ఆర్టీసీ డ్రైవర్ బాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆరపల్లికి తరలి వస్తున్నవారిని నియంత్రించేందుకు రోడ్లపై పోలీసులు భారీ గేట్లను అమర్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యకతిరేకంగా నినాదాలు చేస్తూ.. పోలీసుల నిర్భందం ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అటు పోలీసులకు ఇటు కార్మికులకు వాగ్వాదం నెలకొంది. దీంతో కరీంనగర్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఇక డ్రైవర్ బాబు నివాసం వద్ద ఆర్టీసీ కార్మికులు మానవహారంగా ఏర్పడ్డారు. అలాగే కోదండరాంతో పాటు చాడ వెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు వామపక్ష నేతలు అక్కడకు చేరుకున్నారు.
ఆర్టీసీ డ్రైవర్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత
Nov 1 2019 10:45 AM | Updated on Nov 1 2019 10:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement