అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపులో కొత్త విధానం తెరపైకి వచ్చింది. రోస్టర్ విధానాన్ని అనుసరిస్తూ తెలంగాణ నుంచి ఉద్యోగుల కేటాయింపును ప్రారంభించడానికి బదులుగా.. ‘రోస్టర్ బ్యాండ్’ విధానాన్ని అనుసరించనున్నారు. దీని ప్రకారం రెండు మూడు సంవత్సరాల బ్యాండ్‌లను కలుపుతూ.. ఆయా కేటగిరీల్లో మొదటి అధికారి ఆంధ్రప్రదేశ్‌కు, రెండో అధికారి తెలంగాణ రాష్ట్రానికి వచ్చేలా మార్పు చేసినట్లు సమాచారం. దీనితో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆంధ్రప్రదేశ్‌కు కాకుండా తెలంగాణ రాష్ట్ర కేడర్‌కు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 294 మంది ఐఏఎస్ అధికారులు ఉండగా... అందులో 125 మంది బయటి రాష్ట్రం వారు ఉన్నారు. ఇప్పుడు వీరి పంపకమే కీలకం కానుంది. ప్రస్తుతం అనుసరించనున్న ‘బ్యాండ్’ విధానం బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులకు వర్తిస్తుంది. గతంలో మూడు రాష్ట్రాల్లో అధికారుల విభజన జరిగినప్పుడు.. అవశేష రాష్ట్రం (రెసిడ్యూయరీ స్టేట్) నుంచి అధికారుల కేటాయింపు జరిగిందని, ఇప్పుడు అదే విధానం అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
Aug 22 2014 7:32 AM | Updated on Mar 21 2024 8:10 PM
Advertisement
Advertisement
Advertisement
