బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నమెంట్ హాంకాంగ్ ఓపెన్‌ను సొంతం చేసుకునేందుకు భారత స్టార్ పీవీ సింధు మరో విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్, గత ఏడాది రన్నరప్ సింధు 21–17, 21–17తో ప్రపంచ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ ఇంతనోన్ రచనోక్ (థాయ్‌లాండ్)ను ఓడించింది.