగురు ఆర్టెమిస్-3లో పాల్గొనే నలుగురే కావొచ్చు.. కాకపోవచ్చు. కానీ, నాసా ఆశలన్నీ ఇప్పుడు వీళ్లపైనే ఉన్నాయి.ఇంకా ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే, ఆర్టెమిస్-4లో నలుగురు వ్యోమగాములు చంద్ర కక్ష్యకు వెళ్తారు. వారిలో ఇద్దరు మాత్రమే ల్యాండర్లో చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి దిగుతారు. అక్కడ వారం రోజుల పాటు శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించి తిరిగి ఓరియన్ వ్యోమనౌకలో చేరతారు.:::సాక్షి వెబ్ ప్రత్యేకం
భారత్‌పై కన్నేసిన పాక్.. అసలు లక్ష్యమేంటి?
భారత్ టార్గెట్‌గా దాయాది దేశం పాకిస్తాన్ కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ గత 16 నెలల కాలంలో వరుసగా ఆరు భూ పరిశీలన (Earth Observation) ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. కాగా, పాక్ చర్యలు దక్షిణాసియా వ్యూహాత్మక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఉపగ్రహాలు వ్యవసాయం, ప్రకృతి విపత్తుల నిర్వహణ, భూవినియోగ మ్యాపింగ్ వంటి పౌర అవసరాల కోసం అని పాకిస్తాన్ ప్రకటిస్తున్నప్పటికీ, రక్షణ నిపుణులు ఇవి సైనిక నిఘా సామర్థ్యాన్ని కూడా పెంచగలవని విశ్లేషిస్తున్నారు.వేగంగా పాకిస్తాన్ అంతరిక్ష విస్తరణ.. గతంలో పరిమిత స్థాయిలో ఉన్న పాకిస్తాన్ అంతరిక్ష కార్యక్రమం ఇప్పుడు గణనీయంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా చైనా సాంకేతిక సహకారంతో భూ పరిశీలన, రిమోట్ సెన్సింగ్ రంగాల్లో పాకిస్తాన్ కొత్త ఉపగ్రహాలను అభివృద్ధి చేస్తోంది. ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాల్లో PRSC-EO1, PRSC-EO2, PRSC-EO3 వంటి ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవి భూమి ఉపరితల చిత్రాలను సేకరించి విశ్లేషించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే, భూ పరిశీలన ఉపగ్రహాలు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతూ ఉపరితల చిత్రాలు, భౌగోళిక సమాచారం, వాతావరణ మార్పులు, వ్యవసాయ పరిస్థితులు వంటి అంశాలను నమోదు చేస్తాయి. భద్రతా మరియు సరిహద్దు పర్యవేక్షణ కూడా చేయనున్నాయి. ఇక, అధునాతన సెన్సర్లు కలిగిన ఉపగ్రహాలు సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, వాహనాల కదలికలు వంటి అంశాలను కూడా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటాయి.భారత్‌ను గమనించే సామర్థ్యం ఎంత?నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ఉపగ్రహాలు భారత భూభాగం మీదుగా ప్రయాణించే సమయంలో చిత్రాలను సేకరించగలవు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలు, సైనిక స్థావరాలు, వాయుసేన కేంద్రాలు, వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను గుర్తించే అవకాశం ఉంది. ఇలా ఆయా ప్రాంతాలపై సమాచారం పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ ఉపగ్రహాలు 24 గంటలూ ఒకే ప్రాంతాన్ని ప్రత్యక్షంగా గమనించవు. అవి కక్ష్యలో తిరుగుతాయి. కాబట్టి ఒక ప్రాంతాన్ని నిర్దిష్ట వ్యవధుల్లో మాత్రమే చిత్రీకరించగలవు. అంతేకాకుండా.. భారత్ భౌగోళికంగా చాలా పెద్ద దేశం. దేశ విస్తీర్ణం సుమారు 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు. ఆరు ఉపగ్రహాలు ఉపయోగకరమైన సమాచారాన్ని అందించగలిగినా, మొత్తం దేశాన్ని ప్రతి క్షణం పర్యవేక్షించడం అసాధ్యం.సన్-సింక్రోనస్ కక్ష్య ప్రయోజనంపాకిస్తాన్ తాజా ఉపగ్రహాల్లో చాలా వరకు సన్-సింక్రోనస్ ఆర్బిట్‌లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కక్ష్య ప్రత్యేకతలు ఏంటంటే.. ప్రతిరోజూ ఒకే ప్రాంతాన్ని దాదాపు ఒకే సమయానికి చిత్రీకరించగలదు. భూమిపై మార్పులను పోల్చి చూడటం సులభం. సైనిక నిఘా, మ్యాపింగ్, పర్యావరణ అధ్యయనాలకు అనుకూలంగా ఉంటుంది.భారత్, పాక్ మధ్యలో చైనా..పాకిస్తాన్, చైనా మధ్య అంతరిక్ష సహకారం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది. పాకిస్తాన్‌కు చైనా ఉపగ్రహ సాంకేతికత, శిక్షణ, డేటా ప్రాసెసింగ్ మద్దతు ఇస్తోంది. దీంతో పాకిస్తాన్ సొంత అంతరిక్ష సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేసుకుంటోంది. మరోవైపు. అంతరిక్ష రంగంలో భారత్ ఇప్పటికే పాకిస్తాన్ కంటే ఎంతో ముందుంది. