
ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు గురుకుల విద్యార్థి
భూదాన్‌పోచంపల్లి: భూదాన్‌పోచంపల్లి మండలం దేశ్‌ముఖిలో కొనసాగుతున్న హైదరాబాద్‌లోని మలక్‌పేట, కార్వాన్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి జి. రామకృష్ణారెడ్డి ఎవరెస్ట్ బేస్ క్యాంపునకు చేరుకున్నాడు. గత నెల మన రాష్ట్రం నుంచి 20మంది విద్యార్థుల బృందం అడ్వెంచర్ క్యాంప్‌లో భాగంగా ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధిరోహించడానికి వెళ్లారు. అందులో రామకృష్ణారెడ్డి కూడా బేస్ క్యాంపునకు చేరుకుని జాతీయ పతాకంతో పాటు మహాత్మాబా పూలే గురుకుల పాఠశాలల జెండాను ఎగురవేశారు. రామకృష్ణారెడ్డి స్వస్థలం గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి గ్రామం. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని శుక్రవారం పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆర్. వెంకట్రావ్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ హరికుమార్, డిప్యూటీ వార్డెన్ అజార్, ఫిజికల్ డైరెక్టర్ పి. హేమంత్‌కుమార్, సతీష్, హౌజ్ మాస్టర్ రాజ్‌కుమార్, రవి, శేఖర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.