ఉదయం శిబిరం నుంచి బయటకు రాగానే కోటేశ్వరమ్మ అనే అక్క ‘అన్నా.. మేము పాస్ పుస్తకాలు పెట్టి బంగారం లోను కింద రూ.87,000 తీసుకున్నాం. ఎన్నికల ముందు చంద్రబాబు రుణమాఫీ చేస్తానంటే ఆశపడ్డాం. ఇప్పటిదాకా ఒక్క పైసా మాఫీ కాలేదు. అధికారుల చుట్టూ తిరిగాం, కలెక్టర్‌ను కలిశాం. అమరావతి దాకా వెళ్లి అక్కడా పెద్దోళ్లకు విన్నవించాం. అటూ ఇటూ తిరగడానికే ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.