వరి..వర్షార్పణం
నీట మునిగిన వరి పంటను పరిశీలిస్తున్న ఏఓ రామకృష్ణయ్య
అట్లూరు : దిత్వా తుపాన్ వల్ల కురిసిన వర్షాలతో చేతికి అందిన వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా మండల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో కోతకోయాల్సిన వరి పంట నీట మునిగి మొలకలెత్తింది. మండల పరిధిలోని కొండూరు గ్రామ రైతులకు చెందిన 50 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మంగళవారం మండల వ్యవసాయ అధికారి రామకృష్ణయ్య నీట మునిగిన వరి పంట పొలాలను పరిశీలించి నష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు.
వరి..వర్షార్పణం


