వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని చెప్పలేదా? | Sakshi
Sakshi News home page

వచ్చే జన్మలో అమెరికాలో పుడతామని చెప్పలేదా?

Published Fri, Nov 22 2019 4:42 PM

పాదయాత్రలో హామీ ఇచ్చినట్టుగా నిరక్షరాస్యతను రూపుమాపేందుకు, పేద ప్రజలను లక్షలాది రూపాయల దోపిడీ నుంచి కాపాడేందుకే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్నారని తెలుగు అకాడమి చైర్మన్‌ నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. శుక్రవారం తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన ఆమె ఇంగ్లీష్‌కు వ్యతిరేకంగా మాట్లాడేవారిపై విరుచుకుపడ్డారు. తెలుగు గురించి మాట్లాడే వాళ్లు తమ పిల్లలను ఎందుకు ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తన కుమారుడిని, మనవడిని ఇంగ్లీష్‌ మీడియంలో చదివించలేదా? ఏబీఎన్‌ రాధాకృష్ణ తన కుమారుడిని తెలుగు మీడియంలో చదివించారా? అంటూ తీవ్రంగా మండిపడ్డారు.