
డ్రాగా ముగిసిన కడప– నెల్లూరు మ్యాచ్
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 మల్టీ డే క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో నెల్లూరు జట్టు 232 పరుగులు చేసింది. కడప జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసింది. ఒక వికెట్ నష్టానికి 144 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు రెండవ ఇన్నింగ్స్‌లో 114.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 419 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ అద్భుతంగా బ్యాటింగ్‌లో రాణించి 103 పరుగులు (సెంచరీ) చేశాడు. సయ్యద్ షాహుల్ హుస్సేన్ 80 పరుగులు, రోహిత్ 73 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆర్దిత్ రెడ్డి 4, చరణ్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 13.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో కడప జట్టు ఆధిక్యత సాధించింది.

డ్రాగా ముగిసిన కడప– నెల్లూరు మ్యాచ్

డ్రాగా ముగిసిన కడప– నెల్లూరు మ్యాచ్

డ్రాగా ముగిసిన కడప– నెల్లూరు మ్యాచ్