
ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసే
చౌటుప్పల్ : ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీస్ అని, నేరాల నియంత్రణకు సహకరించాలని డీసీపీ అక్షాంశ్‌యాదవ్ కోరారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లిలో గురువారం రాత్రి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సోదాలు చేశారు. సరైన పత్రాలు లేని రెండు ఆటోలు, ఒక కారు, 60 ద్విచక్ర వాహనాలతో పాటు బెల్టు దుకాణాల్లో మద్యం స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి సూచనలు చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించబోమన్నారు. బెల్టు దుకాణాలు నడిపినా, డ్రగ్స్, గంజాయి రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఎక్కడైనా అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇళ్లు, దుకాణాలు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. శాంతిభ్రదతల పరిరక్షణలో భాగంగానే కార్డన్‌సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి, సీఐలు మన్మదకుమార్, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీసీపీ అక్షాంశ్ యాదవ్

ప్రతి పౌరుడు యూనిఫాం లేని పోలీసే