
మొక్కల పెంపకంతోనే సమృద్ధిగా వర్షాలు
నల్లగొండ టూటౌన్: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతూ వాటిని సంరక్షించే బాధ్యత తీసుకుంటామని, మొక్కల పెంపకంతోనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ సైన్స్ కళాశాల, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఎంజీయూ ఆవరణలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమ వంతు బాధ్యతగా యూనివర్సిటీతో పాటు తమ ఇళ్ల వద్ద కూడా మొక్కలు నాటి పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ పసుపుల మద్దిలేటి, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రేమ్‌సాగర్, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, ఆకుల రవి, స్పోర్ట్స్ సెక్రటరీ కె. హరీష్‌కుమార్, వీరస్వామి, సుధాకర్, శ్రీనివాస్, షరీఫ్, మురళి, శ్రీనివాస్‌రెడ్డి, హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎంజీయూ వైస్ చాన్స్‌లర్
ఖాజా అల్తాఫ్ హుస్సేన్