టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రోజాపై ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బండ్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బండ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం విజయవాడ పోలీస్ కమీషనరేట్‌లో వారు ఫిర్యాదు చేశారు.