ఈ రోజు కోదండాపురం వద్ద వేములపాడుకు చెందిన అనేక పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని వెలిబుచ్చారు. చంద్రబాబు తమకు చేసిన మోసాన్ని ఆ సంఘాలకు చెందిన లీడర్లు, సభ్యులు ఎండగట్టారు. బాబుగారి రుణమాఫీ మోసంతో తామంతా డిఫాల్టర్లుగా మారిన వైనాన్ని వివరించారు. మాఫీ అవుతుంది కదా అని బ్యాంకులకు కిస్తీలు కట్టకపోవడం వల్ల వడ్డీల మీద వడ్డీలు, అపరాధ వడ్డీలు పెరిగి.. ఇప్పుడా అప్పు కట్టుకోలేనంతగా పెరిగిపోయిందన్నారు.