చంద్రుడిపై పరిశోధనకు ఇస్రో పంపిన ఏడాది లోపే ఆచూకీ లేకుండా పోయిన చంద్రయాన్–1 అంతరిక్షనౌకను కనుగొన్నామని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. అది ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతోందని వెల్లడించారు. చంద్రయాన్–1ను 2008, అక్టోబర్ 22న ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. అయితే 2009, ఆగస్టు 29 తర్వాత దాని నుంచి ఎటువంటి సంకేతాలు లేవు. దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు. ఇటీవల నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరెటరీ (జేపీఎల్) శాస్త్రవేత్తలు దానిని కనుగొన్నారు. చంద్రుడి ఉపరితలానికి 200 కిలోమీటర్ల దూరంలో అది ఇంకా పరిభ్రమిస్తోందని చెప్పారు. భూ ఆధారిత రాడార్ వ్యవస్థతో నాసాకు చెందిన లూనార్ రీకానయ్‌సెన్స్ ఆర్బిటార్ (ఎల్‌ఆర్‌వో)తో పాటు ఇస్రోకు చెందిన చంద్రయాన్–1ను కనుగొన్నామని జేపీఎల్ ప్రధాన శాస్త్రవేత్త మారిన బ్రొజోవిక్ తెలిపారు.