ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థ అధినేత అబు బకర్ ఆల్-బాగ్దాదిని అమెరికా దళాలు మట్టుబెట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వైట్‌హౌస్ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా దృవీకరించారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో చనిపోయిన మాట నిజమేనని పేర్కొన్నారు. కానీ అతన్ని మా బలగాలు మట్టుబెట్టలేదు. ఐసిస్ స్థావరాలపై మా భద్రతా బలగాలు చేస్తున్న దాడులు చేస్తున్న సమయంలో బాగ్దాది బయపడి ఒక పిరికివాడిలా తనను తాను ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు.