ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 171వ రోజు ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నైట్ క్యాంపు పెదకాపవరం నుంచి జననేత వైఎస్ జగన్ తన పాదయాత్ర చేపట్టారు. పెద కాపవరం, చిన కాపవరం, గుమ్ములూరు, తరటావ మీదుగా కొనసాగనున్న పాదయాత్ర కొల్లపర్రుకు చేరుకున్నాక వైఎస్ జగన్ విరామం తీసుకుంటారు.