ఆప్త ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు | APTA North East Regional Conference Deepavali Sambaralu | Sakshi
Sakshi News home page

Nov 22 2016 10:04 AM | Updated on Mar 21 2024 8:11 PM

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్(ఆప్త)ఆధ్వర్యంలో నార్త్ ఈస్ట్ రీజినల్ కాన్ఫరెన్స్ దీపావళి సంబరాలు మాంచెస్టర్లో అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి తెలుగు వారు తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చారు. పెద్దలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. రఘు కుంచె, ఆదర్శిని, శేషు ఆకుల, శ్రవణ్ మట్లపూడి, షాలిని గంధం, శుభ రావూరి, సుభాష్ తన్నీరు, కుమారి లావణ్య అందే తమ గానామృతంతో ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ సంగీత విభావరిని రవి వర్రే,శేఖర్ నల్లం స్పాన్సర్ చేశారు. పిల్లల చదువుల మీద నెక్స్ట్ జెన్ కిడ్స్ ప్రోగ్రాంని కిరణ్ పళ్ళా నిర్వహించారు. తల్లితండ్రులు, పిల్లలు పాల్గొని భవిష్యత్తు ప్రణాళికలను వాటి మీద ఉన్న సందేహాలని నివృత్తి చేసుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement