అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీ నెరవేర్చక పోవడంతో రాష్ట్రంలో తల్లడిల్లుతున్న రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులకు సాంత్వన చేకూర్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి ప్రజా సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.