ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం సీఎం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తొలుత హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆయనకు సాదర స్వాగతం పలికారు. సీఎంను చూసేందుకు వెల్‌కమ్ ప్లకార్టులతో పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకున్నారు. కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి సీఎం జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్
Aug 24 2019 7:59 AM | Updated on Aug 24 2019 8:02 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement