
డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!
పాత కమిషనర్ వెళ్లలేదు..
ఆలేరులో విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రస్తుత కమిషనర్ బదిలీ అయినా రిలీవ్ కావడం లేదు. కొత్త కమిషనర్ వస్తలేరు.
గుట్టలకొద్దీ పేరుకుపోయిన చెత్త
-5లో
- 4లో
మొక్కుబడిగా రీసైక్లింగ్
భువనగిరిటౌన్ : పట్టణ పరిధిలోని తుక్కాపురం రోడ్డులో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు లక్ష జనాభా ఉంది. రోజూ 22 మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉత్పత్తి అవుతుంది. సేకరించిన చెత్తను ఏరోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. రీసైక్లింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ చెత్త శుద్ధి జరగడం లేదు. చెత్త పేరుకుపోతుండటంతో శుద్ధి చేయకుండానే కాల్చేస్తున్నారు. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చర్మ, శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడే తప్ప.. సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకోవడం లేదు.
మోడల్ స్కూల్ చెంతనే..
భూదాన్‌పోచంపల్లి: పట్టణ పరిధిలోని మోడల్ స్కూల్ పక్కన డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ నుంచి రోజూ 6 టన్నుల మేర చెత్త సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. యార్డులో కంపోస్ట్ ఎరువుల తయారీ షెడ్డు లేదు. దాంతో తడి, పొడి చెత్తనంతా ఒకేదగ్గర పారబోస్తున్నారు. చెత్తను తలబెడుతుండటంతో పొగ, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని మోడల్‌స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, కాగితాలు గాలికి పంట పొలాల్లోకి కొట్టుకు వస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాగే డంపింగ్ యార్డు
ఆలేరు: మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డుల నుంచి రోజూ 3వేల టన్నుల వరకు చెత్త, ఇతర వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. సేకరించిన వ్యర్థాలను ఆలేరు పెద్దవాగుకు తరలిస్తున్నారు. తాగు, సాగునీటికి ప్రధాన వనరైన ఈ వాగులో వ్యర్థాలను డంప్ చేయడం వల్ల జలాలు కలుషితం అవతున్నాయని స్థానికులు, రైతులు అంటున్నారు. దుర్గమ్మ ఆలయం నుంచి కొలనుపాకకు వెళ్లే రోడ్డు పక్కన, వాగులో వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్గంధం భరించలేక పోతున్నామని సవాపోతున్నారు. డంపింగ్ యార్డు నిర్మాణానికి సాయిగూడెం శివారులో రెండు ఎకరాల స్థలాన్ని రెవెన్యూ అధికారులు కేటాయించారు. అయితే స్థానికులు, అక్కడి రైతుల నుంచి అభ్యంతరం రావడంతో డంపింగ్ యార్డు ఏర్పాటు పెండింగ్‌లో పడింది. అప్పటి నుంచి ఎవరూ ఈ దిశగా చొరవ చూపకపోవడంతో యార్డు ఏర్పాటులో జాప్యం జరుగుతోంది.
నీరు, పరిసరాలు కలుషితం అవుతున్నాయి
పట్టణంలో సేకరించి చెత్త, ఇతర వ్యర్థాలను పెద్దవాగులోకి తరలిస్తున్నారు. దీంతో వాగునిండా చెత్తకుప్పలే దర్శనమిస్తున్నాయి. నీళ్లు, పరిసరాలు కలుషితం అవుతున్నాయి. డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే ఈ సమస్య ఉండదు. త్వరగా అనువైన చోట భూమి సేకరించాలి.
–కై సర్, ఆలేరు
కాళేశ్వరం కాలువ పక్కనే చెత్త డంప్
యాదగిరిగుట్ట: మున్సిపాలిటీలో 12 వార్డులు, 5,003 నివాస గృహాలు, 50కి పైగా హోటళ్లు, 100 వరకు దుకాణాలు, 21వేల జనాభా ఉంది. దీనికి తోడు రోజూ సగటున 25వేల మంది భక్తులు వస్తుంటారు. ఇందులో 5 వేల భక్తులు ఆలయ సన్నిధిలో బస చేస్తుంటారు. రోజూ ఏడు టన్నుల చెత్త, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను సేకరిస్తారు. శని, ఆదివారం, సెలవు రోజుల్లో అదనంగా మరో టన్నుకు పైగా చెత్త ఉత్పన్నం అవుతుంది. సేకరించిన చెత్తను యాదగిరిగుట్ట నుంచి మల్లాపురం వెళ్లే మార్గంలో కాళేశ్వరం చాలువ వెంట డంప్ చేసి కాల్చివేస్తున్నారు. మల్లాపురం శివారులో రెండు ఎకరాల విస్తీర్ణంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. చెత్త రీసైక్లింగ్ కోసం యంత్రాలు కూడా అమర్చారు. కానీ, డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన స్థలం వివాదాస్పదం కావడం, ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో డంపింగ్ యార్డు ప్రారంభానికి నోచడం లేదు.
పందులు, కుక్కలతో పరేషాన్
చౌటుప్పల్ : పట్టణ సమీపంలోని గోల్డెన్ ఫారెస్ట్ స్థలంలో చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల నుంచి రోజూ పది టన్నుల వరకు చెత్త, ఇతర వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని 10 ఆటోలు, రెండు ట్రాక్టర్ల ద్వారా సేకరించి ఏరోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను రీసైక్లింగ్ చేయటానికి ఇటీవల సాగర్ కంపెనీ అనే సంస్థ మున్సిపాలిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. యంత్రాలను బిగించి ట్రయల్ రన్ నిర్వహించారు. త్వరలోనే రీసైక్లింగ్ ప్రారంభించనున్నారు. ప్రస్తుతం చెత్త రీసైక్లింగ్‌కు అవకాశం లేకపోవడంతో తగలబెడుతున్నారు. డంపింగ్ యార్డు సమీపంలో నివాసం ఉంటున్న కొందరు పందులు పెంచుతున్నారు. వీటితో పాటు కుక్కలు పెద్ద ఎత్తున డంపింగ్ యార్డులో తిరుగుతుండటంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. పంట పొలాల్లోకి కూడా వెళ్లుండటంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మనుషులు, పశువులపై దాడి చేస్తున్నాయి
మా వ్యవసాయ భూముల వద్ద మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డు ఉంది. ఎప్పుడు చూసినా డంపింగ్ యార్డు నిండా కుక్కలు, పందులు కనిపిస్తున్నాయి. మనుషులు, పశువులపై దాడి చేస్తున్నాయి. డంపింగ్ యార్డు సమీపంనుంచి వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. యార్డులో చెత్త నిల్వ ఉండకుండా చూడాలి.
–మార్గం ఇందిరమ్మ, రైతు

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!

డంపింగ్ యార్డులతో డేంజర్ బెల్స్!