పుష్కరాల బస్సుల్లో సాధారణ చార్జీలే | normal charges in puskar bueses | Sakshi
Sakshi News home page

Aug 11 2016 9:14 AM | Updated on Mar 22 2024 11:06 AM

తిరుపతి అర్బన్‌: కృష్ణా పుష్కరాల స్పెషల్‌ బస్సుల్లో సాధారణ చార్జీలే అమలులో ఉంటాయని ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ నాగశివుడు తెలిపారు. పుష్కరాలకు ఆర్టీసీ తరఫున తీసుకున్న ప్రత్యేక చర్యలు, ప్రయాణికులకు కల్పిస్తున్న వసతులను బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో వివరించారు. జిల్లాలోని 14 డిపోల నుంచి ప్రస్తుతానికి 11 రెగ్యులర్‌ బస్సులు విజయవాడకు నడుస్తున్నాయని, వాటితో పాటు పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకుని గురువారం నుంచి రోజూ 40 నుంచి 50 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పుష్కరాలు జరిగే రోజుల్లో విజయవాడ, గుంటూరు నగరాలకు నేరుగా బస్సులు వెళ్లవని పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement