తెలంగాణకు డెంగ్యూ సోకిందని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వంపై వ్యంగ్యాస్ర్తాలు విసిరారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణలో వందల మంది చనిపోతుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఫాంహౌస్‌లో నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలోనే డెంగ్యూ వైద్యం కోసం రూ.10 కోట్లు ఖర్చయిందన్నారు. ఆస్తులు తాకట్టు పెట్టి ప్రజలు వైద్యానికి ఖర్చు చేశారని తెలిపారు.