
అరుదైన శస్త్ర చికిత్స
కడప అర్బన్ : గర్భాశయంలో కణితి తొలగించి అరుదైన శస్త్ర చికిత్స చేశారని గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ లక్ష్మీసుశీల తెలిపారు. కడప నగరంలోని దర్బార్‌బీ(46) కడుపునొప్పి, ఉబ్బరంతో శనివారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(రిమ్స్)లో చేరిందని, పరీక్షలు జరిపాక సర్వైకల్ ఫైబ్రాయిడ్‌గా నిర్ధారించారన్నారు. డాక్టర్ అమానుల్లా మూడు గంటల పాటు శ్రమించి ఎనిమిది కిలోల బరువున్న గర్భాశయ ముఖద్వారం కణితి తొలగించారని తెలిపారు. ఇప్పుడు మహిళ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ అమానుల్లాతోపాటు డాక్టర్ రబ్బానీబేగం, డాక్టర్ మాధవి, అనస్తీషియా విభాగం వైద్యులు డాక్టర్ సునీల్ చిరువెళ్ల, డాక్టర్ బాలాజీ, డాక్టర్ సుబ్రహ్మణ్యం, యూరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ శ్రీదీప్, వైద్య సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.