
దరఖాస్తుల ఆహ్వానం
పెనగలూరు: పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీషు పోస్టు కసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీషు పోస్టు (గెస్ట్ ఫ్యాకల్టీ) అర్హులైన వారి నుంచి ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీషు కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. ఈనెల 8వ తేదీ డెమో క్లాసులు కళాశాలలో ఉదయం పది గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. డెమో క్లాసుల అనంతరం ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సూచించారు. గురువారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో మహిళా సర్పంచులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. తొలుత మహత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ మహిళా సర్పంచులు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు చైతన్యవంతులు అయితేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ నాగభూషణం, డీఎల్‌డీఓ, మహిళా సర్పంచులు పాల్గొన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం