అసలు ఎప్పుడైనా తాము ప్రస్తావించిన అంశాలను చర్చకు రానిచ్చారా అని అడిగారు. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత వాయిదాలు వేస్తున్నారని.. ఇప్పుడు సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని పునరాలోచించాలని, లేనిపక్షంలో తాను కూడా నిరసనగా వాకౌట్ చేయాల్సి వస్తుందని జానారెడ్డి అన్నారు. మెజారిటీ ఉందని రెండు నిమిషాల్లోనే సస్పెండ్ చేస్తారా, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. వెల్ లోకి రాకముందే సస్పెండ్ చేయడానికి కారణం ఎంటని అడిగారు. ప్రభుత్వ చర్యలు, వైఫల్యాలను ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు.