విశాఖ ఘటన మరువక ముందే మరో ప్రమాదం
చెన్నై: లాక్‌డౌన్ కారణంగా చాలా కాలం తరువాత పరిశ్రమలు ప్రారంభించడంతో గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖలో జరిగిన యల్‌జీ గ్యాస్ లీకేజీ మరువక ముందే చత్తీస్‌ఘర్ లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీక్ అయ్యి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా తమిళనాడులోని కడలూరు కోల్ మైనింగ్ కంపెనీలో బాయిలర్ పేలి ఏడుగురు గాయాలపాలయ్యారు.
ఈ ఘటన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ప్లాంటులో చోటుచేసుకుంది. తమిళనాడు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. గాయపడిన వారికి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి