వ్యాపారి.. తీరు మారి.. | - | Sakshi
Sakshi News home page

వ్యాపారి.. తీరు మారి..

May 17 2025 5:58 PM | Updated on May 17 2025 5:58 PM

వ్యాప

వ్యాపారి.. తీరు మారి..

ఒక్కరోజులో రూ.10 వేల ధర వ్యత్యాసం

జెడ్పీలో గళమెత్తిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు

అక్రమాలు కట్టడి చేయాలని కలెక్టర్‌కు విన్నపం

కలెక్టర్‌ ఆకస్మిక పర్యటనకు వస్తున్నారని ప్రచారం

ఒక్కమారుగా పెరిగిన చీనీకాయల రేటు

పులివెందుల మార్కెట్‌ యార్డులో

చీనీ కాయల ధరలు

తేదీ అమ్మకం జరిగిన మార్కెట్‌యార్డులో

సరుకు పరిమాణం టన్ను ధర

(టన్నులలో) (రూ.లలో)

సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతికి దీటుగా ఎదురొడ్డి నిలబడ్డారు. కష్టానికి వెరవక కన్నబిడ్డల లెక్కన చెట్లను పెంచుకున్నారు. అందుకు తగ్గట్టుగా పంట దిగుబడి లభించింది. ఎంతో సంతోషించిన రైతన్నలు.. చివరికి మార్కెట్‌ మాయాజాలంలో చిక్కుకున్నారు. పెట్టుబడులకు తగ్గ గిట్టుబాటు ధర లభించడం లేదు. శ్రమంతా వృథా అవుతోంది. ఏమి పాలుపోలేని స్థితికి చేరుకోవడంతో.. కొందరు ఏకంగా చెట్లను పెకలిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు లేవా అంటే.. భారీగా పలుకుతున్నాయి. రైతులు విక్రయాల వద్దకు తీసుకువచ్చే సమయంలో గణనీయంగా తగ్గుతున్నాయి. చీనీ రైతుల పరిస్థితిపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జెడ్పీలో గళమిప్పారు. 24 గంటల వ్యవధిలో భారీగా మార్పు లభించింది.

వ్యాపారులు సిండికేట్‌గా మారి..

పులివెందుల మార్కెట్‌ యార్డులో చీనీకాయల విక్రయాల కేంద్రం ఏర్పాటు చేశారు. ఎంతో ఉపయోగకరంగా మారిన ఈ కేంద్రంలో.. ఇటీవల వ్యాపారులు సిండికేట్‌ అయ్యారు. కొందరు దళారుల అవతారమెత్తి దోచుకుంటున్నారు. మార్కెటింగ్‌శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. కొందరు స్థానిక అధికారులు వ్యాపారులకు దాసోహం అయ్యారు. పొరుగు జిల్లాలో అధికంగా ఉన్న ధరలు.. వైఎస్సార్‌ జిల్లాలో లభించడం లేదు. గురువారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ఈ విషయమై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గళమెత్తారు. రైతులను దోచుకుంటున్నారని వాపోయారు. వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, వేంపల్లె, వేముల జెడ్పీటీసీలు రవికుమార్‌రెడ్డి, బయపురెడ్డి తదితరులు సభ దృష్టికి తీసుకెళ్లారు. ‘కలెక్టర్‌ సార్‌ చొరవ తీసుకోండి.. దళారులను కట్టడి చేయండి, వ్యాపారులను అనుమతించండి. పొరుగునే ఉన్న అనంతపురంలో ఉన్న ధరలు పులివెందులలో లేవు’ అని ఏకరువు పెట్టారు.

టన్నుకు రూ.10 వేలు అదనంగా పలికిన ధర

మార్కెట్‌ యార్డులో వ్యవహరిస్తున్న ధోరణి జెడ్పీ సమావేశంలో బహిర్గతం కావడం, ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు డిజిటల్‌ బోర్డు ద్వారా డిస్‌ప్లే చేస్తామని కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ ప్రకటించడం, పులివెందుల వ్యవహారంలో సమీక్ష చేస్తామని ప్రకటించడంతో మార్కెటింగ్‌శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో 24 గంటలు గడవక మునుపే టన్నుపై రూ.10 వేల ధర అదనంగా పెరిగింది. బుధ, గురువారాల్లో రూ.31 వేలు, రూ.32 వేలు ఉన్న ధర శుక్రవారం టన్ను చీనీ కాయలు రూ.41,500 కొనుగోలు చేశారు. మే 1న రూ.21 వేలు మాత్రమే పలికాయి. మే 8న రూ.22 వేల ధర ఉంది. మే 16 నాటికి రూ.41,500 పలికాయి. ఈ వ్యత్యాసంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. శుక్రవారం పులివెందుల మార్కెట్‌లో 44.08 టన్నుల చీనీకాయలు విక్రయాలు జరిగాయి. గడిచిన రెండు వారాల్లో 1090 టన్నుల చీనీ కాయలు విక్రయించారు. దాదాపు 1050 టన్నులను సగం ధరకే రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. కోట్లాది రూపాయాలు మార్కెటింగ్‌ మాయజాలంతో రైతులు కోల్పోయారని పలువురు వాపోతున్నారు.

కలెక్టర్‌ వస్తున్నారని ప్రచారం...

జిల్లా కలెక్టర్‌ శుక్రవారం వేంపల్లె, గండి ప్రాంతాల్లో పర్యటించారు. పులివెందుల మార్కెట్‌లో కూడా పర్యటిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో మార్కెటింగ్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాపారులను హెచ్చరించారు. ఒక్కరోజులో టన్నుకు రూ.10 వేల ధర అదనంగా పెరిగింది. కార్యాలయానికి పరిమితం కాకుండా కలెక్టర్‌ జిల్లాలో పర్యటిస్తే ఎలాంటి ప్రయోజనాలు దక్కుతాయో.. దీనిని బట్టి ఇట్టే అర్థం చేసుకోవచ్చునని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.

గళమిప్పితే ప్రయోజనమే

మే 1 54.72 21,600

2 84.43 21.100

3 65.45 18,100

5 163.43 31,000

6 142.18 22,000

7 75.79 23,200

8 72.41 22,000

9 53.88 26,700

10 40.71 21,500

12 72.19 26,700

13 62.44 26,000

14 68.37 31,000

15 90.28 32,100

16 44.08 42,500

మొత్తం: 1090.36 టన్నులు

ఎంపీపీ రఘనాథరెడ్డి, జెడ్పీటీసీలు రవికుమార్‌రెడ్డి, బయపురెడ్డి తదితరులు మార్కెటింగ్‌శాఖ పరిధిలో చోటుచేసుకున్న అక్రమాలు, రైతులు నష్టపోతున్న తీరుపై వాస్తవిక విషయాలను సభ దృష్టికి తీసుకొస్తే.. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరాలి. అలా కాకుండా దళారులంతా స్థానిక ప్రజాప్రతినిధుల వర్గీయులే కదా అంటూ సీనియర్‌ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వ్యాఖ్యానించి జెడ్పీ సభలో అభాసుపాలైయ్యారు. రైతుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించపోగా, అక్కడ కూడా రాజకీయం దృక్పథంతో వ్యవహరించడం నవ్వులపాలు కావాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కలెక్టర్‌ చొరవ అభినందనీయం

జిల్లా పరిషత్‌ సమావేశంలో సభ్యులు చీనీ రైతుల దుస్థితిని వివరించారు. ఆకస్మిక పర్యటన పెట్టుకొని పరిశీలించాలని కలెక్టర్‌ను అభ్యర్థించాం. తక్షణమే స్పందించి ఆయన మార్కెట్‌లో ప్రధాన నగరాల్లో ఉన్న ధరలు డిస్‌ప్లే అయ్యేలా బోర్డులు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కలెక్టర్‌ సమీక్ష వల్లే మార్కెట్‌ ధరల్లో ఒక్కమారుగా మార్పు వచ్చింది. చీనీ రైతుల దుస్థితిపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆవేదనపై కలెక్టర్‌ చొరవ అభినందనీయం. – ముత్యాల రామగోవిందురెడ్డి, జెడ్పీ చైర్మన్‌

పర్యవేక్షణ కొరవడింది

చీనీ కాయల విక్రయాల కొనుగోలు కేంద్రంలో మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షణ కొరవడింది. ఉన్నతాధికారులు సమీక్ష చేస్తూ ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలో లభిస్తున్న ధరల వ్యత్యాసాన్ని గమనించాలి. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. ఒక్క రోజులో టన్నుకు రూ.10 వేలు అదనంగా ధర పలికింది. ఇంతకాలం వడపు కాయలంటూ రకరకాల కొర్రిలు పెట్టి దోచుకున్నారు. శుక్రవారం మండీలో ఉన్న కాయలన్నీ కొనుగోలు చేశారు. –ఎంపీపీ రఘునాథరెడ్డి, వీరపునాయునిపల్లె

వ్యాపారి.. తీరు మారి..1
1/2

వ్యాపారి.. తీరు మారి..

వ్యాపారి.. తీరు మారి..2
2/2

వ్యాపారి.. తీరు మారి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement