తాము పెట్టిన అర్జీ చెత్తబుట్టలోకి పోవడం లేదు... వాటిని కలెక్టర్లు పరిశీలిస్తున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆ నమ్మకంతోనే స్పందన కింద వస్తున్న దరఖాస్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతీ కలెక్టర్ గ్రామ సచివాలయాన్ని ఒక బిడ్డ మాదిరిగా చూడాలని సూచించారు. కలెక్టర్లు ధ్యాస పెడితేనే వివిధ సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయన్నారు.