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు, రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాలు, కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, నావిగేషన్ వ్యవస్థలు, వ్యూహాత్మక నిఘా ఉపగ్రహాలు వంటి విస్తృత సామర్థ్యాలను అభివృద్ధి చేసింది. అదనంగా భారత్ తన సరిహద్దుల పర్యవేక్షణ కోసం మరింత పెద్ద ఉపగ్రహ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తోంది. కాగా, భారత్, పాకిస్తాన్ రెండూ తమ భద్రతా అవసరాల కోసం ఉపగ్రహ నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తున్నాయి.భవిష్యత్తు యుద్ధాల్లో ఉపగ్రహాల పాత్రప్రస్తుతం యుద్ధాలు కేవలం సైనికులపై ఆధారపడటం లేదు. టెక్నాలజీపై ఆధారపడి దాడులు జరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో కూడా ఉపగ్రహ సమాచారానికి అత్యంత ప్రాధాన్యం లభించింది.ఉపగ్రహాలతో ఇలా..క్షిపణుల మార్గదర్శనండ్రోన్ కార్యకలాపాలుకమ్యూనికేషన్నావిగేషన్లక్ష్యం గుర్తింపుగూఢచారి సమాచారం వంటి పనుల్లో కీలకం.
అపాచీ ఎఫెక్ట్.. ఇరాన్‌పై అమెరికా రివెంజ్ ఎటాక్స్!
పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతల వైపు అడుగులేస్తోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్మీ హెలికాప్టర్ ‘అపాచీ’ కూలిపోవడం.. దానిని ఇరాన్ కూల్చివేసిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా సైన్యం వైమానిక దాడులు ప్రారంభించింది. హర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో, అలాగే బందర్ అబ్బాస్, సిరిక్తో పాటు దక్షిణ ఇరాన్ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. ఇరాన్ గనుక మళ్లీ దాడులకు దిగితే.. ఈసారి గట్టిగా స్పందిస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇది ఆత్మరక్షణ కోసమేనని అంటోంది. ఇక ఈ దాడులకు ఇరాన్ కూడా స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ సైనిక బలగాలే ప్రమాదంలో ఉన్నాయంటూ ఓ ప్రకటన వెలువరించింది.ఒమన్ తీరంలో అమెరికా ఆర్మీకి చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కూలిపోయింది. హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం.. తొలిసారిగా సముద్రంలో డ్రోన్ బోట్ సహాయంతో వారిని రక్షించారు. ‘కోర్సెయిర్’ పేరుతో పనిచేసే ఈ డ్రోన్ నౌక ఇద్దరు సైనికులను సురక్షిత ప్రాంతానికి తరలించగా, అక్కడి నుంచి మరో హెలికాప్టర్ వారిని తీసుకెళ్లింది.ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మా అత్యాధునిక అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. మా సిబ్బంది క్షేమంగానే ఉన్నప్పటికీ, ఈ దాడికి అమెరికా తప్పనిసరిగా స్పందించాల్సిందే’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘ఇరాన్ అన్యాయమైన దాడికి ఇది ప్రతిస్పందన. అమెరికా సైనికుల రక్షణ, ప్రాంతీయ భద్రత కోసం చర్యలు చేపట్టాం’ అని పేర్కొంది. ఇదే సమయంలో హర్మజ్ జలసంధిలోని ఇరాన్ ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరానియన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే నష్టంపై అధికారిక వివరాలు వెలువడలేదు.అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, ‘హర్ముజ్ జలసంధి అమెరికా తీరాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మా భూభాగానికి సమీపంలో మోహరించిన విదేశీ బలగాలు తమ తప్పిదాలు, ప్రమాదాలు లేదంటే కాల్పుల మధ్య చిక్కుకోవడం వల్లే ప్రమాదాలకు గురవుతాయి. ప్రమాదాలను తగ్గించుకోవాలంటే వారు ఈ ప్రాంతం విడిచిపోవడం ఉత్తమ మార్గం’ అని వ్యాఖ్యానించారు.ఈ పరిణామాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రెండు నెలల క్రితం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మారలేదు. ఇదే సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ కాల్పులు చోటుచేసుకోవడం, లెబనాన్‌లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రెండు లేదా మూడు రోజుల్లో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించిన ఆయన.. హెలికాప్టర్ ఘటన తర్వాత మాత్రం కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా.. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి.హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గం కావడంతో తాజా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా ఘర్షణలు మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జాతీయం
ఒకే కశ్మీర్.. రెండు విభిన్న వాస్తవాలు!
శ్రీనగర్: నియంత్రణ రేఖ (LoC)కి ఇరువైపులా ఉన్న కశ్మీర్ ప్రాంతాల్లో ప్రస్తుతం పూర్తిగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో ప్రజలు ఆర్థిక సమస్యలు, అధిక ధరలు, విద్యుత్ చార్జీల పెంపు, రాజకీయ హక్కుల అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా.. మరోవైపు భారత జమ్మూ-కశ్మీర్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రైల్వే కనెక్టివిటీ, పర్యాటక అభివృద్ధి వేగంగా కొనసాగుతున్నాయి.పీవోకేలో ఇటీవల ముజఫరాబాద్, రావల్కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో నిరసనలు ఉధృతమయ్యాయి. పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, విద్యుత్ బిల్లుల భారం, పాలనాపరమైన సమస్యలపై ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. కొన్ని చోట్ల నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కాల్పులు జరిగినట్లు కూడా నివేదికలు వెల్లడించాయి. ఇంటర్నెట్ సేవల నిలిపివేత, పలువురిని అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలు కూడా తీసుకున్నట్లు సమాచారం.అదే సమయంలో భారత్‌వైపు జమ్మూ-కశ్మీర్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యంగా జోజిల్లా టన్నెల్ నిర్మాణంలో కీలక పురోగతి చోటుచేసుకుంది. కశ్మీర్, లడఖ్ వైపుల నుంచి తవ్వకాలు జరిపిన ఇంజినీర్లు భూగర్భంలో కలుసుకోవడంతో టన్నెల్ నిర్మాణంలో ముఖ్య దశ పూర్తయింది. 13.15 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గం పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్లలో ఒకటిగా నిలవనుంది.జమ్మూ-కశ్మీర్లో రైల్వే కనెక్టివిటీ కూడా గణనీయంగా మెరుగుపడుతోంది. చీనాబ్ రైల్వే వంతెన, ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టు, వందే భారత్ రైళ్ల ప్రారంభం వంటి కార్యక్రమాలు ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల పర్యాటకం, వ్యాపారం, ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతున్నాయి. పర్యాటక రంగంలో కూడా జమ్మూ-కశ్మీర్ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేస్తోంది. గుల్మార్గ్, పహల్గామ్, సోనమార్గ్ వంటి ప్రాంతాలకు భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తోంది. స్టార్టప్ రంగంలోనూ యువత ముందుకు వస్తుండగా, కొత్త పెట్టుబడులు ఆకర్షితమవుతున్నాయి.మొత్తంగా చూస్తే, ఎల్వోసీకి ఇరువైపులా ఉన్న కశ్మీర్ ప్రాంతాలు ప్రస్తుతం రెండు విభిన్న దిశల్లో సాగుతున్నట్లు కనిపిస్తున్నాయి. అక్కడి ప్రజలు ఆర్థిక, రాజకీయ సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా, భారత జమ్మూ-కశ్మీర్లో మౌలిక సదుపాయాల విస్తరణ, పెట్టుబడులు, పర్యాటకం, కనెక్టివిటీ అభివృద్ధి ప్రధానంగా కనిపిస్తున్నాయి. దీంతో "రెండు కశ్మీర్‌ల కథ" మరోసారి చర్చనీయాంశంగా మారింది.
సీఎం పదవి మళ్లీ మిస్: డీసీఎం
నాకు గతంలో 3 సార్లు సీఎం పదవి తప్పిపోయింది అని కొత్త డిప్యూటీ సీఎం పరమేశ్వర్ వాపోయారు. తుమకూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కావాలనే తన చిరకాల కోరిక ఇంకా అలాగే ఉందని ఉద్వేగానికి గురయ్యారు. 2013 ఎన్నికల్లో పార్టీ గెలిచినా, తాను ఓడిపోవడం వల్ల ముఖ్యమంత్రి పదవి తప్పిపోయిందని, ఆనాడు తాను గెలిచి ఉంటే సిద్ధరామయ్య సీఎం అయ్యేవారు కాదని తెలిపారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 స్థానాల్లో గెలుపొందినా మైత్రి సర్కార్ కారణంగా హెచ్డీ కుమారస్వామి సీఎం అయ్యారన్నారు. ఈసారి కూడా సీఎం పదవి తనకు రావాల్సి ఉన్నా, వివిధ రాజకీయ కారణాల వల్ల సాధ్యపడలేదని అన్నారు. ఇటీవల ఢిల్లీలో సీఎం పదవి ఇవ్వకపోతే వెంటనే చెప్పేయాలని, తనకు అవతల చాలా పనులు ఉన్నాయని హైకమాండ్‌కు చెప్పేశానన్నారు. -కర్ణాటక
టీఎంసీలో తిరుగుబాటు.. దీదీ నెత్తిన పాలు పోస్తున్న రాజ్యాంగ సవరణ!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ తిరుగుబాటు ప్రకంపనలు రేపుతోంది. పార్టీకి చెందిన సుమారు 20 మంది లోక్‌సభ సభ్యులు మమతా బెనర్జీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గంగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సంఖ్యాబలం చూస్తే ఇది దీదీకి భారీ ఎదురుదెబ్బలా కనిపిస్తున్నా.. చట్టపరంగా మాత్రం రెబల్స్‌కే షాక్ తగిలే పరిస్థితి ఉందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.లోక్‌సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. వారిలో 20 మంది తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. అయితే రెండు మూడొంతుల మంది ఎంపీలు ఉన్నారనే కారణంతోనే అనర్హత నుంచి రక్షణ లభించదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి రాజకీయ చీలికలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణ ఇప్పుడు మమతా బెనర్జీ వర్గానికే అండగా నిలుస్తోందని విశ్లేషిస్తున్నారు.ఒకప్పుడు రాజకీయ పార్టీల్లో చీలికలకు చట్టంలో కొంత వెసులుబాటు ఉండేది. శాసనసభ లేదంటే పార్లమెంట్లో మూడింట ఒక వంతు మంది సభ్యులు విడిపోయినా అనర్హత నుంచి రక్షణ పొందే అవకాశం ఉండేది. అయితే 2003లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణతో ఆ నిబంధనను పూర్తిగా తొలగించారు. అప్పటి నుంచి "స్ప్లిట్"(చీలిక) అనే భావనకు చట్టపరమైన గుర్తింపు లేదు. ఇప్పుడు రక్షణ పొందాలంటే "మెర్జర్"(విలీనం) మాత్రమే మార్గంగా మిగిలింది.అక్కడే టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు చిక్కులు మొదలవుతున్నాయి. ఎందుకంటే కేవలం ఎంపీలు విడిపోయి కొత్త బ్లాక్‌గా ఏర్పడితే అది విలీనంగా పరిగణించబడదు. పార్టీ సంస్థ మొత్తం మరో పార్టీలో విలీనం కావడం.. దానికి కనీసం రెండు మూడొంతుల మంది ప్రజాప్రతినిధులు అంగీకరించడం వంటి షరతులు నెరవేరినప్పుడే అనర్హత నుంచి రక్షణ లభిస్తుంది. లేదంటే పార్టీని స్వచ్ఛందంగా వీడినట్టుగా పరిగణించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఇదే కారణంగా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో మరో ప్రశ్న వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే అనుసరించిన వ్యూహాన్ని టీఎంసీ తిరుగుబాటు వర్గం అమలు చేయగలదా? శివసేన సంక్షోభంలో షిండే వర్గం కేవలం ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడమే కాదు.. తామే అసలైన శివసేన అని ప్రకటించి పార్టీ సంస్థపై హక్కు కోసం పోరాటం చేసింది. చివరకు ఎన్నికల సంఘం ముందు తమ వాదనను నిలబెట్టి పార్టీ పేరు, గుర్తుపై ఆధిపత్యం సాధించింది.టీఎంసీ తిరుగుబాటు వర్గం కూడా అదే దారిలో నడవాలంటే కేవలం ఎంపీల సంఖ్య సరిపోదు. పార్టీ సంస్థలో, రాష్ట్ర స్థాయి నిర్మాణాల్లో, జిల్లా కమిటీల్లో, ఇతర విభాగాల్లో తమకే మెజారిటీ మద్దతు ఉందని నిరూపించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే "అసలైన టీఎంసీ మాదే" అనే వాదనకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. లేదంటే ప్రత్యేక బ్లాక్‌గా ఏర్పడటం మాత్రమే జరిగితే అనర్హత ముప్పు తప్పకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.అంటే ప్రస్తుతం తిరుగుబాటు ఎంపీల ముందు రెండు మార్గాలే కనిపిస్తున్నాయి. ఒకటి.. చట్టబద్ధమైన విలీనం దిశగా అడుగులు వేయడం. రెండోది.. తామే అసలైన టీఎంసీ అని ప్రకటించి పార్టీపై హక్కు కోసం పోరాటం చేయడం. ఈ రెండింటిలో ఏదీ చేయకుండా కేవలం ప్రత్యేక వర్గంగా కొనసాగితే యాంటీ డిఫెక్షన్ చట్టం వారి మెడకు చుట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అందుకే రాజకీయ విశ్లేషకులు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేస్తున్నారు. బయటికి చూస్తే ఇది మమతా బెనర్జీకి ఎదురుదెబ్బలా కనిపించినా.. చట్టపరంగా చూస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు ఆమెకే అండగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు రాజకీయ చీలికలను ప్రోత్సహించకుండా తీసుకొచ్చిన 91వ రాజ్యాంగ సవరణే ఇప్పుడు టీఎంసీ తిరుగుబాటుదారులకు అతిపెద్ద అడ్డంకిగా మారిందని చెబుతున్నారు.మొత్తానికి టీఎంసీలో జరుగుతున్నది కేవలం ఎంపీల తిరుగుబాటు మాత్రమే కాదు. ఇది పార్టీపై హక్కు కోసం సాగబోయే పెద్ద రాజకీయ, న్యాయపోరాటానికి నాంది కావచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 20 మంది ఎంపీలు ఉన్నంత మాత్రాన చట్టం కళ్లలో రక్షణ లభించదు. "అసలైన టీఎంసీ ఎవరిది?" అనే ప్రశ్నకు సమాధానం దొరికే వరకు ఈ పోరాటం కొనసాగనుంది.
సైనికులకు ఘోర అవమానం: సాయంత్రం ఐదుకు బ్రేక్‌ఫాస్ట్.. ఇంకా..
న్యూఢిల్లీ: దేశ రక్షణలో, ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే భద్రతా దళాలకు రైల్వే ప్రయాణంలో నరకయాతన ఎదురైంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వేలాది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాము ప్రయాణించిన ఎన్నికల ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యం కావడమే కాకుండా, కనీస వసతులు లేక, సకాలంలో ఆహారం అందక జవాన్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) రైల్వే బోర్డుకు ఘాటుగా లేఖ రాశారు.25 గంటల ఆలస్యం.. సాయంత్రం ఐదింటికి టిఫిన్అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల విధుల కోసం మొత్తం 230 ప్రత్యేక రైళ్లను కేటాయించగా, అందులో దాదాపు 200 రైళ్లు తీవ్ర జాప్యంతో నడిచాయి. 150కి పైగా రైళ్లు 10 నుండి 15 గంటలు ఆలస్యంగా నడవగా, మరో 50 రైళ్లు ఏకంగా 20 నుండి 25 గంటల ఆలస్యంతో గమ్యస్థానాలకు చేరాయి. ఈ ఘోర జాప్యం వల్ల జవాన్ల భోజన ఏర్పాట్లు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఉదయం తినాల్సిన అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) కూడా జవాన్లకు సాయంత్రం 5 గంటల సమయంలో అందిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైళ్ల రాకపోకల సమయంపై స్పష్టత లేకపోవడంతో ఐఆర్సీటీసీ సైతం సకాలంలో ఆహారం అందించలేకపోయింది.కిక్కిరిసిన బోగీలు.. నిలవడానికీ లేని చోటురైళ్ల ఆలస్యమే కాకుండా, రైల్వే శాఖ కేటాయించిన బోగీల సంఖ్య కూడా జవాన్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. నిబంధనల ప్రకారం ప్రతి ఎన్నికల ప్రత్యేక రైలుకు 24 బోగీలు కేటాయించాలని సీఆర్పీఎఫ్ డిమాండ్ చేసింది. అయితే, రైల్వే శాఖ కేవలం 19 నుండి 20 బోగీలను మాత్రమే సమకూర్చింది. 10 నుండి 11 కంపెనీల జవాన్లు, వారి భారీ లగేజీ, ఇతర సామగ్రిని ఈ పరిమిత బోగీలలో సర్దడం అసాధ్యంగా మారింది.అపరిశుభ్రత.. మహిళా సిబ్బందికి తప్పని అవస్థలుదీనికి తోడు ప్రయాణంలో కనీస అవసరాలైన నీటి సరఫరా, బోగీల శుభ్రతను రైల్వే శాఖ పూర్తిగా విస్మరించింది. రైలు కాలపట్టిక (ఇటినెరరీ) ప్రకారం నిర్దేశిత స్టేషన్లలో బోగీలను శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ, అనేక చోట్ల ఆ పనులు చేయలేదు. ఫలితంగా బోగీలు అపరిశుభ్రంగా మారి, దుర్వాసనతో జవాన్ల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది ఈ అపరిశుభ్రత వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యలన్నింటినీ లేఖలో ప్రస్తావించిన సీఆర్పీఎఫ్, తిరుగు ప్రయాణంలోనైనా మెరుగైన ఏర్పాట్లు చేయాలని కోరగా.. దీనిపై స్పందించిన రైల్వే బోర్డు అధికారులు, లోపాలను సరిదిద్దుతామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: ముంపు గ్రామాల్లో ముత్యాల సాగుతో కాసుల వర్షం
ఎన్ఆర్ఐ
న్యూజిల్యాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్‌ని ఘనంగా సత్కరించారు.ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు.
భారత సంతతి విద్యార్థికి ప్రతిష్టాత్మక హెన్రీ ఫోర్డ్ II స్కాలర్ అవార్డు..!
భారత సంతతి విద్యార్థి అవని అహుజాకి ప్రతిష్టాత్మక హెన్నీ ఫోర్డ్II స్కాలర్ అవార్డుని గెలుచుకుంది. ఎంఐటీలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డుని సాధించిన ఎన్నారైగా ఘనత సృష్టించింది. అసాధారణమైన విద్యా ప్రతిభ, ఇంజనీరింగ్‌లలో బలమైన నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే సీనియర్ అండర్ గ్రాడ్యుయేట్లకు ఈ పురస్కారన్ని ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో ప్రతిష్టాత్మక ఎంఐటీ విద్యార్థుల ప్రత్యేక బృందంలో చేరారు. ఈ పురస్కారం ఇటీవల కోడే రీసెర్చ్ గ్రూప్‌లో ఆమె చేసి వర్క్ కెపాసిటివ్ వైర్లెస్ పవర్ ట్రాన్స్ఫర్ పరిశోధనకు గానూ లభించింది. ఈ సాంకేతికతను భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వైర్‌లెస్‌గా ఛార్జ్ చేయడానికి, శరీరంలో అమర్చే వైద్య పరికరాలకు శక్తిని అందించడానికి ఉపయోగించవచ్చు. ఈ మేరకు అవని మాట్లాడుతూ.."ఈ అవార్డును అందుకోవడం నాకు చాలా గౌరవంగా, ఆనందంగా ఉంది. ముఖ్యంగా డీన్ హామండ్‌ను కలవడం ఒక గొప్ప గౌరవం." అని అన్నారామె. నిజానికి హెల్త్‌కేర్ టెక్నాలజీలు, రోబోటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లలో పనిచేయగల సామర్థ్యమే, ఆమెను ఎంఐటీ అత్యంత ప్రతిభావంతులైన అండర్ గ్రాడ్యుయేట్ పరిశోధకులలో ఒకరిగా నిలబెట్టింది. అలాగే అవనికి అత్యంత ఆసక్తి ఉన్న రంగాలలో మహిళల ఆరోగ్య పరిశోధన ఒకటి. అంతేగాదు ఆమె రొమ్ము కేన్సర్ స్క్రీనింగ్‌ను మరింత సులభతరం చేయడానికి రూపొందించిన, ధరించగలిగే బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ ప్యాచ్‌కు సంబంధించిన పరిశోధనలలో కూడా కీలకపాత్ర పోషించారామె. తాను పీహెచ్డీ పూర్తి అయిన వెంటనే మహిళల ఆరోగ్య పరిశోధన రంగంలో పవర్ ఎలక్ట్రానిక్స్‌ను అన్వయించాలని చూస్తున్నట్లు తెలిపారు.(చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!)
NRI : అమెరికాలో రోడ్డు ప్రమాదం..
సాక్షి, హైదరాబాద్/మన్సూరాబాద్: మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ సతీమణి డాక్టర్ సుచియాష్కీ అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తమ చిన్న కుమార్తె డాక్టర్ గగనయాష్కీని బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్‌కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రమాద సమయంలో వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిందని, ఈ ప్రమాదంలో డాక్టర్ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోయాయని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. కాగా, మధుయాష్కీ కూడా అమెరికాలోనే ఉన్నారు. చిన్న కుమార్తె డాక్టర్ గగన న్యూయార్క్ మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, కాన్వొకేషన్‌కు హాజరయ్యేందుకు యాష్కీ దంపతులు అమెరికా వెళ్లారు.కుమార్తెను ఎండీ కోర్సులో జాయిన్ చేసి వచ్చే సమయంలో సుచి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వేరే కారులో మధుయాష్కీ కూడా ఉన్నారని, భార్యకు ప్రమాదం జరిగిన నేపథ్యంలో గురువారం ఇండియాకు రావాల్సిన యాష్కీ, అక్కడే ఉండిపోయారని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ ఫోన్లో మధుయాష్కీని పరామర్శించారు.
ఆటా సభలకు వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్‌కు వివరించారు.
క్రైమ్
భార్య, కుమారున్ని హతమార్చి..
