
బాల కార్మికులను గుర్తించాలి
భువనగిరిటౌన్ : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం ద్వారా బాల కార్మికులను గుర్తించాలని అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మహిళా శిశు సంక్షేమ, పోలీస్, కార్మిక, వైద్య, విద్యా శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆపరేషన్ ముస్కాన్‌పై సమీక్షించారు. బాలల హక్కులను పరిరక్షించి వారికి మంచి భవిష్యత్ అందించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. బడిబయట, బడి మానేసిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించి తిరిగి పాఠశాలలో చేర్పించాలని కోరారు. బాలలను పనిలో పెట్టుకున్న యజమానులపై కేసులు నమోదు చేయా లన్నారు. బాల్యవివాహాలను నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం చైల్డ్ హెల్ప్ లైన్ లోగోను ఆవిష్కరించారు. చిన్నపిల్లలకు సంబంధించిన సమస్యలపై 1098, 112 నంబర్లను సంప్రదించాలని కోరారు. అదే విధంగా భవిత కేంద్రాలు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో సౌకర్యాలు, మరమ్మతులపై సూచనలు చేశారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు నరసింహరావు, సత్యనారాయణ, డాక్టర్ యశోద, అరుణ, సీఐ చంద్రబాబు, సీడీపీఓలు తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు