
నాట్లు వేసి నిరసన
రామన్నపేట : మండలంలోని దుబ్బాకలో వర్షానికి బురదమయమైన ప్రధాన రహదారిపై సీపీఎం నాయకులు గురువారం మహిళలతో కలిసి వరినాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రామన్నపేట–అమ్మనబోలు రోడ్డు గుంతలమయమై వర్షపునీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆరోపించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్, గ్రామ శాఖ కార్యదర్శి గుండాల ప్రసాద్, నాయకులు గట్టు నర్సింహ, పైళ్ల పాపయ్య, గుండాల నరేష్, అనిల్, పుట్టల ఉదయ్, గాదె రాజ్‌కుమార్, సుందర్, లింగస్వామి, అక్షిత, రమణ, సాయి పాల్గొన్నారు.