కర్ణాటక: కుటుంబాన్ని ప్రాణంలా కాపాడుకోవాల్సిన ఇంటి పెద్ద హంతకుడయ్యాడు. భార్య, కుమారున్ని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. మండ్య నగరంలో దుస్తుల వ్యాపారి ఒకరు ఈ ఘోరానికి పాల్పడ్డాడు. వ్యాపారి ప్రభాకర్ (65), భార్య జ్యోతి (55), కుమారుడు సంతోష్ (30) మృతులు. ఏం జరిగిందంటే.. వివరాలు.. నెహ్రూ నగరలో ప్రభాకర్‌కు క్లాత్ స్టోర్ ఉంది. కుటుంబ నిర్వహణ, వ్యాపారం కోసం పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్నాక.. భార్య జ్యోతి గొంతుకు చీర బిగించి చంపబోయాడు. ఆ శబ్ధాలకు మరో గదిలో ఉన్న కుమారుడు సంతోష్ వచ్చాడు. అయినప్పటికీ ప్రభాకర్ భార్యను హతమార్చి, ఆపై కుమారున్ని కూడా అదే మాదిరిగా ప్రాణాలు తీశాడు. పక్క గదిలో నిద్రిస్తున్న కోడలికి ఇదేమీ తెలియదు. తరువాత తన బట్టల అంగడికి వచ్చి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం కోడలు నిద్రలేచి అత్త వద్దకు వెళ్లగా ఘోరం బయటపడింది. తూర్పు పోలీసు స్టేషన్ సిబ్బంది, మండ్య ఎస్పీ శోభారాణి చేరుకుని పరిశీలించారు. పాపం.. కొత్త కోడలు ఈ ఘటనలో మరో విషాదం ఏమిటంటే.. నెల రోజుల క్రితమే సంతోష్‌కు ఘనంగా పెళ్లి చేయడం. అతని భార్య జీవితం కూడా ఛిన్నాభిన్నమైంది. రాత్రి తన గదినుంచి భర్త బయటకు వెళ్లిన సంగతి ఆమెకు తెలియరాలేదు. ఫ్యాన్ శబ్దం ఎక్కువగా ఉండడం వల్ల ఏ చప్పుళ్లు వినిపించలేదని ఆమె తెలిపింది. డెత్‌నోట్‌లో.. వ్యాపారంలో నష్టాలు, అప్పుల వల్ల విరక్తికి గురై ప్రభాకర్ భార్య, కొడుకును చంపేశారని ఎస్పీ శోభ తెలిపారు. ప్రభాకర్ డెత్‌నోట్ లభించిందని తెలిపారు. ఇంటి రుణం, నష్టాలు, ఉచిత బస్సు పథకం వల్ల తమకు వ్యాపారం బాగా తగ్గిపోయిందని లేఖలో రాశారన్నారు.
పిల్లల సమాచారం.. సోషల్‌గా వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘నా బిడ్డ స్కూల్లో ఫస్ట్ వచ్చింది’, ‘ఇవాళ నా కుమారుడి పుట్టినరోజు.. ‘మా పాప అక్షరాభ్యాసం చేయించాం’, ‘మా పిల్లలను ఫలానా స్కూల్లో చేర్పించాం..’ అంటూ పిల్లలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమ వేదికల ద్వారా పంచుకోవడం ఇప్పటి తరం తల్లిదండ్రులకు సాధారణమైంది.అయితే ఈ చర్యలే పిల్లలను సైబర్ నేరగాళ్ల బారిన పడేలా చేస్తున్నాయని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆన్లైన్ భద్రతపై స్కూళ్లు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి ఒక స్కూల్ వార్షికోత్సవంలో తీసిన ఫొటోలో విద్యార్థి పేరు, స్కూల్ లోగో, తరగతి వివరాలు కనిపిస్తే, సోషల్ మీడియా ద్వారా ఆ బాలుడి పూర్తి డిజిటల్ ప్రొఫైల్‌ను సేకరించడం సైబర్ నేరగాళ్లకు సులభమవుతుందని చెబుతున్నారు.అనంతరం ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు దేశంలోని సైబర్ భద్రతా సంస్థలు పలుమార్లు హెచ్చరించాయి.ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మీ వివరాలు ఇతరులకు కనిపించకుండా ప్రైవేటు సెట్టింగ్‌లు పెట్టుకోవాలి.లొకేషన్ ట్యాగ్‌లను నిలిపివేయాలి. సోషల్ మీడియా ప్రైవసీ సెట్టింగ్స్‌ను కఠినంగా అమలు చేయాలి.పిల్లలకు సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలి.
