పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలి అని పెద్దలంటారు. అదే మాదిరిగా కూడ్లిగిలో డీఎస్పీగా పని చేస్తూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించి ప్రభుత్వం, మంత్రిపై వ్యతిరేకతతో చివరకు డీఎస్పీ పదవినే త్యజించిన ఉద్యమ నారి అనుపమ షణై రాజకీయ భేరి మోగించారు. అనుపమ షణై బుధవారం జిల్లాలోని కూడ్లిగిలో అభిమానులు, కార్యకర్తల మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించారు. పార్టీకి భారతీయ జనశక్తి కాంగ్రెస్ పార్టీ అని నామకరణం చేశారు. కేసరి తెలుపు, పచ్చ రంగులతో కూడిన పార్టీ జెండాను ఆవిష్కరించారు.