ఏలూరు పత్తేబాద రాఘవాచారి వీధి, డీమార్ట్ సమీపంలో భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో సోమవారం అర్ధరాత్రి రోకలి బండతో మోది చంపిన ఘటన ఆలస్యంగా మంగళవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఏలూరు టూ టౌన్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు పత్తేబాద రాఘవాచారి వీధిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న తాళ్లూరి రాంబాబు, నాగలక్ష్మి దంపతులకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరూ ప్రే మించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వీరిది లింగపాలెం మండలం పుప్పాలవారిగూడెం. వారికి నిఖిత, భవిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాంబాబు నగరంలోని ఓ హోటల్‌లో, నాగలక్ష్మి ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతుండటంతో ఏడాది క్రితం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టుకున్నారు.