సేద్యం చేసే రైతే కాదు.. స్వేదం చిందించే కూలీ ముఖంలోనూ సంతోషం కనిపించడం లేదు. ఎక్కడికెళ్లినా కష్టాలు, కడగండ్లే. ఇలాంటి రైతులు, కూలీలే.. ఈ రోజు కొరిమెర్లలో నన్ను కలిశారు. ఉన్న ఊళ్లో బతకలేని కొంతమంది రైతులు కొరిమెర్లలో భూమిని కౌలుకు తీసుకుని శనగ పంట వేశారట. మూడేళ్లుగా గిట్టుబాటు ధరలేక.. అప్పులే వెంటాడుతున్నాయన్నారు. తిన్నా, తినకున్నా కౌలు కింద ఎకరాకు ఆరు వేల రూపాయలు కట్టాల్సిందేనట. పెట్టుబడితో కలుపుకొంటే ఎకరాకు రూ.22 వేలు ఖర్చవుతోందట.