ఈ రోజు ఉదయం దాదాపు వందమందికిపైగా దివ్యాంగులొచ్చి కలిశారు. ఒక్కొక్కరిది ఒక్కో కష్టం. పింఛన్‌లు అందని, సంక్షేమ పథకాలు చేరువకాని కష్టం. స్థలాలున్నా ప్రభుత్వ గృహాలు మంజూరు కాని వైనం. ‘అన్నా.. గతంలో మాలాంటి దివ్యాంగుల కోసం మీ నాన్నగారు కనిగిరి అర్బన్ కాలనీలో 250 ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారు. లోన్లు తీసుకోడానికి, ఇళ్లు కట్టుకోడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు.