జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు సాద్ ఇర్ఫాన్ ఎంపిక
ప్రొద్దుటూరు : పట్టణానికి చెందిన యువ క్రికెటర్ సాద్ ఇర్ఫాన్ గుంటూరులో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగిన రాష్ట్ర ఎస్‌జీఎఫ్ అండర్–14 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో సత్తా చాటి జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు. సాద్ ఇర్ఫాన్ జాతీయ జట్టు వైస్‌కెప్టెన్ బాధ్యతలు దక్కించుకోవడం విశేషం. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా దిగిన సాద్ ఇర్ఫాన్ టోర్నమెంట్‌లో 135 స్ట్రైక్ రేట్‌తో..124 పరుగుల సగటుతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌలింగ్‌లో 4 వికెట్లు, 3.8 ఎకానమీతో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో సఫలమయ్యాడు. ఎస్‌జీఎఫ్ అండర్–14 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికై న సాద్ ఇర్ఫాన్ రాజస్థాన్‌లో జరిగే జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొననున్నాడు. జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపిక కావడంపై సాద్ ఇర్ఫాన్‌ను బీఎస్ అకాడమి కోచ్‌లు సయ్యద్ అహ్మద్, సయ్యద్ నసృ, తల్లిదండ్రులు ఇర్ఫాన్ బాషా, మోనా హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చూపి ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీల్లో ఆడాలని వారు ఆకాంక్షించారు.
21న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈ నెల 21న తగరపు వలస, విశాఖపట్నంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటేషన్ న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం.తారీఖ్ అలీ, సెక్రటరీ అన్సర్ అలీ తెలిపారు. మంగళవారం నగరంలోని ఖూన్‌కా రిష్టా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్‌కు ప్రతి ఒక్కరు రావాలని కోరారు. ఈ సమావేశంలో స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ న్యామతుల్లా,ట్రెజరర్ ఇంతియాజ్ ఖాన్,ఫిరోజ్ ఖాన్,రాజా, ఏజాస్ ఖాన్,మోయిన్,ముక్తియార్ ఉమర్,సలీం,ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య కాలిబాట మీదుగా ప్రయాణించరాదు
రైల్వేకోడూరు : అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు వెళ్లే భక్తులకు రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామం నుంచి అనుమతి నిరాకరిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.జగన్నాథ సింగ్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ అటవీ మార్గంలో అడవి జంతువులైన ఏనుగుల గుంపు అధికంగా ఉందని, దానివల్ల ప్రజలకు ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏనుగుల దాడిలో ముగ్గు రు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఈ మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే భక్తులకు అనుమతి నిరాకరించడం జరిగిందని తెలిపారు.
జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు సాద్ ఇర్ఫాన్ ఎంపిక
జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు సాద్ ఇర్ఫాన్ ఎంపిక


