15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు | - | Sakshi
Sakshi News home page

15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు

Jul 5 2025 5:50 AM | Updated on Jul 5 2025 5:50 AM

15 రో

15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు

దేవరకొండ: ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచడంతో పాటు 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 15 రోజుల్లోనే ఇంటికే ఓటరు గుర్తింపు కార్డులు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో యువతను చైతన్యపర్చేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.

మార్పులు చేర్పులు సైతం..

అంతేకాకుండా ఇదివరకే ఓటరుగా నమోదై ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి సైతం 15రోజుల్లోనే ఇంటికే ఓటరు కార్డు పంపించనున్నారు. ఇప్పుడు ఉన్న సిస్టం ప్రకారం ఓటర్లకు ఎలక్ట్రోరల్‌ ఫొటో ఐడెంటిటీ కార్డు చేయడానికి నెలకు పైగా సమయం పడుతుంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రామాణిక నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టింది.

దరఖాస్తు ఇలా..

18ఏళ్లు నిండి ప్రతిఒక్కరూ ఈసీఐ.గవర్నమెంట్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ ఫోన్‌ నంబర్‌, ఈమొయిల్‌ ఐడీతో సైన్‌అప్‌ కావాలి.

ఫ క్రియేట్‌ చేసిన అకౌంట్‌పై క్లిక్‌ చేసి తన పేరు, పాస్‌వర్డ్‌ నమోదు చేయాలి. తర్వాత పాస్‌వర్డ్‌ను నిర్ధారించాలి.

ఫ సైన్‌ అప్‌ అయిన ఈమొయిల్‌ ఐడీకి ఓటీపీ వస్తుంది. దానిని ఎంట్రీ చేసి అందులో ఓటరు వివరాలు నమోదు చేసుకోవాలి.

ఫ తర్వాత మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ నమోదు చేసి ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి.

ఫ కొత్తగా ఓటరు నమోదు చేసుకునే వారు ఫారం–6తో వ్యక్తిగత వివరాలు, అడ్రస్‌ తదితర వివరాలు నమోదు చేసి అందులో పేర్కొన్న ధృవపత్రాలను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి. అనంతరం మరోసారి వివరాలను సరిచూసుకొని సబ్మిట్‌ చేయాలి.

ఫ మార్పులు, చేర్పుల కోసం ఫారం–8, ఓటరు పేరు తొలగించుకునేందుకు ఫారం–7 నింపాలి.

ఫ ట్రాక్‌ అప్లికేషన్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేస్తే దరఖాస్తు చేసిన సమయంలో ఎస్‌ఎంఎస్‌గా వచ్చిన రెఫరెన్స్‌ నమోదు చేసి సబ్మిట్‌ చేస్తే అప్లికేషన్‌ స్టేటస్‌ ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది.

అర్హులందరూ ఓటరుగా నమోదు కావాలి

అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కును పొందాలి. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటరు నమోదుపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అర్హులకు 15రోజుల్లోనే గుర్తింపు కార్డు రానుంది.

– రమణారెడ్డి, ఆర్డీఓ, దేవరకొండ

ఫ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

ఫ ఓటరు నమోదును

ప్రోత్సహించడానికి సరికొత్త మార్గం

15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు1
1/1

15 రోజుల్లో.. ఇంటికే ఓటరు కార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement