బడేవారిపాలెం ఎస్సీ కాలనీకి చెందిన బొమ్మల చిన్నయ్య రావడం రావడమే బాబుగారిపై ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. ‘సార్.. ఈ గవర్నమెంటును నమ్మేదానికే లేకుండా పోతోంది. నాకున్న కొద్దిపాటి పొలాన్ని నమ్ముకుని కుటుంబాన్ని సాక్కుంటున్నాను. వర్షాల్లేక పంటలు ఎండి పోతుంటే బోరు వేసుకుందామనుకున్నాను. ఎస్సీ కార్పొరేషన్‌కు పోతే బోరు మంజూరు చేశారు. ఇది జరిగి రెండేళ్ల పొద్దయింది. ఇప్పటికీ నా పొలంలో బోరుపడ్డ పాపానపోలేదు.