ఇడుపులపాయలో మొదలైన నా పాదయాత్ర ఇవాళ వంద రోజులకు చేరింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నా అడుగులో అడుగేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మరువలేని మీ ఆదరణ.. విలువ కట్టలేని మీ ఆప్యాయత.. ఉత్సాహాన్నిచ్చిన మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఈ వంద రోజుల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు. చంద్రబాబు అవినీతి, అన్యాయ, మోసపూరిత పాలనలో జనం అగచాట్లు చూశాను. అన్నదాత గుండెకోత.. అవ్వాతాతల హృదయ ఘోష.. అక్కచెల్లెమ్మల ఆవేదన.. నిరుద్యోగుల హాహాకారాలు.. పేదవాడి ఆకలి కేకలు.. పాదయాత్రలో కదిలించిన అంశాలు. కన్నీరు తెప్పించిన సజీవ చిత్రాలు. ఇలాంటి బాధాతప్త హృదయాలను ఊరడించడానికి ఇంకా.. ఇంకా.. ప్రజలతో మమేకమవ్వాలనే తపన నాలో మరింత పెరుగుతోంది.