గుర్రంపై క్రూరత్వం.. ట్రక్కుకు కట్టి

సాధారణంగా గుర్రం మీద స్వారీ చేస్తూ.. అది వేగంగా పరిగెత్తితే ఆనందపడుతాం. కొంతమంది జంతు ప్రేమికులు గుర్రాలను కూడా చాలా ప్రేమగా పెంచుకుంటారు. కానీ ఓ జంట ఇందుకు పూర్తిభిన్నంగా గుర్రం మీద తమ క్రూరత్వాన్ని ప్రదర్శించారు. వారు వెళ్లే ట్రక్కు వాహనానికి వెనుకభాగంలో బలవంతంగా కట్టేసి.. కారును వేగంగా నడుపుతూ తీసుకువెళ్లారు. ఆ మూగ జీవి ఎంత అరిచినా పట్టించుకోలేదు. అదీకాక ఆ రహదారి పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది. వివరాల్లోకి వెళితే..  అమెరికాలోని కొలరోడోకి చెందిన ఓ జంట ఈ దారుణ ఘటనకు పాల్పడింది.

తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు తీవ్రంగా కామెంట్ల ద్వారా విమర్శిస్తున్నారు. గ్రాండ్‌లేక్‌ వద్ద ఆ గుర్రం బోర్లాపడినట్టు వీడియోలో తెలుస్తోంది. జాన్, అంబర్ సాల్డేట్ దంపతులు గుర్రంపై క్రూరత్వానికి పాల్పడినట్లు గ్రాండ్ కౌంటీ జిల్లా న్యాయవాది ఓ ప్రకటనలో తెలిపారు. గుర్రాన్ని వారి నుంచి తీసుకున్నామని అది ఇప్పుడు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. జంతువులు, చిన్న పిల్లలకు సంబంధించిన కేసులు చాలా సున్నితమైనవి అంటూ దర్యాప్తు కొంత సమయం పడుతుందని గ్రాండ్ కౌంటీ షెరీఫ్ బ్రెట్ ష్రోట్లిన్ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆ జంట ఇంత మంది ఆ గుర్రం గురించి ఎందుకు బాధపడ్డారో అర్థం అయిందని.. తాము తప్పు చేశామని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఆ జంట జనవరిలో కోర్టుకు హాజరుకానున్నారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top