నంద్యాల: దోర్నాల -శ్రీశైలం రహదారిపై 11 గంటల సమయంలో రోడ్డు పై మందు సేవిస్తున్న ఎమ్మెల్యే.. ఆ సమయంలో రోడ్డు పై వాహనాలు నిషేధం..
పెట్రోలింగ్ చేస్తున్న ఫారెస్ట్ అధికారులు వీరిని గుర్తించి వెహికల్ వెనక హారన్ కొట్టిన వైనం. వెహికల్ తీయకపోవడంతో ముందుకు వెళ్ళి చేస్తే బుడ్డా రాజశేఖరరెడ్డి ఉన్నట్లు గుర్తించి సెల్యూట్ కొట్టిన సిబ్బంది.
మద్యం మత్తులో కంట్రోల్ లో లేని ఎమ్మెల్యే నా వాహనం తీయాలని హారన్ కొడతారా అని పచ్చి బూతులతో రెచ్చిపోయిన వైనం .. అంతటితో ఆగక వారి వాహనాన్ని స్వయంగా ఎమ్మెల్యే డ్రైవ్ చేస్తూ నలుగురిని కిడ్నాప్ చేసి శ్రీశైలంలోని మంత్రి గొట్టిపాటి గెస్ట్ హౌస్ కు తరలింపు అక్కడ అందరిని చితకబాదిన వైనం..
సిబ్బందిలో డిప్యూటి రేంజ్ ఆఫీసర్ రామ నాయక్, డ్రైవర్ కరీం, గార్డు గురవయ్య, మరో గార్డ్ వీరంతా ప్రకాశం జిల్లా అటవీ సిబ్బంది.
మార్కాపురం dfo దృష్టికి విషయం కేసు నమోదు చేయాలా వద్దా అని అటవీ అధికారులు తర్జనభర్జన.