రెండో భార్యపై అనుమానం.. మల్కాజ్‌గిరిలో దారుణం
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మల్కాజ్‌గిరిలో కాల్పుల కలకలం రేగింది. మూడు నెలల క్రితం భార్యను హత్య చేసేందుకు స్కెచ్ పోలీసులకు చిక్కిన ఓ భర్త.. చివరకు తన పథకాన్ని అమలు చేశాడు. మరో వ్యక్తి సాయంతో తన రెండో భార్యను తుపాకీతో కాల్చి హతమార్చాడు. బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల సమాచారం ప్రకారం, మల్కాజ్గిరి మారుతీనగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్‌కుమార్‌కు మొదటి భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. విడాకులిచ్చి ఆమె సోదరిని మరో వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెకు ఇతరులతో సంబంధాలు ఉన్నాయని అరుణ్ అనుమానాలు పెంచుకోసాగాడు. ఈ కారణంగా దంపతుల మధ్య తరచూ వివాదాలు చోటుచేసుకోవడంతో.. ఆమె దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. దీంతో.. భార్యను ఎలాగైనా అంతం చేయాలనే ఉద్దేశంతో అరుణ్ ముందుగానే హత్య ప్రణాళిక రూపొందించాడు. ఈ ఏడాది మార్చిలోనే బిహార్ నుంచి అక్రమంగా దేశవాళీ తుపాకీ, బుల్లెట్లు తెప్పించుకుని భార్యను చంపేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు, తుపాకీ పేల్చడంపై ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే పక్కా సమాచారంతో చార్మినార్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అరుణ్ హత్యాయత్నం విఫలమై వార్తల్లోకి ఎక్కింది.ఆయుధ చట్టం కేసుతో కటకటాల పాలైన అరుణ్.. బెయిల్ మీద బయటకు వచ్చాడు. అయితే ఆ తర్వాత కూడా అతడి ఆలోచన మారలేదు. ఈ తెల్లవారుజామున మాట్లాడుకుందామని భార్యను బయటకు పిలిచిన అరుణ్, మరో వ్యక్తితో కలిసి ఆమెపై కాల్పులు జరిపాడు. మూడు రౌండ్లతో కాల్పులు జరపడంతో.. ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాల్పుల అనంతరం నిందితులు పరారయ్యారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని తన స్నేహితుల ద్వారా అరుణ్ తుపాకీ కొనుగోలు చేసినట్లు పోలీసులకు లీడ్ దొరికింది. ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
స్నేహితుడే చితకబాది.. చనిపోయాడనుకుని తొట్లో వేసి..
ముండ్లమూరు: స్నేహితుడే చితకబాది చనిపోయాడనుకుని తొట్లో వేసి వెళ్లాడు. తీవ్రగాయాలతో బతికిబయటపడిన బాధితుడు ఆస్పత్రికి చేరాడు. ముండ్లమూరు మండలంలోని సుంకరవారిపాలెం గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. చిట్టిబోయిన వెంకట్రావు, చిట్టిబోయిన రామబ్రహ్మం స్నేహితులు, బంధువులు కూడా.వారి మధ్య ఏం జరిగిందో ఏమోగానీ.. సుంకరవారిపాలెంలోని తన ఇంట్లో వెంకట్రావు ఉండగా, స్నేహితుడు రామబ్రహ్మం మోటార్ సైకిల్‌పై వచ్చి నీతో పని ఉంది అంటూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో తీసుకెళ్లాడు. సుమారు ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి నాయుడుపాలెం పొలాల్లోని ఎత్తిపోతల పథకం వద్ద మద్యం సేవించారు.అనంతరం ఇద్దరూ అద్దంకి వెళ్లి పొద్దుపోయిన తర్వాత నాయుడుపాలెం పొలాల్లోనే ట్యాంకు దగ్గరకు వచ్చారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదుగానీ.. రామబ్రహ్మం రాయితో వెంకటరావుపై తీవ్రంగా దాడి చేశాడు. చనిపోయాడనుకుని నీటి తొట్టిలో పడేసి వెళ్లిపోయాడు. తెల్లవారేసరికి తీవ్ర గాయాలతో ఉన్న వెంకట్రావుకు మెలకువ వచ్చింది. పూరిమెట్ల వైపు ఒక పశువుల షెడ్డు దగ్గరకి అతి కష్టం మీద వెళ్లి అక్కడున్న వారికి విషయం చెప్పి తన బంధువులకు సమాచారం ఇచ్చాడు.తీవ్రంగా గాయపడిన వెంకట్రావును బంధువులు వెళ్లి చికిత్స నిమిత్తం అద్దంకి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కి అతన్ని తరలించారు. దాడి జరిగిన విషయం అద్దంకి పోలీసులకు తెలియజేయగా, కేసు నమోదు చేసి ముండ్లమూరు పోలీసులకు పంపారు. వారి మధ్య ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
వీడియోలు
తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
జ్ఞానేశ్వరి కేసులో అనుమానాలు.. కుక్క ప్రవర్తనలో మార్పు!
ప్రమాదం ముందే తెలుసు.. బయటపెట్టిన వాట్సాప్ స్టేటస్
బంగారం కొట్టేసిన నేపాలీ గ్యాంగ్ అరెస్ట్
Viral News: పాపం బుల్డోడు..ఇరుక్కున్నాడు
కెప్టెన్ గా శ్రేయస్... ఆనందంతో అయ్యర్ తండ్రి డాన్స్ వైరల్ అవుతున్న వీడియో
జగన్ అన్న దేవుడిలా వచ్చాడు... బాధితుల ఎమోషనల్ రియాక్షన్
భారతీరాజాకు ఘన నివాళులు.. సీఎం విజయ్, స్టాలిన్, సూర్య
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, పవన్ వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన జగన్
మాటకు మాట

